శంకరాభరణం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 68:
=== కథా చర్చలు ===
 
[[తాయారమ్మ బంగారయ్య]] సినిమా విజయం తరువాత దర్శకుడు [[కె.విశ్వనాథ్]]ని కలిశాడు నిర్మాత [[ఏడిద నాగేశ్వరరావు]]. నాగేశ్వరరావుకి అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం అతడితో సినిమా చెయ్యడానికి పూనుకున్నాడు విశ్వనాథ్. అలా, శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని తెలిపే అంశంతో తను అనుకున్న కథను రచయిత [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]]<nowiki/>తో కలిసి తయారు చేశాడు విశ్వనాథ్. నాగేశ్వరరావుకి ఇంటర్వెల్ నచ్చి క్లైమాక్స్ నచ్చకపోవడంతో మళ్ళీ కథాచర్చలు నిర్వహించి చివరకు దానికి శంకరాభరణం అని పేరు పెట్టారు. అయితే, ప్రసిద్ధ వీణా విద్వాంసుడైన [[ఈమని శంకరశాస్త్రి]]<nowiki/>కి శంకరాభరణం రాగమంటే ఇష్టమనే విషయం అందరికీ తెలిసినదే కావడంతో అతడి జీవితకథతోనే సినిమా తీస్తున్నారని అందరూ అనుకున్నారు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=61|ps=శంకరాభరణం}}
 
=== నటీనటుల ఎంపిక ===
 
విజ్ఞానం, గాంభీర్యం, చిరు కోపం లాంటి లక్షణాలు కలిగిన శంకరశాస్త్రి పాత్రకు తొలుత [[అక్కినేని నాగేశ్వరరావు]], [[శివాజీగణేశన్]] లను అనుకున్నారు. కానీ వారిని సంప్రదించలేదు. ఆ తరువాత [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]]<nowiki/>కు కథను వినిపించారు. అయితే, ఆ పాత్ర తనకు కొత్తని, దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు తిరస్కరించాడు. చివరకు ఆ పాత్రకు ఓ కొత్త నటుడిని ఎంపిక చేయాలన్న దర్శకుడు విశ్వనాథ్ ఆలోచనను సమర్థించాడు నిర్మాత నాగేశ్వరరావు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=61|ps=శంకరాభరణం}} ఆ విషయమై వారిద్దరినీ తమ సన్నిహితులు వారించినా వారు తమ నిర్ణయం వైపే మొగ్గు చూపారు. ఆ క్రమంలో తనతో కలిసి ఒకప్పుడు నాటకాలు వేసిన జె.వి.సోమయాజులు గురించి విశ్వనాధ్ తో చెప్పాడు నాగేశ్వరరావు. అందుకు గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కూడా సమర్థించాడు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=62|ps=శంకరాభరణం}}
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శంకరాభరణం" నుండి వెలికితీశారు