సి. పుల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
 
== సినీ రంగంలో ==
[[రఘుపతి వెంకయ్య]], అతని కుమారుడు [[రఘుపతి ప్రకాష్]] దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి [[సినిమా]] నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో [[భీష్ముడు|భీష్ము]]<nowiki/>ని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, [[వై.వి.రావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుల్లయ్య [[కాకినాడ]]<nowiki/>లో 'భక్తమార్కండేయ' మూక్తీ చిత్రాన్ని 1925 లో నిర్మించి విడుదల చేసాడు. ఒక తెలుగు వాడు ఆంధ్రదేశంలో నిర్మించిన మూకీ 'భక్తమార్కండేయ'. ఇందులో పుల్లయ్య యమునిగా నటించాడు.
 
అక్కడ కాంగ్రెస్ నాయకుడు [[బులుసు సాంబమూర్తి]] సలహా మేరకు ఫిలిం లేబరేటరీలో చేరారు. రెండు పూటలా భోజనం పెట్టి, నెలకు ఐదు రూపాయల జీతం ఇచ్చేవారు. అక్కడే సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ నేర్చుకున్నారు. అయితే, కొన్నాళ్లకు ల్యాబ్ దివాళా తీసి మూతపడే పరిస్థితి రావడంతో, పుల్లయ్యకు ఇవ్వాల్సిన జీతం బదులు ఓ సెకండ్ హ్యాండ్ కెమెరా, ప్రొజెక్టరు, ఫిల్ములు ఇచ్చి దయచేయమన్నారు నిర్వాహకులు. వాటిని తీసుకుని [[కాకినాడ]] చేరారాయన. కెమెరా చేతిలో ఉండడంతో సినిమా తీయాలన్న కోరిక కలిగింది. తమ ఇంటి రేకుల షెడ్డులో సెట్లు వేసి, 'భక్త మార్కండేయ' సినిమా తీయడానికి ప్లాన్ వేశారు. అందులో తను యముడిగా కూడా నటించారు. కష్టపడి తీసిన సినిమాను తన ఇంట్లో చీకటి గదిలో గోడ మీద ప్రోజక్ట్ చేసి, తమ వీధిలోని వాళ్లందరికీ చూపించారు. అయితే, ఆయనకు అది సంతృప్తినివ్వలేదు. సినిమా మెలకువల్ని ఇంకా నేర్చుకోవాలన్న తలంపుతో, తన కళాశాల ప్రిన్సిపాల్ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] వద్ద రికమండేషన్ లెటర్ తీసుకుని, మద్రాసు బయలుదేరారు. అక్కడ వెంకటరత్నం నాయుడు సోదరుడు వెంకయ్య నాయుడు అప్పటికే సినిమా నిర్మాణంలో ఉన్నారు. వారి కుమారుడు ప్రకాష్ వద్ద పుల్లయ్య అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. [[రఘుపతి వెంకయ్య]]<nowiki/>గారికి థియేటర్లు కూడా ఉండేవి. కొన్నాళ్లకు వాటి ప్రదర్శన నిర్వహణను పుల్లయ్యకు అప్పజెప్పారు. అప్పుడే ఆయన ఆ రంగంలో కూడా అనుభవం సంపాదించారు.
 
టాకీ సినిమా వచ్చిన తర్వాత మళ్లీ పుల్లయ్య దృష్టి సినిమా మీదకు మళ్ళింది. అదే సమయంలో ఈయన గురించి తెలుసుకున్న కలకత్తాలోని ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు, తమ తెలుగు చిత్ర నిర్మాణ విభాగానికి ఇంచార్జ్ గా పుల్లయ్యను ఆహ్వానించారు. ఈస్టిండియా కంపెనీకి ఆయన రూపొందించిన తొలి సినిమా 'సతీ సావిత్రి'. ఆనాటి రంగస్థల ప్రముఖులు [[వేమూరి గగ్గయ్య]], [[రామతిలకం]] అందులో నటించారు. తర్వాత దేవకీ బోస్ బెంగాలీలో 'లవకుశ' ప్లాన్ చేస్తుంటే, ఆ సబ్జక్ట్ పుల్లయ్యను ఆకర్షించింది. దాంతో, ఆ కంపెనీకే దీనిని తెలుగులో తీయడానికి రెడీ అయ్యారు పుల్లయ్య. [[బలిజేపల్లి లక్ష్మీకాంత కవి]] స్క్రిప్ట్ రాశారు. [[పారుపల్లి సుబ్బారావు]], సీనియర్ శ్రీరంజని ఇందులో సీతారాములుగా నటించారు. రథాలు, సెట్లు, కాస్ట్యూమ్స్ వంటి వాటిని [[బంగ్లా భాష|బెంగాలీ]] వెర్షన్ కి వాడిన వాటినే వాడారు. 1934 లో విడుదలైన సినిమా గొప్ప విజయం సాధించింది. 1963లో ఇదే సినిమాను తన తనయుడు సి.యస్.రావుతో కలిసి పుల్లయ్య పునర్నిర్మించాడు. తెలుగులో తొలి రంగుల చిత్రంగా నమోదైన లవకుశలో [[ఎన్.టి.రామారావు]], [[అంజలీదేవి]] సీతారాములుగా నటించగా, నాగయ్య వాల్మీకిగా నటించారు. పుల్లయ్య తీసిన అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఇదీ ఒకటి.
"https://te.wikipedia.org/wiki/సి._పుల్లయ్య" నుండి వెలికితీశారు