రత్నమాల (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
==చిత్రకథ==
సినిమాలో కథానాయిక ఒక రాజకుమార్తె, పదహారేళ్ల పిల్ల, హీరో పదహారు నెలల బిడ్డ. ఆ బిడ్డ చిరంజీవి కావాలంటే పదహారేళ్ల పిల్లకిచ్చి పెళ్ళిచేయాలని పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞ. ప్రభుభక్తి పరాయణుడైన మంత్రి రాజ్యానికి వారసుడు, వంశోద్ధారకుడు చిరంజీవిగా వుండాలనే ఉద్దేశంతో తన కుమారుడి చిత్రపటాన్ని రాజకుమార్తె రత్నమాలకు పంపిస్తాడు. అందులో వున్నది రాజకుమారుడని చెబుతూ పెళ్లి నిశ్చయమవుతుంది. పెళ్లి సమయంలో కత్తికి బాసికం కట్టి పెళ్లి చేయాలని అది రాజుల వంశాచారమని చెప్పి మోసంచేస్తారు. వివాహమైన తర్వాత శోభనం గదిలో ఊయలలో వున్న బిడ్డను చూసి రత్నమాల దిగ్భ్రాంతి చెందుతుంది. అప్పుడు మంత్రి కుమారుడు వచ్చి జరిగినదంతా చెప్పి ఆ బిడ్డనే భర్తగా స్వీకరించమని కోరి, ఆ మోసంలో తనకూ భాగం వున్నందున కాళ్ళమీదపడి క్షమాపణ కోరతాడు. ఆరాత్రే రత్నమాల ఆ బిడ్డ భర్తను తీసుకొని రాజప్రాసాదాన్ని విడిచిపెట్టి అడవి దారిపడుతుంది. ఎన్నెన్నో అపనిందలకు గురవుతుంది. రత్నమాల శీలాన్ని, సహనాన్ని మెచ్చుకున్న పార్వతీపరమేశ్వరులు క్లైమాక్స్ లో ఆమె ముందు ప్రత్యక్షమై, ఆ బిడ్డను యువకుడిగా మార్చి పెళ్లి జరిపించి, దీవిస్తారు. ఈ కథను భానుమతి రామకృష్ణకు ఆమె అమ్మగారు చెప్పిన వ్రతకథల్లో బాగా జ్ఞాపకం వున్న ఒకానొక కథగా పేర్కొన్నారు.<ref>భానుమతీ రామకృష్ణ, నాలో నేను, శ్రీ మానస పబ్లికేషన్స్, విజయవాడ, 2000, పేజీ 172.</ref>
 
== స్పందన ==
"https://te.wikipedia.org/wiki/రత్నమాల_(సినిమా)" నుండి వెలికితీశారు