ప్రధాన మెనూను తెరువు
అడ్డదారి:
WP:VP
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా..విషయ సూచిక

సినిమా పేజీల్లోని సమాచారపెట్టె మూసలుసవరించు

సినిమాల పేజీల్లో రెండు సమాచారపెట్టెలు కనబడుతున్నాయి - {{infobox film}}, {{సినిమా}}. మొదటి దాన్ని ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీ వర్గం:ఫలానా సంవత్సరం సినిమాలు ఆనే వర్గంలోకి చేరుతోంది. రెండో దాన్ని ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీ వర్గం:ఫలానా సంవత్సరం తెలుగు సినిమాలు అనే వర్గంలోకి చేరుతోంది. ఈ రెండు వర్గాలు వర్గవృక్షంలో ఒకదాని కింద ఒకటి ఉండే రకం. హారిజాంటల్‌గా ఉండేవి కావు. అందుచేత, ఏ పేజీ కూడా ఈ రెండు వర్గాల్లోకీ చేరకూడదు. రెండో వర్గానికి మిదటిది మాతృవర్గం అవుతుంది. ఇప్పుడు ఈ రెండు మూసలు ఉండటం చేత, కొన్ని పేజీలు మొదటి వర్గంలోకి, మరికొన్ని రెండో వర్గంలోకీ చేరుతున్నాయి. సులువైన పరిష్కారంగా {{infobox film}} ను సవరించి, ఆ మూసలో ఉన్న వర్గాన్ని మారిస్తే సరిపోతుంది అని నేను భావిస్తున్నాను. రవిచంద్ర గారూ, నేనేమైనా మిస్సయ్యానేమో తెలియదు. మీరు సినిమాలపై పనిచేస్తున్నారు కాబట్టి, సమస్య ఎక్కడుందో మీరు సరిగ్గా కనుక్కోగలరు. ఈ సంగతిని పరిశీలించి తగు విధంగా పరిష్కరించగలరా? __చదువరి (చర్చరచనలు) 03:12, 1 మార్చి 2019 (UTC)

చదువరి గారూ, పాత సినిమా వ్యాసాలు {{సినిమా}} మూసను వాడుతున్నాయి. ఇది పాతబడిపోయింది. అందుకని నేను ఆంగ్లవికీ నుంచి తెచ్చుకున్న {{infobox film}} మూసనే వాడుతున్నాను. ఇది వర్గం:ఫలానా సంవత్సరం తెలుగు సినిమాలు వర్గానికి ట్రాన్స్‌క్లూడు చేసేలా చేస్తే సరిపోతుందనుకుంటున్నాను. లేదా {{సినిమా}} మూస వ్యాసాలన్నింటినీ {{infobox film}} తో రీప్లేస్ చేయాలి. అందులో కొన్ని ఫీల్డులు మార్చవలసి ఉంటుంది. కాబట్టి మొదటి మార్గం సరైందని భావిస్తున్నాను. దీన్ని పరిశీలిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:52, 1 మార్చి 2019 (UTC)

స్వచ్ఛంద రాజీనామాసవరించు

నేను నా నిర్వాహకహోదా నుంచి స్వచ్ఛందంగా వైదొల్గుటకై నిర్ణయించి నిర్వాహకుల నోటీసుబోర్డులో పేర్కొన్నాను. ఇదివరకే నిర్ణయించిన ప్రకారం నేను రాజీనామా సమర్పిస్తున్నాను. రాజీనామాను ఆమోదించిన తర్వాత సభ్యుడిగా ఉంటూ, అవసరమైతే "తెవికీ విమర్శకుడి"గా మారి తెవికీని సంస్కరించడానికి, తెవికీలో లోటుపాట్లను లేవనెత్తి తెవికీ ప్రగతికి తోడ్పడగలను. అలాగే ప్రధాన చర్చలలో సీనియర్ సభ్యుడిగా పాల్గొనగలను. నిర్వాహకహోదాలో ఉంటూ ఒకవైపు నిర్వహణ చేయజాలని స్థితిలో మరోవైపు తెవికీలో జరుగుతున్న (ముఖ్యంగా నిర్వహణ లోపాలను) లేవెనెత్తే స్థితిలో లేని కారణంగా నిర్వాహక హోదా నుంచి బయటపడాలని నిర్ణయించాను. ఇన్నాళ్ళు నన్ను ఆదరించిన వారికి కృతజ్ఞతలతో ... సి. చంద్ర కాంత రావు- చర్చ 17:29, 1 మార్చి 2019 (UTC)

పాక్షిక నిరోధం తెలుగు వికీపీడియాలో సచేతనం చేసేందుకు ప్రతిపాదనసవరించు

సహ సభ్యులకు నమస్తే. సముదాయాల్లో చర్చలు, వాతావరణం ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా Community Health Initiatives పేరిట పని సాగుతోంది. అలా చేపడుతున్న చర్యల్లో భాగంగా పాక్షిక నిరోధం విధించగల ఉపకరణం ఒకటి అందుబాటులోకి వస్తోంది.

ప్రస్తుత పరిస్థితి
ఇప్పటివరకూ మనం హెచ్చరించినా వినకుండా సరికాని దిద్దుబాట్లు చేస్తున్నా, ఎన్నిమార్లు చెప్పినా వినిపించుకోకుండా వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నా, తిట్లు తిడుతున్నా - సముదాయం, నిర్వాహకులు అమలు చేయగల చర్య నిరోధం. అవతలివారు ఒకవేళ కొన్ని రకాల పేజీల్లోనే తప్పుగా ఎడిట్ చేస్తూ మిగతా దిద్దుబాట్లన్నీ మంచివే చేస్తూ ఉన్నా - నిరోధిస్తే మొత్తం సైట్ వ్యాప్తంగా నిరోధించగలం. కొన్నిసార్లు సముదాయం చర్చ పేజీల్లో రాయవద్దని, ఫలానా వారి చర్చ పేజీలో రాయవద్దని ఒక వాడుకరిని నిషేధించినా, ఆ ప్రకారం నిరోధించలేదు. కాబట్టి అదొక హెచ్చరికగా మిగిలిపోతుంది, వారు దాన్ని ఉల్లంఘిస్తే చేయగలిగిందల్లా మళ్ళీ మొత్తం సైట్ వ్యాప్తంగా నిరోధించడమే.
ఉపకరణం తెచ్చే మార్పు
ఈ కొత్త ఉపకరణం మన తెవికీలోకి తీసుకువస్తే అవసరాన్ని బట్టి నిర్వాహకులు సైట్-వ్యాప్తంగానే కాక కొన్ని పేరబరుల్లో కానీ, కొన్ని వర్గాల మీద కానీ రాయనీయకుండా నిరోధించవచ్చు. ఉదాహరణకు ఒకరు ఉద్దేశపూర్వకంగా, పదేపదే చెప్పినా వినకుండా తోటి వికీపీడియన్లను అగౌరవకరంగా, ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారని అనుకోండి వారిని కేవలం వాడుకరి చర్చ పేజీల్లోనూ, చర్చ పేజీల్లోనూ, వికీపీడియా చర్చ పేజీల్లోనూ రాయకుండా ఒకరిని నిరోధించవచ్చు. అలానే మరొకరు అన్నివిధాలా బాగానే రాస్తూ కేవలం కొందరు రాజకీయ నాయకుల పేజీల్లోనే తటస్థతకు దెబ్బతగిలేలా రాస్తూ పోతూంటే వారిని హెచ్చరించి వినకపోతే ఆయా రాజకీయ నాయకుల పేజీలుండే వర్గంలో ఏ పేజీలో మార్పులు చేయకుండా నిరోధించవచ్చు.

మనం వికీపీడియాలో విధించే నిరోధాలు శిక్షలు కావనీ, కేవలం అవతలివారు వికీపీడియాను దెబ్బతీయకుండేందుకే నిరోధాలు విధిస్తున్నాం అంటున్నాం కనుక ఇలా పాక్షిక నిరోధాలు ఉంటే దానికి మార్గం సుగమం చేస్తాయని నమ్ముతున్నాను. దీనిపై మనం చర్చించి, అన్ని విధాలా బావుందనుకుంటే తెచ్చుకుందాం. మరింత సమాచారం కోసం మెటాలో ఈ పేజీ చూడండి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 13:10, 9 మార్చి 2019 (UTC)

అంగీకారం
వ్యతిరేకత
చర్చ
నిర్ణయం
చర్చ ప్రారంభించిన నేను, అభిప్రాయాలు వ్యక్తపరిచిన సభ్యులు కాక వేరెవరైనా నిర్వాహకులు పైన జరిగిన చర్చ, ఓటింగులను అనుసరించి నిర్ణయం వెలువరించమని అభ్యర్థన. --పవన్ సంతోష్ (చర్చ) 06:36, 20 మార్చి 2019 (UTC)
చర్చ ప్రారంభించి నెల రోజులు గడిచింది. ఒకరోజునే 7 పూర్తి అనుకూల స్పందనలు లభించి అంతటితో ఆగిపోయింది. చర్చ ముగించి నిర్ణయం ప్రకటించగల వారంతా స్పందనలు వెలువరించినట్టు భావించి తప్పనిసరి స్థితిలో నేనే నిర్ణయం ప్రకటిస్తున్నాను. ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. --పవన్ సంతోష్ (చర్చ) 14:16, 15 ఏప్రిల్ 2019 (UTC)

సమిష్టి కృషి ప్రారంభించుకుందాంసవరించు

తెలుగు వికీపీడియాలో సమిష్టిగా ఒక అంశంపై పనిచేయాలని, నాణ్యతా మెరుగుపరచాలని ఎన్నో సందర్భాల్లో చర్చలు చేసుకున్నాం. కొన్నిసార్లు ఆ విధంగా పనీ చేశాం. మళ్లీ సమిష్టిగా పనిచేయడం మొదలుపెడదాం. ఈసారి నాణ్యత పెంచేలా ఆ పని సాగిద్దాం. ఇందుకోసం ఇదీ ప్రతిపాదన:

