"ధర్మరాజు" కూర్పుల మధ్య తేడాలు

1,382 bytes added ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
 
అసూయతో అతడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పతియైన [[శకుని]] చేతిలో ధర్మరాజు వరుసగా తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు. సభలోకి రావడానికి సందేహిస్తున్న పాంచాలిని [[దుశ్శాసనుడు]] తలవెంట్రుకలు పట్టి బలవంతంగా ఈడ్చుకొని వస్తాడు. ద్రౌపది వస్త్రాన్ని అపహరించవలసిందని దురోధనుడు తమ్మున్ని అజ్ఞాపించాడు. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల ద్రౌపది కట్టుకొన్న వస్త్రం అంతులేని అక్షయ వలువలుగా మారి నిండు సభలో ఆమె గౌరవం దక్కింది. ధృతరాష్ట్రుడు కొడుకు చేసిన తప్పును గ్రహించి వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాస్య వికుక్తుల్ని కావించి, వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు.
 
 
మరళ రెండవసారి జూదమాడడానికి హస్తినాపురికి పిలుస్తాడు. ఓడినవాల్లు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో విధిపైపరీత్యం వల్ల మళ్ళా ఓడిపోతాడు. ధర్మప్రభువు ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం లల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.
మరళ రెండవసారి జూదమాడడానికి హస్తినాపురికి పిలుస్తాడు. ఓడినవాల్లు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/293802" నుండి వెలికితీశారు