సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

చి 223.230.29.47 (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 12:
[[సూర్యుడు]] [[మకర రాశి]]లోకి ప్రవేశించే కాలమే [[మకర సంక్రమణము]]. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత [[కుంభ రాశి|కుంభ]], [[మీన రాశి|మీన]], [[మేష రాశి|మేష]],[[వృషభ రాశి|వృషభ]], [[మిథున రాశి|మిథున]] రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. [[శారీరక పరిశ్రమ]]కు, [[పూజ]]లకు, [[సాధన]]లకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.[[కర్కాటక రాశి]]లోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాత[[సింహ రాశి|సింహ]], [[కన్య రాశి|కన్య]], [[తుల రాశి|తుల]], [[వృశ్చికం రాశి|వృశ్చికం]], [[ధనూ రాశి|ధనూ]] రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన [[అర్చన]]కు,[[ధ్యానం|ధ్యానానికీ]], [[యోగా]]నికీ, [[దీక్ష]]లకు,[[బ్రహ్మచర్యం|బ్రహ్మచర్యానికి]], నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము [[దక్షిణాయణము]]. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన [[భీష్ముడు]].
 
"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - ''తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః'' - [[మేషం]] మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి <ref name="saptagiri">"సంక్రాంతి" - రచన: పి.బి. వకుళ - [[సప్తగిరి (పత్రిక)|సప్తగిరి]] మాసపత్రిక - జనవరి 2008 - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>- సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.[[మార్గశిరం]] పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.
 
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/సంక్రాంతి" నుండి వెలికితీశారు