హఠయోగం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 1:
[[దస్త్రం:A_Hatha_Yoga_collage.jpg|thumb|హఠయోగం]]
'''హఠయోగం''' అనేది [[యోగా]]లో ఒక విభాగం. ఇది శారీరక, మానసిక వ్యాయామాల ద్వారా బుద్ధిని బాహ్య వస్తువుల నుంచి దూరంగా వచ్చునని తెలియజేస్తుంది.{{Sfn|Encyclopedia Britannica|2007}} [[సంస్కృతం]]లో ''హఠ'' అంటే ''బలవంతంగా'' అని అర్థం. ప్రాచీన భారతీయులు ఈ విధానాన్ని అవలంభించడం శ్రమతో కూడుకున్నది కాబట్టి ఈ అర్థాన్ని ఆపాదించి ఉండవచ్చు.{{Sfn|James Mallinson|2011|p=770}} హఠయోగం యోగా అనే బృహత్తర విధానంలో కొన్ని భౌతిక విధానాలను సూచిస్తుంది.<ref name="JM">[//en.wikipedia.org/wiki/James_Mallinson_(author) Mallinson, James] (2011). </ref>{{Rp|770,}}<ref name="JB">Birch, Jason (2011), [http://www.academia.edu/1539699/Meaning_of_ha%E1%B9%ADha_in_Early_Ha%E1%B9%ADhayoga ''The Meaning of haṭha in Early Haṭhayoga''] Journal of the American Oriental Society 131.4.</ref>{{Rp|527}}హ-ఠ అనే రెండక్షరాలు, సూర్యచంద్రుల సాంగత్యాన్ని తెలుపుతున్నవనీ, శివభక్తుల సాంగత్యానికి సూచికలని కూడా అంటారు.ఈ యోగానికి ఆంధ్రదేశంలో ఎక్కువ ప్రచారం ఉండేదనేవారు.
 
భారతదేశంలో హఠయోగం నాథ్ సాంప్రదాయానికి చెందిన [[మత్స్యేంద్రనాథ్]] అనే సన్యాసి ద్వారా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. హఠయోగానికి చెందిన చాలా పుస్తకాలు కూడా నాథ సాంప్రదాయానికి చెందిన యోగులు రాసినవే. వీటిలో ముఖ్యమైనవి మత్స్యేంద్రనాథ్ శిష్యుడైన గోరఖ్ నాథ్ లేదా గోరక్ష నాథ్ అనే యోగి రాసినవి.<ref>{{Cite book |last=White |first=David Gordon |authorlink=David Gordon White |title=The Alchemical Body: Siddha Traditions in Medieval India |year=2012 |publisher=University of Chicago Press |isbn=9780226149349 |page=57}}</ref> మత్స్యేంద్రనాథ్ కే మీనా నాథ్ అనీ టిబెట్ లో ''మినపా'' అని కూడా వ్యవరిస్తుంటారు. ఈయనను హిందు, బౌద్ధ తాంత్రిక విధానాల్లో ఈయనను సమానంగా గౌరవిస్తారు. జేమ్స్ మాలిసన్ మాత్రం హఠయోగం [[దశనామి సాంప్రదాయం|దశనామీ సాంప్రదాయానికి]] చెందినదని, అందుకు మూలపురుషుడు దత్తాత్రేయ స్వామి అని భావించాడు.<ref>[[James Mallinson (author)|James Mallinson]] (2014). [https://www.academia.edu/5304343/The_Yog%C4%ABs_Latest_Trick The Yogīs' Latest Trick]. Journal of the Royal Asiatic Society (Third Series), 24, pp 165-180. doi:10.1017/S1356186313000734.</ref><ref>[https://www.academia.edu/3490868/Yoga_and_Yogis Yoga and Yogis]. March 2012. James Mallinson. pg. 26–27.</ref> దత్తాత్రేయ యోగశాస్త్రం ప్రకారం హఠయోగంలో రెండు విధానాలున్నాయి. ఒకటి యజ్ఞవల్క్యుడు అవలంభించిన అష్టాంగ యోగం. ఇంకొకటి కపిల మహర్షి అనుసరించిన అష్టముద్ర యోగం.
 
ప్రస్తుతం హఠయోగాన్ని వివరించే అతి పురాతనమైన వచనం, సా. శ 11 వ శతాబ్దానికి చెందిన [[అమృతసిద్ధి]] అనే గ్రంథం. ఇది తాంత్రిక బౌద్ధ మూలాలు నుండి వచ్చింది. <ref>[[James Mallinson (author)|Mallinson, James]] (2016). [https://www.academia.edu/26700528/The_Am%E1%B9%9Btasiddhi_Ha%E1%B9%ADhayogas_Tantric_Buddhist_Source_Text] ''The Amṛtasiddhi: Hathayoga's tantric Buddhist source text''</ref> హఠ అనే పదం వాడిన అత్యంత ప్రాచీన గ్రంథాలు కూడా వజ్రయాన బౌద్ధమతానికి సంబంధించినవే.
ఈ యోగానికి సంబంధించిన మరొక ముఖ్యమైన గ్రంధం '''హఠరత్నావళి'''.దీని కర్త శ్రీ.శ్రీనివాస భట్ట మహాయోగీంద్రుడు పెక్కు శాస్త్రాలలో గొప్ప విద్వాంసుడనీ, కృష్ణానదీ తీరవాసియై ఉండవచ్చిననీ, ఆతనికి ఆత్మారాముడనేవారు. ఆత్మారామ, స్వాత్మారామ దీక్షానామం కల శ్రీనివాస మరికొందరుకూడా ఉన్నారు. ఒక ఆత్మారామ హఠయోగికి-కుంభికా పురాన్ని (నేటి కుమిలెను) పాలిస్తూ వుండిన గజపతిమహారాజులు ఒక అగ్రహారాన్ని ఇచ్చారు.నేటి హంపీ విజయనగరం ఏర్పడక మునుపు గజపతిరాజులకు దాని సమీపంలోని కుంభికాపురమే (కుమిలియే) రాజధానిగా ఉండేది.హఠరత్నావళి కర్త 15వ శతాబ్ది మధ్యభాగానికి ముందుభాగమే ఉండివుండవచ్చునని తెలుస్తున్నది.
 
20 వ శతాబ్దంలో హఠయోగం యొక్క అభివృద్ధి, ముఖ్యంగా [[ఆసన]] (భౌతిక భంగిమలు) పై దృష్టి సారించి, ప్రపంచవ్యాప్తంగా ఒక [[శారీరక వ్యాయామం]] రూపంగా ప్రాచుర్యం పొందింది. ఇది ఇప్పుడు విస్తృతమైన అర్థంలో "యోగా" అని పిలువబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/హఠయోగం" నుండి వెలికితీశారు