డీహైడ్రేషన్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
 
శరీరంలోని మొత్తం నీళ్ళలో 3-4% ఆవిరైపోయినా మనుష్యుల్లో చాలావరకు తట్టుకోగలరు. 5-8% నష్టం అయితే కళ్ళు తిరగడం, అలసట సంభవిస్తాయి. 10% కి మించితే భౌతికంగా మానసికంగా క్షీణించిపోతారు. విపరీతమైన [[దాహం]] వేస్తుంది. 15-25% నీరు పోతే మరణం సంభవిస్తుంది.<ref name=Ashcroft>Ashcroft F, Life Without Water in Life at the Extremes. Berkeley and Los Angeles, 2000, 134-138.</ref> ఒక మాదిరి డీహైడ్రేషన్ అయితే కొంచెం అసౌకర్యంగా, దాహంగా ఉంటుంది. దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ (ప్రత్యేకమైన ద్రవపదార్థాల్ని సేవింపజేయడం) ద్వారా పరిష్కరించవచ్చు.
 
== లక్షణాలు ==
బాగా దాహం వేయడం, [[తలనొప్పి]], అసౌకర్యంగా అనిపించడం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం, మానసికంగా గందరగోళం, ఏ కారణంలేకుండానే అలసటగా ఉండటం, గోళ్ళు ఊదారంగులోకి తిరగడం, [[మూర్ఛలు (ఫిట్స్)|మూర్ఛ]] మొదలైనవి డీహైడ్రేషన్ ప్రధాన చిహ్నాలు. శరీరంలో నీటి నష్టం ఎక్కువయ్యే కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డీహైడ్రేషన్" నుండి వెలికితీశారు