పద్మనాభ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==యుద్ధానికి కారణాలు==
క్రీ.శ. 1768 నాటికి గంజాం గిరిజన ప్రాంతంలో పర్లాకిమిడి, మొహిరి, గుంసూరు, ప్రతాపగిరి మొదలైన 20 మంది జమిందారులు ఉండేవారు. వారి ఆధీనంలో 34 కోటలు మరియు ఇంచుమించు 35,000 సైన్యం ఉండేది. వీరిలో ఎక్కువమంది జమిందారులు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసారు. వీరిలో కొందరికి కొండలకు ఎగువనున్న మన్యం ప్రాంతంలో కోటలు ఉండేవి. అందువలన ఓడిపోయిన జమిందారులు ఈ కోటలలో తలదాచుకుని తిరుగుబాటును కొనసాగించేవారు.
 
విజయనగరం రాజ్యంలో ఆనంద గజపతిరాజు మరణం తరువాత చిన విజయరామరాజు జమిందారయ్యాడు. అతడు బాలుడు కావడం వలన సవతి తల్లి కుమారుడైన సీతారామరాజు దివానుగా నియమించబడ్డాడు. విజయరామరాజుకు యుక్త వయసు రాగానే సీతారామరాజును దివాన్ పదవి నుండి తొలగించాడు. అందుకు ఆగ్రహించిన దివాన్ ఆంగ్లేయులతో చేతులు కలిపాడు.
 
క్రీ.శ. 1759-68 మధ్య కాలంలో విజయరామరాజు గంజాం, విశాఖపట్నం ప్రాంతాలలోని అనేక మంది జమిందారులను ఓడించి వారిని కారాగారంలో బంధించి, వారి భూముల్ని ఆక్రమించి నిరంకుశంగా పాలించసాగాడు.
 
విజయనగర జమిందారు చెల్లించవలసిన పేష్కస్ పెంచడానికి, అతని సైనిక బలాన్ని తగ్గించడానికి, అతని నుండి ఎనిమిదిన్నర లక్షల పేష్కస్ బకాయిలను వసూలు చేయడానికి ఆంగ్లేయులు ప్రయత్నించారు. తాను వారికి ఋణపడలేదని ఋజువు చేసినప్పటికీ ఆంగ్లేయులు 1793 ఆగష్టు 2 న విజయనగరాన్ని ఆక్రమించారు. రాజ్యంలోని రైతులు ఆంగ్లేయులకు భూమి శిస్తు చెల్లించడానికి నిరాకరించారు. అందువలన ఆంగ్లేయులు చిన విజయరామరాజును నెలకు 1200 రూపాయల పింఛనుతో మచిలీపట్నానికి వెళ్ళవలసిందిగా ఆదేశించారు. దానిని లెక్కచేయకుండా రాజు విజయనగరం, భీమునిపట్నం మధ్యనున్న పద్మనాభం చేరాడు. ఆంగ్లేయుల సేనలు చినవిజయరామరాజును ముట్టడించి యుద్ధంలో ఓడించి వధించాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పద్మనాభ_యుద్ధం" నుండి వెలికితీశారు