స్వాగతంసవరించు

Prasharma681 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

Prasharma681 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
 • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
 • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
 • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
 • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
 • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
 • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 10:27, 14 జూలై 2020 (UTC)

శ్రీపాద వల్లభ స్వామి పేజీసవరించు

శ్రీపాద వల్లభ స్వామి అనే పేజీని సృష్టించారు. ధన్యవాదాలు. ఈ పేజీ వికీపీడియాకు అనుగుణంగా ఉండేలా మలచుకునేందుకు కొన్ని అంశాలను మార్చడం, కొన్నిటిని చేర్చడం చెయ్యాల్సి ఉంది. కొన్ని ఇక్కడ రాసాను చూడండి: 1. శ్రీపాద వల్లభ స్వామి గురించి కొంత పరిచయం అవసరం. ఆయన ఎవరు, ఏం చేస్తారు వగైరాలను కొంచెం వివరంగా రాయాలి 2. ఆయనకు ప్రత్యేకంగా ఒక పేజీని సృష్టించదగినంత విశిష్టత ఆయనకు ఉన్నదా అనే విషయాన్ని మీరు స్పష్టం చెయ్యాల్సి ఉంటుంది. అంటే ఎన్నదగిన ప్రచురణల్లో (ఈనాడు, సాక్షి వంటి వార్తా పత్రికల్లో, లేదా ఇతర ప్రసిద్ధ ప్రచురణల్లో) ఆయన "గురించి" వచ్చి ఉండాలి. సామాజిక మాధ్యమాలు (ఫేస్‌బుక్, బ్లాగులు వగైరాలు), స్వంత వెబ్‌సైట్లు, స్వంత యూట్యూబ్ వీడియోలు వగైరాలు పనికిరావు. 3. ప్రాముఖ్యత నిర్ధారణ అయ్యాక కూడా, ఆ పేజీలో రాసే అంశాలకు కూడా మూలాలు ఇవ్వాలి. ఎందుకంటే వారి గురించి రాసిన సంగతులు నిజమో కాదో తెలుసుకునే వీలు అందరికీ ఉండాలి. ఉదాహరణకు చూడండి: "..అందరూ ప్రథమ దత్తాత్రేయ స్వామి వార్ల అవతారం భావిస్తారు" అని రాసారు. "అందరూ" అలా భావిస్తారని మనం ఎలా రాయగలం? రాయలేం కదా! పోనీ, దాన్ని కొందరు అలా భావిస్తారు అని మార్చినా.. ఆ సంగతి ఎక్కడ ఉందో ఆ మూలాన్ని ఇక్కడ ఉదహరించాలి. పైన రెండవ పాయింటులో చెప్పినట్లు ఆ మూలం ఎన్నదగినదై ఉండాలి. 4. ఆ పేజీలో మీరు రెండు బయటి లింకులు ఇచ్చారు. అలా బయటి లింకులు ఇవ్వకూడదు.

చాలా అభ్యంతరాలు లేవనెత్తానని అనుకోకండి. నిజానికి ఈ వ్యాసం ఇప్పుడున్న రూపంలో ఉంటే తొలగించాల్సి ఉంది. అయితే దీన్ని సరైన విధంగా అభివృద్ధి చేస్తే తొలగించాల్సిన అవసరం లేకుండా చెయ్యవచ్చు. మీరు అభివృద్ధి చేస్తానంటే నేను మీతో కలిసి పనిచేస్తాను. ఏ సంగతీ ఇక్కడ రాయండి. ఉంటాను __చదువరి (చర్చరచనలు) 10:29, 15 జూలై 2020 (UTC)

