మల్లాది వెంకట సత్యనారాయణ రావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
 
==కళాకారునిగా==
 
[[దస్త్రం:Violinist Malladi.jpg|thumbnail||right||వయోలిన్ వాయిద్యంతో మల్లాది వెంకట సత్యనారాయణ రావు]]
వయోలిన్ వాదనంతో బాటు, గాత్రంలోనూ మల్లాది నిష్ణాతుడు. సంగీత కళాకారులకు వాద్య సహకారం అందించడంతోబాటు, వయోలిన్ సోలో కచేరీలు, గాత్ర కచేరీలు ఇచ్చాడు. అలాగే పార్వతీకల్యాణం, రుక్మిణీ కల్యాణం హరికథలనూ గానం చేశాడు. మల్లాది నాగస్వర వాదనంలో అందెవేసిన చెయ్యి.
[[దస్త్రం:Violinist Malladi1.jpg|thumbnail||right||మల్లాది వెంకట సత్యనారాయణ రావు గాత్రకచేరి]]
 
కాకినాడ, బరంపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లో అభిమానుల కోరికపై వీరు నాగస్వరం వాయించినప్పుడు అనేక నాగులు పడగ విప్పి నృత్యం చేయడం నాటి ప్రత్యక్ష్య సాక్షుల గుండెల్లో చెరగని ముద్ర. సినీ నటుడు, నటవిరాట్ బిరుదాంకితుడు రావు గోపాలరావు మల్లాదికి అత్యంత సన్నిహితుడు. 1952 నుండి 1965 మధ్య సంవత్సరాల కాలంలో రావు గోపాలరావు దర్శకత్వంలో మల్లాది సంగీత దర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించిన ‘విక్రాంతి’ నాటకం నాటక ప్రియుల అభిమానాన్ని చూరగొంది.
==బిరుదులు, సత్కారాలు==
కపిలేశ్వరపురం జమిందారు యస్.పి.పి.బి.కె. సత్యనారాయణ రావు కపిలేశ్వరపురంలో నిర్వహించే హరికథా పాఠశాల విద్యార్థులకు మల్లాది హరికథా గానంలో మెళకువలు నేర్పాడు. సువర్ణ పతక, సువర్ణ సింహ తలాట గ్రహీత, సంగీత కళానిధి, మధుర గాయక, గానకళా సరస్వతి వంటి బిరుదులూ, ఘన సత్కారాలు పొందిన మల్లాది ఆంధ్ర దేశం నాలుగు చెరగులా విస్తృతంగా పర్యటించి హరికథకులకు వైలిన్ సహకారం అందించడంతో బాటు వయోలిన్ సోలో కచ్చేరీలు ఇచ్చారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సుమారు పది సంవత్సరాలబాటు ప్రతి ఏటా కళ్యాణమహోత్సవాలకు జరిగే [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] కార్యక్రమాలకు వాద్య సహకారం అందించారు.
[[దస్త్రం:Violinist Malladi 10.jpg|thumbnail||right||ఆకాశవాణి "వనితావాణి" కార్యక్రమం రికార్డింగులో మల్లాది వెంకట సత్యనారాయణ రావు]]
[[దస్త్రం:Violinist Malladi 11.jpg|thumbnail||right||100px|మల్లాది వెంకట సత్యనారాయణ రావు గారికి సత్కారం]]
 
==కుటుంబ వివరాలు ==
[[దస్త్రం:Violinist Malladi2.jpg|thumbnail|right|100px|షష్టిపూర్తి సందర్భంగా భార్య సుబ్బలక్ష్మితో మల్లాది వెంకట సత్యనారాయణ రావు]]
ఈయనకు ముగ్గురు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద తమ్ముడు మల్లాది సుబ్బారావు [[జబల్పూర్|జబల్ పూర్]] లో [[మధ్యప్రదేశ్]] రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు సెక్షన్ ఆఫీసర్ గా, రెండవ తమ్ముడు మల్లాది వెంకటరావు విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అసిస్టెంట్ జనరల్ మానేజర్ గా, మూడవ తమ్ముడు మల్లాది రామకృష్ణారావు HSCL వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫోర్ మెన్ గా రిటైర్ అయ్యారు. పెద్ద చెల్లెలు విజయకుమారి వైజాగ్ లో హిందీ పండిట్ గా, చిన్న చెల్లెలు కామేశ్వరి కాకినాడలో సాధారణ గృహిణిగా ఉన్నారు.
తీవ్ర అస్వస్థత కారణంగా 1996 నవంబరు 1న తన 64వ ఏట [[గుండెపోటు]]తో [[కాకినాడ]]లో మృతి చెందారు. వీరికి భార్య సుబ్బలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మల్లాది సత్యనారాయణమూర్తి ఉపాధ్యాయుడుగా, రెండవ కుమారుడు మల్లాది సుబ్బారావు ఇంజనీరుగా, మూడవ కుమారుడు [[మల్లాది కామేశ్వరరావు]] జర్నలిస్టుగా ఉన్నారు.
==చిత్రమాలిక==
 
<gallery mode="packed-hover" heights="180">
[[దస్త్రం:Violinist Malladi.jpg|thumbnail||right||వయోలిన్ వాయిద్యంతో మల్లాది వెంకట సత్యనారాయణ రావు]]
[[దస్త్రం:Violinist Malladi1.jpg|thumbnail||right||మల్లాది వెంకట సత్యనారాయణ రావు గాత్రకచేరి]]
[[దస్త్రం:Violinist Malladi 10.jpg|thumbnail||right||ఆకాశవాణి "వనితావాణి" కార్యక్రమం రికార్డింగులో మల్లాది వెంకట సత్యనారాయణ రావు]]
[[దస్త్రం:Violinist Malladi 11.jpg|thumbnail||right||100px|మల్లాది వెంకట సత్యనారాయణ రావు గారికి సత్కారం]]
[[దస్త్రం:Violinist Malladi2.jpg|thumbnail|right|100px|షష్టిపూర్తి సందర్భంగా భార్య సుబ్బలక్ష్మితో మల్లాది వెంకట సత్యనారాయణ రావు]]
</gallery>
== మూలాలు ==
{{మూలాల జాబితా}}