వరుడు 2010 లో వచ్చిన సినిమా. దర్శకుడిగా గుణశేఖర్ పదవ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్, తమిళ నటుడు ఆర్య,[2] భాను శ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటించగా, సుహాసిని మణిరత్నం, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం [3] సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత.[4] మణి శర్మ స్వరపరిచిన ఈ చిత్రం 2010 మార్చి 31న విడుదలైంది. ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది.

వరుడు
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం గుణశేఖర్
నిర్మాణం డి.వి.వి. దానయ్య
కథ గుణశేఖర్
తారాగణం అల్లు అర్జున్
భానుశ్రీ మెహ్రా[1]
స్నేహా ఉలాల్
సుహాసిని
సింగీతం శ్రీనివాసరావు
శాయాజీ షిండే
ఆశిష్ విద్యార్థి
ఆర్య
నరేష్
ఆలీ (నటుడు)
బ్రహ్మానందం
ఫిష్ వెంకట్
జై బద్లాని
ధృతిమాన్ చ్యాటార్జీ
సంగీతం మణి శర్మ
సంభాషణలు తోట ప్రసాద్
ఛాయాగ్రహణం ఆర్.డి. రాజశేఖర్
కూర్పు ఆంథోనీ
నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్
విడుదల తేదీ 31 మార్చి 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సందీప్ 'శాండీ' ( అల్లు అర్జున్ ) రేపటి తరం యువకుడు. అతను ఆధునిక దృక్పథం కలిగి ఉంటాడు. కాని పెళ్ళి పట్ల అతని ఆలోచనలు సాంప్రదాయికంగా ఉంటాయి. అతను యుఎస్ఎలో ఉద్యోగం వచ్చినప్పుడు, అతని తల్లిదండ్రులు వసుంధర ( సుహాసిని ), రాజ్ గోపాల్ ( ఆశిష్ విద్యార్థి ) అతన్ని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని వారివారి తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్నారు. వారు ఎంపిక చేసిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాననీ, పెళ్ళినాటి వరకు అమ్మాయిని చూడను కూడా చూడననీ ఐదు రోజుల పాటు పెళ్ళి చెయ్యాలనీ అతడు అడుగుతాడు. అతని ఇష్టాలకు అనుగుణంగా ప్రతిదీ ఏర్పాటు చేస్తారు. అతని పెళ్ళి దీప్తి ( భాను శ్రీ మెహ్రా ) తో నిశ్చయమౌతుంది. వేడుకలో, శాండీ దీప్తి ఒకరినొకరు చూసుకున్నప్పుడు, వారు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. దీప్తిని దివాకర్ ( ఆర్య ) అనే స్థానిక గూండా కిడ్నాప్ చేస్తాడు. శాండీ తల్లిదండ్రులు అతనిని మరొకరిని పెళ్ళి చేసుకొమ్మని ఒప్పించటానికి ప్రయత్నిస్తారు. కాని అతను నిరాకరించి తన వధువును కనుగొనటానికే ప్రయత్నిస్తాడు.

అతను దీప్తి ఆచూకీ తెలుసుకుంటాడు. గతంలో ఒకసారి బహిరంగంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె అతణ్ణి చెంపదెబ్బ కొడుతుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి దివాకర్ దీప్తిని కిడ్నాప్ చేశాడు. దివాకర్, అతని అనుచరులూ పోలీసులను చంపుతారు. శాండీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని దివాకర్ సోదరుడిని కిడ్నాప్ చేసి తన వధువును రప్పించుకుంటాడు. ఈ గొడవలో, చేతనైతే తన పెళ్ళిని అడ్డుకోమని అతను దివాకర్‌ను సవాలు చేస్తాడు, దానికి అతను అంగీకరిస్తాడు. అన్ని ఆచారాలతో శాండీ దీప్తి విజయవంతంగా పెళ్ళి చేసుకుంటారు. వారు మండపం నుండి బయటికి వచ్చినప్పుడు, దివాకర్ శాండీపై దాడి చేస్తాడు. ఒక పోరాటం జరుగుతుంది, ఇందులో శాండీ దివాకర్‌ను చంపేస్తాడు. శాండీ దీప్తి సంతోషంగా జీవిస్తారు.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

మణి శర్మ స్వరపరచిన పాటలను రామానాయుడు స్టూడియోలో 2010 మార్చి 7 న విడుదల చేసారు. . ఆడియోను ఆదిత్య సంగీతం మార్కెట్లో విడుదల చేసింది.

All tracks are written by వేటూరి సుందరరామమూర్తి.

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."సారే జహా.. ప్రేమే యహా"బెన్నీ దయాళ్4:46
2."ఐదు రోజుల పెళ్ళి"జమునారాణి, హేమచంద్ర, మాళవిక, విజయలక్ష్మి, సునంద,రంజిత్8:43
3."కలలు కావులే"హేమచంద్ర, మాళవిక4:24
4."తలంబ్రాలతో"హేమచంద్ర, మాళవిక3:20
5."బహుశా ఓ చంచలా"సోను నిగం, శ్రేయా ఘోషల్, కల్పన6:13
6."ఐదు రోజుల పెళ్ళి" (Traditional Version)హేమచంద్ర, మాళవిక,4:51
7."రేలారే రేలారే"కార్తిక్, గీతామాధురి4:21
మొత్తం నిడివి:36:38

మూలాలు

మార్చు
  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
  2. Varudus shooting completes – Telugu Movie News Archived 2009-11-28 at the Wayback Machine. Indiaglitz.com (26 November 2009). Retrieved on 2015-08-03.
  3. Varudu with Allu Arjun against Arya. entertainment.oneindia.in. 4 November 2009
  4. "Varudu's heroine". indiglamour.com. 2010. Retrieved 27 March 2010.
"https://te.wikipedia.org/w/index.php?title=వరుడు&oldid=3870148" నుండి వెలికితీశారు