థామస్ పైన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
థామస్ పేన్ 1790వ దశకంలో [[ఫ్రాన్సు]]<nowiki/>లో నివసించాడు. అప్పుడు జరుగుతున్న [[ఫ్రెంచి]] విప్లవంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. 1791లో "[[రైట్స్ ఆఫ్ ఎ మాన్]]" అనే కరపత్రికను ఫ్రెంచి విప్లవం పట్ల సుముకంగా లేని విమర్శకులను వుద్దేశిస్తూ ఈ రచనను చేసాడు. థామస్ పేన్ ఫ్రెంచి విప్లవానికి పూర్తి మద్దతు ప్రకటించాడు. [[ఫ్రెంచి భాష]] రాకపోయినా పేన్ ఫ్రాన్సు జాతీయ కన్వెషన్కు ఎన్నికయ్యాడు. ఫ్రెంచి విప్లవంలో రెండు వర్గాలలో ఒకటైన జిరాండిస్టులు థామస్ పేన్ను తమ మిత్రునిగా భావించేవారు. మరొక వర్గమైన జాకొబిన్ వర్గ నాయకుడైన రాబిస్పియర్ పేన్ను తమ శత్రువుగా భావించేవారు.
 
1793లో థామస్ పేన్ను బంధించి [[లక్సెంబర్గ్|లక్సెంబర్గు]] కారాగారంలో ఖైదు చేసారు. జైలు జీవితంలో తన బృహత్గ్రంథం "[[ది ఏజ్ ఆఫ్ రీజన్]]" (1793-94) రచనలో నిమగ్నమైయ్యాడు. థామస్ పేన్ను ఫ్రాన్సు దేశంలో బంధించారనే విషయం అమెరికా దేశ వ్యాప్తంగ ప్రకంపనలు సృష్టించింది. అమెరికాకు అప్పటికి కాబోయే భావి అధ్యక్షుడు "[[జేమ్స్ మన్రో]]" తన పలుకుబడిని ఉపయోగించి దౌత్య సంబంధాల ద్వారా థామన్ పేన్ను విడుదల చేయించాడు. అప్పటికే తన రచన "ది ఏజ్ ఆఫ్ రీజన్" ద్వారా మత ఛాందసవాదుల నుంచి ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తన గ్రంథంలో "దీయిసమ్" అనే వాదనను సమర్ధించాడు. ఈ వాదం ఏమిటంటే భగవంతుడు ఈ సృష్టిని తయారు చేసి దాని కంటూ కొన్ని నియమాలు ఏర్పరచాడు. ఆ తరువాత ఆ నియమాల అనుసారం ఈ సృష్టి నడుస్తుందే తప్ప భగవంతుని జోక్యం ఇందులో వుండదు. ఈ సిద్ధాంతం అప్పట్లో ఎన్నో అలజడులను సృష్టించింది. మత ఛాందసవాదులనుంచి విమర్శలను ఎదుర్కొంది. ఈ సిద్ధాంతాన్ని అప్పటి మేధావులైన "[[వోల్టేర్]]" "[[బెంజమిన్ ఫ్రాంక్లిన్]]" "[[థామస్ జెఫర్సన్|థామస్ జెఫర్ సన్]]" వంటి వారు అనుసరించారు. థామస్ పేన్ తన 72వ ఏట 1809 జూన్ 8వ తేదీన వృద్ధాప్యంలో అమెరికాలోని తన స్వంత గృహంలో తుది శ్వాస విడిచాడు. అప్పటి క్రైస్తవ మత అధికారులకు భయపడి పేన్ యొక్క అంతిమ యాత్రకు కేవలం 6గురు మాత్రమే హాజరయ్యారు.
 
== Notes ==
"https://te.wikipedia.org/wiki/థామస్_పైన్" నుండి వెలికితీశారు