కొమురం భీమ్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
→‎ఉద్యమ స్ఫూర్తి.. భీమ్: పునరావృతం తొలగించబడింది
పంక్తి 61:
నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన కొమురం భీం ఆశించిన లక్ష్యాలను నేటి పాలకులు నెరవేర్చలేక పోతున్నారు. భీం మరణించి 72 ఏళ్లు గడుస్తున్నా జల్, జంగిల్, జమీన్‌పై ఆదివాసీలు నేటికీ హక్కులు పొందలేకపోతున్నారు. నాటి నుంచి నేటి వరకు గిరిజనులు హక్కుల కోసం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. భీం పుట్టింది ఆదిలాబాద్ జిల్లా [[కెరమెరి]] మండలం సంకెపల్లి.. పెరిగింది సుర్తాపూర్. కష్టపడి అడవి నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్లు. రాత్రింబవళ్లు కావలి కాశీ పంటలు పండించేవాళ్లు. గిరిజనులపై నిజాం సర్కారు పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు పంటను కొట్టిన కల్లంలోనే.. కైలు కింద గింజలు ప్రభుత్వానికి అప్పజెప్పేవారు. గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవారు. గిరిజనులు ఎంతటి దట్టమైన అడవిలో భూములను సాగుచేకున్నప్పటికీ వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్లు.. జంగ్లాత్ వాళ్లు గొడవలు చేసేవాళ్లు. తిరిగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్లు. ఇలాంటి సంఘటనలే కొమురం భీంను కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్ధికి అనే వ్యక్తిని కర్రతో తల పగలకొట్టాడు భీం. ఈ దెబ్బతో సిద్ధికి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భయపడ్డ భీం మహారాష్ట్రలోని బల్లార్షా, చందా దిక్కు పారిపోయాడు. అక్కడ తేయాకు తోటల్లో కూలీపని చేసుకుంటూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు. కొత్త కొత్త పంటలు పండించటం, వాటిని మార్కెట్‌లో మంచి ధరకు అమ్మటం తెలుసుకున్నాడు. తరువాత భీం తల్లిదంవూడులు ఉంటున్న కాకన్‌ఘాట్‌కు వచ్చాడు. ఆ గ్రామంలోని గిరిజనుడు లచ్చుప వద్ద జీతం ఉండగా భీంకు సోంబాయితో పెళ్ళి జరిగింది. ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు, పోడుకు రెండు రూపాయల చొప్పున పన్నును ఆసిఫాబాద్ తహసిల్దార్‌కు కట్టేవారు. కొమురం భీం అప్పటి తహసిల్దార్‌తో మాట్లాడి లచ్చుప చెందిన పన్నెండు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు. అప్పటినుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 60 ఎకరాల అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పరిచాడు.
 
ఆ గ్రామాలు జోడుణ్‌ఘాట్, [[పట్నాపూర్ (బోథ్)|పట్నాపూర్]], బాబెఝరి, నర్సపూర్, కల్లెగాం, చాల్‌బడి, బోయికన్ మోవాడ్, భోమన్‌గొంది, భీమన్‌గొంది, [[అంకుశాపూర్ (భీమారం)|అంకుసాపూర్]], దేవునిగూడ, గొగినవమోవాడ్. దీంతో అటవీ అధికారులు భీం మీద కేసుపెట్టారు. ఓ చౌకిదార్, అమీన్, తొమ్మిది మంది పోలీసులు వచ్చి భీం ఇంటిని సోదా చేయగా ఏమీ దొరకలేదు. దీంతో భీంకు కోపం వచ్చి వాళ్లపై తిరుగబడి కొట్టాడు. దీంతో అధికారులు భీంపై కేసుపెట్టారు. గిరిజనులు పోడుచేసుకుంటున్న భూములకు పన్ను కట్టాల్సిన పనిలేదని కోర్టు తీర్పు ఇచ్చిప్పటికీ అధికారుల వేధింపులు తప్పలేదు. భీంను, ఆయన అనుచరులను ఎదుర్కొనేందుకు 1940 సెప్టెంబరు 1న నైజాం పోలీసులు వచ్చి 300 మంది గిరిజనులు ఉన్న 12 గ్రామాలను చుట్టిముట్టారు. మొదట