జలగం వెంగళరావు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''జలగం వెంగళరావు''' ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్]] కు 6 వ [[ముఖ్యమంత్రి]], '''జలగం వెంగళరావు'''. నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన [[ముఖ్యమంత్రి]]గా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిపదవులు నిర్వహించాడు.
 
తన 20 వ ఏట [[నిజాము]]కు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు. రెండు సార్లు జైలుకు వెళ్ళాడు. 1952 లో [[శాసనసభ]]కు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. [[1952]] నుండి 1962 వరకు ఆయన కాంగ్రెసు పార్టీ [[ఖమ్మం జిల్లా]] అధ్యక్షుడిగా ఉన్నాడు. [[1962]]లో కాంగ్రెసు పార్టీ తరపున [[ఖమ్మం జిల్లా]] [[సత్తుపల్లి]] నియోజకవర్గం నుండి గెలిచి [[శాసనసభ]]లో ప్రవేశించాడు. ఆ తరువాత [[1978]] వరకు మరో మూడు సార్లు [[సత్తుపల్లి]] నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. [[1967]]లో పంచాయితీరాజ్‌ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు.
పంక్తి 39:
కాంగ్రెసు పార్టీ చీలిపోయి కాంగ్రెసు (ఐ) ఏర్పడినపుడు, వెంగళరావు కొన్నాళ్ళు పార్టీకి దూరమయ్యాడు. మళ్ళీ 1984 లో కాంగ్రెసుకు తిరిగి వచ్చి, [[1984]], [[1991]] మధ్య ఖమ్మం నియోజకవర్గం నుండి [[లోక్‌సభ]]కు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. [[1986]] నుండి [[1989]] వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేసాడు.
 
[[1999]] [[జూన్ 12|జూన్‌ 12]] న హైదరాబాదులో జలగం వెంగళరావు మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు - ప్రసాదరావు, వెంకటరావు. వీరిద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు [[జలగం వెంకటరావు]] [[2004]]లో [[సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.
 
==వనరులు, మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జలగం_వెంగళరావు" నుండి వెలికితీశారు