 • ఏం చేద్దాం: మొదటి పేజీలో రెండు వారాల తర్వాత కనిపించే పలు వ్యాసాల మీద మనం ఇప్పుడు పనిచేద్దాం. ఎందుకూ అంటే మనం చేసిన పని తాలూకు ప్రభావం వెంటనే కనిపిస్తుంది. మొదటి పేజీ మన తెవికీ నాణ్యతకు అద్దం కావడం ఇందుకు మరింత బలాన్నిస్తోంది.
 • ఎలా చేద్దాం: నాణ్యత పెంచడం అన్నదానికి ఒక కొలబద్ద ఉండడం మంచిది. కాబట్టి వికీపీడియా:మెరుగైన వ్యాసాలు అన్న నాణ్యతా ప్రమాణం తయారుచేసి, దానిలో మూడు స్థాయిలు పెట్టాం. దీనికి వాడుకరి:Chaduvari గారు రూపకల్పన చేశారు. ఈ మూడు స్థాయిల్లో కనీస స్థాయి నుంచి మూడవ స్థాయి వరకూ దేని దాకానైనా మీరు ఒక వ్యాసాన్ని మెరుగుపరచవచ్చు. మీరే సమీక్షించి చర్చా పేజీలో ఫలానా స్థాయికి తెచ్చాననీ రాయవచ్చు.
 • ఎక్కడికి వెళ్ళాలి: వికీపీడియా:నాణ్యతాభివృద్ధి సమిష్టి కృషి/2019-11వ వారం అన్న దగ్గరకు వెళ్ళి చూస్తే, రెండు వారాల తర్వాత రానున్న 13వ వారంలో ఎన్ని వ్యాసాలను మనం మొదటి పేజీలో చూపనున్నామో అదంతా జాబితా వేశాను. అక్కడ సంతకం చేసి ఈ పని ముందుకు తీసుకుపోవచ్చు.

"అందర మొకటై చేయి కలిపితే ఎదురేమున్నది" అంటూ ఆ విధంగా ముందుకుపోదాం. --పవన్ సంతోష్ (చర్చ) 04:45, 11 మార్చి 2019 (UTC)

మంచి పని. ఎప్పటి నుంచో అనుకుంటున్న పని. ఈ మధ్యకాలంలో అందరూ ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఇదే పని నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుందాము. నేను ఈ కృషిలో పాలుపంచుకోవడానికి నమోదు చేసుకున్నాను. -- రవిచంద్ర (చర్చ) 11:13, 11 మార్చి 2019 (UTC)

కినిగెతో ద వికీపీడియా లైబ్రరీ భాగస్వామ్యంసవరించు

సాధారణంగా నెలకు ఇంతని ఖర్చుచేసి ఖాతా తీసుకుంటే కానీ అందుబాటులోకి రాని పే వాల్డ్ పబ్లికేషన్లు, డేటాబేస్లు, డిజిటల్ లైబ్రరీలు, వగైరా వికీపీడియన్లకు కొన్ని ఖాతాల చొప్పున ఉచితంగా అందుబాటులోకి వచ్చేలా ద వికీపీడియా లైబ్రరీ అన్న ప్రాజెక్టు ద్వారా కృషి జరుగుతోందన్న సంగతి తెలిసే వుంటుంది. వందలు, వేలాది పుస్తకాలు, పత్రికలు అలా ప్రపంచవ్యాప్తంగా వికీపీడియన్లకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తెలుగులో అలా అందుబాటులోకి తీసుకువద్దామన్నా మనకు ప్రత్యేకించి పే వాల్డ్ డిజిటల్ లైబ్రరీలు అరుదు. (నాకు తెలిసి లేవు) కాబట్టి మనకున్న ఇ-బుక్స్ స్టోర్ అయిన కినిగె వారితో మాట్లాడి ద వికీపీడియా లైబ్రరీ ప్లాట్ ఫాం ద్వారా నెలకు 10 పుస్తకాలు ఉచితంగా మనకు అందుబాటులోకి వచ్చేలా చేస్తున్నాం. ఇవి అచ్చంగా కాక నెలరోజుల అద్దె పద్ధతిలో వస్తాయి. ఇక్కడ ద వికీపీడియా లైబ్రరీ వారి కార్డ్ ప్లాట్ ఫాం వద్ద దీనిని అప్లై చేసుకోవచ్చు.

 • ఎలా అప్లై చేసుకోవాలి: అప్లై చేసుకునేముందు కినిగె.కాంకి వెళ్ళి అక్కడ మీకు వికీపీడియాలో వచ్చే నెల రోజుల పాటు చదివి తెలుగు వికీపీడియాలో వ్యాసాలు మెరుగుపరచడానికి పనికివచ్చే పుస్తకం ఒక్కటి ఎంచుకోండి. ఆపైన అది మరెక్కడా ఉచితంగా అందుబాటులో లేదని ఇంటర్నెట్లో నిర్ధారించుకోండి. ద వికీపీడియా లైబ్రరీ ప్లాట్ ఫాంలో కినిగె పేజీలో దానిని కోరుతూ దరఖాస్తు చేయండి. చేసేముందు మీరు కనీసం ఏవో కొన్ని వ్యాసాల్లో మూలాలు చేర్చి మెరుగుచేసివున్న అనుభవం కలవారై ఉండాలన్నది మరవవద్దు. మీ దరఖాస్తు నెలలో 25వ తేదీ లోపు జరిగితే, మీ దరఖాస్తును వచ్చే నెలకు గాను పరిశీలిస్తాం. మీ దరఖాస్తు ఆమోదం పొందితే వచ్చే నెలకు మీకు ఆ పుస్తకం అద్దె పద్ధతిలో లభిస్తుంది. అంటే ఓ నెలరోజుల పాటు మీరు దాన్ని చదివి వ్యాసాలు మెరుగుపరిచి, మూలాలు ఇవ్వవచ్చునన్న మాట. ఒకవేళ అదే పుస్తకం మళ్ళీ నెలకు కావాలన్నా, వేరే పుస్తకం తర్వాతి నెలకు కోరుకుంటున్నా మళ్ళీ పై పద్ధతిలో అప్లై చేసుకోవాలి.

ఈ భాగస్వామ్యాన్ని నేను నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కాక వ్యక్తిగత హోదాలో ఒక వికీపీడియన్ గా చేస్తున్నాను. ఈ విషయంలో నాతో కలిసి పనిచేస్తున్న వెలగా కృష్ణచైతన్యకు, కినిగె నుంచి దీనిపై పనిచేస్తున్న రాజన్, అనుమతించిన కినిగె అధినేత కిరణ్ గార్లకు, ద వికీపీడియా లైబ్రరీ ఉద్యోగులకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:26, 12 మార్చి 2019 (UTC)

నేను దరఖాస్తు చేసుకున్నాను. :-) అన్నట్టు ఎంత మంది దరఖాస్తు చేసుకోవచ్చు? ఇందుకోసం వికీమీడియా ఫౌండేషన్ నుంచి కినిగె సంస్థకు ఏదైనా చెల్లింపులు జరపాలా? -- రవిచంద్ర (చర్చ) 13:49, 12 మార్చి 2019 (UTC)
ఎంతమందైనా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ నెలకు వారిలోంచి 10 దరఖాస్తులు అంగీకరిస్తాం. మనకు ప్రస్తుతం ఉన్న స్థితిగతుల్లో అన్ని చాలతాయి అనుకుంటున్నాను. //ఇందుకోసం వికీమీడియా ఫౌండేషన్ నుంచి కినిగె సంస్థకు ఏదైనా చెల్లింపులు జరపాలా?// అవసరం లేదండీ, కినిగె వారు ఉచితంగా ఇస్తున్నారు. అసలు మొత్తం ద వికీమీడియా లైబ్రరీ భాగస్వామ్యాలన్నీ అలా జరిగేవే. --పవన్ సంతోష్ (చర్చ) 14:05, 12 మార్చి 2019 (UTC)

సీఐఎస్-ఎ2కె సముదాయ అవసరాల అంచనా సర్వేసవరించు

అందరికీ నమస్కారం. సీఐఎస్-ఎ2కె భవిష్యత్తు కార్యకలాపాలు, ప్రయత్నాల విషయమై ప్రణాళిక వేస్తున్నది. మిమ్మల్ని కొద్ది సమయాన్ని వెచ్చించి ఈ ఫాం నింపమని కోరుతున్నాం: https://docs.google.com/forms/d/e/1FAIpQLSduNuq2uneHuQBcBni15ffMZQ1_jnuMWUGQiJthIArnHRvT-w/viewform. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 13:42, 12 మార్చి 2019 (UTC)

New Wikipedia Library Accounts Available Now (March 2019)సవరించు

Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access, accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials on the Library Card platform:

 • Kinige – Primarily Indian-language ebooks - 10 books per month
 • Gale – Times Digital Archive collection added (covering 1785-2013)
 • JSTOR – New applications now being taken again

Many other partnerships with accounts available are listed on our partners page, including Baylor University Press, Taylor & Francis, Cairn, Annual Reviews and Bloomsbury. You can request new partnerships on our Suggestions page.

Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 17:40, 13 మార్చి 2019 (UTC)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

తెవికీ ప్రాచుర్యంసవరించు

ప్రజల్లో తెవికీ ప్రాచుర్యానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే నాకు కింది విషయాలు తోచాయి:

 1. గత ఏప్రిల్ నుండి తెవికీ పేజీవ్యూలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. సగటు పేజీవ్యూలు గడచిన 10 నెలల్లో, నెలకు దాదాపు 25 లక్షలుండగా, అంతకు ముందరి 12 నెలల్లో అది 15 లక్షల లోపు ఉంది. 66% పెరుగుదల.
 2. 2017 జూలై నుంచి మొబైల్లో వికీపీడియా చూట్టం పెరుగుతూ వచ్చింది. మొబైల్లో సైటును చూట్టం వల్లనే ముఖ్యంగా ఈ పెరుగుదల వచ్చింది. డెస్కుటాపు కంటే మొబైలు మీద చూట్టమే ఎక్కువ- దాదాపు రెండు రెట్లు ఎక్కువ. అంటే అంతర్జాలం చవగ్గా, విస్తారంగా దొరకడం ఒకటి, స్మార్టుఫోన్ల వాడకం ఎక్కువ కావడం రెండు - ఈ కారణాల వల్ల పెరుగుదల వచ్చింది అనుకోవచ్చు. అన్ని వికీల్లోనూ ఇదే తీరు.
 3. తెవికీ కంటే హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ, మరాఠీ వగైరా వికీలకు ప్రాచుర్యం ఎక్కువ. తెవికీ ఓక నెలలో గరిష్ఠ పేజీ వ్యూలు 39 లక్షలుండగా, హిందీ 5 కోట్ల పైచిలుకు, బెంగాలీ కోటీ ముప్పై లక్షలు, తమిళం 73 లక్షలు, మలయాళం 39 లక్షలు (మనంత), మరాఠీ 88 లక్షలు ఉన్నాయి. కన్నడం మాత్రం మనకంటే తక్కువ (పాతిక లక్షలు).

ఈ గణాంకాల లింకును ఇక్కడ చూడవచ్చు.

వివిధ వికీల గణాంకాల పోలికను చటుక్కున చూసేందుకు ఈ లింకును చూడొచ్చు. xtools కు చెందిన ఈ లింకును ప్రతి పేజీలోనూ పైన కనబడేలా పెట్టుకోవచ్చు కూడా (ఇది వాడుకరి జావాస్క్రిప్టు ఫైలులో తగు చేర్పులు చేస్తేనే ఇది కనబడుతుంది). ఈ లింకులో అనేక ఇతర గణాంకాలను కూడా చూడొచ్చు. వాటిలో ఒకటి - మనం సృష్టించిన పేజీలకు ఎన్నేసి పేజీవ్యూలు వచ్చాయనేది. (నేను సృష్టించిన 1600 పైచిలుకు పేజీల్లో 15% పైగా పేజీలకు గత మూడు మూడు వారాల్లో ఒక్క పేజీవ్యూ కూడా లేదు.). __చదువరి (చర్చరచనలు) 04:06, 15 మార్చి 2019 (UTC)

జియో కొత్తగా ఇంటర్నెట్టు అందుకున్నవారిలో 85 శాతానికి పైగా తమ తమ స్వంత భాషల్లోనే సమాచారం కావాలని కోరుతున్నారని, అందునా తెలుగు వారైతే 95 శాతం మంది తెలుగులోనే చదవాలనుకున్నవి, చూడాలనుకున్నవి చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ఇండియా ప్రకటించింది. ఇది కూడా తెవికీ ప్రాచుర్యానికి కారణం కావచ్చు. కానీ, తమిళ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల వారి కన్నా మనం ఎందుకు వీక్షణల్లో వెనుకబడ్డామన్నది ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ సంఖ్యాధిక్యతే చూసుకున్నా మనకన్నా తమిళ, మలయాళ భాషల వారు తక్కువ సంఖ్యాకులు. పేజీలే చూసినా మలయాళ భాషలో మనకున్నన్ని పేజీలు లేవు. భాషాభిమానం లాంటి కొలవలేని, పడికట్టు మాటలతో సరిపెట్టుకోకూడదని నా ఉద్దేశం. దీనిపై తోటి వాడుకరులు కూడా మేధోమథనం చేస్తారని ఆశిస్తున్నాను. కానీ ప్రాచుర్యం పొందడానికి చిన్న చిన్న ప్రయత్నాలు ఇతర భాషల్లో జరిగేవి, మనమూ తేలిగ్గా చేసుకోదగ్గవీ నాకు తెలిసినవి చెప్తున్నాను చూడండి:
 • తేలిగ్గా కాపీ చేసుకుని పేస్టు చేసుకోవడానికి వీలుగా తమిళ వికీపీడియాలో వ్యాసం పేరు కిందనే చిన్న Short Url ఉంటుంది.
 • పంజాబీ, తమిళ వికీపీడియాల్లో పక్కన పరికరాల పెట్టెలో ముందుగా ట్విట్టర్, మెయిల్, ఫేస్ బుక్ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. వాటి ద్వారా తేలిగ్గా ఆ పేజీని షేర్ చేయవచ్చు.
ఈ ఉపకరణాలు, వీలుసాళ్ళు ఎలా ఉన్నాయో చెప్పండి. పనికివస్తుందనుకుంటే మనమూ వాడదాం. --పవన్ సంతోష్ (చర్చ) 06:35, 15 మార్చి 2019 (UTC)
బాగా గమనించారు. కచ్చితంగా పనికొస్తాయ్. __చదువరి (చర్చరచనలు) 06:46, 15 మార్చి 2019 (UTC)
నేను సృష్టించిన వ్యాసాల్లో కూడా 50% పైగా వ్యాసాలకు అసలు వీక్షణలే లేవు. మనం ఇంతకష్ట పడి వ్యాసాలు రాస్తున్నది ఇందుకేనా అనిపించింది. కానీ ఇందుకు పలు కారణాలు ఉండవచ్చు. మనం రాసిన వ్యాసమే అంత ప్రాధాన్యత లేకుండా ఉండవచ్చు. లేదా వేరే వ్యాసాల నుంచి ఆ వ్యాసానికి దారి చూపే లింకులు తక్కువగా ఉండవచ్చు. తెవికీలో అనాథ వ్యాసాలు కోకొల్లలు. మనం గుడ్డిగా వ్యాసాలు రాసుకుంటూ పోతున్నాం గానీ వాటిని వీక్షకులు సులభంగా చేరుకోవడానికి మార్గాల మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇకనుంచి దానిపైన కూడా దృష్టి సారిస్తే మరిన్ని వీక్షణలు వస్తాయని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 11:40, 15 మార్చి 2019 (UTC)
అవును రవిచంద్ర గారూ, సరిగ్గా చెప్పారు. అనాథ వ్యాసాలు, అగాధ వ్యాసాలూ వికీలో ఉండతగవు. అసలు అంతర్జాలం నడిచేదే "లింకు" మీద! ఈ సందర్భంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం అనే ప్రాజెక్టును మీ దృష్టికి, సముదాయం దృష్టికీ తీసుకొస్తున్నా. __చదువరి (చర్చరచనలు) 14:04, 15 మార్చి 2019 (UTC)

మరింత సమాచారంసవరించు

గణాంకాలకు సంబంధించి కింది సమాచారం కూడా ఉంటే మనకు మరింత ఉపయోగంగా ఉంటుంది:
 1. సైటు సందర్శకులు తెవికీలోకి ఏ పేజీ ద్వారా ప్రవేశిస్తున్నారు (ల్యాండింగు పేజీ)
 2. ఏ పేజీ నుండి బయటికి పోయారు (ఎక్జిట్ పేజీ)
 3. ఈ మధ్యలో ఏయే పేజీలను చూసారు
 4. ఎన్వికీ లోని తెవికీ నుండి వచ్చే వాళ్ళు ఏ ఎన్వికీ పేజీలోకి ప్రవేశిస్తున్నారు (ఎన్వికీ ల్యాండింగు పేజీ, తెవికీ సోర్సు పేజీ)
ఇలాంటి సమాచారం తెలిస్తే, ఏయే పేజీలను మెరుగుపరచాలో మనకు తెలుస్తుంది. ఈ సమాచారం నాకు కనబడలేదు. ఎవరికైనా కనిపిస్తే ఇక్కడ ఆ లింకు ఇవ్వగలరు. వాడుకరి:Arjunaraoc గారూ, మీరు గతంలో గణాంకాలపై పని చేసి ఉన్నారు; ఈ విషయంపై మీదగ్గరేమైనా సమాచారం ఉంటే ఇక్కడ చెప్పగలరు. __చదువరి (చర్చరచనలు) 14:16, 15 మార్చి 2019 (UTC)
@చదువరి గారికి, చాలాకాలానికి తెవికీ గణాంకాలు విశ్లేషించటంలో మీరు తోడవటం ఆనందంగా వుంది (నా ఇటీవలి విశ్లేషణ వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/2017 viewing devices). వికీసర్వర్లు ద్వారా మీరు చెప్పినవాటిలో వీక్షణ పేజీ కు ఎక్కడనుండి వచ్చినదనే వివరం సంగ్రహిస్తున్నారు (పేజీవీక్షణలు స్కీమా పేజీ) కాని, వాడుకరుల గోప్యతను సంరక్షించే వుద్దేశ్యంతో వాటిని అందరితో పంచుటలేదు. అందరికి అందుబాటులో సంగ్రహ గణాంకాలు (పేజీవ్యూ) మాత్రమే వున్నాయి. దాదాపు 10 సంవత్సరాలనుండి పరిశీలించినమీదట నాకనిపించేదేమంటే, గూగుల్ నుండే చాలావరకు (80-90శాతం) వీక్షణలు వుంటాయి. గూగుల్ వికీమీడియా ఫౌండేషన్ కి గ్రాంటులు అందజేయటం (Google.org donating $2 million to Wikipedia and offering APIs, other tools at no cost) మీరు గమనించేవుంటారు. ఇక మనం ముఖ్యంగా వికీట్రెండ్స్ ఆధారితంగా వికీవ్యాసాలను మెరుగుచెయ్యాలని చేపట్టిన ప్రాజెక్టులకు కూడా తగినంతమంది సభ్యులు పాలుపంచుకోలేదు. దీనికి ప్రధానకారణం మన వికీపీడియాకు కీలకమైనంత స్థాయిలో క్రియాశీలక సభ్యులను సమకూర్చుకోలేకపోవడమే. ఇప్పటికే సోషల్ మీడియా అని, శిక్షణ కార్యక్రమాలని, ప్రచారాలని, సంస్థలతో ఒప్పందాలని ఎన్నో చేపట్టాము. వాటివలన పెద్దగా ప్రాజెక్టుకి మంచి జరిగిందనుకోవటంలేదు. ఇటీవలి భారతదేశపు ఇంటర్నెట్ వినియోగదారుల ప్రధాన ఆసక్తి వీడియో మాధ్యమం అయిందన్న వార్తల మధ్య(Indians spending more time watching online videos), సమాజంలో తెలుగు ప్రాధాన్యత తగ్గుతున్న పరిస్థితులలో (తెలుగుకు తెగులు)మనం గణాంకాలకోసం ఎంతకృషిచేసినను వాటిలో పెద్ద మార్పు తీసుకురావడడం కష్టం. వికీకృషి ప్రధానంగా వ్యక్తుల ఆత్మ సంతృప్తి కొరకు చేయటమే మంచిదనిపిస్తుంది.--అర్జున (చర్చ) 05:12, 16 మార్చి 2019 (UTC)
గణాంకాల కోసం కృషి చేద్దామనేది నా ఉద్దేశం కాదండి. గణాంకాలను బట్టి మనం పని చెయ్యాల్సిన పేజీలపైన, విషయాలపైన మరింత దృష్టి పెట్టవచ్చు అని నా ఉద్దేశం. ఉదాహరణకు, కుక్కుట శాస్త్రం అనే పేజీకి పేజీ వ్యూలు ఓ థెగ వచ్చేస్తున్నాయ్ (సంక్రాంతి అయ్యాక కూడా). అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవచ్చు, కనీసం ఊహించొచ్చు.
మీరు నిరాశ పడటం నాకు కష్టంగా ఉంది. అయితే, మనం నిరాశను దరిజేరనీయ కూడదు. ఎందుకంటే నిరాశ పడితే ఇక ఆ తరవాత పని చెయ్యలేం. నిరాశ పడేంత లగ్జరీ మనకు లేదు. నేనొక టనుకుంటూంటాను.. కొన్ని లక్షల మంది ఆసక్తి ఉన్నవాళ్లకు, మనలాంటి ఆసక్తులే, అభిరుచులే ఉన్నవాళ్లకు వికీపీడియా అనేది ఒకటుందని ఇంకా తెలిసి ఉండకపోవచ్చు. తెలిసిన రోజున వాళ్ళు ఉత్సాహంగా ఇక్కడ పని చెయ్యడానికి రావచ్చు. ఇక్కడి వ్యాసాలు చదూకోడానికి రావచ్చు. అలాగే.. ముందు ముందు ఒక గొప్ప ప్రభుత్వం రావచ్చు - తెలుగు దేశాన చదివే ప్రతీ వాడూ తెలుగులోనే చదివి తీరాలి/తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి తీరాలి అనే నిబంధనలు పెట్టొచ్చు. ఏమో.. గుర్ర మెగరా వచ్చు! 2005/2006 లో పరిస్థితి ఎలా ఉండేదంటే.. గుర్రమెగరడం కాదు సరిగదా, రాయైనా ఎగురుతుందేమో గానీ, ఇది మాత్రం ముందుకు పోదు అన్నట్టుండేది. కానీ తెవికీ ముందుకు పోయింది. మనందరినీ ముందుకు తీసుకుపోయింది, తోసుకుపోయింది.
ఇక మీరు చెప్పినట్టు ఆత్మసంతృప్తి అనేది చాలా ముఖ్యం. నా మటుకు నేను అందుకోసమే పనిచేస్తాను. ఇక్కడ రాసిన దాని కంటే ఇక్కడి నుండి నేను నేర్చుకున్నదే ఎక్కువై ఉంటుంది బహుశా. నేను రాసే ప్రతీదీ నేర్చుకునే రాస్తాను (అక్షర దోషాలు సవరించేవి తప్ప). అనువాదాలు చేసినా అంతే! అంటే నేర్చుకున్నట్టే గదా. నేర్చుకున్నప్పుడు కలిగే ఆనందాన్ని, ఆత్మసంతృప్తినీ నేను అనుభవిస్తున్నట్టేగా!__చదువరి (చర్చరచనలు) 09:38, 17 మార్చి 2019 (UTC)
@చదువరి మీ స్పందనకి ధన్యవాదాలు. 2005/2006 పరిస్థితిని ఉటంకించి ఉత్సాహాన్ని కలుగజేశారు. సలహా వచ్చింది కాబట్టి అమలుచేద్దామని కాకుండా, ఇప్పుడు దాకా మనం చేసిన ప్రయత్నాల ఫలితాలు, లోటుపాట్లు పరిశీలించి, విశ్లేషించి సమర్ధవంతంగా ముందుకెలడం మంచిదని నా సూచన. --అర్జున (చర్చ) 12:44, 17 మార్చి 2019 (UTC)
ఫలితం
 • ఏ చర్చకైనా ఒక ఫలప్రదమైన ముగింపు ఉండాలి కాబట్టి ఇంత చక్కని చర్చ మనలను తర్వాతి అడుగుల వైపుకు తీసుకుపోతోందా అన్నదానిపై అభిప్రాయాలు కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేనొక నిర్ణయం తీసుకున్నాను: కనీసం 50 రోజుల పాటు ఇంగ్లీషు వికీపీడియాలోని "In the news" తరహాలో ఈ మధ్య జరుగుతున్న అంశాలను వ్యాసాలుగా మలచి వాటికి స్పందన ఎలా ఉందో చూస్తాను. అట్లాగే అర్జునగారు సూచించినట్టు ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు వికీపీడియాలో ఉండీ, జనం చదువుతున్న వ్యాసాల మీదే జరుగుతోంది. --పవన్ సంతోష్ (చర్చ) 06:47, 20 మార్చి 2019 (UTC)
 • నేను ఎప్పటి నుంచో చేస్తున్న పని, ఇప్పుడు అందరినీ చేయమంటున్న పని. ఇప్పటికే ఉన్న అనాథ వ్యాసాలు ఎప్పుడో ఒకప్పుడు సంస్కరించాలి. కానీ ఇకనుంచి దయచేసి వ్యాసం సృష్టించేటప్పుడే దాన్ని అనాథను చెయ్యద్దు. కనీసం వ్యాసం సృష్టించిన వెంటనే వేరే వ్యాసాలకు లింకులు వచ్చేలా చూడండి. అలాగే వ్యాసాలు సృష్టించాలనుకున్నపుడు ఇప్పటికే ఎదురుచూస్తున్న ఎర్ర లింకులను వ్యాసాలుగా మలచడానికి ప్రయత్నించండి. రవిచంద్ర (చర్చ) 08:45, 20 మార్చి 2019 (UTC)

తెలుగు వికీపీడియా కొరకు ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు -సముదాయ స్పందనసవరించు

@చదువరి గారి స్పందన మేరకు వికీపీడియా:బాటు/అనుమతి కొరకు అభ్యర్ధన లో స్పందించండి. ఇప్పటిదాకా వున్నవిషయాన్ని అక్కడకు తరలించాను. --అర్జున (చర్చ) 00:40, 24 మార్చి 2019 (UTC)

స్పందనకు తుదిగడువు రేపే అనగా 30 మార్చి కాబట్టి, ఇప్పటికే స్పందించని సహచరులు స్పందించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 08:47, 29 మార్చి 2019 (UTC)

ఆంధ్ర ప్రదేశ్ జిల్లా పటములు నవీకరణసవరించు

 
(మూలం: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పటము 2019-03-29 న ఉన్నట్లుగా)

ఆంధ్ర ప్రదేశ్ జిల్లా పటము తాజా చేయడంతో పాటు,దానికి సంబంధించిన సరియైన సమదీర్ఘచతురస్రపటము తాజా పరచబడినది. ఇప్పుడు ఆ పటము వాడితే సరియైన స్థాన సూచికలు కనబడ్తాయి. అయితే {{IIJ}} వాడినచోట కాకుండా. ఈ మూసకు బదులుగా {{Infobox settlement}} తో మార్పులు చేయాలి (కర్నూలు జిల్లా మార్పు ఉదాహరణ). మరింత సమాచారం. వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు కూడా చూడండి. తాజా మార్పుల వలన ఎక్కడైనా దోషాలుంటే తెలియపరచండి. కొత్త జిల్లాలమార్పులు కల తెలంగాణ పటము మంచి నాణ్యతగలది ఇంకా సార్వజనీకంగా లభ్యం కావడంలేదు. అది దొరికితే తెలంగాణా పటాలలో కూడా మార్పులు చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 01:41, 29 మార్చి 2019 (UTC)

ఉచితం కాని బొమ్మలు చేర్చునపుడు పాటించవలసినవిసవరించు

కొంత మంది సభ్యులు ఉచితం కాని బొమ్మలు చేర్చునపుడు, ఫైల్ అప్లోడ్ విజర్డ్ వాడకుండా సాదాఫారము వాడి అవసరమైన మూసలు చేర్చటంలేదు. ఇప్పటికి అటువంటి బొమ్మలు 86 శాతం (2218/2567) వున్నాయి(తాజా స్థితి).. మొత్తం ఉచితంకానివిగా పేర్కొన్న బొమ్మలు 20.7 శాతం (2567/12363) వున్నాయి. ఫైళ్లు ఎక్కించినవారు తమ ఫైళ్లని సరిచేయవలసిందిగా కోరుతున్నాను. వికీపీడియా నాణ్యత పరిరక్షించటం కోసం సాదా ఫారము వాడ వద్దు. ఒకవేళ వాడినా తప్పక {{Information}}, {{Non-free fair use}} మరియు {{Non-free use rationale}} మూసలు లేక వాటికి సరిపోయిన మూసలు వెనువెంటనే సరియైన వివరాలతో చేర్చమని మనవి. అలా చేయకుంటే సాదా ఫారముతో బొమ్మల ఎక్కింపు నిరోధించవలసి రావచ్చు. సందేహాలుంటే సహాయం కోరండి.--అర్జున (చర్చ) 07:09, 6 ఏప్రిల్ 2019 (UTC)

అర్జున గారు... నేను చాలా వరకు సాదాఫారము వాడి బొమ్మలను ఎక్కిస్తున్నాను. కానీ, మీరన్నట్లు వాటికి నేను అవసరమైన మూసలు చేర్చటంలేదు. సినిమా పోస్టర్, వ్యక్తులు, భవనాలు, కార్యక్రమాలు, లోగోలు, కోటలు, జలపాతాలు, అవార్డులు వంటి వాటికి సంబంధించి సారాంశం, లైసెన్సింగ్ ఉదహరణలు అందించగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:21, 6 ఏప్రిల్ 2019 (UTC)
Pranayraj Vangari మీ స్పందనకి ధన్యవాదాలు. మనకి చాలా వాటికి తెలుగు వికీలో ఉదాహరణలు కన్పించకపోతే ఆంగ్ల వికీలో చూడండి. ఒకే మూసని అన్నిటికి నకలుచేసేటప్పుడు ఆలోచించి, హేతువులు ఏమైనా మార్చాల్సి వస్తే మార్చండి. --అర్జున (చర్చ) 04:14, 7 ఏప్రిల్ 2019 (UTC)
అలాగే అర్జున గారు... Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:51, 7 ఏప్రిల్ 2019 (UTC)

Read-only mode for up to 30 minutes on 11 Aprilసవరించు

10:56, 8 ఏప్రిల్ 2019 (UTC)

Wikimedia Foundation Medium-Term Plan feedback requestసవరించు

Please help translate to your language

The Wikimedia Foundation has published a Medium-Term Plan proposal covering the next 3–5 years. We want your feedback! Please leave all comments and questions, in any language, on the talk page, by April 20. కృతజ్ఞతలు! Quiddity (WMF) (talk) 17:35, 12 ఏప్రిల్ 2019 (UTC)

జిల్లా, నగర వ్యాసాలకు ప్రామాణిక సమాచారపెట్టెల విధానంసవరించు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/జిల్లా, నగర వ్యాసాలకు ప్రామాణిక సమాచారపెట్టెలు పరిశీలించి ఆ వ్యాస చర్చాపేజీలో స్పందించండి. చర్చకు తుది తేదీ 2015-04-292019-04-29. --అర్జున (చర్చ) 06:15, 15 ఏప్రిల్ 2019 (UTC)

విధానం అవసరంలేనిదిగా తీర్మానించడమైనది. వివరాలకు వికీపీడియా చర్చ:రచ్చబండ (పాలసీలు)/జిల్లా, నగర వ్యాసాలకు ప్రామాణిక సమాచారపెట్టెలు చూడండి.--అర్జున (చర్చ) 02:25, 6 మే 2019 (UTC)

వికీపీడియా బ్రాండ్ ప్రాజెక్టు ప్రతిపాదనపై సంప్రదింపులుసవరించు

వికీమీడియా ఫౌండేషన్‌లో కమ్యూనిటీ బ్రాండ్ అండ్ మార్కెటింగ్ టీం సమన్వయకర్త సమీర్ ఎల్షర్బొట్టి ఏప్రిల్ 21న బెంగళూరులో ఆసక్తిగల, చురుకైన వికీమీడియన్లతో వికీపీడియా బ్రాండింగ్ ప్రతిపాదనను చర్చించి, ఫీడ్‌బాక్ తీసుకునేందుకు సమావేశమవుతున్నారు. (మరిన్ని వివరాలకు ఈ బ్లాగ్‌ పోస్టు చదవండి). ఈ సందర్భంగా భారతీయ వికీమీడియా ప్రాజెక్టుల నుంచి ఆసక్తిగల చురుకైన వికీమీడియన్లు, యూజర్‌ గ్రూపుల సభ్యులకు చర్చించేందుకు ఆహ్వానం. బెంగళూరులోని దొమ్మలూరులోని దొమ్మలూరు క్లబ్ సమీపంలోని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి రెండు గంటల పాటు జరుగనున్న కార్యక్రమానికి ఆసక్తిగల చురుకైన వికీపీడియన్లు హాజరుకావచ్చు. మీటప్ గురించి మరిన్ని వివరాలకు, రిజిస్టర్ కావడానికి మెటాలోని కార్యక్రమ పేజీ సందర్శించండి. ఈ సందర్భంగా వసతి, ప్రయాణ సౌకర్యాలు కోరే చురుకైన వికీమీడియన్లు gopala@cis-india.org మెయిల్ ఐడీని సంప్రదించవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:40, 16 ఏప్రిల్ 2019 (UTC)

ప్రముఖుల వర్గాలుసవరించు

వికీపీడియాలో కొంతకాలం క్రితం రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా ప్రముఖుల వర్గాలు (ఉదా:వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు ప్రారంభించాము. ప్రస్తుత ఆలోచనల కనుగుణంగా, మరియు ఆంగ్లంలోని పద్ధతులను అనుసరించి; వీటిని మార్పు చేసిన బాగుంటుంది. ప్రముఖులకు బదులుగా - జిల్లా వ్యక్తులు లేదా ప్రజలు అని మారిస్తే ఎలావుంటుంది. ఆలోచించండి. --Rajasekhar1961 (చర్చ) 07:38, 17 ఏప్రిల్ 2019 (UTC)