భూములకు పట్టాలు ఇస్తామని చెప్పటంతో [[గిరిజనులు]] ఇళ్లల్లోంచి బయటకు వచ్చా రు. వీరిని పోలీసులు కొట్టడంతో గొడవ జరిగి కొమురం భీంతోపాటు 11 మంది గిరిజనులు చనిపోయారు. భీం నాయకత్వంలో గిరిజనులు పోలీసులకు ఎదురు నిలిచిన సంఘటన నిజాం ప్రభువును కదిలించింది. వారి సమస్యల పరిష్కారానికి, సదుపాయాల కల్పనకు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించటానికి ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమన్‌డార్ఫ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజనులతో కలిసిపోయి వారి జీవన విధానాలను అధ్యయనం చేసి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన పథకాలను సూచిస్తూ నివేదిక తయారు చేసి నిజాం సర్కారుకు అందజేశారు. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి నాటి భీం త్యాగఫలితమే.. కొము రం భీం వారసులు ప్రస్తుతం సిర్పూర్ (యు) మండలం పెద్దదోబలో ఉంటున్నారు. భీం మనుమడు కొమురం సోనేరావ్ ప్రభుత్వం నిర్వహించే వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. భీం నేలకొరిగిన జోడెఘాట్‌లో కొమురం భీం మునిమనవరాలు కొమురం భీంబాయి నివసిస్తున్నారు.
జోడేఘాట్ ఏర్పాట్లు
ఏటా అశ్వయుజ కార్తీక [[పౌర్ణమి]] రోజు కెరమెరి మండలం జోడేఘాట్‌లో కొమురం భీం వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు ఆయన 72వ వర్ధంతి దర్బార్‌ను సోమవారం జోడేఘాట్‌లో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హట్టిలోని భీం స్మారక బేస్‌క్యాంప్‌ను రంగులతో అలంకరించి, భీం విగ్రహాన్ని ముస్తాబు చేశారు. హట్టి గ్రామం వద్ద స్వాగత తోరణానికి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జోడేఘాట్‌లోని భీం విగ్రహానికి రంగులు వేయించి, సమాధిని పూలతో అలంకరించారు. వర్ధంతి సందర్భంగా 15 వేల మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు.‘నిజాం సర్కారే నయం’ ‘కొమురం భీం పోరాడి పొందించిన 12 గ్రామాలను భీంనే ఏలుకొమ్మని నిజాం అనుమతినిచ్చాడు. కానీ ఆదివాసీలందరికీ హక్కులు కావాలని పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంతో నిజాం సర్కారు భీంను చంపేసింది. కానీ ఇప్పుడు సర్కారు ఆదివాసీల కనీసం హక్కులను కూడా హరిస్తోంది. కనీసం తాగేందుకు నీళ్లుకూడా లేకుండా చేస్తోంది. ఈ సర్కారు కన్నా నిజాం సర్కారే నయం. నా భర్త పొందించిన 12 గ్రామాలను ఏలుకొమ్మని అధికారం ఇచ్చాడు’ ఇవి భీం భార్య సోంబాయి బతికున్నప్పుడు అన్న మాటలు. అవును నిజమే నిజాం సర్కారు కేవలం భూములపై, పంటలపై, అడవిపై మాత్రమే ఆంక్షలు విధించి వీటిని చెల్లించాలని ఆదివాసీలపై పెత్తనం చెలాయించేది. కానీ ఇప్పుడున్న సర్కారు ఆదివాసీల కనీస హక్కులను సైతం హరిస్తోంది. 72 ఏళ్ల క్రితం జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడి ప్రాణాలను వదిలిన కొమురం భీం ఆశయాలను ఇంత వరకు మన పాలకులు, అధికారులు నెరవేర్చలేక పోతున్నారు. అటవీ చట్టాల పేరుతో అడవుల్లో ఆదివాసీలను మైదానాలకు తరిమి వేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఆదివాసీల సమస్యలు ఎప్పటికీ తీరవనే ముందు చూపుతోనే ప్రస్తుత సర్కారు కన్నా నిజాం సర్కారే నయమని సోంబాయి అనుకొని ఉంటారు.
 
== కొమురం భీము విగ్రహం ==
"https://te.wikipedia.org/wiki/కొమురం_భీమ్" నుండి వెలికితీశారు