అక్క మహాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
ఉడుతడిని పాలించే రాజు కౌశికుడు ఒకనాడు నగరంలో ఊరేగుతుండగా, బాల్య చాపల్యంతో రాజును మేడలపై నుండి చూస్తూ ఉన్న బాలికలలో అందాల సుందరి మహాదేవి అతని కంటబడింది. వెంటనే ఎలాగైనా ఆమెను తన రాణిగా చేసుకోవాలని తలచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. వారు అంగీకరించకపోవడంతో మంత్రి వారిని అధికార దర్పంతో భయపెట్టాడు. తల్లిదండ్రుల అవస్థ గమనించిన మహదేవి ఒక ఉపాయమాలోచించి, రాజు తాను విధించే మూడు కోర్కెలు చెల్లిస్తే తాను వివాహమాడగలనని, ఏ ఒక్కదానికి భంగం వాటిల్లినా తాను స్వతంత్రురాలినై వెళ్ళిపోతానని తెలిపింది. రాజు అంగీకరించడంలో మహాదేవి రాజ మందిరం ప్రవేశించి నిత్యం లింగపూజ చేస్తూ, గురు జంగములకు తోడ్పడుతూ, అనుభవ మంటపములో పాల్గొంటూ కాలం గడపసాగింది.
 
 
కొంత కాలానికి కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కలిగించాడు. ఒకనాటి రాత్రి ఆమె పడకగదిలో నిద్రిస్తుండగా ఆరాధ్య గురువు వచ్చాడని తెలిసి ఆమె ఉన్నపాటున (దిగంబరిగా) బయటికి వచ్చి గురుదర్శనం చేసుకొనగా, వస్త్రాలు ధరించి రావలసిందిగా గురువు ఆమెను ఆజ్ఞాపించాడు. ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ, "పరమభక్తురాలివి గదా, నీకు వస్త్రం ఎందుకు?" అని అపహాస్యం చేస్తాడు. తక్షణం ఆమె నిడువైన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పివేసి గురుదర్శనం చేసుకుంటుంది. అప్పటినుండి అక్క మహాదేవి వస్త్రాలు ధరింపక జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది. రాజమందిరం నుండి బయటపడిన మహాదేవి అనేక కష్టాలను ఎదుర్కొని కళ్యాణ పట్టణం చేరుతుంది.
"https://te.wikipedia.org/wiki/అక్క_మహాదేవి" నుండి వెలికితీశారు