దివ్యభారతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: వర్గం:జీవిస్తున్న ప్రజలు
పంక్తి 19:
'''దివ్యభారతి''' ([[ఫిబ్రవరి 25]], [[1974]] - [[ఏప్రిల్ 5]], [[1993]]) ఉత్తరాది నుండి [[తెలుగు]] సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకొన్న నటి. ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]]తో పరిచయం చేసారు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో [[బాలీవుడ్]]లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
==తొలి రోజులు==
దివ్యభారతి [[ముంబై|ముంబైలో]] ఓంప్రకాశ్ భారతి, మీత భారతిలకు పుట్టింది.<ref>{{cite book|author1=Anil Saari|author2=Pārtha Caṭṭopādhyāẏa|title=హిందీ సినెమా: ఎన్ ఇన్‌సైడర్స్ వ్యూ|url=https://books.google.com/books?id=dqzQOgAACAAJ|accessdate=28 July 2012|year=2009|publisher=Oxford University Press|isbn=978-0-19-569584-7|page=222}}</ref> ఈమెకు కునాల్ అనే తమ్ముడు ఉన్నాడు, పూనం అనే సవతొ చెల్లెలు ఉంది.<ref>{{cite web|url=http://bollyspice.com/7597/remembering-divya-bharti|title=రిమెంబరింగ్ దివ్య భారతి|publisher=BollySpice|accessdate=17 August 2013}}</ref> కైనాత్ అరోరా ఈమెకు దాయాది. <ref>{{cite web| url=http://movies.ndtv.com/bollywood/divya-bhartis-cousin-kainaat-arora-to-make-bollywood-debut-with-grand-masti-634510|title=దివ్య భారతి కజిన్ కైనాత్ అరోరా టు మేక్ బాలీవుడ్ డెబ్యు విత్ గ్రాండ్ మస్తి|publisher=Movies.ndtv.com|date=9 August 2013}}</ref>
దివ్యభారతి [[హిందీ]], [[ఆంగ్లము]], [[మరాఠీ]] భాషలు బాగా మాట్లాడగలిగేది. ఈమె తొలినాళ్ళలో బొద్దుగా, బొమ్మలా అందంగా ఉండటం అందరినీ ఆకర్షించిన విషయం.
ఈమె ముంబైలోని జుహూలోని మాణెక్‌జీ కోఆపరేటివ్ హైస్కూల్ లో చదువుకుంది. నటనారంగంలోకి వచ్చే ముందు 9వ తరగత్ వరకు విద్యను పూర్తి చేసింది.<ref>{{cite news|url=http://divyabharti.tumblr.com/biography|title= అర్లీ లైఫ్ ఆఫ్ దివ్యభారతి|accessdate=28 July 2012}}</ref>
==వ్యక్తిగత జీవితం==
షోలా ఔర్ షబ్‌నం సినిమా షూటింగ్ సమయంలో గోవింద ద్వారా దివ్యభారతికి దర్శక-నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా పరిచయమయ్యాడు. వీరి పెళ్ళి 10 మే 1992న జరిగింది. ఈ పెళ్ళి రహస్యంగా సాజిద్ స్వగృహంలో కేవలం దివ్యభారతి, సాజిద్, ఒక కాజీ, దివ్యభారతి కురులను అలంకరించే స్నేహితురాలు సంధ్య, సంధ్య భర్త సమక్షంలో జరిగింది. <ref name=ht>{{cite news|author1=రోష్మిలా భట్టాచార్య|title=టూ యంగ్ టు డై|url=http://www.hindustantimes.com/entertainment/too-young-to-die/story-YJq1kkah1FcCqZSn7aDCsK.html|accessdate=14 June 2016|work=హిందుస్తాన్ టైంస్|date=24 April 2011}}</ref>
 
== దివ్యభారతి నటించిన చిత్రాలు ==
పంక్తి 167:
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
[[వర్గం:1974 జననాలు]]
[[వర్గం:1993 మరణాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:ఆత్మహత్యలు]]
[[వర్గం:ఫిలింఫేర్ అవార్డుల విజేతలు]]
"https://te.wikipedia.org/wiki/దివ్యభారతి" నుండి వెలికితీశారు