చర్చ:ముహూర్త బలం: కూర్పుల మధ్య తేడాలు

విన్నపం
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
{{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}}
{{వికీప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును|తరగతి=మొలక|యాంత్రికం=అవును}}
*పెళ్లంటే.... పందిళ్లు, సందళ్లు, బంధువులు, విందులు, తాళాలు, తలంబ్రాలు! వీటన్నింటికీ ముఖ్యం... సుముహూర్తం. 'కానీ... మాఘ మాసం వచ్చేదాకా మంచి రోజు లేదన్నాడే! ఆగేదెట్టాగా? అందాకా వేగేదెట్టాగా?' అని వాపోయేవారికి ఇది పిడుగులాంటి వార్తే! ఎందుకంటే... ఈసారి మాఘమాసంలోనూ మంచి ముహూర్తం లేదు. చైత్రం, వైశాఖానిదీ అదే పరిస్థితి.నవంబర్ 14 నుంచి సుమారు ఆరు నెలలపాటు సుముహూర్తమే లేదు. మాఘ మాసాన్ని శుక్ర మౌఢ్యమి మింగేసింది. ఆ వెంటనే గురు మౌఢ్యమి వచ్చిపడింది. చైత్రమాసంలో అంటే 2010 మార్చి 17 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నాలుగైదు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. అయితే... వధూవరుల నక్షత్రాలకు ఆ ముహూర్తాలు సరిపోవాలి. మిగిలిన వ్యవహారాలన్నీ కలిసిరావాలి.చైత్రం తర్వాత వస్తున్నది... అధిక వైశాఖ మాసం. అధిక మాసంలో వివాహాది శుభకార్యాలు చేయరు. వెరసి... మే 15 వరకు వివాహం, గృహప్రవేశం వంటి ఎలాంటి శుభకార్యాలూ జరుపుకోకూడదు. అంటే... నవంబర్ 14 నుంచి మే మూడో వారం వరకు బాజా భజంత్రీలు మూగపోవాల్సిందే! ఈ ఏడాది నవంబర్ 14 నుంచే మంచి ముహూర్తాలు లేవని చాలా మంది పంచాంగ కర్తలు చెబుతున్నారు.ఒకటి రెండు పంచాంగాల్లో మాత్రం పరిమితంగా కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 16 నుంచి మౌఢ్యమి కాబట్టి ఎలాగూ శుభకార్యాలు జరుపుకోకూడదు. ఈలోగా ఎందుకు ముహూర్తాలు లేవని ప్రశ్నిస్తే... గ్రహస్థితుల కారణంగా మంచి లగ్నాలు లేవనేది వారి సమాధానం. 'ఈ ముహూర్తాలు, లగ్నాలు అన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవే కదా! కాస్త చూసీ చూడనట్లు వెళ్తే పోలా! అని కుర్రకారు అనుకున్నా... ఇంట్లో పెద్దవాళ్లు మాత్రం ఊరుకోరు!అలా అని ఊరుకోకుండా పంచాంగాలన్నీ తిరగేసి తమకు అనుకూలంగా ఉన్న ఏదో ఒక ముహూర్తానికి ఓకే చెబుతున్నారు. కొన్ని పంచాంగాల్లో ముహూర్తాలు ఉండడం.. మరికొన్నింటిలో లేకపోవడం ఏమిటని కొందరు పంచాంగకర్తలను ఆక్షేపిస్తున్నారు. ఐదారు మాసాలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు లేకపోతే కోట్లాది రూపాయల వ్యాపారం ఏం కావాలి? అసలే ఆర్థిక మాంద్యంతో వ్యాపారాలు సరిగా లేక తల్లడిల్లి పోతుంటే.. పులిమీద పుట్రలా ఇదేంటని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.చీరెలు, నగలు, కళ్యాణ మండపాలు, వాటికి అలంకారాలు, పూలు, క్యాటరింగ్‌లు, భజంత్రీలు, పురోహితులు, వీడియోలు, ఫొటోలు... ఒకటా రెండా! రాష్ట్రంలోని కళ్యాణమంటపాల్లో ఏటా సుమారు 10 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇక ఇళ్లలో, గుళ్లలో జరిగే వాటికి లెక్క లేదు. పెళ్లిళ్ల పేరిట మన రాష్ట్రంలో సుమారు 30 వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఓ అంచనా.ఆరు నెలల పాటు పెళ్ళిళ్లు లేకపోతే ఈ వ్యాపారం అంతా ఏం కావాలి? దుస్తుల నుంచి బంగారు వస్తువుల వ్యాపారం వరకు అన్నీ డీలా పడిపోవడం ఖాయమని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పట్టువిడుపులు ప్రదర్శించి ముహూర్తాలు పెట్టేస్తే రాష్ట్రం కళకళలాడుతుంది కదా అని వ్యాపార వర్గాలు అంటుంటే... మరే విషయంలో అయినా మార్గాంతరం ఉంటుందేమో కానీ మౌఢ్యాలకు, అధికమాసానికి ఉండదు.మౌఢ్యాలు, అధిక మాసాల్లో పెళ్లిళ్లు చేయలేం కదా అని పండితులు అంటున్నారు! పెళ్లిళ్లు ఉంటే నిశ్చితార్థం, వివాహం, సత్యనారాయణ వ్రతం... ఇలా పెళ్లికి అనుబంధంగా ఉండే అనేక వేడుకలతో పురోహితులకు చేతినిండా పని ఉంటుంది. పెళ్లిళ్లు లేకపోతే పురోహితుల ఆదాయంలో 60 శాతానికి పైగా గండి పడుతుంది. http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/sep/12main10
"https://te.wikipedia.org/wiki/చర్చ:ముహూర్త_బలం" నుండి వెలికితీశారు
Return to "ముహూర్త బలం" page.