దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
}}
 
'''దేవులపల్లి రామానుజరావు''' ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు. ఆయన తెలంగాణలో శోభ, [[గోలకొండ పత్రిక|గోల్కొండ]] పత్రికలకు సంపాదకుడిగా, [[సురవరం ప్రతాపరెడ్డి]] తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాదించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా విశ్వవిద్యాలయం]] సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]], [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]], [[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం]], [[కేంద్ర సాహిత్య అకాడమీ]]<nowiki/>లలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుబంధాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు.<ref name="ఆయన గూర్చి సిలికానాంధ్ర లో">[{{Cite web |url=http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb2010/telugutejomurthulu.html |title=దేవులపల్లి రామానుజరావు గురించి సిలికానాంధ్ర లో] |website= |access-date=2013-09-07 |archive-url=https://web.archive.org/web/20160315192911/http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb2010/telugutejomurthulu.html |archive-date=2016-03-15 |url-status=dead }}</ref>
 
[[ఆంగ్ల భాష|ఇంగ్లిషు]], [[తెలుగు]], [[ఉర్దూ]] భాషా ప్రవీణుడు, వక్త, పరిశోధకుడు. తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు.
పంక్తి 23:
సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్‌గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న ఆయన 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.
 
డాక్టర్ రామానుజరావు గారి దేశాభిమానం వారిలోని కవితాశక్తిని జాగృతం చేసి పొంగింప చేసింది. ‘పచ్చతోరణం’ వారి పద్యరూప దేశాభిమానానికి హృద్యమైన ఉదాహరణం. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్నట్లు వారు [[ఓరుగల్లు]] మీద వ్రాసిన ఖండకావ్యం [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]<nowiki/>లోని ప్రబోధ కవితాశాఖలో వెలువడిన విలువైన కళాఖండంగా కావ్య విమర్శకులు గుర్తించారు. అందులోని అయిదు సీసపద్యాలూ పంచరత్నాలు. ఓరుగల్లు కోటను దర్శించే సమయంలో సాహితీపరులు ఆ పద్యాలను స్మరించుకుంటూ పులకిస్తూ ఉంటారు. డాక్టర్ రామానుజరావు గారు ‘మా ఊరు-ఓరుగల్లు’ అనే వ్యాసం కూడా వ్రాశారు. పద్యాల్లో ఎంత ఆవేశాన్నీ, ఆర్ద్రతనూ ప్రదర్శించారో మాటల్లో కూడా అంత ఆత్మీయతనూ, తాదాత్మ్యాన్నీ ప్రకటించారు.<ref>[http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=9&ContentId=155153 ప్రముఖ సాహితీవేత్త డా॥ జి.వి.సుబ్రహ్మణ్యం వ్యక్తపరిచిన భావాలు]{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== సాహితీ సేవలు ==
పంక్తి 66:
 
==యితర లింకులు==
* [http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=3&ContentId=24150 నమస్తే తెలంగాణా లో వ్యాసం]{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [https://archive.org/details/in.ernet.dli.2015.372156 రామానుజరావు సంపాదకునిగా వ్యవహరించిన సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, మొదటి సంపుటము భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]