సోనా మసూరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
పంక్తి 5:
== చరిత్ర ==
సోనా మసూరి బియ్యం భారతీయ కిరాణా దుకాణాల్లో లేదా పెద్ద దుకాణాలు ( మాల్స్) వంటి బల్క్ స్టోర్లలో కూడా సులభంగా లభించే ప్రసిద్ధ భారతీయ బియ్యం రకం. ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో సాగు చేయబడ్డ ఈ బియ్యం భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక భారతీయ కుటుంబాల భుజించే ప్రధాన ఆహారము గా చెప్పవచ్చును.సోనా మసూరి బియ్యం మీడియం గ్రెయిన్ రైస్, ఇది సోనా, మసూరి అనే రెండు రకాల వరి జాతుల హైబ్రిడ్ కాంబినేషన్. ఈ రెండు జాతులు సువాసన, పోషకాలు , మృదుత్వం లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ హైబ్రిడ్ కాంబినేషన్ గా పేర్కొనవచ్చును.సోనా మసూరి బియ్యం పాలిష్ చేయని ధాన్యం ఉండటం తో పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. జీర్ణం కావడం సులభం, తక్కువ కేలరీలు, పిండి పదార్థం ను కలిగి ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక గా చెప్పవచ్చును.సోనా మసూరి బియ్యం గోధుమ, తెలుపు రకాలు రెండింటిలోనూ వస్తుంది. సోనా మసూరి బ్రౌన్ రైస్ లో అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఈ అన్నం చాలా వైవిధ్యభరితమైనది, రుచికరమైన,తీపి వంటకాలు రెండింటికి ఉపయోగం<ref>{{Cite web|url=https://pipingpotcurry.com/instant-pot-sona-masoori-rice/|title=Instant Pot Sona Masoori Rice|last=Meeta|first=Arora|date=28 September 2020|website=https://pipingpotcurry.com/|url-status=live|archive-url=https://pipingpotcurry.com/instant-pot-sona-masoori-rice/|archive-date=26 April 2021|access-date=26 April 2021}}</ref> .
 
== వాణిజ్య పంట ==
భారత దేశం లో వరి సాగును వ్యవసాయ పరిశ్రమ గా ఖచ్చితంగా చెప్పవచ్చును .సోనా మసూరి భారతదేశంలో వరి ఎగుమతిదారులను,వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది, ఎందుకంటే దాని మెరుగైన నాణ్యత. భారతదేశంలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని తుంగభద్ర బెల్ట్, తెలంగాణ రాష్ట్రాలలో లో ఎక్కువగా సాగు చేయబడుతున్న పంట సోనా మసూరి. సోనా మసూరి బియ్యం విదేశాలకు ఎగుమతి చేయబడుతోంది - చెన్నై, నవా షేవా, నాగపూర్, ముంద్రా, నోయిడా-దాద్రీ (ఐసిడి), మొదలైనవి. ఇప్పటి వరకు, దాదాపు 173 మిలియన్ ల విలువైన సోనా మసూరి బియ్యం ప్రతి నెలా భారతదేశం నుండి ఎగుమతి చేయబడుతుంది. జెబెల్ అలీ, దోహా, నెవార్క్, సింగపూర్, ఓక్లాండ్ మొదలైనవి సోనా మసూరి దిగుమతి అవుతున్న కొన్ని ఓడరేవులు<ref>{{Cite web|url=https://www.krishnamohanfoods.in/blog/indian-rice-industry-market-dynamics-and-growth-trends/|title=Indian Rice Industry – Market scenario|website=https://www.krishnamohanfoods.in/|url-status=live|archive-url=/web/20210426051436/https://www.krishnamohanfoods.in/blog/indian-rice-industry-market-dynamics-and-growth-trends/|archive-date=26 April 2021|access-date=26 April 2021}}</ref> .
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సోనా_మసూరి" నుండి వెలికితీశారు