మూస చర్చ:ఈ వారం వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఈ వారం వ్యాసం రూపంలో తారక అవసరంలేదు: +నే రాసిన దానిలో రెండు లింకులు చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 89:
:కాబట్టి, ఈ వారం వ్యాసాలకు తారకలిచ్చే ఆలోచన మాని, వాటి నాణ్యత పెంచే పని చేపట్టాలి. అర్జున గారు పెద్దలు, నిర్మాణాత్మకమైన పనులు చెయ్యాలి, నాలాంటి వాళ్ల చేత చేయించాలి. అంతేగానీ, తేలిగ్గా చేసెయ్యొచ్చు గదా అని నాణ్యత లేని పనులు, నాసిరకం పనులూ చేపట్టకూడదు. నమస్కారం. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:46, 9 ఏప్రిల్ 2021 (UTC)
::ఎటువంటి ప్రమాణికతలు పాటించకుండా, నాణ్యతా ప్రమాణాల కలిగిన వ్యాసం అని నిర్థారించకుండా తారకలు తగిలించే అర్జున గారి ప్రయత్నాలు తారక అనే పదం విలువకు అర్థం లేకుండా చేస్తున్నట్లు ఉంది.చురుకైన వాడుకరులు ఎవ్యరూ తారకలు చూసి '''''నాణ్యమైన వ్యాసాలను తయారుచేసే పనిని పెట్టుకోరు.'''''ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా చురుకైన వాడుకరులు ఇటీవల మార్పులు జరుగుచున్న వ్యాసాలమీదనే దృష్టిపెడుతుంటారు. తారకలు పెట్టే ఆలోచనను నేను త్రీవంగా వ్యతిరేకిస్తున్నాను.తారకలు పెట్టాలనే చిత్తశుద్ధి ఉన్నవారు,ముందుగా అవి ఎలా ఉంటే తారకలు పెట్టే అర్హత ఉంటుందో ప్రమాణికతలు లేదా కొలమానాలు అనేవి తయారుచేసి, సముదాయంలో చర్చకు పెట్టటానికి ముందుకురండి,అంతేగానీ తారకలు పెట్టి, వికీపీడియా వ్యాసాలను అపహాస్యం చేయటానికి, దయఉంచి అవకాశం కలిగించవద్దు. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 06:54, 9 ఏప్రిల్ 2021 (UTC)
=== ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారం ===
ఈ విషయంపై అత్యధిక సంఖ్యాకులు రచ్చబండలోనే చర్చిస్తున్నారు, పైపెచ్చు ఈ మూస చర్చలో చర్చించేంత చిన్న సంగతి కాదిది. ఐనా, {{Ping|Arjunaraoc}} గారు ఇక్కడే చర్చించాలని ఎందుకో పట్టుబడుతున్నందున నా అభిప్రాయం ఇక్కడే రాస్తున్నాను. చర్చ చాలా దూరం వచ్చింది, ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారం ఇప్పుడు అవసరం అని ఇది ప్రతిపాదిస్తున్నాను.
* ఈ విషయంపై అభిప్రాయాలు వ్యక్తం చేసినవారిలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నదీ, అర్జున గారు ఉండాలని పట్టుబడుతున్నదీ - ఆ నాణ్యతను సూచించే ఒక తారక. అది వద్దని వ్యతిరేకిస్తున్నవారి అభ్యంతరం (నాతో సహా) స్థూలంగా ఏమిటంటే - ఈవారం వ్యాసాలు అన్నవి కనీస నాణ్యత స్థాయిలో లేవనీ, అందులో ఒక తారక పెట్టేంత నాణ్యతతో అయితే లేనేలేవని. అవి లేవన్న విషయాన్ని తెలియజేయడానికి పైన {{Ping|Chaduvari}} గారు కొన్ని వ్యాసాలను తీసుకుని వాటిలో లోటుపాట్లు చూపించారు, ఇక ఎన్నాళ్ళ నుంచో వీటిపై పనిచేస్తున్న {{Ping|K.Venkataramana}} గారూ అనుభవపూర్వకంగా అదే విషయం చెప్తున్నారు.
