జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి ఇతివృత్తం
పంక్తి 21:
 
అటువంటి సాంప్రదాయిక ఉమ్మడికుటుంబంలో అడుగుపెట్టిన జమీల్యాకు దుడుకుతనం, మంకుపట్టు ఉన్నప్పటికీ నిజాయితీగా, నిష్కపటంగా వర్తించే స్వభావం కలది. కష్టపడి పనిచేసే మనస్తత్వంతో పాటు అందరితో సరదాగా కలుపుగోలుతనంతో వుండే జమీల్యాకు అత్తింట్లో చిట్టి మరిది సీట్ చేదోడు వాదోడుగా నిలుస్తాడు. కుటుంబ సంప్రదాయాలను అమితంగా గౌరవించే సాదిక్, తన భార్య జమీల్యా పట్ల ప్రేమను వ్యక్టం చేయడంకన్నా ఆమెను తన సొత్తులా భావించే మనస్తత్వం కలిగివుంటాడు. యుద్ధభూమి నుండి భర్త రాసిన ఉత్తరాలలో కూడా కనీసం ప్రేమాస్పదమైన పిలుపు కూడా నోచుకోని వైవాహిక జీవితం ఆమెది. అందుకే అత్తింట ఆదరాభిమానాలతో ఉల్లాసంగా గడిచిపోతున్నప్పటికీ ఆమెకు జీవితం ప్రేమ రాహిత్యంగానే గడిచిపోతుంది.
 
ఇది ఇలా ఉండగా యుద్ధంలో కాలుకి గాయమవడంతో సైన్యం నుండి తిరిగి వచ్చేసిన ధనియార్ అనాథగా తన స్వగ్రామానికి చేరుకొంటాడు. సహజంగానే అంతర్ముఖుడైన ధనియార్ ఆ గ్రామంలోని ప్రజలతో అంతగా కలివిడిగా వుండలేడు. కానీ పని పట్ల అంకితభావం వున్నవాడు. సమిష్టిక్షేత్రంలో పండించిన గోధుమ ధాన్యాన్ని సమీప పట్టణం లోని రైల్వే స్టేషన్ కు తరలించే పని జమీల్యా, మాజీ సైనికుడు ధనియార్, మరిది సీట్ లకి అప్పగించబడుతుంది. ఈ పనిలో నిమగ్నమైన జమీల్యా-ధనియార్ ల మధ్య చిన్నగా పరిచయం ఏర్పడుతుంది. స్పర్ధతో మొదలైన వీరి పరిచయం, వేళాకోళాలతో ఆటపట్టించడంగా సాగి, క్రమంగా ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఏర్పడి, చివరకు ప్రేమగా మారుతుంది.
 
==ప్రధాన పాత్రలు==
 
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు