భువనగిరి పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
== భౌగోళికం ==
ఇది 17° N 78° E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాయగిరి, పగిడిపల్లి, బొమ్మాయిపల్లి గ్రామాలు పురపాలకసంఘంలో విలీనం అయ్యాయి. దీని విస్తీర్ణం 76.537 చదరపు కిలోమీటర్లు ఉంది. రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]] నుండి 48 కిలోమీటర్ల దూరంలో, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
== జనాభా గణాంకాలు ==
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో మొత్తం 12,165 కుటుంబాలు నివసిస్తున్నాయి. పట్టణ పరిధిలో ఉన్న జనాభా మొత్తం 59,844 మంది కాగా, అందులో 30,265 మంది పురుషులు, 29,579 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా 35 మునిసిపాలిటీ వార్డులుగా, 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.