జయంతి రామయ్య పంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. మండలాధికారిగా అనేక శాసనాలను సేకరించి పరిశోధించారు. వీటిలో దేవులపల్లి శాసనం, యుద్ధమల్లుని శాసనం ముఖ్యమైనవి. ఇలా సేకరించిన శాసనాలలోని పద్యాలను క్రోడీకరించి "శాసన పద్య మంజరి" అనే పేరుతో రెండు భాగాలుగా ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు తాము ప్రకటించినవి కాక 1926 వరకు సేకరించి ఉంచిన తెలుగు శాసనాలను వీరికి పరిష్కరించాలని ఇవ్వారు. అట్టి గ్రంధమే "దక్షిణ హిందూదేశ శాసనాలు" పదవ సంపుటంగా ప్రకటితమైనది.
 
వీరు రాష్ట్ర న్యాయాధీశులుగా [[పిఠాపురం]],[[ బొబ్బిలి]], [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ప్రోత్సాహంతో [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] ను ఏర్పాటుచేశారు. దానికి ఐదు వేల తాళపత్ర గ్రంధాలను సేకరించారు. ఈ పరిషత్తు మొదట చెన్నపురిలో ఉండి తరువాత కాకినాడకు మార్చబడినది. [[ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక]] ను ప్రకటించి దానిలో ఎన్నో ఆముద్రిత గ్రంథాలను ముద్రించారు. పిఠాపురం మహారాజా వారి ఆధిక సహాయంతో ఆంధ్ర నిఘంటువును రచించారు.
 
వీరు రససిద్ధులైన కవి. ఉత్తర రామచరిత్ర, చంపూ రామాయణం వీరి స్వతంత్ర రచనలు. ఆంధ్ర వాజ్మయ వికాస వైఖరి అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రచించారు. ఆంగ్రభాషలో "డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు", "డ్రవిడియన్ లెక్సికోగ్రఫీ" అనే భాషా గ్రంథాలు రచించారు. వీరు గ్రాంథిక భాషావాది.
 
వీరు [[ఫిబ్రవరి 19]], [[1941]] సంవత్సరంలో పరమపదించారు.
 
వీరి సంకల్పం అయిన ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు శాశ్వత భవన నిర్మాణం వీరి నిర్యానానంతరం వీరు సోదరీమణి [[ప్రభల వెంకట సుబ్బమ్మ]] కల్పించిన ద్రవ్య సహాయంతో రూపొందినది.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]