ప్రతాపరుద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎మరణం: మరో మూలం
పంక్తి 40:
 
==మరణం==
ప్రతాపరుద్రుడు, కటకపాలుడు గన్నమ నాయుడు మరియూ పెక్కు సేనానులు బందీలయ్యారు. ప్రతాపరుద్రున్ని బంధించిన ఉలుఘ్‌ఖాన్, వరంగల్ లోనే ఉంచితే ప్రమాదమని విశ్వాసపాత్రులైన ఖాదిర్ ఖాన్, ఖ్వాజాహాజీలకు ఆయన్ను ఢిల్లీకి తరలించే బాధ్యతను అప్పగించాడు. అయితే ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. అయితే ఇవన్నీ గ్రంథస్తం చేసిన షాంసి సిరాజ్ అఫీఫ్ ప్రతాపరుద్రుడు ఎలా మరణించాడో వివరించలేదు. సుల్తాను సైన్యం ప్రతాపరుద్రుని ఢిల్లీ తీసుకు వెళుతుండగా మార్గమధ్యాన సోమోద్భవ ([[నర్మదా నది]]) తీరంలో ఆయన కన్నుమూశాడని ముసునూరి ప్రోలయ నాయకుని క్రీ.శ. 1330 విలసదానపత్రం పేర్కొంది. ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదని స్వఛ్ఛందంగానే భగవదైక్యం చెందాడని క్రీ.శ. 1423లో రెడ్డిరాణి వేయించిన అనితల్లి కలువచేరు తామ్రశాసనంలో ఉంది.<ref>A Forgotten Chapter of Andhra History (history of the Musunuri Nayaks) By Mallampalli Somasekhara Sarma పేజీ.14 [http://books.google.com/books?id=AnxAAAAAMAAJ&q=anitalli&dq=anitalli&client=firefox-a&pgis=1]</ref> దీనిని బట్టి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవటమో లేదా అతని కోరిక మేరకు సహచరులెవరైనా చంపటమో జరిగివుంటుందని భావిస్తున్నారు.<ref>కాకతీయులు - పి.వి.పరబ్రహ్మశాస్త్రి పేజీ.136,137</ref>
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రతాపరుద్రుడు" నుండి వెలికితీశారు