కాన్‌స్టాంటిన్ ద గ్రేట్: కూర్పుల మధ్య తేడాలు

"Constantine the Great" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

11:17, 18 అక్టోబరు 2020 నాటి కూర్పు

కాన్‌స్టాంటిన్ ద గ్రేట్ (క్రీ.శ. 272 ఫిబ్రవరి 27 నుంచి 337 మే 337) క్రీ.శ. 306 నుంచి 337 వరకూ పరిపాలించిన రోమన్ చక్రవర్తి. ఇతన్ని మొదటి కాన్‌స్టాంటిన్ అని కూడా పిలుస్తారు. డాసియా మెడిటెరానియాలోని నైసస్‌లో (నేటి సెర్బియాలోని, నీష్ నగరం) జన్మించాడు. కాన్‌స్టాంటిన్ తండ్రి ఫ్లావియస్ కాన్‌స్టాంటియస్ ఇలిరియన్ ప్రాంతానికి చెందిన సైన్యాధికారిగా జీవితం ప్రారంభించి రోమన్ సామ్రాజ్యపు టెట్రార్కీ విధానంలో నలుగురు చక్రవర్తుల్లో ఒకడయ్యాడు. అతని తల్లి హెలెనా గ్రీక్ జాతీయురాలు, సామాన్య కుటుంబంలో జన్మించింది. డియోక్లెటైన్, గాలెరియస్ చక్రవర్తులు ఇద్దరి నాయకత్వంలోనూ కాన్‌స్టాంటైన్ సేనా నాయకునిగా విశిష్టమైన సేవలందించాడు. ఇందులో భాగంగా తూర్పు ప్రావిన్సుల్లో బార్బేరియన్లు, పర్షియన్లపై పోరాడాడు. క్రీ.శ. 305లో అతని తండ్రి అధీనంలో బ్రిటన్‌లో పోరాడడానికి వెనక్కి పిలిచేదాకా తూర్పు ప్రావిన్సుల్లో సేనా నాయకునిగా పనిచేశాడు. 306లో ఇతని తండ్రి మరణించాకా ఎబోరాకం (ఈనాడు ఇంగ్లాండ్‌లోని యార్క్ నగరం) సైన్యం కాన్‌స్టాంటిన్‌ను చక్రవర్తిగా ప్రకటించింది. ఇతర చక్రవర్తులైన మాక్సెంటియస్, లిసినియస్‌లపై అంతర్యుద్ధాల్లో పోరాడి 324 నాటికల్లా రోమన్ సామ్రాజ్యపు ఏకైక పరిపాలకుడిగా నిలిచాడు.