మీ సూచనలు తప్పకూండా చేయగలను . ధన్యవాదములు Prasharma681 (చర్చ) 13:12, 15 జూలై 2020 (UTC)
ధన్యవాదాలండి. శ్రీపాద వల్లభ స్వామి ప్రాముఖ్యత గురించి తెలియజేసే మూలాలను పెట్టండి. నేరుగా పేజీలో పెట్టకపోయినా, ఇక్కడ ఈ చర్చాపేజీలో పెట్టి, నాకు చెప్పండి ([[User:Chaduvari|చదువరి]] అని నా పేరు ప్రస్తావిస్తే నాకు కబురు వస్తుంది) __చదువరి (చర్చరచనలు) 11:08, 17 జూలై 2020 (UTC)

కన్నాభి రామన్సవరించు

కన్నాభి రామన్] పేజీ గురించి: ఆయన కన్నాభిరాన్ కావచ్చు, కన్నబిరాన్ కావచ్చు, కన్నబీరన్ లేదా కణ్ణబీరన్ కావచ్చు., కన్నాభి రామన్ కాదు. కె.జి.కన్నబిరాన్ అనే పేజీ ఈసరికే ఉంది. మీరు ఆయన గురించి ఇంకేమైనా రాయదలిస్తే అక్కడే రాయండి. మీరు సృష్టించిన పేజీని తొలగిస్తాను. __చదువరి (చర్చరచనలు) 11:03, 17 జూలై 2020 (UTC)

వికీపీడియాలో ఉన్న వ్యాసాల శైలి గమనించండిసవరించు

వాడుకరి:Prasharma681 గారు, వికీలో రచనలు చేయాలని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. వికీలో ఒక్కో అంశానికి (వ్యక్తులు, గ్రామాలు, చరిత్ర, సినిమా తదితర) సంబంధించిన వ్యాసాలకు ఒక్కో శైలి ఉంటుంది. నేను వికీలో రాసే కొత్తలో నా వ్యాసాల శైలి సరిగా ఉండేది కాదు, అప్పుడు మిగతా వ్యాసాలు చూసి ఆయా అంశాల శైలిని అర్థం చేసుకున్నాను. ప్రస్తుతం మీరు వికీపీడియాకు కొత్త కాబట్టి ముందుగా వివిధ అంశాలకు సంబంధించిన వ్యాసాలను క్షుణ్ణంగా గమనించండి. మీకు శైలి అర్థం అవుతుంది. ఆ తరువాత మీరు కొత్త వ్యాసాలు రాయవచ్చు. ఈ విషయంలో మీకు సహాయం అందించడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇప్పటివరకు మీరు రాసిన వ్యాసాలను మీ వాడుకరి పేజీ లోని ఉపపేజీలకు తరలిస్తాను. అక్కడ మీరు వ్యాసాలను సరిచేసిన తరువాత వాటిని వికీలోని ప్రధాన పేరుబరికి మారుద్దాం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:37, 18 జూలై 2020 (UTC)

మీరు చాలా బాగా రాస్తున్నారు... మరియు అనే పదాలు వస్తున్నాయి...ఆంగ్ల వ్యాసాలు నుండి తెలుగులోకి అనువాదం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎలా రాయాలో ఇంతకుముందు ఉన్న వ్యాసాలను చూడండి...మీరు రాసిన

వ్యాసాలలో చాలా వ్యాసాల శైలి సరిగా లేదు మీరు వికీపీడియాకు కొత్త కాబట్టి, మిగతా వ్యాసాలు చూసి గమనించండి. ప్రభాకర్ గౌడ్ నోముల 16:09, 20 జూలై 2020 (UTC) ధన్యవాదములు ప్రణయ్ రాజ్ Pranayraj Vangari,ప్రభాకర్ గౌడ్ నోముల మీ సూచనలు పాటించగలను. Prasharma681 (చర్చ) 15:05, 24 జూలై 2020 (UTC)

మీరు విస్తరించిన పేజీలుసవరించు

కింది పేజీలు మొలకల విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. వాటిని మీరు అవసరమైనంత మేరకు విస్తరించారు. కానీ ఆ పేజీల్లోని మొలక మూసను తీసెయ్యలేదు. ఆ మూసలు తీసేస్తే అవి ప్రాజెక్టు సాధించిన పనుల్లో భాగమౌతాయి. అలాగే మీరు గతంలో మరో 11 పేజీలను విస్తరించి ఉన్నారు. వీటన్నిటినీ కలిపి, ప్రాజెక్టులో అంతర్భాగంగా మీ కృషి పేజీని తయారుచేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇంకా ఏమైనా పేజీలను విస్తరించి ఉంటే వాటిలో కూడా మొలక మూసలను తీసేసి కృషి పేజీలో చేర్చగలరు.