Rajasekhar1961 గారి సూచన సముచితంగా ఉంది. అలా మార్చాలనేది నా అభిప్రాయం కూడా. "ప్రముఖ" వర్గాల న్నిటినీ కూడా అలా మార్చాలి. __చదువరి (చర్చరచనలు) 08:09, 17 ఏప్రిల్ 2019 (UTC)
వ్యక్తులు,ప్రజలు అనే పదాలలో ఏమి ప్రత్యేకత కనిపించుటలేదు.వాటి బదులు 'ముఖ్యులు' అనే పదం వాడితే ఆ వ్యాసాలకు సార్థకత ఉంటుందనేది నాఅభిప్రాయం,సూచన--యర్రా రామారావు (చర్చ) 08:21, 17 ఏప్రిల్ 2019 (UTC)
ముఖ్యులు అనే పదం కూడా ఇంచుమించుగా ప్రముఖ లాంటిదే. కాబట్టి దానివలన ప్రయోజనం లేదు. వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రజలు (ఆంగ్లంలోని "people" కి "ప్రజలు" సమానార్ధం కాబట్టి) గా అన్నింటిని మార్చాలి. చదువరి గారు దయచేసి వీటిని ఏదైన సుళువైన పద్ధతిలో మార్చగలరేమో చూడండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:37, 17 ఏప్రిల్ 2019 (UTC)
యర్రా రామారావు గారూ, ప్రత్యేకత కనిపించకూడదనే వ్యక్తులు, ప్రజలు వాడదామని ప్రతిపాదిస్తున్నారండీ. ఎందుకంటే, తటస్థతకు ప్రముఖులు, ముఖ్యులు వంటి పదాలు భంగం కలిగిస్తాయి. విషయ ప్రాధాన్యతే తప్ప వ్యక్తుల ప్రాముఖ్యత మనం నిర్ణయించే పని పెట్టుకోవట్లేదు. అందుకే ఈ మార్పు. ఇక రాజశేఖర్ గారూ, మీరు ప్రతిపాదిస్తున్న రెండు పదాల్లో వ్యక్తులు అన్నదే మన తెలుగు నుడికారానికి అనువుగా ఉంటుందని నమ్ముతున్నాను. ఆంగ్లంలో People అంటే అన్నారు, మనం వ్యక్తులు అనొచ్చని నా ఉద్దేశం. --పవన్ సంతోష్ (చర్చ) 08:50, 18 ఏప్రిల్ 2019 (UTC)
Rajasekhar1961 గారి సూచన సరియైనది.వర్గం:........జిల్లా ప్రముఖులు లకు బదులుగా వర్గం:........జిల్లా ప్రజలు గా మారిస్తే బాగుంటుంది. అదే విధంగా "ప్రముఖ" వర్గాలనన్నింటినీ మార్చాలి.--కె.వెంకటరమణచర్చ 10:41, 18 ఏప్రిల్ 2019 (UTC)
నా అభిప్రాయం ప్రకారం వర్గం:..... జిల్లా వ్యక్తులు అనేది సరి అయినదని అనుకుంటున్నాను. ఇందులోనే వ్యక్తులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ప్రధాన వర్గంగా వర్గం:..... జిల్లా ప్రజలు అంటే అన్ని రకాల ప్రజలందరూ ఈ వర్గంలోకి వస్తారు. నన్ను నమూనాగా మార్చమంటే ఒక కృష్ణా జిల్లా తీసుకొని చేస్తాను. JVRKPRASAD (చర్చ) 11:01, 18 ఏప్రిల్ 2019 (UTC)
people అనగా "ప్రజలు" లేదా "వ్యక్తులు" అని అర్థం ఉంది. కనుక మీరు ప్రతిపాదిస్తున్న రెండు పదాల్లో వ్యక్తులు అన్నదే మన తెలుగు నుడికారానికి అనువుగా ఉంటుందని నమ్ముతున్నాను. వర్గం:..... జిల్లా వ్యక్తులు అని మార్చితే బాగుంటుంది.--కె.వెంకటరమణచర్చ 11:15, 18 ఏప్రిల్ 2019 (UTC)
ముఖ్యులు అనే పదం మీద నేను మరొకసారి ఆలోచించగా, మీరు సూచించిన ప్రకారం ప్రజలు, వ్యక్తులు పదాలు సరియైనవని ఏకీభవిస్తున్నాను.ఆ రెండు పదాలలో ప్రజలు అనే పదానికి గూగుల్లో వీక్షించగా 40,80,000 ఫలితాలు చూపించగా, వ్యక్తులు అనే పదానికి 1,23,00.000 ఫలితాలు చూపిస్తున్నాయి.పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 11:31, 18 ఏప్రిల్ 2019 (UTC)
ప్రస్తుతం వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు, వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రజలు వంటి రెండు రకాల వర్గాలు చాలా జిల్లాలకు ఉన్నాయి. కనుక ఆ రెంటినీ వర్గం:తూర్పు గోదావరి జిల్లా వ్యక్తులు అనే ఒకే వర్గంలోనికి చేర్చితే బాగుంటుంది.--కె.వెంకటరమణచర్చ 11:41, 18 ఏప్రిల్ 2019 (UTC)
వర్గాలన్నింటికీ "వ్యక్తులు" అనే మాటనే వాడదామని, "ప్రజలు", "ప్రముఖులు" అనే మాటలను వాడరాదనీ అందరం నిశ్చయించినట్లుగా భావిస్తాను. వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు తో మొదలుపెట్టి మారుద్దాం. JVRKPRASAD గారూ, ఈ పని చేసేందుకు ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ని మానవికంగా చెయ్యడం శ్రమ, సమయం రెండూ దండగే. (సెమీ) ఆటోమాటిగ్గా చేస్తే చకచకా పనైపోతుంది. మీకు AWB ఖాతా ఉంది కాబట్టి, అందులో బాట్ అంశాన్ని వాడి చెయ్యండి. అలా చేస్తే ఫటాఫట్ అయిపోద్ది. __చదువరి (చర్చరచనలు) 14:05, 18 ఏప్రిల్ 2019 (UTC)
సభ్యులు తమ సమయాన్ని వెచ్చింది విలువైన అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రజలు మరియు ప్రముఖులు బదులుగా వ్యక్తులు పేజీలకు మారిస్తే సరిపోతుంది. జిల్లాల పేజీలతో బాటు రాష్ట్రాల ప్రముఖుల పేజీలను కూడా మార్చాలి. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 14:24, 18 ఏప్రిల్ 2019 (UTC)
JVRKPRASAD గారూ, చేస్తారా?
చేస్తానండి. JVRKPRASAD (చర్చ) 05:50, 20 ఏప్రిల్ 2019 (UTC)
JVRKPRASAD గారూ, మీరు మానవికంగా కాక, AWB వాడి చేస్తారని నేను భావించాను. అందుకని చెయ్యమన్నాను. ఇలా అయితే మీ శ్రమ, సమయం చాలా అవసరం అవుతుంది. నేను చేసేస్తాలెండి. __చదువరి (చర్చరచనలు) 07:18, 20 ఏప్రిల్ 2019 (UTC)
వర్గం:తెలంగాణ ప్రముఖులు, వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు అనే వర్గాలకు ఏం పేరు పెడదాం -వర్గం:తెలంగాణ వ్యక్తులు, వర్గం:ఆంధ్రులు అంటే ఎలా ఉంది? __చదువరి (చర్చరచనలు) 07:48, 20 ఏప్రిల్ 2019 (UTC)
చదువరి గారు, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. AWB వాడవద్దని ఇదివరకు సూచించారు, మామూలుగానే చేస్తే తప్పు లేదని నిర్ణయించారు, అందుకని చేస్తున్నాను. కృష్ణా జిల్లా మీరు వదలి, మిగిలిన అన్నీ మీరు పూర్తి చేయమని నా మనవి. వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు అనే వర్గానికి వర్గం:పేరుపొందిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు లేదావర్గం:గుర్తించదగిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు లేదా వర్గం:గుర్తించిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు లేదా వర్గం:తెలిసిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు లేదా వర్గం:పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు లేదా వర్గం:తెలిసిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు అని మార్చుకోవచ్చును. వర్గం: ఆంధ్ర వ్యక్తులు అనవచ్చును, కానీ వర్గం:రాయలసీమ వ్యక్తులు అనే మరో వర్గం చేయవలసి వస్తుంది. JVRKPRASAD (చర్చ) 08:14, 20 ఏప్రిల్ 2019 (UTC)
చదువరి గారు, అలాగే వర్గం:పేరున్న వ్యక్తులు, లేదా వర్గం:పేరుపొందిన వ్యక్తులు అనేవి కూడా పరిశీలించ వచ్చని అనుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 00:04, 21 ఏప్రిల్ 2019 (UTC)
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ వర్గాలను మార్చాను. వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు నుండి కిందికి జిల్లాల ప్రముఖులు వర్గాలన్నిటినీ మార్చినట్టే. ప్రస్తుతానికి జిల్లా ప్రముఖులు వర్గాలను మాత్రమే మార్చాను. 4100 పై చిలుకు వర్గాలను AWB తో మార్చాను. ఒక యాభై/వంద దాకా మానవికంగా చేసాను. సుప్రసిద్ధ ఆంధ్రులు ఇప్పుడు వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు అయింది. అలాగే జిల్లా ప్రముఖులు వర్గాలు జిల్లా వ్యక్తులు అయ్యాయి. ఈ వర్గాల్లోని పేజీల వర్గీకరణను ఇంకా సవరించాలి. ప్రస్తుతమున్న స్థాయి నుండి ఇంకా వీలైనంత నిమ్నస్థాయి వర్గాల్లోకి చేర్చాలి. నా ఉద్దేశంలో జిల్లా వ్యక్తులు అనే వర్గంలో నేరుగా చేరే పేజీల కంటే వివిధ ఉపవర్గాల ద్వారా అందులో చేరేవి ఎక్కువ ఉండాలి. "ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు" వర్గంలో నేరుగా చేరే పేజీలు దాదాపుగా ఉండకూడదు. కానీ మన దగ్గర పరిస్థితి అలా లేదు. వర్గీకరణ అతి నిమ్న స్థాయిలో కాకుండా అత్యున్నత స్థాయిలో చేసుకున్నాం. (ఉదా: చిత్తూరు నాగయ్య పేజీని గుంటూరు జిల్లా వ్యక్తిగా కాక గుంటూరు జిల్లా సినిమా నటుడుగా వర్గీకరించాలి. "గుంటూరు జిల్లా సినిమా నటులు" ను "గుంటూరు జిల్లా నటులు" గాను, దాన్ని "గుంటూరు జిల్లా వ్యక్తులు" గానూ వర్గీకరించాలి. కానీ చిత్తూరు నాగయ్య పేజీని గుంటూరు జిల్లా వ్యక్తులుగా వర్గీకరించుకున్నాం.) ఇప్పుడైనా చేసుకోవాలి. ఇది AWB ద్వారా చెయ్యగలిగేది కాదు. ఒక్కొక్క పేజీని తెరిచి ఆ వ్యక్తి వృత్తి/ప్రవృత్తి ఏంటో చూసి అప్పుడు చెయ్యాలి. ఈ పనిని నేను ఇప్పుడు చెయ్యటం లేదు. ఇకముందు పేజీలను వర్గీకరించేటపుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని మనం అందరికీ చెప్పాలి. ఇప్పుడిక తెలంగాణ ప్రముఖుల పని పడతాను. __చదువరి (చర్చరచనలు) 07:01, 21 ఏప్రిల్ 2019 (UTC)
నేను కూడా, వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు అనే దానిని వర్గం:కృష్ణా జిల్లా వ్యక్తులు గానూ, వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు అనే దానిని వర్గం:కోస్తాంధ్ర వ్యక్తులు గానూ మార్చే పనిని సంపూర్ణముగా పూర్తి చేసాను. JVRKPRASAD (చర్చ) 07:20, 21 ఏప్రిల్ 2019 (UTC)
తెలంగాణ జిల్లాల ప్రముఖుల వర్గాలు కూడా మార్చేసాను.__చదువరి (చర్చరచనలు) 10:10, 21 ఏప్రిల్ 2019 (UTC)
వికీ నాణ్యత దిశగా ఇంకొక అడుగు ముందుకేసినందుకు ఈ సమస్య మూలాన్ని అందరి దృష్టికి తెచ్చిన చదువరి , మరియు వర్గాలనుకూడా మార్పు చేయాలన్న సలహాను పంచుకొన్న User:Pranayraj1985, స్పందించిన సభ్యులందరికి, AWB తో వేగంగా మార్పులు చేసిన చదువరి గారికి అభివందనలు. --అర్జున (చర్చ) 03:34, 22 ఏప్రిల్ 2019 (UTC)

సుప్రసిద్ధ వర్గాలుసవరించు

చదువరి గారు, వర్గం:సుప్రసిద్ధ ...... అనే వర్గాలు వాటికి వర్గం:విశిష్ట ....... అనే పదం సరిపోతుందని అనుకుంటున్నాను. మిగతా వారి అభిప్రాయాలు కూడా మీరు తీసుకోగలరు. 06:46, 21 ఏప్రిల్ 2019 (UTC)
సుప్రసిద్ధ భారతీయులు వర్గాన్ని అలాగే రాష్ట్రాలవారీగా ప్రముఖుల వర్గాల్ని కూడా వ్యక్తులు వర్గంగా మరిస్తే పని పరిపూర్ణమౌతుంది.--Rajasekhar1961 (చర్చ) 06:42, 23 ఏప్రిల్ 2019 (UTC)
Rajasekhar1961 గారు, సుప్రసిద్ధ భారతీయులు వర్గాన్ని భారతీయ వ్యక్తులు గానూ, రాష్ట్రాలవారీగా ప్రముఖుల వర్గాల్ని .....రాష్ట్ర వ్యక్తులు (ఉదా: :వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు) గానూ మార్పు చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. 2019-04-24T05:56:47 User:JVRKPRASAD

తెలంగాణ పటము నవీకరణసవరించు

నాణ్యమైన వెక్టర్ దత్తాంశము దొరకటంతో తెలంగాణపటము నవీకరించబడినది.

