ఇద్దరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 26:
}}
''' ఇద్దరు''' 1997లో విడుదలైన ఒక [[డబ్బింగ్ సినిమా]]. దీని మాతృక తమిళంలో విడుదలైన ''ఇరువర్'' సినిమా. ఇది మణిరత్నం సహరచయితగా, దర్శకునిగా, నిర్మాతగా వ్యవహరించిన రాజకీయ కథాంశం కల చిత్రం. మూలచిత్రమైన ''ఇరువర్'' తమిళనాట రాజకీయాలకు, సినిమాకీ నడుమ ఉన్న సంబంధాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా. సినిమాలో [[మోహన్ లాల్]], [[ప్రకాష్ రాజ్]] ప్రధానపాత్రలు ధరించగా ఇతర ముఖ్యపాత్రల్లో [[ఐశ్వర్య రాయ్]], [[టబు]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[రేవతి (నటి)|రేవతి]], [[నాజర్ (నటుడు)|నాజర్]] నటించారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో పోషించిన ద్విపాత్రాభినయంతో సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. సినిమాలో అత్యంత విజయవంతమైన బాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం [[ఎ.ఆర్.రెహమాన్]] అందించారు. సినిమాటోగ్రఫీ [[సంతోష్ శివన్]] వహించారు. మలయాళంలో ''ఇరువర్'' పేరిటనే అనువదించి విడుదల చేశారు.<br />
ఈ సినిమా 1997 [[టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్]]లో మాస్టర్స్ విభాగంలో ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలతోపాటు బెల్గ్రేడ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం పురస్కారాన్ని, రెండు [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాలను]] పొందింది. 2012లో, ''ఇరువర్'' సినిమాను విమర్శకుడు రాచెల్ డ్వెయర్ 2012 బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ 1000 ఆల్-టైమ్ అతిగొప్ప చలనచిత్రాల జాబితాలో చేర్చారు, ఈ జాబితా అత్యంత విలువైన సినిమా పోల్స్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినది.<ref>{{Cite web |url=http://explore.bfi.org.uk/sightandsoundpolls/2012/film/4ce2b80247698 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2015-07-13 |archive-url=https://web.archive.org/web/20150719030336/http://explore.bfi.org.uk/sightandsoundpolls/2012/film/4ce2b80247698 |archive-date=2015-07-19 |url-status=dead }}</ref>
==చిత్రకథ==
1950ల నాటి కాలంలో సినిమా ప్రారంభమౌతుంది. ఇబ్బందులుపడుతున్న నటుడు ఆనంద్ ([[మోహన్ లాల్]]) సినీరంగంలో ఎదిగే ఒక మంచి అవకాశం కోసం ప్రయత్నిస్తూండడంతో సినిమా ప్రారంభమవుతుంది. అతని మావయ్య సహకారంతో ఒక సినిమాలో హీరో పాత్రకు ఆడిషన్ లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. స్టూడియోకి వెళ్ళిన ఆనంద్ దర్శకుడు, ఇతర సినిమా బృందం వచ్చేలోగా అక్కడున్న సెట్ ప్రాపర్టీ(కత్తి)తో తన కత్తివిద్య ప్రదర్శన నైపుణ్యాలను పరీక్షించుకుంటూంటాడు. ఇంతలో తన వ్యంగ్య కవితలతో అక్కడికి వచ్చిన రచయిత సమరసూర్యాన్ని([[ప్రకాష్ రాజ్]]) కలిసి, అతనితో చిరు వాగ్వాదం చేస్తాడు. ఈ వాగ్వాదం ఇద్దరి మధ్య పరస్పర గౌరవాన్ని పెంచేందుకు కారణమవుతుంది. సమరసూర్యం నైపుణ్యానికి ఆకర్షించబడ్డ ఆనంద్ తన ఆడిషన్లో చెప్పేందుకు డైలాగులు రాసిపెట్టమని కోరతాడు.
"https://te.wikipedia.org/wiki/ఇద్దరు" నుండి వెలికితీశారు