వరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 9:
|dialogues = [[తోట ప్రసాద్]]
|lyrics =
|producer =డి.వి.వి.దానయ్య
|distributor =
|released = 31 మార్చి 2010
|runtime =
|language = తెలుగు
|music =[[మణి శర్మ]]
|playback_singer =
|choreography =
|cinematography =ఆర్.డి. రాజశేఖర్
|editing =ఆంథోనీ
|production_company = [[గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్]]
|awards =
పంక్తి 25:
}}
 
'''వరుడు 2010 లో వచ్చిన సినిమా.''' దర్శకుడిగా [[గుణశేఖర్]] పదవ చిత్రం. ఈ చిత్రంలో [[అల్లు అర్జున్]], తమిళ నటుడు [[ఆర్య(నటుడు)|ఆర్య]], <ref>[http://www.indiaglitz.com/channels/telugu/article/52094.html Varudus shooting completes – Telugu Movie News]. Indiaglitz.com (26 November 2009). Retrieved on 2015-08-03.</ref> [[భానుశ్రీ మెహ్రా|భాను శ్రీ మెహ్రా]] ప్రధాన పాత్రల్లో [[సుహాసిని|నటించగా]], [[సుహాసిని|సుహాసిని మణిరత్నం]], [[ఆశిష్ విద్యార్థి|ఆశిష్ విద్యార్తి]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] <ref>[https://web.archive.org/web/20101208200636/http://entertainment.oneindia.in/telugu/top-stories/2009/allu-arjun-varudu-arya-041109.html Varudu with Allu Arjun against Arya]. entertainment.oneindia.in. 4 November 2009</ref> సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. <ref name="indiglamour.com">{{వెబ్ మూలము|year=2010|title=Varudu's heroine|publisher=indiglamour.com|accessdate=27 March 2010|url=http://www.indiglamour.com/s3cms/article/Telugu/Varudus-heroine201003}}</ref> [[మణిశర్మ|మణి శర్మ]] స్వరపరిచిన ఈ చిత్రం 2010 మార్చి 31న విడుదలైంది.
{{మొలక-తెలుగు సినిమా}}
 
== కథ ==
సందీప్ 'శాండీ' ( [[అల్లు అర్జున్]] ) రేపటి తరం యువకుడు. అతను ఆధునిక దృక్పథం కలిగి ఉంటాడు. కాని పెళ్ళి పట్ల అతని ఆలోచనలు సాంప్రదాయికంగా ఉంటాయి. అతను యుఎస్ఎలో ఉద్యోగం వచ్చినప్పుడు, అతని తల్లిదండ్రులు వసుంధర ( [[సుహాసిని]] ), రాజ్ గోపాల్ ( [[ఆశిష్ విద్యార్థి|ఆశిష్ విద్యార్తి]] ) అతన్ని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని వారివారి తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్నారు. వారు ఎంపిక చేసిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాననీ, పెళ్లినాటి వరకు అమ్మాయిని చూడను కూడా చూడననీ ఐదు రోజుల పాటు పెళ్ళి చెయ్యాలనీ అతడు అడుగుతాడు. అతని ఇష్టాలకు అనుగుణంగా ప్రతిదీ ఏర్పాటు చేస్తారు. అతని పెళ్ళి దీప్తి ( [[భానుశ్రీ మెహ్రా|భాను శ్రీ మెహ్రా]] ) తో నిశ్చయమౌతుంది. వేడుకలో, శాండీ దీప్తి ఒకరినొకరు చూసుకున్నప్పుడు, వారు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. దీప్తిని దివాకర్ ( [[ఆర్య(నటుడు)|ఆర్య]] ) అనే స్థానిక గూండా కిడ్నాప్ చేస్తాడు. శాండీ తల్లిదండ్రులు అతనిని మరొకరిని పెళ్ళి చేసుకొమ్మని ఒప్పించటానికి ప్రయత్నిస్తారు. కాని అతను నిరాకరించి తన వధువును కనుగొనటానికే ప్రయత్నిస్తాడు.
 
అతను దీప్తి ఆచూకీ తెలుసుకుంటాడు. గతంలో ఒకసారి బహిరంగంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె అతణ్ణి చెంపదెబ్బ కొడుతుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి దివాకర్ దీప్తిని కిడ్నాప్ చేశాడు. దివాకర్, అతని అనుచరులూ పోలీసులను చంపుతారు. శాండీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని దివాకర్ సోదరుడిని కిడ్నాప్ చేసి తన వధువును రప్పించుకుంటాడు. ఈ గొడవలో, చేతనైతే తన పెళ్లిని అడ్డుకోమని అతను దివాకర్‌ను సవాలు చేస్తాడు, దానికి అతను అంగీకరిస్తాడు. అన్ని ఆచారాలతో శాండీ దీప్తి విజయవంతంగా పెళ్ళి చేసుకుంటారు. వారు మండపం నుండి బయటికి వచ్చినప్పుడు, దివాకర్ శాండీపై దాడి చేస్తాడు. ఒక పోరాటం జరుగుతుంది, ఇందులో శాండీ దివాకర్‌ను చంపేస్తాడు. శాండీ దీప్తి సంతోషంగా జీవిస్తారు.
 
== తారాగణం ==
{{Div col}}
* [[అల్లు అర్జున్]]
* ఆర్య
* భానుశ్రీ మెహ్రా
* [[సుహాసిని]]
* [[ఆషిష్ విద్యార్థి]]
* [[నరేష్]]
* వినయ ప్రసాద్
* కిషోరీ బల్లాల్
* [[నాజర్]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం]]
* [[సయాజీ షిండే]]
* [[రావు రమేష్]]
* [[ఆహుతి ప్రసాద్]]
* [[దీక్షా పంత్]]
* [[కొండవలస లక్ష్మణరావు]]
* [[హర్ష వర్ధన్]]
* [[సింగీతం శ్రీనివాసరావు]]
* స్నేహా ఉల్లాల్
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[సునీల్ (నటుడు)|సునీల్]]
{{Div col end}}
 
== పాటలు ==
[[మణిశర్మ|మణి శర్మ]] స్వరపరచిన పాటలను రామానాయుడు స్టూడియోలో 2010 మార్చి 7 న విడుదల చేసారు. . ఆడియోను [[ ఆదిత్య సంగీతం|ఆదిత్య మ్యూజిక్]] మార్కెట్లో విడుదల చేసింది. {{Track listing|all_writing=[[వేటూరి సుందరరామమూర్తి]]|extra4=హేమచంద్ర, మాళవిక|extra7=కార్తిక్, గీతామాధురి|title7=రేలారే రేలారే|length6=4:51|extra6=హేమచంద్ర, మాళవిక,|note6=Traditional Version|title6=ఐదు రోజుల పెళ్ళి|length5=6:13|extra5=సోను నిగం, శ్రేయా ఘోషల్, కల్పన|title5=బహుశా ఓ చంచలా|length4=3:20|title4=తలంబ్రాలతో|extra_column=గాయనీ గాయకులు|length3=4:24|extra3=హేమచంద్ర, మాళవిక|title3=కలలు కావులే|length2=8:43|extra2=జమునారాణి, హేమచంద్ర, మాళవిక, విజయలక్ష్మి, సునంద,రంజిత్|title2=ఐదు రోజుల పెళ్ళి|length1=4:46|extra1=బెన్నీ దయాళ్|title1=సారే జహా.. ప్రేమే యహా|total_length=36:38|length7=4:21}}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వరుడు" నుండి వెలికితీశారు