జిఎస్‌ఎల్‌వి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 86:
'''భూ అనువర్తిత ఉపగ్రహ ప్రయోగ వాహనం''' (Geosynchronous satellite launch vehicle) లేదా '''భూ సమస్థితి ఉపగ్రహ వాహకనౌక''' కు క్లుప్తపదం, జిఎస్‌ఎల్‌వి (GSLV). ఈ ఉపగ్రహ వాహక నౌకను [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ]] (Indian Space Research Organisation) ([[ఇస్రో]]) తయారు చేసింది.
==ముందుమాట==
ఉపగ్రహాలను భారతదేశం నుండే, స్వయంగా ప్రయోగించే లక్ష్యంగా ఇస్రో మొదట SLV (ఉపగ్రహ ప్రయోగవాహనం), తరువాత [[పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక|పిఎస్‌ఎల్‌వి]] (ధ్రువీయ ఉపగ్రహ ప్రయోగ వాహనం) ఉపగ్రహ వాహకనౌకలను నిర్మించారు. భూస్థిర, భూ అనువర్తిత కక్ష్యలలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే లక్ష్యంతో జీఎస్ఎల్‌వి శ్రేణి<ref>{{cite journal|title=GSLV Launched Successfully| journal=Current Science|date=May 2001| volume=80| issue=10| page=1256| url=http://www.iisc.ernet.in/currsci/may252001/1254.pdf| accessdate=12 December 2013}}</ref> ఉపగ్రహవాహకనౌక రూపకల్పన చేసి, అభివృద్ధిచేసి నిర్మించారు. SLV తరగతికి చెందిన వాహకనౌక [[భూ నిమ్న కక్ష్య]]లో (low earth orbit) 40 కిలోల బరువుఉన్న [[ఉపగ్రహం|ఉపగ్రహాలను]] అంతరిక్షకక్ష్యలో ప్రవేశ పెట్టగలదు. [[పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక|పిఎస్‌ఎల్‌వి]] తరగతికి చెందిన ఉపగ్రహ వాహకనౌక దాదాపు 2000 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను భూ నిమ్న కక్ష్యలో ప్రవేశపెట్టగలదు. ఇస్రో పిఎస్‌ఎల్‌వి తరగతి/శ్రేణికి చెందిన వాహకనౌకల ద్వారా పలు దేశీయ, విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్శాట్ వంటి దేశీయ ఉపగ్రహాలను భూ స్థిర, భూ అనువర్తిత కక్ష్యకు పంపేందుకు ఇస్రో విదేశాలమీద ఆధారపడవలసి వచ్చేది.<ref name=flGSLVQuest>{{cite news| last=Subramanian| first=T S| title=The GSLV Quest| url=http://www.frontline.in/navigation/?type=static&page=flonnet&rdurl=fl1806/18060820.htm | accessdate=12 December 2013| newspaper=Frontline| date=March 17–31, 2001| archive-date=1 ఏప్రిల్ 2014| archive-url=https://web.archive.org/web/20140401030910/http://www.frontline.in/navigation/?type=static&page=flonnet&rdurl=fl1806%2F18060820.htm| url-status=dead}}</ref>. అందువలన భూస్థిర, భూ అనువర్తిత కక్ష్యలో ఉపగ్రహాలను స్వంతగడ్డ మీద నుండే ప్రవేశపెట్టే లక్ష్యంతో జీఎస్ఎల్‌వి శ్రేణి ఉపగ్రహవాహకనౌక రూపకల్పన చేసి, అభివృద్ధిచేసి నిర్మించారు.
 
==చరిత్ర==
[[భారతదేశం]] భూ అనువర్తిత ఉపగ్రహ ప్రయోగ వాహనం నిర్మాణానికి 1990 లో శ్రీకారం చుట్టింది. ఇన్శాట్ వంటి భూ అనువర్తిత ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ [[అమెరికా]], [[యూరోప్]] దేశాలమీద ఆధారపడేది. 2001 నాటి మొదటి ప్రయోగం నుండి 2015 ఆగస్టు 27 వరకు ఇస్రో మొత్తం 9 జీఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలను ప్రయోగించగా, క్రయోజనిక్ స్థాయిలో లోపం వలన మూడు ప్రయోగాలు విఫలమయ్యాయి.
===రష్యా-ఇండియా ఒప్పందం===
ఇస్రో అంతకుముందు రూపకల్పన చేసి, నిర్మించి విజయవంతంగా ఉపగ్రహాలను అంతరిక్షములోకి పంపిన పీఎస్ఎల్వీ వాహక నౌక నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపగ్రహ భాగాలను, జీఎస్ఎల్వి వాహకనౌక రూపకల్పన నిర్మాణంలో వినియోగించారు. పీఎస్ఎల్వీలో ఉపయోగించి, విజయవంతంగా పనిచేసిన S125/S139 ఘన ఇంధన రాకెట్ బూస్టరులను, ద్రవఇంధన వికాస్ ఇంజన్ను జిఎస్‌ఎల్‌వి శ్రేణి వాహనాలలో కూడా ఉపయోగించారు. జిఎస్‌ఎల్‌విలో మూడు దశలు ఉండగా, అందులో మూడవ దశలో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజను, రాకెట్ సక్రమంగా పనిచేయటానికి అత్యంత కీలకమైనది. రష్యా, భారత ప్రభుత్వాల మధ్య 1991 లో కుదిరిన అంగీకారం ప్రకారం [[రష్యా]] కంపెనీ గ్లావ్ కాస్మోస్ 5 క్రయోజనిక్ ఇంజన్లను, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంది<ref name=flGSLVQuest /> కాని 1992 లో అమెరికా [[ఇండియా]] మీద విధించిన ఆంక్షల వలన రష్యా తన ఒప్పందం నుండి వెనక్కి తగ్గింది. ఒప్పందం ప్రకారం కాక, కేవలం క్రయోజనిక్ ఇంజన్లను మాత్రమే సరాఫరా చేసింది, సాంకెతికతను ఇవ్వలేదు.<ref>{{cite news| last=Subramanian| first=T S| title=The cryogenic quest| url=http://www.frontline.in/static/html/fl1809/18090140.htm| accessdate=13 December 2013| newspaper=Frontline| date=28 April – 11 May 2001| archive-date=13 డిసెంబర్ 2013| archive-url=https://web.archive.org/web/20131213054718/http://www.frontline.in/static/html/fl1809/18090140.htm| url-status=dead}}</ref>.ఈ కారణంగా ఇస్రో 1994 ఏప్రిల్ లో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజక్ట్ ను ప్రారంభించి, క్రయోజనిక్ యంత్రాన్ని స్వంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధిపరిచే కార్యానికి శ్రీకారం చుట్టినది<ref name=GSLVGopalRaj>{{cite news| last=Raj| first=N Gopal| title=The long road to cryogenic technology| url=http://www.thehindu.com/opinion/lead/the-long-road-to-cryogenic-technology/article397441.ece| accessdate=12 December 2013 |newspaper=The Hindu| date=21 April 2011| location=Chennai, India}}</ref>.
 
==జిఎస్‌ఎల్‌వి ప్రయోగం-సఫలాలు-విఫలాలు ==
"https://te.wikipedia.org/wiki/జిఎస్‌ఎల్‌వి" నుండి వెలికితీశారు