పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''దక్షిణ [[కాశి]]'''గా ప్రసిద్ధి చెందిన [[పుష్పగిరి ఆలయ సముదాయము|పుష్పగిరి]] [[కడప]] నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది.
<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-05 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref>[[ఆదిశంకరులు]] పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ [[విద్యారణ్యస్వామి]] [[శ్రీచక్రం|శ్రీచక్రాన్ని]] ప్రతిష్ఠించారు. కడప నుంచి [[కర్నూలు]]కు వెళ్ళే మార్గంలో [[చెన్నూరు]] సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ [[మార్గము|మార్గం]]<nowiki/>లో పుష్పగిరి వస్తుంది. ఈ [[క్షేత్రం]] కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య [[పెన్నా]] [[నది]] ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, [[శైవులు]] దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
 
[[File:Pushpagiri Temple in Kadapa District.jpg|thumb|250px|పుష్పగిరి దేవాలయం]]
ఈ గ్రామాన్ని గురించి [[తెలుగు]]<nowiki/>లో తొలి యాత్రాచరిత్రగా చెప్పబడే [[కాశీయాత్ర చరిత్ర]]లో ప్రస్తావనలున్నాయి. గ్రంథకర్త [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన [[కాశీయాత్ర చరిత్ర|కాశీయాత్ర]]<nowiki/>లో ఈ గ్రామంలో 1830 సంవత్సరాంతంలో విడిది చేశారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు. గ్రంథంలో ఆయన పుష్పగిరి గురించి ఇలా వ్రాశారు: పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకినీ తీరము. నది గట్టున కొండ వెంబడిగా రమణియ్యమైన యొక దేవస్థల మున్నది. అది హస్తినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్త పీఠాధిపతి యయిన పుష్పగిరి స్వాములవారు, అక్కడ మఠము గట్టుకొని నివాసము చేస్తున్నారు. 18 బ్రాహ్మణ గృహములున్నవి. అక్కడి [[బ్రాహ్మణులు]] కొంత వేదాంత విచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకు పేటకు పోవలెగాని, అక్కడ దొరకవు. నది దాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నది దాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
==పేరు వృత్తాంతం==
ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది. [[గరుత్మంతుడు]] [[ఇంద్రుడు|ఇంద్రు]]<nowiki/>ని అమృతభాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికీ [[పోరాటం]] జరిగింది. ఆ సమయంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి [[యౌవనం]] లభించేది, అమరత్వమూ సిద్ధించేది. దేవతలు భయపడి [[శివుడు|శివు]]<nowiki/>ణ్ణి ఆశ్రయించారు. శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే పుష్పగిరి అయింది.
 
పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని '''పంచనదీక్షేత్ర'''మంటారు.
 
పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. [[ఆలయం]] బయటి గోడలపైన ఉండే [[శిల్పాలు]] చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి [[శిల్పాలు|శిల్పాల]]<nowiki/>లో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.
 
==హరిహరాదుల క్షేత్రం==