లైఫ్ అఫ్ పై: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 23:
}}
 
'''లైఫ్ అఫ్ పై''' అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ధ [[నవలా సాహిత్యము|నవల]]. యాన్‌ మార్‌ట్టెల్ ([[Yann Martel]]) దీని రచయిత. దీనిని అంగ్‌ లీ ([[Ang Lee]]) దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు. లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి తరుణ వయస్సులోజరిగిన విచిత్ర సంఘటనల, అనుభవాల ద్వారా పై ఒక [[రచయిత]]<nowiki/>కు చెప్పే తన కథ.
 
==నటీనటులు==
పంక్తి 41:
===ఫై బాల్యం ===
 
పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్న రవితో కలిసి జూ ప్రాంగణంలోనే నివాసం. జూ లోని జంతువులతో సావాసం. పుట్టుకతో [[హిందువులు|హిందువు]], కానీ పద్నాలుగేళ్ళ వయసులో క్రిష్టియానిటీ, [[ఇస్లాం]] మతాల మీద కూడా నమ్మకం కుదిరి, మూడు మతాల ప్రార్థనలూ చేస్తుంటాడు. పైకి పదహారేళ్ళ వయసున్నప్పుడు, అతని తండ్రి ఎమర్జన్సీ టైంలో (1976 లో) పాండిచ్చేరీలో జూ నిర్వహణకీ, ఇతర వ్యాపారాలకి భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించక, [[కెనడా]] వలస పోవాలని నిర్ణయించుకున్నాడు. జూలోని కొన్ని ముఖ్యమైన జంతువులని [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లోని కొన్ని జూలకి అమ్మేసారు. ఆ జంతువులని ఓడలో కెనడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలని ఒప్పందం. తన కుటుంబం తోనూ, ఆ జంతువులతోనూ కలిసి, ఒక జపానీ ఓడలో పసఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం. ఓ మూడు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత ఒక [[తుపాను]]లో ఓడ మునిగిపోయింది. పై మాత్రం ఎలాగో ఒక చిన్న లైఫ్ బోట్లోకి చేరుకోగలిగాడు. తన మిగతా కుటుంబం అంతా ఓడతో పాటూ మునిగిపోయింది.
 
File:Sumatraanse Tijger.jpg
పంక్తి 49:
ఆ లైఫ్ బోట్లో పైతో పాటూ ఒక [[జీబ్రా|చారలగుర్రం]] (జీబ్రా), ఒక [[ఒరాంగుటాన్]] (Orangutan), ఒక [[దుమ్ములగొండి]] (హయీనా), ఒక [[పెద్దపులి]] కూడా చోటు సంపాదించుకుంటాయి. జీబ్రానీ, ఒరాంగుటాన్నీ హయీనా, ఆ హయీనాని పులీ తినెయ్యగా, చివరికి పులీ, పై పడవలో మిగులుతారు. పులి గారికి రిచ్చర్డ్ పార్కర్ (Richard Parker) అని ఓ మంచి పేరు కూడా ఉంది. మిగిలిన కథ అంతా ఆ పులితో, ఆ సముద్రంలో, పై కొనసాగించిన ప్రయాణపు వయినంతో నడుస్తుంది.
 
ఒక వైపు పైకి తను ఒంటరి కానందుకు కొంచెం సంతోషం, ఒకవైపు [[పులి]]<nowiki/>తో సావాసం చేస్తూ క్షణక్షణం గండంగా ఉన్న పై పటేల్ పై ముందున్నవి రెండు సమస్యలు… ఒకటి పులికి తను ఆహారం కాకుండా ఉండాలంటే, దానికి వేరే ఆహారం సమర్పించుకోవడం. రెండు ఆ చిన్న బోట్లో ఎవరి హద్దులు ఎంతవరకో, ఎవరు ఎవరికి యజమానో స్పష్టం చెయ్యడం.
 
రెండో దానికి తను జూ వాతావరణంలో పెరిగి, అక్కడ తండ్రి నుంచీ, ఉద్యోగుల నుంచీ గ్రహించిన ఏనిమల్ సైకాలజీ, ట్రైనింగ్ సమయానికి ఉపయోగపడ్డాయి. కానీ చుట్టూ అగాధం లాంటి [[మహా సముద్రం]]<nowiki/>లో, [[పులి]] తినగలిగే ఆహారం సంపాదించడం ఎలా? పాపం దానికోసం పడరాని పాట్లు పడ్డాడు. శుద్ధ శాకాహారి అయిన తను, సముద్రంలో దొరికే చేపలూ, తాబేళ్ళూ పట్టి, వాటిని చంపి పులి ఆకలి తీరుస్తాడు. మొదటిసారి చేపను పట్టుకొని, దానిని చంపడానికి ఒక దుప్పటిలో చుట్టి, [[గొడ్డలి]]తో కొట్టడానికి పడే సంఘర్షణ నుండి, పాశవికంగా వట్టి చేతులతో కొట్టి చంపగలిగే మనస్థితికి చేరుకుంటాడు. ఆ నేపథ్యంలో పడిన వేదన, నెమ్మదిగా ఆ పనికి అలవాటు పడి యాంత్రికంగానూ కొంచెం క్రూరంగానూ మారిన వైనం చదువుతుంటే కొంచెం వొళ్ళు జలదరిస్తుంది. [[జంతువు]]<nowiki/>తో సమానంగా దొరికిన అడ్డమైన దాన్నీ తినడం … అసహ్యంతో పొట్టలో దేవేస్తుంది. కానీ అలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో మనిషికి వేరే దారి, విచక్షణ ఉండవు మరి.
 
పులికి సరిపడా తిండి పెట్టాక, దానికి తన హద్దులు ఏమిటో తెలియ చెయ్యడానికి, సర్కస్లో ఉపయోగించే ట్రైనింగ్ పద్ధతులు ఉపయోగిస్తాడు. బోట్లో ఒక వైపు మాత్రమే పులి తిరగగలిగిన ప్రదేశమనీ, ఆ లిమిట్స్ దాటి బయటకు రావటానికి వీల్లేదనీ తెలియచేసి, తన చుట్టూ ఒక రక్షణ కవచం కట్టుకున్నాడు. అయినా కూడా భయమే, ఏ నిద్రపోతున్న క్షణంలోనో అది మీదపడి అంతు చూస్తుందేమో అని. అసలు బోట్ లోంచి పులి ఆదమరపుగా ఉన్నప్పుడు సముద్రంలోకి తోసేద్దామా అనుకుంటాడు కూడా ఒకసారి, కానీ [[ఒంటరి]]<nowiki/>గా ఆ బోట్లో గడపటం కన్నా రిస్క్ తీసుకుని పులితో కలిసి బ్రతకడమే మేలు అనుకుంటాడు. కొన్నాళ్ళకి ఇంకొక షిప్ దూరంనుంచి వెళ్తుంటే చూసి, చూడు చూడు రిచర్డ్ పార్కర్, మనం రక్షించబడే సమయం వచ్చేసింది, ఎంతో సేపు పట్టదు అని ఆనందపడతాడు. కానీ అందులో ఎవరూ వీళ్ళని చూడకుండానే దూరమయిపోతారు.
 
అలా ఆ లైఫ్ బోట్లో పులితో కలిపి దాదాపు ఏడు నెలలు సముద్రంలో గడిపిన తర్వాత, [[మెక్సికో]] తీరం చేరుకుంటాడు. పై కూడా చివరికి కథ సుఖాంతం అవుతున్నందుకు సంతోషపడి, ఇన్నాళ్ళు తను ఒంటరితనంతో చావకుండా తనకి తోడున్నందుకు పులికి థాంక్స్ చెప్పి వీడ్కోలు తీసుకుందాం అనుకున్నాడు. ఇంకా ఎక్కడ పులి? తీరం చూడగానే పులి ఒక్క దూకు దూకి, ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రక్కనే ఉన్న అడవుల్లోకి పరిగెడుతుంది. “అయ్యో, రిచర్డ్ పార్కర్ నాకు ఆఖరిసారి వీడ్కోలు కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయాడో, ఇన్నాళ్ళు ఒకరికొకరం తోడుగా ఉన్నాం కదా, అలా ఎలా చెయ్యగలిగాడు?” అంటూ పై బాధపడతాడు. అన్ని నెలలుగా సరైన తిండి లేక, ఎండకు ఎండీ వానకు తడిసీ సరిగా నిలబడే శక్తి కూడా లేదు పై కి. పై అక్కడ తీరంలో [[స్పృహ]] తప్పి పడి ఉంటే, కొందరు మెక్సికన్లు అతనిని చూసి వూర్లోకి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి, తిండి పెట్టి హాస్పిటల్లో చేరుస్తారు.
"https://te.wikipedia.org/wiki/లైఫ్_అఫ్_పై" నుండి వెలికితీశారు