సురభి కమలాబాయి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 51:
కమలాబాయి ప్రతిభ గురించి విని, ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని [[బొంబాయి]]కి ఆహ్వానించాడు. అక్కడే పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించింది. [[మహా భారతము|మహాభారతం]] వంటి 25 చిత్రాలలో నటించింది. [[హిందీ సినిమా రంగం|హిందీ]] సినిమాలలో నటిస్తున్నప్పుడే ఈమెకు సిగరెట్లు త్రాగటం అలవాటయ్యింది. షాట్ షాట్కి మధ్యలో ఆదరాబాదరాగా వెళ్ళి సిగరెట్టు త్రాగేది. సిగరెట్టు తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకునేది.
 
1939లో విడుదలైన [[భక్తజయదేవ]] సినిమాతో మళ్ళీ [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో నటించడం ప్రారంభించింది. విశాఖపట్నంలోని ఆంధ్రా సినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, [[బంగ్లా భాష|బెంగాళీ]] భాషలలో నిర్మించారు. ఈ రెండు భాషలలోనూ కమలాభాయే కథానాయకి. ఆ చిత్రంలో రెంటచింతల సత్యనారాయణ, సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. ఆ చిత్రానికి హిరేన్ బోస్ అనే [[బంగ్లా భాష|బెంగాలీ]] ఆయన దర్శకుడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం సరిగా సాగలేదు. నిర్మాణం ఆగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితిలో కథానాయిక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరచింది కమలాబాయి. అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం దర్శకుడిగా హిరెన్ బోస్ పేరే కనబడుతుంది.<ref>[{{Cite web |url=http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_3792.html |title=శిరాకదంబం: ఎప్పుడో ' లేచింది మహిళాలోకం '] |website= |access-date=2013-03-10 |archive-url=https://web.archive.org/web/20120118021849/http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_3792.html |archive-date=2012-01-18 |url-status=dead }}</ref>
 
అలాగే తొలి ద్విభాషా చిత్రమైన [[తుకారాం]] (1940) తెలుగు వెర్షన్లో ఈమె నటించింది. అప్పటి వరకు కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి ఆ తర్వాత సినిమాలలో కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించి. ఈ విధంగా నటించిన సినిమాలలో పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, [[పాతాళభైరవి]], సంక్రాంతి, [[అగ్నిపరీక్ష]] ముఖ్యమైనవి.
"https://te.wikipedia.org/wiki/సురభి_కమలాబాయి" నుండి వెలికితీశారు