కంచి వాసుదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''కంచి వాసుదేవరావు''' తెలుగు రచయిత. ఆయన ఆరు దశాబ్దాల పాటు తెలుగునాట వార, మాస, దిన పత్రికలలో పాత్రికేయునిగా పనిచేసారు. <ref name=vasudevarao>{{cite news|title=ఆదర్శ పాత్రికేయుడు|url=http://www.andhrajyothy.com/Artical?SID=255056|accessdate=18 June 2016|agency=ఆంధ్రజ్యోతి|publisher=బి.వి. అప్పారావు|date=17 June 2016}}</ref><ref>{{cite news|title=Kanchi Vasudeva Rao feted|url=http://www.thehindu.com/news/cities/Visakhapatnam/kanchi-vasudeva-rao-feted/article2584838.ece|accessdate=31 October 2011|agency=The HIndu|publisher=SPECIAL CORRESPONDENT|date=18 June 2016}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమగోదావరి జిల్లా]] [[ఏలూరు]]<nowiki/>లో [[1930]], [[జూన్ 6]]<nowiki/>న జన్మించారు. [[మచిలీపట్నం]] హిందూ కళాశాలలో చదివారు. తర్వాత [[విశాఖపట్నం]]<nowiki/>లోని [[ఆంధ్ర వైద్య కళాశాల|ఆంధ్ర మెడికల్‌ కళాశాల]]<nowiki/>లో డిప్లొమా ఇన ఫార్మసీ చేశారు. అయినా విద్యార్హతకు తగిన వృత్తిలో కాక, చిన్ననాటి నుంచి తనను ప్రభావితం చేసిన జాతీయోద్యమ పరిస్థితుల ప్రభావంతో, పత్రికా రచయితగా జీవితం ప్రారంభించారు.<ref name=vasudevarao/>
 
==పత్రికా రంగం==
ఆయన 1957లో [[కృష్ణా పత్రిక]] కు సబ్ ఎడిటరుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్|రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌]]<nowiki/>లో పనిచేశారు. తరువాత తన సహ విద్యార్థి, సుప్రసిద్ధ నటుడు, నాటక చరిత్రకారుడు మిక్కిలినేని సాహచర్యంతో విశాల ప్రపంచ దృక్పథంతో, [[కమ్యూనిజం]], [[హిందూయిజం]], [[గాంధీయిజం]] గురించిన అవగాహన పెంచుకున్నారు. మంచి సృజనాత్మకతతో 1946లోనే కథారచనకు శ్రీకారం చుట్టారు. ఆనాటి ‘ఆనందవాణి’లో తొలికథ ‘జాలి గుండె’ అచ్చయింది. ఆ స్ఫూర్తితో దాదాపు నూట యాభై వరకు [[కథలు]], మూడు [[నవలలు]] రచించారు. వాటిలో "శాపగ్రస్తులు" నవల పాఠకాదరణ పొందినది. ఆయనకు మంచి రచయితగా, సాహిత్యవేత్తగా కూడా గుర్తింపు తెచ్చింది. 1957 నుండి 1967 వరకు "[[చుక్కాని]]" పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. ఆయన "సమాచారం" పత్రికలో కొంతకాలం పనిచేసారు. 1976 నుంచి 1988 వరకు [[ఈనాడు]] [[విశాఖపట్నం]] యూనిట్‌లో [[సబ్‌ఎడిటర్‌]]గా పనిచేసి పదవీ విరమణ చేశారు.<ref name=vasudevarao/>
 
ఆయన గ్రేటర్‌ విశాఖ నగర శివారు ఆరిలోవలో సాధారణ ఆవాసంలోనే జీవితం గడిపారు.
"https://te.wikipedia.org/wiki/కంచి_వాసుదేవరావు" నుండి వెలికితీశారు