వికీపీడియా చర్చ:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''==ఏకాభిప్రాయసాధన కోసం జరిగే చర్చలకు తగిన కోరం (Quorum) ఉండాలి.'''<br>==
ఈ అంశం మీద చర్చించడానికి సహాయపడవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. <br>
ఏదైనా ఒక చర్చలో చివరగా తీసుకొనే నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేలా చేయడానికి ఆ "చర్చలో హాజరు కావాల్సిన సాముదాయంలోని కనీస సభ్యుల సంఖ్య"ను కోరంగా పేర్కొంటారని మనకు తెలుసు. (Quorum is the minimum number of members of a community that must be present at any of its discussions to make the decisions of that discussion valid.) కోరం లేని చర్చలలో కంటే, తగినంత కోరం వున్న చర్చలలో తీసుకొనే నిర్ణయాలు, consensus అనే వికీ స్ఫూర్తికి మరింత అనుగుణంగా ఉంటాయి.
పంక్తి 36:
 
*''ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది సభ్యులు పాల్గొంటారన్న ఈ విషయంలో ఏమిటి మీ నమ్మకం.''-- సర్ స్పష్టంగా ఆశావాదంతో ముందుకు వెళదాం. ఎక్కువ మంది పాల్గొనకపోతే, పాల్గొనేలా చేయడానికి ఇంకా మనవైపు నుండి ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. ప్రతీ సమస్యకూ పరిష్కారముంటుంది. అతను పాల్గోవడం లేదు అంటే లోపం అతనితోనే కాదు మనలో కూడా ఉండవచ్చేమో. ఆ కోణం నుంచి ఆలోచిద్దాం. లోపం అటువైపు నుంచి అయితే దాన్ని మనం చేసేదేమీ లేదు. ప్రయత్న లోపం మనవైపు నుంచి ఉందా అనే కోణంలో నుంచి కూడా చూద్దాం. అసలు ప్రాధమికంగా మనం ఇక్కడ చర్చ చేస్తున్న సంగతి గురించి అతనికి (ఓ సాధారణ వాడుకరికి) తెలుస్తూందా? అనే ప్రాధమిక విషయం నుంచి చర్చించడం మొదలుపెడితే ఎంతో కొంత ఫలితం రావచ్చు. Every step begins a journey, and this one is for us. ఒకవేళ ఇప్పుడు మన ప్రయత్నాలు విఫలం అయినా మన తదుపరి ప్రయత్నాలకు ఈ చర్చ లోని విశ్లేషణ కొంత వరకు ఉపయోగపడుతుంది. --[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 00:52, 3 అక్టోబరు 2020 (UTC)
:: {{Ping|Vmakumar}} గారూ! //పవన్ సంతోష్ గారు పై విశ్లేషణను అన్ని కోణాలలో ఆలోచించగల సీనియర్ వికీపీడియన్స్ చక్కగా చేయగలరు. దీనికి వాడుకరి:Chaduvari గారు స్పందించి అంతే దీటుగా నియమావళిని రూపొందించారు. అయితే ఆ విధంగా రూపొందించిన సంఘం నిర్మాణ ప్రవర్తనా నియమావళి పాలసీ మ్యాటర్ మీద ఎంత మంది చర్చించారు? అన్నదే నా ప్రశ్న. అక్కడ పాలసీ మ్యాటర్ లో 12 మంది చేసాం. ఇక్కడ పాలసీ మ్యాటర్ లో ఐదు మంది చర్చించినా పరవాలేదు అనుకుంటే ఎలా అండీ// ఫరవాలేదు అని నేను అనలేదండీ. ఆ విధానం ఉండాలా వద్దా అన్నదాని మీద 12 మంది స్పందించారన్న విషయం మీరు పరిగణనలోకి తీసుకున్నారా లేదా అని సందేహం వచ్చి మీకు గుర్తుచేశాను. మీకు ఆ విషయం తెలిసే ఉందనీ, ఆ చర్చ చదివారనీ ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది. అందులో చంద్రకాంతరావు గారు మాట్లాడినవీ చూశారు, చదువరి గారు తయారుచేసిన విధానమూ అందుకు దీటుగా ఉందని గమనించారు. చర్చలో 5 గురు మాత్రమే పాల్గొనడమే మీకు సమస్య ఉందని ఇప్పుడు వివరించారు. సంతోషం. ఆ ముక్కే ముందు ఉండివుంటే నేనసలు ఆ విషయం ప్రస్తావించేవాడిని కాదు. ఇప్పుడు అక్నాలెడ్జ్ చేసినందుకు ధన్యవాదాలు.
:: రెండో అంశం మీరు స్పందించనే లేదు. ఒక చర్చ అంటూ జరిగినప్పుడు అందులో తగినంత చర్చ జరగని అంశాన్ని వేరుగా ప్రతిపాదించుకొమ్మని తిరస్కరించడం ఒక మంచి విషయమే కదా?
:: నా ఉద్దేశం నేను చెప్పిన రెండు విషయాలూ మీ కోరం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాయనీ, వ్యతిరేకిస్తున్నాయనీ కాదు. మీరొక ఉదాహరణ తీసుకువచ్చినప్పుడు దానిలో ఉన్న అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని రాస్తే ఆ చర్చ సఫలీకృతం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
:: ఇక్కడ మీరు ప్రాసెస్‌ని చర్చిస్తున్నారని నాకు అర్థమైంది. ఐనా, విషయంతో సంబంధం లేని పద్ధతిపై చర్చ ఫలప్రదమవడం కష్టం. ఇప్పుడు - మీకు ఇలా పన్నెండుమంది అలాంటి పద్ధతి ఒకరుండాలని, ఐదుగురు ఆ పద్ధతి ఎలా ఉండాలని చర్చించడం నచ్చలేదు అనుకుందాం. ఈ ఐదుగురూ పద్ధతి ఇలా ఉండాలని చర్చించి చేసేశారు, అందులో ఫలానా అంశం అసలు సరిగా లేదు కదా. అని మీరు ఎత్తిచూపగలిగితే మీరు మాట్లాడుతున్నదానికి పరిపూర్ణత వస్తుంది. ఈ చర్చల్లో పాల్గొని నిర్ణయంలో పాలుపంచుకున్నవాడిగా నాకైతే ఉదాహరణ తెచ్చినప్పుడు ఆ లోటు ఏమిటో కూడా మీరు చెప్పగలిగితే బావుంటుందనే అనిపిస్తోంది. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:18, 3 అక్టోబరు 2020 (UTC)
Return to the project page "ఏకాభిప్రాయం".