గసగసాల కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గసగసాల: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి using AWB
చి →‎గసగసాల: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 36:
చైనా దేశస్థులిప్పుడు నల్లమందును నిషేధించుటచే మన వర్తకము తగ్గినది. అయినను ధరలెక్కువగనుండుట చే లాభము బాగుగనె వచ్చుచున్నది.
 
నల్లమందును గడుపునొప్పి విరేచనములు కట్టుటకు దస్రుచుగా వాడుదురు. దానికి నిత్ర యుపయోగములు కూడా గలవు. కొందరు సదా భోజనమునకు ముండు మాత్రగా వేసికొందురు. గసగసాలలో నీ మత్తును గలుగ జేయు గుణములేదు. వాని యందొక సువాసనయు గలదు. నల్ల మందు తీయని కాయలలోని గింజలు మంచివి. ఈ గింజలనుండి నూనె దీయుదురు. దీనిని వంటలో గూడ వాడుదురు. మరియు జిత్ర పటములు వ్రాయుట యందును బనికి వచ్చు చున్నది. గసగసాలను కొన్ని పిండి వంటలలోను తాంబూలము లోను గూడ వాడుదురు.
 
* బ్రహ్మదండి: మొక్క ఎక్కడైనను బెరిగిన నూడబెరికి పారవేయు చున్నారు గాని దాని లాభము గమనించుట లేదు. దాని వాడుకయు నెందు చేతనో యంతగా లేదు. కాని గింజలనుండి తీసిన చమురు, తలుపులకును, బల్లలకును అన్ని చెక్కలకును మెరుపు దెచ్చును. చిత్ర పటములు వ్రాయుటలోను బనికి వచ్చును. కొందరు తల నొప్పిని కూడా బోగొట్టు నందురు. ఈ నూనె కడుపు నొప్పులు మొదలగు వానిని బోగొట్టును. దీని యాకుల రసము పుండ్లను మానుపును. నిజమైన బ్రహ్మదండి మొక్క వేరేయున్నదని కొందరు చెప్పు చున్నారు.
"https://te.wikipedia.org/wiki/గసగసాల_కుటుంబము" నుండి వెలికితీశారు