భారత అత్యవసర స్థితి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎ఇందిరా గాంధీ ఎదుగుదల: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
1971 నాటికి ప్రధాని [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా పూర్తి ఆధిక్యతను సాధించింది, అలాగే పార్లమెంట్ లో భారీ మెజారిటీ కూడా పొందారు. ప్రభుత్వంపై పట్టును సాధించేందుకు క్యాబినెట్ చేతిలోంచి కేంద్ర ప్రభుత్వ అధికారాలు ప్రధాని కార్యాలయం తీసేసుకుంది. క్యాబినెట్ మంత్రులు అధికార కేంద్రాలుగా మారతారన్న భయంతో ఈ పనిచేశారు. ఈ క్రమంలో కిచెన్ క్యాబినెట్ గా వ్యవహరించే ఆమె అంతర్గత సలహాదారుల బృందంలోని ముఖ్యుడు, ముఖ్యకార్యదర్శి పి.ఎన్.హస్కర్ పై నమ్మకాన్ని పెట్టుకున్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాధికారులు అన్న ఆలోచనను కూలదోసి హస్కర్ ఆప్పటి అధికారంలోని పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించేలాంటి పద్ధతులు తీసుకువచ్చారు.
 
ఇందిర కాంగ్రెస్ పార్టీలోని తన ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేశారు, ఆ క్రమంలో పార్టీ 1949లో కాంగ్రెస్ (ఓ) (ఓ అంటే ఆర్గనైజేషన్, సిండికేట్ గా పేరొందిన కాంగ్రెస్ పాతనేతలు ఇందులో ఉన్నారు) మరియు, ఇందిర యొక్క కాంగ్రెస్ (ఆర్) కింద విడిపోయింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోనూ, పార్టీ ఎంపీల్లోనూ ఎక్కువభాగం ప్రధాని ఇందిర పక్షం వహించారు. పూర్వపు కాంగ్రెస్ పార్టీ పద్ధతుల్లోని అంతర్గత ప్రజాస్వామ్యం వంటివి లేకుండా ఇందిర పార్టీ విధానాలు వ్యతిరక్తంగా తయారయ్యాయి. కాంగ్రెస్ (ఆర్) లో నాయకులు ఇందిరా గాంధీకి, ఆమె కుటుంబానికి విధేయంగా, సన్నిహితంగా ఉండడం వల్లనే తాము పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందగలమని తెలుసుకున్నారు. మితిమీరిన పొగడ్తలు సర్వసాధారణమైపోయింది. కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి ఎన్నికవడానికి మారుగా ముఖ్యమంత్రులుగా ఇందిర తనకు విధేయుల్ని నేరుగా నియమించే పద్ధతులు ప్రబలాయి.
 
ఆమె ప్రభుత్వం 1969లో బ్యాంకుల జాతీయీకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు చేపట్టడంతో ప్రజల్లో ఆమె పలుకుబడి పెరిగింది. ఆ పలుకుబడి వల్ల ఇందిరకు తన మాట చెల్లించుకోగల సామర్థ్యం వచ్చింది. ఈ కార్యకలాపాలు కూడా హఠాత్తుగా ఆర్డినెన్సుల ద్వారా చేపట్టి తన ప్రత్యర్థులను షాక్ కి గురిచేసేవారామె. సిండికేట్ మరియు, ఇతర ప్రత్యర్థుల ఇమేజికి భిన్నంగా, ఇందిరను "ఆర్థికరంగంలో సోషలిజం, మతపరంగా లౌకికత్వం, పేదల పక్షపాతంతో మొత్తానికి దేశాభివృద్ధికి అనుకూలురాలిగా" భావించేవారు.<ref name="Guha, p. 439">Guha, p. 439</ref>
 
1971 సాధారణ ఎన్నికల్లో, ప్రజలను ఇందిరా గాంధీ ఇచ్చిన ''గరీబీ హఠావో!'' (పేదిరక నిర్మూలన) అన్న నినాదం ఉత్తేజపరిచింది. ఆ ఎన్నికల్లో ఆమెకు 518 లోక్ సభ స్థానాలకు 352 భారీ ఆధిక్యత లభించింది. చరిత్రకారుడు రామచంద్ర గుహ అనంతరకాలంలో రాసినట్టు "ఆ భారీ విజయంతో కాంగ్రెస్ (ఆర్) తన ఉనికిని గుర్తుచేసే (ఆర్) అన్న ప్రత్యయం అవసరం లేకుండా నిజమైన కాంగ్రెస్ గా పేరొందింది".<ref name="Guha, p. 439"/> డిసెంబరు 1971లో, ఆమె యుద్ధ నాయకత్వంలో భారతదేశం బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా నిర్వహించింది. తన ఆగర్భ శత్రువైన పాకిస్తాన్ ను యుద్ధంలో ఓడించి, అప్పటివరకూ తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్ అన్న నూతన దేశంగా ఏర్పరచడంలో భారతదేశం, అందునా ప్రధాని ఇందిర, ముఖ్య పాత్ర వహించారు. తర్వాతి నెలలో [[భారతరత్న]] పురస్కారం అందుకుని తన జీవితంలో అత్యున్నత శిఖరం అనదగ్గ కాలాన్ని అనుభవించారు. ఆమె జీవితచరిత్రకారుడు ఇందర్ మల్హోత్రా ప్రకారం అప్పటికి "ద ఎకనమిస్ట్ అభివర్ణించినట్టుగా భారత సామ్రాజ్ఞి అన్న పదం సరిపోయిందన్నట్టుగా తోచింది". లోక్ సభలో ఆమెను సాధారణంగా నియంతలా వ్యవహరిస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని గురించి [[భట్రాజు పొగడ్తలు]] ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించే ప్రతిపక్ష నేతలే ఆమెను దుర్గ, చండి అంటూ ప్రశంసించారు.<ref>Malhotra, p. 141</ref><ref>{{cite book|last1=Derichs,|first1=Claudia (Editor)|last2=Thompson|first2=Mark R. (Editor)|last3=Hellmann-Rajanayagam|first3=Dagmar|title=Dynasties and Female Political Leaders in Asia: Gender, Power and Pedigree Chapter THE PIONEERS: DURGA AMMA, THE ONLY MAN IN THE CABINET|date=2013|isbn=978-3-643-90320-4|url=https://books.google.com/books?hl=en&lr=&id=UKBcLhCxSvQC&oi=fnd&pg=PA27&dq=vajpai+durga+indira+gandhi+&ots=ix3WNNoY55&sig=yJ_-UgVyiA_5Qo3Sw19_rLvULBM#v=onepage&q=vajpai%20durga%20indira%20gandhi&f=false|accessdate=20 October 2015}}</ref><ref>{{cite journal|last1=Puri|first1=Balraj|title=Indian Muslims since Partition,|journal=Economic and Political Weekly|date=1993|volume=28|issue=40|pages=2141–2149|url=http://www.jstor.org/stable/4400229|accessdate=20 October 2015}}</ref> ఇందిరను దుర్గగా వాజపేయి అభివర్ణించారని ప్రతీతి, కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో కాదని చెప్పారు<ref>{{cite web |url=https://www.youtube.com/watch?v=ofxZKeH8BGM |title=Did Atal bihari Vajpayee call Indira Gandhi 'Durga' ? |last=Jain |first=Atishay |publisher=You Tube |date=26 September 2015 |website=You Tube |access-date=23 March 2016}}</ref>