కర్నాల్

హర్యానా రాష్ట్రం లోని నగరం

కర్నాల్ హర్యానా రాష్ట్రం లోని నగరం, కర్నాల్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) లో భాగం. పర్షియాకు చెందిన నాదర్ షాకు, మొఘల్ సామ్రాజ్యానికీ మధ్య1739 లో జరిగిన యుద్ధం ఇక్కడే జరిగింది. 1857 లో జరిగిన భారత తిరుగుబాటు సమయంలో, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సైన్యం ఇక్కడ తలదాచుకుంది.

కర్నాల్
నగరం
కర్నాల్ is located in Haryana
కర్నాల్
కర్నాల్
హర్యానా పటంలో కర్నాల్ నగర స్థానం
Coordinates: 29°41′10″N 76°59′20″E / 29.686°N 76.989°E / 29.686; 76.989
దేశం India
రాష్ట్రంహర్యాణా
జిల్లాకర్నాల్
Named forకర్ణుడు
Government
 • BodyMunicipal Corporation Karnal
జనాభా
 (2011)
 • Total2,86,827[1]
భాషలు
 • అధికారికహిందీ, పంజాబీ, ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
PIN
132001
Vehicle registrationHR-05
అక్షరాస్యత84.60%[1]
లింగనిష్పత్తి996/1000 స్త్రీ/పురుషుడు

పురాతన చరిత్ర

మార్చు

గొప్ప దాత, యోధుడూ ఐన కర్ణుడితో నగరానికి సంబంధం ఉంది. నగరంలో కర్ణుడి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.[2] నగరంలోని కర్ణ తల్ అనే పేరుతో ఒక సరస్సు ఉంది. నగర ద్వారాన్ని కర్ణ గేట్ అని పిలుస్తారు.

క్రీస్తుశకం 6 వ శతాబ్దం చివరలో, ఈ ప్రాంతం థానేసర్‌కు చెందిన వర్ధనుల పాలనలో ఉండేది.[3] 7 వ శతాబ్దంలో ఇండో-గంగా మైదానాలలో బౌద్ధమతం క్షీణిస్తూ హిందూ మతం తిరిగి పుంజుకుంటోంది. అప్పుడు ఈ ప్రాంతం బెంగాల్ పాల చక్రవర్తి (సా.శ. 770-810) క్రింద కనౌజ్ పాలనలో ఉండేది. కనౌజ్ ప్రతీహార పాలకుడు మిహిర భోజుడి (సా.శ. 836-885) అధికారం కర్నాల్‌తో సహా పెహోవా వరకు విస్తరించి ఉండేది.[4]

రాజా జౌలా వారసులైన తోమరులు 9 వ శతాబ్దం మధ్యలో ఈ ప్రాంతానికి పాలకులయ్యారు.[4] 10 వ శతాబ్దం ప్రారంభంలో, ప్రతీహార శక్తి క్షీణించడం మొదలవగానే, తోమరులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. తోమర పాలకులలో ఒకడైన అనంగపాల్ తోమర్, ఢిల్లీ నగరాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. కర్నాల్‌తో సహా ఆధునిక హర్యానా ప్రాంతమంతా అతని రాజ్యంలో భాగంగా ఉండేది. తోమరులకు శాకంబరి చౌహాన్లతో తగాదాలుండేవి. 12 వ శతాబ్దం మధ్యకాలంలో చాహమాన విగ్రహరాజ IV వారిని పదవీచ్యుతులను చేసాడు.[5] కర్నాల్‌తో సహా సత్లజ్, యమునల మధ్య ఉన్న ప్రాంతమంతా ఒకటిన్నర శతాబ్దం పాటు, గజనీ మహమూద్ దండయాత్రల సమయాన్ని తప్పించి, సాపేక్షికంగా ప్రశాంతంగా ఉంది.

మధ్య యుగం

మార్చు
 
కర్నాల్ యుద్ధం తరువాత ఢిల్లీ (1739) ని చేజిక్కించుకున్నాక, నాదర్ షా మొఘల్ రాజవంశం నుండి స్వాధీనం చేసుకున్న దారియా-ఇ-నూర్ వజ్రం

సా.శ. 1739 లో, నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యంపై దాడి చేసాడు. కర్నాల్ వద్ద జరిగిన యుద్ధంలో నాదిర్ షా, మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాను నిర్ణయాత్మకంగా ఓడించాడు.[6] ముహమ్మద్ షా తన అపారమైన సైన్యంతో సహా కర్నాల్ వద్ద దుర్గమమైన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాని నాదిర్షా, బయటి నుండి వాళ్ళకు ఆహార సరఫరాలేమీ జరగనీయకుండా దిగ్బంధనం చేసాడు. దానితో ఆకలిని తట్టుకోలేని ముహమ్మద్ షా ఆక్రమణదారుడికి లొంగిపోయాడు. ఈ ఓటమి మొఘల్ సామ్రాజ్యాన్ని తీవ్రంగా బలహీనపరిచింది, పర్షియన్ సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. తరువాత, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన వేగవంతమవడానికి కారణమైంది.

18 వ శతాబ్దంలో సిక్కులు ఈ ప్రాంతంలో తొలిసారిగా కనిపించారు. జింద్ రాష్ట్రానికి చెందిన రాజా గజ్‌పత్ సింగ్ కాలంలో కర్నాల్ ప్రాముఖ్యత పెరిగింది. అతడు సా.శ. 1763 లో దీన్ని స్వాధీనం చేసుకుని సరిహద్దు గోడను, ఒక కోటనూ నిర్మించాడు. అతడి పాలనలో పట్టణం పరిమాణం కూడా గణనీయంగా పెరిగింది.[7] 1764 జనవరి 14 న, సిక్కు నాయకులు దుర్రానీ గవర్నరైన జైన్ ఖాన్ సిర్హిందీని ఓడించి చంపారు. కర్నాల్‌తో సహా పానిపట్ వరకు దక్షిణాన ఉన్న సిర్హింద్ ప్రావిన్స్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆధునిక చరిత్ర

మార్చు

భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, లాలా లాజ్‌పత్ రాయ్ చైర్మన్‌గా కర్నాల్‌లో జిల్లా రాజకీయ సమావేశం ఏర్పాటు చేశారు. "హర్యానా గాంధీ" అని పిలువబడే మూల్ చంద్ జైన్ కర్నాల్‌కు చెందినవాడే. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ నాయకులలో ఒకడు.[8]

శీతోష్ణస్థితి

మార్చు
శీతోష్ణస్థితి డేటా - Karnal (1981–2010, extremes 1949–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 31.2
(88.2)
33.2
(91.8)
37.5
(99.5)
45.2
(113.4)
46.0
(114.8)
45.6
(114.1)
43.9
(111.0)
42.0
(107.6)
38.3
(100.9)
39.3
(102.7)
34.4
(93.9)
28.5
(83.3)
46.0
(114.8)
సగటు అధిక °C (°F) 19.1
(66.4)
22.4
(72.3)
27.7
(81.9)
35.3
(95.5)
38.3
(100.9)
37.9
(100.2)
33.9
(93.0)
32.8
(91.0)
32.5
(90.5)
31.7
(89.1)
27.4
(81.3)
21.8
(71.2)
30.1
(86.1)
సగటు అల్ప °C (°F) 7.1
(44.8)
9.4
(48.9)
13.5
(56.3)
18.8
(65.8)
23.3
(73.9)
25.5
(77.9)
25.6
(78.1)
25.1
(77.2)
23.2
(73.8)
17.4
(63.3)
12.0
(53.6)
8.0
(46.4)
17.4
(63.3)
అత్యల్ప రికార్డు °C (°F) −0.3
(31.5)
0.6
(33.1)
3.5
(38.3)
9.0
(48.2)
14.5
(58.1)
18.0
(64.4)
16.0
(60.8)
18.4
(65.1)
16.0
(60.8)
9.4
(48.9)
3.0
(37.4)
−0.4
(31.3)
−0.4
(31.3)
సగటు వర్షపాతం mm (inches) 26.7
(1.05)
24.8
(0.98)
17.8
(0.70)
8.4
(0.33)
24.2
(0.95)
65.7
(2.59)
171.8
(6.76)
157.5
(6.20)
115.9
(4.56)
3.5
(0.14)
1.9
(0.07)
9.0
(0.35)
627.2
(24.68)
సగటు వర్షపాతపు రోజులు 1.5 1.8 1.6 0.9 1.6 3.9 7.9 7.8 4.7 0.2 0.4 0.8 33.1
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 64 58 51 31 33 44 67 73 68 54 53 60 55
Source: India Meteorological Department[9][10]

నగర ప్రముఖులు

మార్చు
  • కల్పనా చావ్లా, మొదటి భారత-అమెరికన్ మహిళా వ్యోమగామి. 2003 లో, స్పేస్ షటిల్ కొలంబియా విపత్తులో మరణించిన ఏడుగురు సిబ్బందిలో చావ్లా ఒకరు [11]
  • మూల్ చంద్ జైన్, భారత స్వాతంత్ర్య నాయకుడు
  • పాకిస్తాన్ మొదటి ప్రధాని నవాబ్‌జాదా లియాఖత్ అలీ ఖాన్ .[12]
  • అనీష్ భన్వాలా, భారతీయ షూటర్.[13]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Karnal (M Cl)". censusindia.gov.in. Government of India. Retrieved 7 April 2016.
  2. King Karna returns to his land — Karnal. Mythology inspires ambitions, a larger-than-life portrayal of past events in order to add awe, plus a few nickels to the government kitty by way of tourism.[permanent dead link]
  3. D. C. Ganguly (1981). "Western India in the Sixth Century A.D.". In R. C. Majumdar (ed.). A Comprehensive History of India. Vol. 3, Part I: A.D. 300-985. Indian History Congress / People's Publishing House. OCLC 34008529.
  4. 4.0 4.1 H. A. Phadke (1990). Haryana, Ancient and Medieval. Harman. ISBN 978-81-85151-34-2.
  5. R. B. Singh (1964). History of the Chāhamānas. N. Kishore. OCLC 11038728.
  6. Axworthy, Michael (2009)
  7. D. C. Miglani (1993). Politics and Rural Power Struggle: Emerging Trends. Deep and Deep Publications. ISBN 81-7100-578-0.
  8. "Babu Mool Chand Jain Comprehensive Archives".
  9. "Station: Karnal Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 395–396. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 1 March 2020.
  10. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M65. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 1 March 2020.
  11. "Only 98 cities instead of 100 announced: All questions answered about the smart cities project". 28 August 2015.
  12. "63th death anniversary of Liaquat Ali Khan being observed today". The News Teller. Archived from the original on 2020-02-09. Retrieved 2020-11-18.
  13. India, Press Trust of (26 March 2018). "Anish wins India's third individual gold in Jr. World Cup". Business Standard India.
"https://te.wikipedia.org/w/index.php?title=కర్నాల్&oldid=4302701" నుండి వెలికితీశారు