తాజా చేయడంతో పాటు,దానికి సంబంధించిన సరియైన సమదీర్ఘచతురస్రపటము తాజా పరచబడినది. ఇప్పుడు ఆ పటము వాడితే సరియైన స్థాన సూచికలు కనబడ్తాయి. మరింత సమాచారం. వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు కూడా చూడండి. తాజా మార్పుల వలన ఎక్కడైనా దోషాలుంటే తెలియపరచండి. --అర్జున (చర్చ) 11:27, 17 ఏప్రిల్ 2019 (UTC)

హిందీ వికీతో పోలికలో..సవరించు

2019 ఏప్రిల్ 19 న సేకరించిన తెలుగు, హిందీ వికీల గణాంకాలను పోల్చి చూస్తే కింది సంగతి దృష్టికొచ్చింది.

మొత్తం పేజీల సంఖ్య నిష్పత్తి

అంశం తెలుగు హిందీ తెలుగు కంటే హిందీ ఎంత శాతం
మొత్తం విజ్ఞాన సర్వస్వ పేజీలు 70,709 1,30,605 తెలుగు కంటే 84% ఎక్కువ
విజ్ఞాన సర్వస్వ పేజీల్లోని మొత్తం పదాల సంఖ్య 3,51,43,448 3,90,55,554 తెలుగు కంటే 11% మాత్రమే ఎక్కువ

పై అంకెలను బట్టి చూస్తే హిందీలో మొలకలు ఎక్కువగా ఉన్నట్టు గమనించాను. ఇంకో సంగతి.. ఈ "విజ్ఞాన సర్వస్వ పేజీల్లోని మొత్తం పదాల సంఖ్య" బెంగాలీ, తమిళ, కన్నడ, మలయాళ వికీల కంటే తెలుగులోనే ఎక్కువ! దీన్ని బట్టి తెలుగులో మొలకలు తక్కువయ్యాయని అనుకోవచ్చు. గ్రామాల వ్యాసాల్లో మనం సమాచారాన్ని చేర్చడమే మొలకలు తగ్గడానికి ప్రధానమైన కారణమని నేను అనుకుంటున్నాను. సహచర వాడుకరులు ఏమంటారో చూడాలి. __చదువరి (చర్చరచనలు) 11:12, 19 ఏప్రిల్ 2019 (UTC)

మీరు చెప్పిన గ్రామాల వ్యాసాల విస్తరణ కార్యక్రమం ప్రధాన కారణం కాగా, కొంతకాలంగా మనం రాశి కంటే వాసికే ఎక్కువగా ప్రాధాన్యత నిచ్చి నెలవారీ మొలకల జాబితాల ద్వారా వాటిని విస్తరించడం మరొక కారణం అనిపిస్తున్నది.Rajasekhar1961 (చర్చ) 05:21, 20 ఏప్రిల్ 2019 (UTC)
శుభ పరిణామం. గ్రామ వ్యాసాల్లో పెద్ద ఎత్తున మనం మార్పులు చేయడం ఖచ్చితంగా దీనికి తోడుపడింది. అంతే కాకుండా, మనం ఒక ప్రణాళిక ప్రకారం కాకపోయినా అడపా దడపా గ్రామ వ్యాసాల కోసమో, సినిమా వ్యాసాల కోసమో, మొలకల విస్తరణ కోసమో అప్పుడప్పుడు చర్చలు లేవదీసి వాటి మీద కొంచెం కృషి చేశాము. అలాగే ఎడిటథాన్లలో భాగంగా వ్యాసాలు సృష్టించేటపుడు వ్యాసాల్లో కనీస పరిమాణం, పదాలు లాంటి నియమాలను అనుసరించాం. ఇవన్నీ నాణ్యతకు తోడ్పడ్డ అంశాలని భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా మనం నాణ్యతను విస్మరించకుండా కుండా ఉంటేనే బాగుంటుంది. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు!. అన్నట్టు మనం అభివృద్ధి చేయాల్సిన మొలకలు ఇంకా చాలా ఉన్నాయి. నేను సుదీర్ఘ కాలంగా అప్పట్లో బాటునుపయోగించి కేవలం మూస మాత్రమే ఉండేలా సృష్టించిన సినిమా వ్యాసాల్లో పరిచయం, తారాగణం, కథ లాంటివి చేరుస్తూ వచ్చాను. కొద్ది కాలం పాటు కొత్త వ్యాసాలు సృష్టించడం కన్నా ఉన్న వ్యాసాలనే మెరుగుపరచాలనే నియమం కూడా పెట్టుకున్నాను. మొలకల అభివృద్ధికి కూడా అప్పుడప్పుడు ఒక ఎడిటథాన్ లాంటివి నిర్వహించుకుంటే బాగుంటుందేమో.రవిచంద్ర (చర్చ) 09:24, 20 ఏప్రిల్ 2019 (UTC)

