సినిమా అభిమానులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
=== సినిమా విడుదలకు ===
సినిమా విడుదలయ్యేరోజు ఉదయం ఆట కన్నా ముందే బెనిఫిట్ షో లేక ఫ్యాన్ షో అని థియేటర్లు ప్రదర్శించగా అభిమానులు సాధారణ టిక్కెట్ ధర కన్నా ఎన్నో రెట్లు (కొన్నిసార్లు రూ.150 టిక్కెట్ కోసం రూ.3000 వరకూ) ఖర్చుచేసి చూస్తూ ఉంటారు.<ref>{{Cite web|url=https://mumbaimirror.indiatimes.com/news/india/bahubali-2-police-imposes-section-144-in-prabhass-hometown-/articleshow/58417315.cms|title=Bahubali 2: Police imposes Section 144 in Prabhas's hometown|last=Apr 28|first=P. PavanP Pavan / Updated:|last2=2017|website=Mumbai Mirror|language=en|access-date=2021-01-09|last3=Ist|first3=18:10}}</ref> మొదటి రోజు మొదటి ఆట చూడకపోవడం అవమానంగా కూడా భావిస్తూంటారు.<ref name=":0">{{Cite web|url=http://www.navatelangana.com/article/warangal/601777|title=సినిమాకెళ్తే జేబులు ఖాళీ..!? {{!}} వరంగల్ {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2021-01-09}}</ref> విడుదలకు ముందు హీరోల బొమ్మలతో, తమ పేర్లు, అభిమాన సంఘం వివరాలతో థియేటర్ ముందు బ్యానర్లు కడుతూ ఉంటారు. మరికొందరు అభిమానులు తమ నగరం/పట్టణంలోని పలు చోట్ల కూడా బ్యానర్లు కడతారు.<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/andhra-pradesh/maharshi-movie-release-effect-mahaesh-babu-fan-dead-in-dhavaleswaram-theater-pr7s4a|title=మహర్షి సినిమా రిలీజ్ ఎఫెక్ట్: ఫ్లెక్సీ కడుతూ అభిమాని దుర్మరణం|last=|first=|date=|website=Asianet News Network Pvt Ltd|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20210109043301/https://telugu.asianetnews.com/andhra-pradesh/maharshi-movie-release-effect-mahaesh-babu-fan-dead-in-dhavaleswaram-theater-pr7s4a|archive-date=2021-01-09|access-date=2021-01-09}}</ref><ref>{{Cite web|url=https://tolivelugu.com/mahesh-babu-fans-hungama-at-theatres-before-releasing/|title=మహేష్ ఫాన్స్ హంగామా షురూ|date=2020-01-09|website=Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu|language=en-US|access-date=2021-01-09}}</ref> విడుదల సమయంలో తమ అభిమాన హీరోల కటౌట్లకు పాలతో అభిషేకం చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-695302|title=ధైర్యం చేసి మరీ.. చెర్రీకి పాలాభిషేకం చేసిన యువతి|last=|first=|date=|website=ఆంధ్రజ్యోతి|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref> సినిమా విజయవంతమైతే డప్పులతో, డ్యాన్సులతో వేడుక చేయడం, బ్యాండ్ మేళం ఏర్పాటుచేయడం, థియేటర్ ఆవరణలోనే టపాకాలు, ఇతర బాణసంచా కాల్చడం కూడా పరిపాటి.<ref>{{Cite web|url=https://tv9telugu.com/maharshi-release-day-hungama-at-chennai-64932.html|title=చెన్నైలో పోటెత్తిన "మహర్షి" హంగామా - TV9 Telugu Maharshi release day hungama at Chennai|last=Telugu|first=TV9|date=2019-05-09|website=TV9 Telugu|language=te-IN|access-date=2021-01-09}}</ref> ఉదాహరణకు [[బాహుబలి:ద బిగినింగ్]] సినిమా విడుదలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని [[భీమవరం]]<nowiki/>లో ప్రభాస్ అభిమానులు 2 ఏనుగులు, 100 రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు, 50 గుర్రాలతో కూడిన భారీ ఊరేగింపు నిర్వహించారు.<ref>{{Cite web|url=https://www.ap7am.com/lv-192560-prabhas-fans-rally-for-baahubali-in-bhimavaramerect-huge-cut-outs|title=Prabhas fans rally for 'Baahubali' in Bhimavaram,erect huge cut outs|website=ap7am.com|language=en|access-date=2021-01-09}}</ref>
 
== విమర్శలు ==
అభిమానుల ధోరణులు, పద్ధతుల పట్ల సమాజంలో చాలా విమర్శలు ఉన్నాయి. కటౌట్లు కట్టేప్పుడు అడ్డుతగిలిన విద్యుత్ వైర్లు షాక్ కొట్టి, టిక్కెట్ల కోసం పోటీపడేప్పుడు తొక్కిసలాటలో పడి ప్రాణాలు కోల్పోయిన అభిమానులు ఎందరో ఉన్నారు. ఈ సందర్భంలో హీరోలు స్పందించి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించారు.<ref name=":1">{{Cite web|url=http://andhrabhoomi.net/content/others-242|title=ఫ్యాన్సే నిజమైన హీరోలు!|last=|first=|date=|website=andhrabhoomi.net|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-01-09}}</ref> కొందరు అభిమానులు, అభిమాన సంఘ నాయకులు తమ స్వంత డబ్బును సినిమాల వేడుకల కోసం, అలంకరణల కోసం వెచ్చించి ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందుల్లో పడ్డారు.<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/entertainment/charanjeevi-fan-asking-for-help-arj-qkr0gt|title=చిరంజీవి కోసం అన్నీ అమ్ముకుని..సాయం కోసం రోడ్డెక్కిన అభిమాని|website=Asianet News Network Pvt Ltd|language=te|access-date=2021-01-09}}</ref> మొదటి రోజే సినిమా చూడకపోతే అవమానకరమనీ, మొదటి షో చూడడం తమకు ప్రతిష్టాత్మకమని భావించే అభిమానుల వల్ల మొదటి రోజు టిక్కెట్ల ఖరీదు విపరీతంగా పెంచడం పరిపాటి అయిపోయింది.<ref name=":0" /> హీరోల కటౌట్లకు క్షీరాభిషేకాలు చేయడం వల్ల పాల వంటి ఆహారపదార్థాలు వృధా అవుతున్నాయని దీనిపై చెన్నై హైకోర్టులో వ్యాజ్యం కూడా నడిచింది.<ref name=":1" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సినిమా_అభిమానులు" నుండి వెలికితీశారు