అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
లింకులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
}}
 
'''అన్వేషణ''' [[వంశీ]] దర్శకత్వంలో కార్తీక్, [[భానుప్రియ]], [[శరత్ బాబు]] ప్రధాన పాత్రధారులుగా 1985లో విడుదలయిన తెలుగు మిస్టరీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని కామినేని ప్రసాద్ రాంకుమార్రామ్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా దర్శకుడు వంశీనే చూసుకున్నాడుసమకూర్చాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి. [[వేటూరి సుందరరామ్మూర్తి]] పాటలు రాశాడు. [[ఎం. వి. రఘు]] కెమెరా బాధ్యతలు నిర్వహించగా [[అనిల్ మల్నాడ్]] ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నాడు.
 
==కథ==
మద్రాసు సంగీత కళాశాలలో చదువుకున్న హేమ ఫారెస్ట్ కంట్రాక్టర్ రావుగారి ఆహ్వానం మేరకు ఆయన ఉంటున్న అటవీ ప్రాంతానికి వస్తుంది. సంగీత ప్రియుడైన రావుకు పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని, వివిధ రాగాలకు రకరకాల పక్షుల కూతలకు దగ్గర సంబంధం ఉందని నిరూపించే పరిశోధనని పుస్తకంగా వేయాలని ఆశయం. స్వయంగా ఆ విషయాన్ని పరిశోధన చేయాలని ప్రయత్నించినా వయసు మీదపడడంతో వచ్చిన మతిమరుపు ఆ పనిచేయనివ్వదు.
రావుగారి జీపు డ్రైవర్, అతని భార్య ఆ ఇంట్లోనే వంటమనిషి. రావు గారికి స్నేహితుడైన ఫారెస్ట్ రేంజర్ జేమ్స్, ఊరి సర్పంచి పులిరాజు ([[మల్లికార్జునరావు]]), ఆయన భార్య నాగలక్ష్మి, వాళ్ళ కొడుకు చంటోడు, నాగలక్ష్మి తమ్ముడు వంటివాళ్ళందరి విచిత్రమైన ప్రవర్తన హేమకు అర్థంకాకుండా ఆశ్చర్యం కలిగిస్తూంటుంది.
ఆమె కన్నా ముందే ఈ పరిశోధనకు రావుగారు రప్పించిన సుమతి పులివాత పడి మరణించినా హేమ చాలా ధైర్యంగా అడవిలో తిరుగుతూ పక్షికూతలు రికార్డు చేసుకుని విశ్లేషించుకుంటూ కొనసాగుతుంది. ముగ్గురు మనుషులు ఆమెను వెంటపడడం, వాళ్ళని మరో ముసుగుమనిషి వెంబడించడం హేమ గమనిస్తుంది. రావుగారి సహాయకుడు గోఖలే పులిబారిన పడి మరణించడంతో ఊళ్ళో పులిభయం మళ్ళీ తలెత్తుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు