సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 64:
'''1996 ప్రపంచ కప్''' : తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ [[1996]] [[ప్రపంచ కప్ క్రికెట్]]లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిల్చాడు. ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు.[[1998]] ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. అందులోనే [[షేన్‌వార్న్]], [[రోబర్ట్ సన్]] లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సీరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం.<ref>SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. ''Down Memory Lane - Shane Warne's nightmare''. November 29, 2004</ref>
 
'''1999 ప్రపంచ కప్''' : [[1999]] ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ టెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో [[జింబాబ్వే]]తో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై [[కెన్యా]] పై [[బ్రిస్టన్]]లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు.<ref>[{{Cite web |url=http://usa.cricinfo.com/link_to_database/ARCHIVE/WORLD_CUPS/WC99/SCORECARDS/GROUP-A/IND_KENYA_WC99_ODI15_23MAY1999_CI_MR.html |title=Report on 1999 WorldCup match against Kenya] |website= |access-date=2007-11-25 |archive-url=https://web.archive.org/web/20090504185744/http://usa.cricinfo.com/link_to_database/ARCHIVE/WORLD_CUPS/WC99/SCORECARDS/GROUP-A/IND_KENYA_WC99_ODI15_23MAY1999_CI_MR.html |archive-date=2009-05-04 |url-status=dead }}</ref>
 
[[దస్త్రం:Master Blaster at work.jpg|left|thumb|300px|క్రీజ్ లో ఉద్యుక్తూడవుతున్న సచిన్.]]
'''షేర్‌వార్న్ కు సింహస్వప్నం''' : [[1998]] [[ఆస్ట్రేలియా]] పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ [[షేన్‌వార్న్]] బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం<ref>SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. Down Memory Lane - Shane Warne's nightmare. November 29, 2004</ref>.
 
'''నాయకత్వం''' : ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా [[అజహరుద్దీన్]] నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కాని ఈ సీరీస్ కొత్త ప్రపంచ చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది.<ref>[{{Cite web |url=http://aus.cricinfo.com/db/ARCHIVE/1999-2000/IND_IN_AUS/SCORECARDS/IND_AUS_T2_26-30DEC1999.html |title=Cricinfo match report AUS v IND 3rd Test 26-30 December 1999] |website= |access-date=25 నవంబర్ 2007 |archive-url=https://web.archive.org/web/20071011205320/http://aus.cricinfo.com/db/ARCHIVE/1999-2000/IND_IN_AUS/SCORECARDS/IND_AUS_T2_26-30DEC1999.html |archive-date=11 అక్టోబర్ 2007 |url-status=dead }}</ref> ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.అతని తర్వాత [[2000]]లో [[సౌరవ్ గంగూలీ]]కి కెప్టెన్సీ ఇవ్వబడింది.
 
'''2003 ప్రపంచ కప్''' : [[2003]] ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చాడు. కాని ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ నే వరించింది. 2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో [[సిడ్నీ]]లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు.
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు