భక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* [[దాస్య భక్తి]] : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. [[హనుమంతుడు]], లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.
* [[సఖ్య భక్తి]] : సఖ్యం అనగా [[స్నేహం]]. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. [[అర్జునుడు]], [[సుగ్రీవుడు]] మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.
* [[ఆత్మ నివేదన భక్తి ]] లేదా [[ప్రపత్తి]] : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన [[ద్రౌపతి]], గజేంద్రాదులు ముక్తులైనారు.
* [[దేశభక్తి]] : దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన [[దేశం]] (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సాంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/భక్తి" నుండి వెలికితీశారు