 1. కనకాంబరాలు
 2. ఒపర్కులినా
 3. కసింద
 4. ఏగిస
 5. ఎర్ర జిల్లేడు
 6. కనప
 7. కాకిచెరకు
 8. రాళ్లమొక్క
 9. కాక్సీనియా
 10. కణుపు
 11. ఒరైజా
 12. ఎర్ర వండ పూలు

ధన్యవాదాలు __చదువరి (చర్చరచనలు) 04:08, 17 ఆగస్టు 2020 (UTC)

పై జాబితాలో మరి కొన్నిటిని చేర్చాను చూడండి. అలాగే మీ కృషి పేజీని సృష్టించాను. మీరు విస్తరించిన పేజీలను అక్కడ చేర్చగలరు. __చదువరి (చర్చరచనలు) 07:36, 17 ఆగస్టు 2020 (UTC)

గతంలో ఉన్న వ్యాసాలు సృష్టించడంసవరించు

ప్రభాకర్ శర్మ గారూ, తెలుగు వికీపీడియాలో ఇదివరకే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) వ్యాసాలు ఉన్నాయి. మీరు కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా, భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేరుతో వ్యాసాలు రాసారు. ఒక కొత్త వ్యాసం రాయడానికి ముందు ఆ వ్యాసం తెవికీలో ఉందో లేదో చూసుకోవాలి. అందుకు,

 1. మనం రాయాలి అనుకుంటున్న వ్యాసం పేరును వేరువేరు పదాలతో వెతకాలి.
 2. ఆంగ్ల వికీపీడియాలో ఆ వ్యాసం పేజీకి వెళ్ళి అక్కడ తెవికీ వికీ వ్యాసానికి లింక్ ఉందో చూడాలి.

గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:07, 21 అక్టోబరు 2020 (UTC)

ప్రభాకర్ శర్మ గారూ, వ్యాసాలు రాయడం లోను మరియు తప్పులు సరిదిద్దడం లోను, మీకు బాగా అనుభవం వచ్చేసింది. చాలా చక్కగా రాస్తున్నారు. ధన్యవాదాలు, ఇలాగే కొనసాగించండి. --- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 06:30, 2 డిసెంబరు 2020 (UTC)

వృక్షశాస్త్రము పుస్తకంసవరించు

వృక్షశాస్త్రము (పుస్తకం) తెలుగులోనిది మీకు వ్యాసరచనలో ఉపయోగపడుతుంది. పూర్తిపుస్తకం తెలుగు వికీసోర్సులో అందరికీ అందుబాటులో ఉన్నది. ఒకసారి చూడండి: [1]--Rajasekhar1961 (చర్చ) 18:27, 4 జనవరి 2021 (UTC)

వ్యాసాలకు సంబంధం లేని శీర్షికలు పెట్టడంసవరించు

వాడుకరి:Prasharma681 గారూ, మీరు అన్ని వ్యాసాలలో 'చరిత్ర' (వ్యాసాలకు సంబంధం లేనివి కూడా) చేరుస్తున్నారు. వ్యాసాలకు అవసరమైన శీర్షికలు మాత్రమే పెట్టాలి, గమనించగలరు. అలాగే మీరు విస్తరించిన వ్యాసాలలో ఉన్న మొలక మూసను కూడా తొలగించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:02, 16 జనవరి 2021 (UTC)

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులుసవరించు

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)