శ్రీరామాంజనేయ యుద్ధం (1958): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 72:
శక్తి, భక్తిలలో ఏది గొప్పదని శివపార్వతుల మధ్య వచ్చిన మీమాంసలో భక్తి గొప్పదని శివుడు చెప్పి దానికి తార్కాణంగా భూలోకంలో జరుగుతున్న ఒక సంఘటనను పార్వతికి చూపిస్తాడు.
 
యయాతి రాజు శ్రీరామభక్తుడు. ముందు వచ్చిన వశిష్టుని పాదపూజలో మునిగిపోయి కొంచెం వెనుక వచ్చిన విశ్వామిత్రుని రాకను గమనించడు. దానికి కుపితుడైన విశ్వామిత్రుడు తన్ను పరాభవించిన రాజును సంహరించగలనని రాముడితో వాగ్దానం పొందుతాడు. ఆ రాజు యయాతి అని విని రాముడు ఖేదం పొందుతాడు. యయాతిని బంధించి తీసుకురావడానికి వెళ్లిన లక్ష్మణుడి ద్వారా రాముడు విశ్వామిత్రునికి ఇచ్చిన వాగ్దానం గురించి తెలుసుకున్న యయాతి క్రుంగిపోతాడు. ఆ సమయంలో పెను తుఫాను చెలరేగుతుంది. ఆ తుఫానులో యయాతి, లక్ష్మణుడు విడిపోతారు. యయాతి అంజనీదేవి ఆశ్రమప్రాంతం చేరుకుంటాడు. ఆమె యయాతిని రక్షించవలసిందని తన కుమారుడు హనుమంతుడిని ఆదేశిస్తుంది. యయాతిని చంపబూనినది శ్రీరామచంద్రుడని తెలిసి అంజనీదేవి, హనుమంతుడు ఇరువురూ విచారిస్తారు. నారదుడు యయాతిని చంపడానికి రాముడు ప్రతిన బూనిన సంగతి, యయాతికి హనుమంతుడు అభయమిచ్చిన సంగతి అటు హనుమంతునితోను, ఇటు రామునితోను చెబుతాడు. రాముడు, హనుమంతుడు సందిగ్ధ స్థితిలో పడతారు. యయాతి భార్య శాంతిమతి అయోధ్య వెళ్ళి సీతను తనకు పతిభిక్ష వేడుతుంది. సీత రాముడిని బతిమాలుతుంది. కాని రాముడు ఆడిన మాటతప్పనని అంటాడు. అటు వానరులు అంగదుని రాముడి వద్దకు రాయబారం పంపుతారు. అది విఫలం కావడంతో రామ ఆంజనేయుల యుద్ధం తప్పనిసరి అవుతుంది. రామాస్త్ర ప్రభావాన్ని హనుమంతుడు రామనామస్మరణంతోనే ప్రతిఘటిస్తాడు. ప్రళయోదగ్రమైన పరిస్థితి ఉత్పన్నమై లోకాలు తల్లడిల్లడంతో శివుడు పార్వతితో వచ్చి శ్రీరామ హనుమంతుల మధ్య పోరును నిలుపుతాడు<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=సమీక్షకుడు |title=చిత్ర సమీక్ష - శ్రీరామాంజనేయ యుద్ధం |url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=1709 |accessdate=2 April 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=28 May 1958 }}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==విశేషాలు==