వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: MassMessage delivery
పంక్తి 185:
<!-- Message sent by User:Samwalton9@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/Wikipedia_Library&oldid=21851699 -->
 
'''== వ్యాసం తొలగింపుకు ప్రతిపాదనలో లోపాలు ==
 
సభ్యులకు అందరకూ నమస్కారం. కొంతకాలంగా వికీలో కొత్త సభ్యుల రచనలు గమనిస్తూ వచ్చిన నాకు ఒక విషయంలో అసంతృప్తి ఉంది. కొత్త వాడుకరులకు ప్రోత్సాహం ఇవ్వడం వికీలో మొదటి ప్రాధాన్యతా అంశం గా అనుకొనే స్థాయి నుండి నేడు అది కొరవడి ఆరోపణ, అనుభవాధికారం పెరుగుతున్నదిగా అనుకుంటున్నాను. వాటిలో రచన మొదలైన వెంటనే కొందరు సభ్యులు ఆ వ్యాసంలో మార్పులు చేయడం అనేది. సరాసరి వ్యాసంలో మార్పులు చేయకుండా వ్యాసం రాస్తున్న వాడుకరినిదానిపై వివరణ కోరి, లేదా సలహా అడిగి ఆపై వాడుకరి రాసిన దానినిబట్టి నిర్ణయం తీసుకోవాలి. కాని ఇక్కడ వాటికి వ్యతిరేకంగా వాడుకరి వ్యాసం రాస్తూ ఉన్నపుడు అత్యుత్సాహంతో అందులో మార్పులు చేయడం తగని పనిగా అనుకుంటాను. ఒకవేళ వ్యాసంలో పైన వ్యాసం పూర్తి కాలేదని కాని, సమయం కావాలి అని గాని ఇస్తే కూడా దానిపై మార్పులు చేయడం అంతే ఒక రకమైన అధికార భావం, లేదా అహంకార భావం ప్రదర్శించడంగా అనుకోవచ్చు.
పంక్తి 255:
:__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:19, 16 ఆగస్టు 2021 (UTC)
కొత్తవారికి కొన్ని మార్గదర్శకాలు,పట్టు విడుపుల మీద ఒక విధానం రావాలి లేకుంటే నిరుత్సాహ పడతారు, అసలే వికీలో స్వచ్చంధంగా పనిచేయాలనే అభిలాష ఉన్న వారు దొరకడం లేదు, గ్రోత్ ప్రాజెక్టు మీద కూడా సమీక్ష జరగాలి ,ఈ విషయం మీద చర్చ తో పాటు శిక్షణా కార్యక్రమం జరగాలి : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 09:56, 17 ఆగస్టు 2021 (UTC)
 
