నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కరోనా వ్యాధి మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 35:
తొలి, మలి దశల [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ ఉద్యమాల్లో]] చురుకుగా పాల్గొన్నాడు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహారెడ్డి [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆరుసార్లు పోటిచేసి, మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు.
 
[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)|1978]]లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటిచేసి ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[టి. అంజయ్య]]పై 2,167 ఓట్ల తేడాతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 1983లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 307 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)|1985]]లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె. ప్రకాష్ గౌడ్ పై 10,984 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ తరువాత 1989, 1994 ఎన్నికలల్లో జనతాదల్ పార్టీ తరపున పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 1989 ఎన్నికల్లో 12,367 ఓట్లు, 1994 ఎన్నికల్లో 4,931 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
 
అనంతరం 2001లో కెసీఆర్ స్థాపించిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరాడు.<ref>{{cite web|title=Council of Ministers|url=http://www.telangana.gov.in/Pages/CouncilofMinisters.aspx|work=telangana.gov.in|accessdate=22 October 2020|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20140714142420/http://www.telangana.gov.in/Pages/CouncilofMinisters.aspx|archivedate=14 July 2014}}</ref><ref>{{cite web|title=Telangana State ushers in its first Bonalu|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/telangana-state-ushers-in-its-first-bonalu/article6161628.ece|work=Hindu-Journal|accessdate=22 October 2020}}</ref> [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)|2004]]లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటిచేసి [[బిజెపి]] అభ్యర్థి కె. లక్ష్మణ్ పై 240 ఓట్ల తేడాతో గెలుపొంది, [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు.