తేజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==నేపథ్యము==
ధర్మ తేజ 1966 ఫిబ్రవరి 22వ తేదీన మద్రాస్ లో జన్మించాడు.<ref name="Happy Birthday Director Teja : చిత్రం, నువ్వునేను, జయం వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తేజ పుట్టిన రోజు నేడు - Happy Birthday Director Teja">{{cite news |last1=TV9 Telugu |first1=TV9 |title=Happy Birthday Director Teja : చిత్రం, నువ్వునేను, జయం వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తేజ పుట్టిన రోజు నేడు - Happy Birthday Director Teja |url=https://tv9telugu.com/entertainment/happy-birthday-director-teja-424798.html |accessdate=21 April 2021 |date=22 February 2021 |archiveurl=http://web.archive.org/web/20210421053643/https://tv9telugu.com/entertainment/happy-birthday-director-teja-424798.html |archivedate=21 April 2021 |language=te}}</ref> 1960వ దశకంలో తేజ కుటుంబం బాగా కలిగిన కుటుంబం. నాలుగంతస్తుల పెద్ద ఇల్లు వారిది. తండ్రి జె. బి. కె. చౌదరి కొరియా, జపాన్ దేశాలకు [[బెరైటీస్]], [[మైకా]], తిరుమల నుంచి వెంట్రుకలు మొదలైనవి ఎగుమతి వ్యాపారం చేసేవాడు. తేజ బాల గురుకుల పాఠశాలలో చదివాడు. సినీ నటి జీవిత, నృత్య దర్శకురాలు [[సుచిత్ర చంద్రబోస్]] ఈయన ఒకే తరగతిలో చదువుకున్నారు. దర్శకుడు శంకర్ ఈయనకు సీనియరు. తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ పర్వతవర్ధనమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. ఆమె ఇతనికి రామాయణ, మహాభారత, భాగవతాలను కథలుగా చెప్పేది.
 
తల్లి మరణం తర్వాత తండ్రి వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబం రోడ్డున పడింది. బంధువులు తేజతో సహా ముగ్గురు పిల్లల బాధ్యతను తీసుకున్నారు. దాంతో తేజ బాబాయి ఇంట్లో ఉంటూ బతుకు తెరువు కోసం సినిమా ఆఫీసుల్లో చిన్న చితకా పనులు చేస్తుండేవాడు. తర్వాత చెన్నై నుంచి హైదరాబాదు వచ్చాడు. కొద్ది రోజులు పోస్టరు ఇన్ చార్జిగా పనిచేశాడు. తర్వాత కెమెరా సహాయకుడిగా పనిచేశాడు. దర్శకుడు [[టి. కృష్ణ]] ఇతన్ని బాగా చూసుకునే వాడు. ఛాయా గ్రాహకులు రవికాంత్ నగాయిచ్, ఎస్. గోపాల రెడ్డి, మహీధర్ దగ్గర కొద్ది రోజులు సహాయకుడిగా పనిచేశాడు. రాం గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడి శివ సినిమాకు మొదటి నుంచి చివరి వరకు అనేక విభాగాల్లో పనిచేశాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాతో ఛాయాగ్రాహకుడిగా మారాడు. తర్వాత అదే హోదాలో అంతం, మనీ సినిమాలకు కూడా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/తేజ" నుండి వెలికితీశారు