గంగమ్మ జాతర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
== గంగమ్మ జాతర్లు నాడు ....నేడు==
కుంభం కూడుపెట్టిన తరువాత గంగమ్మలను రజకులు అనగా [[చాకలి]]వారు ఎత్తుకుంటారు. [[ఆసాదివారు]] అను సరిస్తారు. వారు ముందుగా గంగ మిట్టవద్దకు వెళ్ళి, అక్కడనుంచే [[సువర్ణముఖినదీ]] తీరానికి వెళతారు. ఆసాది వాడు బూతుపదాలు పాడుతూ వెళతాడు. జనం కూడా అతనిని అనుసరిస్తారు. దీవెన పదాలు పాడిన తరువాత గంగలను [[స్వర్ణముఖి నది|స్వర్ణముఖి]]లో నిమజ్జనం చేస్తారు. ఇలా పూర్వ సంప్రదాయంతో తరతాలుగా వస్తున్న ఈ గంగ జాతర్లను జరుపుతూ ఆ వుత్సాహంలో ఎన్నో జానపద గేయాలను, జానపద నృత్యాలను, జానపద వాయిద్యాలను ప్రయోగించి వుత్యవాలను జరుపుకుంటున్నారు. కాలంమారిన దృష్ట్యా నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ గంగజాతర్లు కొంచెం తగ్గినా వెనుకబడ్డ గ్రామాలలోనూ, వెనుకబడ్డ జాతులలోను ఈ గంగజాతర్లను భక్తిభావంతో చేస్తూనే ఉన్నారు. మన జానపద విజ్ఞానానికి గుర్తులు గంగ జాతర్లు. చిత్తూరు జిల్లా [[కలికిరి]] లో జరిగే గంగమ్మ జాతర్లు కూడా చాలా ప్రసిద్ది.
 
==చిత్ర మాలిక==
"https://te.wikipedia.org/wiki/గంగమ్మ_జాతర్లు" నుండి వెలికితీశారు