రేస్ (2013 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== కథా నేపథ్యం ==
చైతన్య(కార్తీక్) వీడికి డబ్బు పిచ్చి, సిద్దార్థ్(భరత్ కిషోర్) వీడికి అమ్మాయిల పిచ్చి, అభిరామ్(విక్రమ్) వీడికి సాటి వారికి హెల్ప్ చెయ్యడం ఇష్టం. ఇలా మూడు వేరు వేరు స్వభావాలు కలిగిన వీరు ముగ్గురూ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. చైతన్య అంజలితో(నిఖితా నారాయణ్) ప్రేమలో పడతాడు కానీ ఆమెకి డబ్బు లేదని డబ్బున్న అమ్మాయి నేహ అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ చేసుకోవాలని వీళ్ళు ముగ్గురూ కలిసి బ్యాంకాక్ వెళ్తారు. ఓ రోజు పార్టీ కెళ్ళి తిరిగి వస్తుండగా బ్యాంకాక్ ఫేమస్ డాన్ మైఖేల్ తమ్ముడు రాబర్ట్ ఓ యాక్సిడెంట్ కి గురవడంతో కథ ఓ మలుపుతిరుగుతుంది. ఆ తర్వాత ఆర్తి(దిశా పాండే) తెలుగమ్మాయిలా ఈ ముగ్గురి బ్యాచ్ లో వచ్చి చేరుతుంది. అభిరామ్ – ఆర్తి ప్రేమలో పడతారు. ఈ ముగ్గురి ట్రిప్ అయిపోయి ఇండియాకి బయలుదేరాల్సిన టైములో చైతన్య – అంజలి కిడ్నాప్ అవుతారు. అసలు చైతన్య – అంజలిని ఎందుకు కిడ్నాప్ చేసారు? అసలెవరు కిడ్నాప్ చేసారు? ఇంతకీ ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగింది? మధ్యలో వచ్చిన ఈ ఆర్తి ఎవరు? చివరికి చైతన్య – అంజలి కిడ్నాపర్స్ నుంచి ప్రాణాలతో బయట పడ్డారా? లేదా? అనేదే మిగిలిన కథాంశం.<ref name="సమీక్ష : రేస్ – రేసులూ లేవు, కథలో స్పీడూ లేదు">{{cite web |last1=123 తెలుగు |first1=రివ్యూ |title=సమీక్ష : రేస్ – రేసులూ లేవు, కథలో స్పీడూ లేదు |url=https://www.123telugu.com/telugu/reviews/review-race-no-races-and-no-speed-in-story.html |website=www.123telugu.com |accessdate=4 June 2020 |date=2 March 2013}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/రేస్_(2013_సినిమా)" నుండి వెలికితీశారు