:చర్చమొదలైంది ఒక కొత్త సభ్యుడి రచనలపై. అయితే మునుపు చెప్పిందే మరో సారి చెప్పవలసివస్తున్నది. చర్చ వెనుక ఉద్దెశ్యం నేను ఎప్పుడూ ఉదహరించేదే. కొత్త వాడుకరులపై కొందరి అత్యుత్సాహ ఆత్ర వైఖరి చర్యలు. అందుకే చర్చను రచ్చబండకు మరలించడం జరిగింది. ఇక్కడ రెండు రకాల వాదనలు గమనించవచ్చు. 1. సమస్య మూలాలపై చర్యలు లేకపోగా వాటిని నిర్యహణా చర్యలుగా అభిప్రాయపడటం. 2. అలాంటి చర్యలపై చర్చించేవారివే దుశ్చర్యలుగా అభిప్రాయపడటం. దీనికి కారణం పైన చర్చల్లో [[వాడుకరి:Nskjnv]] పై [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] '''ఈ వాడుకరి నిర్వహణకు కొత్త''' అనగా '[[User:K.Venkataramana|➠ కె.వెంకటరమణ]] గారు "'''నిర్వహణా శక్తి'''" అని అభివర్ణించారు. కొత్తకు, నిర్వహణ శక్తికి మద్య జవాబుదారీ, భాద్యతలు, సహనం కూడా ముఖ్యపాత్రగా మారుతాయని మరచిపోకూడదు. ఇంత చర్చా నడిచినా అలాంటి జవాబుదారీతం, భాద్యత, సహనం వంటిని నాకు కనిపించలేదు. అదే వసరలో "కొన్ని గంటలు వ్యాసంలో ఎవరూ మార్పులు చెయ్యనపుడు అందులో ఎవరైనా మార్పులు చేసే అవకాశం ఉంది. అలా మార్పులు చేయడం తప్పుకాదు" అని రాసారు. కానీ కొన్ని నిముషాల వ్యవధిలో ఎందుకు వ్యాసానికి అడ్డం పడవలసివచ్చిందొ రాయలేదు. కొత్త వాడుకరులో పేజీల్లో తొలగింపు మూసలు ఎందుకు పెట్టారో, చర్చ లో ఉదహరించగానే మళ్ళీ ఎందుకు తొలగించారో, దానికీ జవాబులేదు. అయితే వేరే వాడుకరుల ద్వారా అన్ని ప్రశ్నలకూ వివరణలు లభిస్తున్నాయి కాని, [[వాడుకరి:Nskjnv]] నుండీ జవాబులేదు. "సమస్యలో మొదటినుండీ అలా జరగలేదు. దిద్దుబాట్లు, పై దిద్దుబాట్లు జరిగిపోయాయి. ముందే చర్చించి, ఒక నిర్ణయం తీసుకుని ఆపై చేస్తే బాగుండేది" అని రాసారు తప్ప సమస్య ఎవరి వలన ఎందుకు మొదలైదో, ఎవరు అసహనంతో ఉన్నారో వారికి తెలియచేయడం చర్చల్లో కొరవడిన ప్రధాన అంశం. కనుక ఈ విషయంలో సమూహ ప్రోత్సాహం అని రాసాను. దీనికీ సదరు వాడుకరి నుండి కాక మిగిలిన సభ్యుల నుండి ఆధారాలు కావాలనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఆధారాలు లేని కారణంగా నేను ఈ వాఖ్యలను విరమించుకుంటున్నాను. @[[User:Chaduvari|చదువరి]] గారు " కొత్త వాడుకరి పట్ల జనరలైజ్ చేసిన రాసిన వ్యాఖ్య. దానికి ఆధారాలు చూపించలేని పక్షంలో వెనక్కి తీసుకోవాలి (కాలవిరాగ్య గారు ఈ దిద్దుబాటులో తనకూ కళాసాగర్ గారికీ వ్యక్తిగత వైరమేమీ లేదని స్పష్టపరుస్తూ ఒకడుగు ముందుకేసారు. అందుకు ఆయన్ను అభినందిస్తున్నాను)." అని రాసారు.[[వాడుకరి_చర్చ:Kalasagary]] గారి పేజీలో వాడుకరిపేజీ తొలగింపుపై కొత్త వాడుకరికి సవాలు చేస్తూ నోటీసు పెట్టినదానికి అభినందనా?, అదే వాడుకరి "ఇదే ఆంగ్ల వికీలో అయితే ఇప్పటికి మీరు ఈ విదంగా రాసిన వ్యాసాలూ అన్ని తొలగింపుకు గురయ్యేవి" అని వాడుకరి పేజీలో రాసిన దానికి ఎవరు సమాదానం చెప్పలేదు. ఇది జనరలైజ్ చేసిన అభిప్రాయంగా తోసిపుచ్చవచ్చు. కానీ కొత్త వాడుకరి పేజీలో ఇలా రాయడం దురుద్దేశం గానే నేను అభిప్రాయపడతాను..(అసలు ఆంగ్ల వికీ ఎందుకు ప్రామాణికం. ఆంగ్ల వికీలో చేస్తే ఇక్కడా అవే రూల్స్ ఫాలో కావాలా, అన్ని విషయల్లో ఆ వాడుకరి ఆంగ్ల వికీనే ఫాలో అయితే 20, 30, కేబీల వ్యాసాలను ఒకటి రెండు మూలాలతో ఎందుకు తామర తుంపరగా సృష్టిస్తున్నట్టు, అవి అవసరమైన వ్యాసాలు అని సమర్ధించుకోవచ్చు, కానీ వికీలో అన్నీ అవసరమైన వ్యాసాలే. అనవసరమైన వ్యాసాలు అంటూ ఉండవు) ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నా వాటికి కూడా సదరు వాడుకరి నుండి కాక మిగతా సభ్యుల నుండే జవాబులు వచ్చే అవకాశాం ఉందని భావిస్తూ.. వికీలో జరిగే పరిణామాలు మనకు పాతవైన కారణంగా తేలిగ్గా తీసుకుంటున్నాం అనుకుంటున్నాను. కానీ ఇటీవల సామాజిక వేదికలలో అనేక విషయాలు వికీ నేపద్యంగా విస్తృతంగా చర్చించబడుతున్నాయి. ఇక్కడ ఆధారాలు కావాలి గాని అక్కడ అక్కరలేదు కదా.. ఎవరు ఎలాగైనా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు. వికీపై వికీలో కాకుండా బయటా అవగాహనా పెరుగుతున్నది. అయితే అది సంతొషించే విషయంగా కాదని అనుకుంటున్నాను. ఇలాంటి కొన్ని అస్పష్ట విషయాల్లో ఆందోళనే మునుపు కొందరు వాడుకరులు తెరపైకి తెచ్చినా వారి ఆవేశం అదుపుతప్పి వాడుకరులపైకి మళ్లడంతో చర్చలు అర్ధవంతంగా ముగియలేదు. [[https://te.wikipedia.org/wiki/వికీపీడియా:నిర్వాహకుల_నోటీసు_బోర్డు#చంద్రకాంతరావు_గారి_వ్యక్తిగత_దాడులు,_వేధింపులు|వ్యక్తిగత దాడులు]] చర్చల వద్ద చివర్లో "'''టాపిక్ డైవర్ట్ చేయడం నా ఉద్దెశ్యం కాదు కాని మూలం ఏమిటో తెలుసుకుంటే చద్రకాంతరావుగారో, మరొకరో, ఇలా ఎందుకు అంటున్నారు అనేదానిపై స్పష్టత వస్తుందని అనుకుంటాను'''" అని రాసాను. ఇప్పటికీ అదే అభిప్రాయానికి కట్టూబడి ఉన్నాను. ఇది ఒక వాడుకరి, లేదా ఒక వ్యాసం పైనో కాదు. మిగతా వికీల గురించి కాకున్నా తెవికీ వరకూ కొన్ని వేలమంది ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి వారి సమయాన్ని అక్షరాలుగా మార్చి సృష్టించారు. అలాంటి మహా సర్వస్వాన్ని లక్షల మంది హేళన, విమర్శ చేసే కాలం రాకూడదని బలంగా కోరుకొనే వాడిగా.. నిజాయితీగా శ్రమిచే వాడుకరులంతా కొన్ని కొత్త మార్పులు చేయాలని ఆశిస్తాను..ధన్యవాదాలు..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 07:19, 18 ఆగస్టు 2021 (UTC)
 
== Invitation for Wiki Loves Women South Asia 2021 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు