వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 147:
== ఓటింగ్ పద్ధతి సరిగా లేదు, ఓటింగ్‌ కి పెట్టిన విషయమూ సరిగాలేదు ==
నేను ఎన్నో అనువాదాలను ఈ ట్రాన్సలేషన్ టూల్ వాడి చేశాను. అనువాదం చేసేప్పుడు యాంత్రిక అనువాదం మీద ఆధారపడకూడదని చెప్పను కానీ వాక్యాలను చాలా వరకూ మార్చేయవలసి వస్తుంది. గూగుల్ అనువాదం ఎంత తప్పుల తడకతో ఉంటుందో గతంలో గూగుల్ అనువాద వ్యాసాల్లో చూడడమే కాదు ఈనాటికీ ఎవరైనా అనువాదం చేసుకుని గమనించవచ్చు. చదువరి గారు కనీసం 30 శాతం మార్చితే కానీ ఆ అనువాదాన్ని టూల్ నుంచి ప్రచురించలేమన్న నియమం పెట్టడం చాలా అనుభవంతో చేసిన సరైన పని అని నా అభిప్రాయం. అటువంటిది ఆ నిబంధన తొలగించాలనడం ఒక పొరబాటు, అది తీసేసి కొత్తగా వచ్చిన వాడుకరులకు మాత్రమే ట్రాన్సలేషన్‌ టూల్ తో చేసిన అనువాదాలు నేరుగా మొదటి పేరుబరిలో ప్రచురిచనివ్వకూడదనడం మరో పొరబాటు. ఎందుకంటే, నేను 2015లో ఇక్కడికి వచ్చాను. వచ్చేనాటికే నేను ఎంతో భాష నేర్చుకునే వచ్చాను. అదే 2020లో వస్తే ఈ నిబంధన ప్రకారం నాకు భాష రాదన్నట్టు, నేను నేరుగా ప్రచురించకూడదన్నట్టు అవుతుంది కదా. అలాగే ఎందరో అనుభవజ్ఞులు తప్పులు చేయవచ్చు. ఇక చర్చ ఆసాంతం చదివితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికే తిరస్కరణ పొందాయని తెలుస్తోంది. అలాంటప్పుడు ఓటు ఎందుకు వేయాలంటూ ఓటింగ్ ప్రక్రియను తిరస్కరిస్తున్న సభ్యుల నిర్ణయం చాలా సముచితం, న్యాయం. కానీ, అలాగని ఊరుకుంటే ఈ ప్రతిపాదనలు గెలుస్తాయి. కాబట్టి, నేను ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే ప్రతిపాదనలో వ్యతిరేక ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. ఆలస్యంగా ఈ చర్చ చూడడం చాలా పెద్ద పొరబాటయింది. కనీసం, ఇప్పటికైనా నా వ్యతిరేకతను నమోదు చేయగలగడం సంతోషంగా ఉంది. --[[వాడుకరి:Meena gayathri.s|Meena gayathri.s]] ([[వాడుకరి చర్చ:Meena gayathri.s|చర్చ]]) 11:11, 20 సెప్టెంబరు 2020 (UTC)
 
నేను, మా కళాశాలలోని కొంతమంది విద్యార్థులు క్రిందటి రెండు సంవత్సరాల నుండి తెలుగు వికీపీడియా లో అనువాదం చేస్తున్నాము. డిసెంబర్,2019 లో మేము ఒక తెలుగు వికీపీడియా కార్యక్రమం లో పాల్గొన్నాము. కానీ మాకు తెలుగు భాష లో అంత అవగాహన లేకపోవడం చేత కొన్ని తప్పులు జరిగాయి. అందుచేత మేము అనువాదం చేసిన వాక్యాలు తెలుగు వికీపీడియా లో నుంచి తొలగించబడ్డాయి. అదే ఆ సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే మా వ్యాసాలు పూర్తి నాణ్యతతో ప్రసురించబడేయి. ఈ నిబంధన వాళ్ళ వ్యాసాల యొక్క నాణ్యత పెరగడం తో పాటు, కొత్తగా అనువాదం చేసేసవాళ్ళకి చాల ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కావున ఈ నిబంధన తొలగించేందుకు నేను వ్యతిరేకత తెలుపుతున్నాను. --[[వాడుకరి:Mekala Harika|Mekala Harika]] ([[వాడుకరి చర్చ:Mekala Harika|చర్చ]]) 13:07, 20 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".