లగ్నం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భావాలు కారకత్వాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{వికీకరణ}}
రచన కొమర్రాజు భరద్వాజ్ శర్మ
 
[[జ్యోతిషశాస్త్రం|జ్యోతిష శాస్త్రం]]లో '''లగ్నం''' ప్రధాన మైనది. లగ్నం శిశువు పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించ బడుతుంది. ఒక రాత్రి ఒక పగటి సమయంలో మొత్తం పన్నెండు లగ్నాలు ఆవృత్తం ఔతాయి. సాధారణంగా సూర్యుడు మేషరాశి ప్రవేశ కాలం అయిన మేష సంక్రాంతి నుండి ఉదయకాలమున మేష లగ్నంతో ప్రారంభం ఔతాయి. ఒక లగ్న కాలం రెండున్నర ఘడియలు. ప్రస్తుత కాలంలో రెండు గంటల సమయం. అంటే నూట ఇరవై నిముషాలు. ఒక రోజు అనగా సూర్యోదయము మొదలు మరల సూర్యోదయము వరకు గల కాలము. ఒక రోజుకు 24 గంటలు లేదా 60 ఘడియలు. ఒక్కోరోజుకు ఈ లగ్నం నాలుగు నిముషాలు వెనుకకు జరిగి తిరిగి ఒక మాస కాలానికి వృషభ సంక్రాంతి నాటికి వృషభ లగ్నంతో మొదలౌతుంది. దానికి కారణము ప్రతి దేశ అక్షాంశముల సహాయముతో మేషాది సాయన లగ్న ప్రమాణములు తెలుసుకొనవచ్చును. ఈ సాయన లగ్న ప్రమాణములు యెన్ని యుగములు అయిననూ ఏ విదమైన మార్పు చెందవు. ఒక భూప్రదిక్షిణ కాలానికి పన్నెండు లగ్నాల ఆవృత్తం పూర్తి ఔతుంది.
పన్నెండు లగ్నాలకు పన్నెండు రాశులు అధిపత్యం వహిస్తాయి. ఒక రోజు 12 రాశులు లేదా లగ్నముల వలన యేర్పడినది. అందువలన ఒక రోజునకు 24 గంటలు లేదా 60 ఘడియలు లేదా 12 లగ్నములు అని భావించ వలయును. ఒక రోజులో 12 లగ్నములును ఒకే ప్రమాణము కలిగి వుండవు. కానీ ఈ 12 లగ్నములు ప్రమాణము మొత్తము కలసిన 60 ఘడియలు లేదా 24 గంటలు ఔతుంది. సాధారణంగా లగ్నం నుండి వ్యక్తి జాతక గణన జరుగుతుంది. లగ్నం నుండి పన్నెండు స్థానములకు లేక భావములకు పన్నెండు కారకత్వములు ఉంటాయి. లగ్నం మొదటి (తను) స్థానం లగ్నాధిపతి, అందు ఉండే గ్రహాలను అనుసరించి వ్యక్తి గుణగణాలను గణిస్తారు. రెండవ (ధన) స్థానముకు ధనస్థానం, మూడవది (భ్రాతృ) సోదర స్థానం. నాలుగవ (మాతృ) స్థానం గృహం, సుఖం, తల్లి స్థితిని తెలుపుతుంది. అయిదవ (పుత్ర) స్థానం పూర్వపుణ్య స్థానం. ఆరవ (శత్రు) స్థానం శత్రువులు, రోగముల స్థానం. ఏడవ (కళత్ర) స్థానం. ఎనిమిదవ (ఆయువు) స్థానం మారక స్థానం. తొమ్మిదవ (భాగ్య) స్థానం తండ్రి పితరులు, పిత్రార్జితం సూచిస్తుంది. పదవ (రాజ్య) స్థానం కర్మస్థానం ఇది వ్యక్తి చేయు వృత్తిని సూచిస్తుంది. పదకొండు (లాభ) స్థానం. పన్నెండవ (వ్యయ) స్థానం.
"https://te.wikipedia.org/wiki/లగ్నం" నుండి వెలికితీశారు