* ఒకవేళ ఈ తారక ప్రదర్శించాల్సిందేనని అర్జున గారు ఇప్పటికీ నమ్ముతుంటే ఈ కింద సూచించిన పనిచేయమని అర్జున గారికి సూచిస్తున్నాను: ఒక 7 సంవత్సరాలు తీసుకుని, ఆ ఏడేళ్ళలో ఏడాదికి పది ఈవారం వ్యాసాలను ఎంచుకుని, మొత్తంగా ఒక 70 ఈవారం వ్యాసాలను శాంపిల్‌గా తీయండి. (700లో 10 శాతం 70 కనుక) ఆ 70 వ్యాసాలు కనీసం [[వికీపీడియా:మంచి_వ్యాసం_ప్రమాణాలు|మంచి వ్యాసం ప్రమాణాలకు]] అయినా అనుగుణంగా ఉన్నాయో లేదో సమీక్షించి ఆయా చర్చా పేజీల్లో అప్‌డేట్ చేయండి. ఆ 70 వ్యాసాలు కనీసం మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిరూపణ అయితే ఈవారం వ్యాసాలకు ఈ తారక (లేదా ఏదోక కొత్త తారక) ఇవ్వవచ్చునని నిర్ణయించవచ్చు. ఈ పనిలో సహాయపడేందుకు కావాలంటే ఈ ప్రతిపాదనను సమర్థించిన సభ్యుల సహకారం అర్జున గారు తీసుకోవచ్చు.
* ఈ పని చేయలేనని ఆయన భావిస్తున్నట్టైతే, ఒక వర్గాన్ని ఈవారం వ్యాసాలు అన్నిటిలోనూ చేర్చేయవచ్చు (చర్చ పేజీలో కాదు వ్యాసం పేజీలోనే), ఆ చేర్చిన వర్గాన్ని ఉపయోగించి వ్యాసాన్ని //ఇటీవల మార్పులలో ఈ వ్యాసాలకు సంబంధించిన మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటు// చేసుకోవచ్చు. ఈ వర్గం వ్యాసం పేజీలోనే పెట్టుకుంటున్నాం కాబట్టి ఏ సమస్యా లేకుండా అర్జున గారు చేసిన పని నెరవేరుతుంది. ఆ వర్గాన్ని hide కూడా చేయడం ఉత్తమం.
పాఠకులకు (అంటే కేవలం చదివేవాళ్ళు) తెలిసేలా వ్యాసం కనిపించాలంటే నాణ్యంగా ఉందని కనీసం పది శాతం వ్యాసాల మీదైనా సమీక్ష చేసుకోవాలి. వాడుకరులకు (అంటే మనలా మార్పుచేర్పులు చేసేవాళ్ళు) వ్యాసంలో మార్పులు తెలిసేలా చేయాలంటే ఇంత హంగామా అక్కరలేదు. సింపుల్‌గా వ్యాసంలో ఒక వర్గం చేస్తే చాలు. ఈవారం వ్యాసాల్లో తారక చేర్చడానికి ఈ వ్యాసాలు మొదలుపెట్టి, అభివృద్ధి చెందిన వాడుకరుల్లో కూడా ఎక్కువమంది ఇష్టపడతారని అనుకోను. ఎందుకంటే నేను ప్రారంభించిన/ప్రధానంగా అభివృద్ధి చేసినవి 15 వ్యాసాలు గత రెండు సంవత్సరాల్లోనే ఈవారం వ్యాసానికి ఎక్కినాయి. నేను ప్రధానంగా కంట్రిబ్యూట్ చేసిన ఈ వ్యాసాల్లోకి తారక పెట్టడం నేనేమీ ఘనతగా భావించకపోగా గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. అది నాణ్యత మీద నాకున్న కమిట్మెంట్. గ్రహించగలరు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 12:52, 9 ఏప్రిల్ 2021 (UTC)
Return to "ఈ వారం వ్యాసం" page.