కర్నాల్: కూర్పుల మధ్య తేడాలు

→‎పురాతన చరిత్ర: గుర్జర ప్రతీహార రాజవంశం లింకు సవరణ
పంక్తి 66:
గొప్ప దాత, యోధుడూ ఐన [[కర్ణుడు|కర్ణుడితో]] నగరానికి సంబంధం ఉంది. నగరంలో కర్ణుడి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. <ref name="Karna">[https://www.tribuneindia.com/news/sunday-special/people/king-karna-returns-to-his-land-karnal/496282.html King Karna returns to his land — Karnal. Mythology inspires ambitions, a larger-than-life portrayal of past events in order to add awe, plus a few nickels to the government kitty by way of tourism.]</ref> నగరంలోని కర్ణ తల్ అనే పేరుతో ఒక సరస్సు ఉంది. నగర ద్వారాన్ని కర్ణ గేట్ అని పిలుస్తారు.
 
క్రీస్తుశకం 6 వ శతాబ్దం చివరలో, ఈ ప్రాంతం థానేసర్‌కు చెందిన [[పుష్యభూతి రాజవంశం|వర్ధనుల]] పాలనలో ఉండేది. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=mRBuAAAAMAAJ|title=A Comprehensive History of India|last=D. C. Ganguly|publisher=Indian History Congress / People's Publishing House|year=1981|editor-last=R. C. Majumdar|editor-link=R. C. Majumdar|volume=3, Part I: A.D. 300-985|chapter=Western India in the Sixth Century A.D.|oclc=34008529|ref=harv}}</ref> 7 వ శతాబ్దంలో ఇండో-గంగా మైదానాలలో బౌద్ధమతం క్షీణిస్తూ హిందూ మతం తిరిగి పుంజుకుంటోంది. అప్పుడు ఈ ప్రాంతం బెంగాల్ పాల చక్రవర్తి (క్రీ.శ. 770-810) క్రింద కనౌజ్ పాలనలో ఉండేది. కనౌజ్ [[గుర్జరాగుర్జర -ప్రతీహార ప్రతిహరా రాజవంశాలురాజవంశం|ప్రతీహార]] పాలకుడు మిహిర భోజుడి (క్రీ.శ. 836-885) అధికారం కర్నాల్‌తో సహా పెహోవా వరకు విస్తరించి ఉండేది. <ref name="history">{{Cite book|url=https://books.google.com/books?id=HxlIAAAAIAAJ|title=Haryana, Ancient and Medieval|last=H. A. Phadke|publisher=Harman|year=1990|isbn=978-81-85151-34-2|ref=harv}}</ref>
 
రాజా జౌలా వారసులైన తోమరులు 9 వ శతాబ్దం మధ్యలో ఈ ప్రాంతానికి పాలకులయ్యారు.<ref name="history">{{Cite book|url=https://books.google.com/books?id=HxlIAAAAIAAJ|title=Haryana, Ancient and Medieval|last=H. A. Phadke|publisher=Harman|year=1990|isbn=978-81-85151-34-2|ref=harv}}</ref> 10 వ శతాబ్దం ప్రారంభంలో, ప్రతీహార శక్తి క్షీణించడం మొదలవగానే, తోమరులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. తోమర పాలకులలో ఒకడైన అనంగపాల్ తోమర్, ఢిల్లీ నగరాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. కర్నాల్‌తో సహా ఆధునిక హర్యానా ప్రాంతమంతా అతని రాజ్యంలో భాగంగా ఉండేది. తోమరులకు శాకంబరి చౌహాన్లతో తగాదాలుండేవి. 12 వ శతాబ్దం మధ్యకాలంలో చాహమాన విగ్రహరాజ IV వారిని పదవీచ్యుతులను చేసాడు. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=TKs9AAAAIAAJ|title=History of the Chāhamānas|last=R. B. Singh|publisher=N. Kishore|year=1964|oclc=11038728|ref=harv}}</ref> కర్నాల్‌తో సహా [[సట్లెజ్ నది|సత్లజ్]], [[యమునా నది|యమున]]<nowiki/>ల మధ్య ఉన్న ప్రాంతమంతా ఒకటిన్నర శతాబ్దం పాటు, గజనీ మహమూద్ దండయాత్రల సమయాన్ని తప్పించి, సాపేక్షికంగా ప్రశాంతంగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/కర్నాల్" నుండి వెలికితీశారు