భారత జనగణన డేటా ప్రాజెక్టు పై చర్చసవరించు

నా దృష్టిలో ఇతర వికీలతో పోలికకన్నా మనవికీలోనే గత సంవత్సరంతో పోల్చి ముందుకెళ్తున్నామా, వెనకబడుతున్నామా అని విశ్లేషించటం మెరుగు. వ్యాసాలు పరిమాణంలో పెద్దవైనా, గణాంక పట్టికలలోని సమాచారాన్ని వాక్యాల రూపంలో చేర్చటం అంత మచంచిది కాదనిపిస్తుంది. ఈ విషయమై చదువరి, వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) గారి దృష్టికి తీసుకువెళ్లినా స్పందన రాలేదు. ఇప్పటికైనా ఆ ప్రాజెక్టుని సమీక్షించి తదుపరి చర్యలు చేపట్టటం మంచిది, --అర్జున (చర్చ) 03:38, 22 ఏప్రిల్ 2019 (UTC)
అర్జున గారూ, ఆనాడు గ్రామాల పేజీలు ఉన్న తీరు సరైనది కాదు, దాన్ని మార్చాలి అన్నది అందరూ అంగీకరించిన సత్యం. దాన్ని ఇదుగో ఇలా మారుద్దాం అని కొందరు ముందుకొచ్చారు - ముఖ్యంగా వాడుకరి:Pavan santhosh.s. అది కూడా సరైన పద్ధతి కాదు అని అన్నపుడు మరొక సరైన పద్ధతి చూపించాలి. మీరు ఇప్పుడు చెప్పిన అభ్యంతరాన్నే - సరిగ్గా అదే అభ్యంతరాన్ని - నేను అప్పుడు ఆయనకు చెప్పాను. అయితే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోయాను. పవన్ గారు చూపించిన ప్రత్యామ్నాయం ఆనాడు ఉన్న పేజీల కంటే ఎంతో మెరుగు. అంచేత దాన్ని నేనూ స్వీకరించాను. ఆ దారిలోనే వెళ్ళాను. నాకు తోచిన పని చేసాను. ఇక.., మీరూ అభ్యంతరం లేవనెత్తారు, మీరూ ప్రత్యామ్నాయం చూపించలేకపోయారు. కానీ అక్కడే ఆగిపోయారు. కొత్త దారి వెతకలేదు, ఇతరులు చూపించిన దారిలో నడవనూ లేదు. ప్రవాహానికి ఎదురీదలేదు, ప్రవాహంతో పాటు వెళ్ళనూ లేదు. ఒడ్డునే ఉండిపోయారు. ఇప్పుడు "తదుపరి చర్యలు" అని మాట్టాడుతున్నారు. ఏంటా తదుపరి చర్యలు?__చదువరి (చర్చరచనలు) 04:33, 22 ఏప్రిల్ 2019 (UTC)
తెలుగు వికీపీడియాలో 30+ శాతం వ్యాసాల మీద, అందునా పదేళ్ళపాటు సమస్యాత్మకంగా మిగిలిపోయిన వ్యాసాల మీద, ముందస్తుగా విస్తారమైన చర్చ జరిపి, రెండున్నరేళ్ళ పాటు ఐదారుగురు వికీపీడియన్లు నిత్యం పనిచేసిన ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత అర్జున గారికీ తెలుసనే భావిస్తున్నాను. సముదాయం పదేళ్ళ పాటు పదే పదే సమస్యాత్మకమని ఘోషించిన ఈ వ్యాసాల మీద జరిగిన ఇటువంటి పనిని విమర్శించే ముందు కనీసం ఓ రెండు నిర్మాణాత్మకమైన విషయాలు సుస్పష్టంగా ఆలోచించుకుని ఉంటారని నమ్ముతున్నాను. ఈ క్రమంలో ఆయన ఈ రెండు వివరాలు స్పష్టం చేస్తే బావుంటుంది:
 1. గణాంకాల్లోంచి రూపొందించిన వాక్యాల్లో ఏది ఎందుకు విజ్ఞాన సర్వస్వ వ్యాసాల్లో ఉండడానికి తగనిది?, అలా కాక మరి ఏ విధంగా మార్చివుండవచ్చు?
 2. వేలాది సంఖ్యలో ఉన్న ఈ వ్యాసాలను మరి ఏ విధంగా మెరుగుపరచవచ్చు? అందుకు ఆయన ఆలోచించిపెట్టిన వరుస క్రమం ఏమిటి?
ఈ అంశంపై కొందరం ఉత్సాహంగా, నిర్మాణాత్మకంగా పనిచేస్తూ దీన్నొక దశకు తీసుకురావడం ఆయనా గమనించేవుండొచ్చు. ఇంత ముఖ్యమైన అంశంపై తమ నిర్మాణాత్మకమైన ఆలోచనలు సూటిగా, అసందిగ్ధంగా, అస్పష్టతకు తావులేకుండా పంచుకుంటే, చర్చించి, అందరితో కలిసి ఆ విధంగా పనిచేసి ఇంకా మెరుగుపరుద్దామని ఆశిస్తున్నాను. పై సమాధానాల కోసం వేచిచూస్తూ.. పవన్ సంతోష్ (చర్చ) 14:48, 22 ఏప్రిల్ 2019 (UTC)
చదువరి, పవన్ సంతోష్ గార్ల స్పందనలకు ధన్యవాదాలు. చదువరి గారు కూడా గ్రామ వ్యాసాల విస్తరణ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పారని ఇప్పుడే తెలిసింది. దీనికొరకు చేసిన సభ్యుల కృషిని అగౌరవపరచటంలేదు. కాకపోతే ఈ గ్రామాల వ్యాసాల నాణ్యత తక్కువ అని అనుకునేవారు నేనే కాక ఇంకా వున్నారని కొన్ని పాతచర్చలు చూస్తే తెలిసింది. నేను ఏమి జరుగుతున్నదో తెలుసుకుందామని ఇటీవల, అంతకుముందు ప్రయత్నించినపుడు, తలా, తోకా అంతుపట్టలేదు. నాకు కనబడిన సంబంధించిన ప్రాజెక్టు పేజీ యొక్క చర్చలో వ్యాఖ్య రాయటం జరిగింది. అలా ఈ కృషికి ఇటీవల నాయకత్వం వహించుతున్నారని అనిపించిన వారి దృష్టికి తీసుకెళ్లినా వారినుండి స్పందన లేకపోవటం ఈ ప్రాజెక్టు సరియైన దిశలో నడవటంలేదనిపించింది. అందుకనే మరొక్కసారి సభ్యులదృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక నేను చేసిన వ్యాఖ్యలో మొదటిది, ప్రాజెక్టుని సమీక్షించటం. అదీ, ప్రాజెక్టు పేజీ నిర్వహించటం, ప్రాజెక్టు నిర్వహించినవారి బాధ్యతలలో ప్రముఖమైనది. అవి సరిగా నిర్వహించినపుడే, ముందు కాలంలో ఆసక్తి వున్న వికీపీడియన్లు సమర్ధవంతమైన తదుపరి చర్యలు చేపట్టటానికి అవకాశముంటుంది. వీలైతే ఆ ప్రాజెక్టుపేజీని ఇటీవలి జరిగిన పనులకు సంబంధించిన వివరాలు, వనరులు, పాల్గొన్న సభ్యులు, లోటుపాట్లు లాంటి వాటితో తాజా చేయమని చదువరి, పవన్ సంతోష్ గార్లను ఇంకా ఇతరత్రా పాల్గొన్న సభ్యులను కోరుతున్నాను. --అర్జున (చర్చ) 04:16, 23 ఏప్రిల్ 2019 (UTC)
అర్జున గారూ, మీ వ్యాఖ్య లోని "వ్యాసాలు పరిమాణంలో పెద్దవైనా, గణాంక పట్టికలలోని సమాచారాన్ని వాక్యాల రూపంలో చేర్చటం అంత మంచిది కాదనిపిస్తుంది." - అనే వాక్యానికి నేను స్పందించాను. "తదుపరి చర్యలు" అంటే మెరుగు పరచే ఇతర పద్ధతి గురించి మాట్టాడుతున్నారని అనుకున్నాను. ఈ వ్యాసాలను అభివృద్ధి చెయ్యడంలో మీకు వేరే ఆలోచనలు ఉన్నట్టుగా నాకు అనిపించింది. కేవలం ఇది మంచిది కాదు అనేసి ఊరుకుంటే, ప్రాజెక్టుకు ఏవిధంగానూ ఉపయోగపడదన్న సంగతి మీకు తెలియనిదేమీ కాదు. ఈ వ్యాసాలను ప్రస్తుతం మెరుగు పరుస్తున్న పద్ధతి అంత మంచిది కాదనుకుంటే, మీరు సూచించే పద్ధతి ఏంటో వివరించండి. దాన్ని చర్చించి అందుకనుగుణంగా ఈ పేజీల్లో మార్పుచేర్పులు చేసుకుందాం. __చదువరి (చర్చరచనలు) 04:51, 23 ఏప్రిల్ 2019 (UTC)
అర్జున గారూ మీరు ముందు చేసిన వ్యాఖ్య వ్యాసాలు పెద్దవి ఐనా నాణ్యత దెబ్బతిందన్న (ఎలాగన్న స్పష్టత ఇవ్వలేదు) అంశాన్నే చెప్తోంది. ఆ పాయింట్ చాలా కీలకమైనది. "గణాంక పట్టికలలోని సమాచారాన్ని వాక్యాల రూపంలో చేర్చటం అంత మంచిది కాదనిపిస్తుంది." అని వ్యాఖ్యానించారు కాబట్టి ఏయే వాక్యాలు విజ్ఞాన సర్వస్వంలో ఉండదగ్గవి కావో, ఎందుకు కావో చెప్పగలరని ఆశించడం కనీసమాత్రపు కోరిక. ఉదాహరణగా ఇప్పటికి పనిపూర్తైన వ్యాసాన్ని దేన్ని తీసుకున్నా ఫర్వాలేదు, కావాలంటే మేడపల్లి (నల్లబెల్లి) వ్యాసాన్ని తీసుకోండి. అంతకుముందు ఎనిమిదేళ్ళ పాటు మూడు బాట్లు, నలుగురు వాడుకరులు మార్పుచేర్పులు చేయగా రూపొందిన 2015 డిసెంబరు నాటి ఈ వెర్షన్ చూడండి. ప్రస్తుత వెర్షన్ ఏ విధంగా మంచిది కాదు? అలా మంచిది కాకపోవడానికి విజ్ఞాన సర్వస్వంలో ఉండదగని, 2015 నాటి వెర్షన్‌ను మీ మాటల్లో చెప్పాలంటే "టెలిఫోన్ డైరెక్టరీ స్థాయి"కి దిగజార్చిన వాక్యాలేమిటి? వంటి రెండు అంశాలపై స్పష్టత ఇస్తే ఎలా మెరుగుపరచవచ్చో అందరం తెలుసుకోవచ్చు. నేను పైన కోరినదీ అదే. --పవన్ సంతోష్ (చర్చ) 07:53, 23 ఏప్రిల్ 2019 (UTC)
చదువరి, పవన్ సంతోష్ మీ స్పందనలు చూస్తే ప్రాజెక్టు చర్చాపేజీలో అప్పటి వ్యాసాలతీరుని గమనించినట్లు లేదు. అందుకని ఆ వ్యాఖ్యకు అప్పటి కాలంనాటి వ్యాసాల లింకులు, నా వ్యాఖ్యలకు వివరాలు, ఆ చర్చాపేజీలోనే పొందుపరిచాను. ఇక వాటిలో వెంటనే చేయాలనుకున్న స్వల్పమార్పులు (పర్చూరు) స్వల్పమార్పులు (దేవరపల్లి) తదుపరి చేశాను. ఇక పట్టికలనుండి వ్యాసాలు, వికీపీడియా వ్యాసాలవనేరవు. ఇది టెలిఫోన్ డైరెక్టరీ స్థాయికి తీసుకువెళ్లే ప్రక్రియ మాత్రమే. దానికి బదులుగా గ్రామ వ్యాసాలు వాటి ప్రాముఖ్యతకి తగ్గట్టు కాలక్రమంలో సభ్యుల ఆసక్తులదృష్ట్యా మెరుగవటమే మంచిది అని నా ఉద్దేశం.
నా ప్రాధాన్యతలలో గ్రామాల ప్రాజెక్టు తక్కువస్థాయి అని మీకు తెలిసేవుంటుంది, అయినా ఏదైనా చర్చ జరిగితే కనీసం నా అభిప్రాయాలు పంచుకునేవాడిని. పైన పేర్కొన్న బలహీనతలు, కేవలం ఇటీవలి జనగణన పట్టికలనుండి తయారు చేసిన వ్యాసాలవలనే అని అనడంలేదు. అది ఒక ప్రాజెక్టు రూపంలో చేయటానికి ప్రయత్నించినపుడు, కేవలం ఈ పాఠ్యాన్ని యాంత్రికంగా చేర్చటమే కాక, గ్రామ వ్యాసాలకు మార్గదర్శకాలేమైనా రూపొందించి వాటికి అనుగుణంగా వ్యాసాన్ని దిద్దే బాధ్యతకూడా ప్రాజెక్టు సభ్యులు తీసుకుంటే వ్యాసాలు మెరుగయ్యేవిగా అని నా ఊహా. అయినా మీరు ఈ వ్యాసాలపై ఎక్కువ కృషి చేశారు అందువలన మీ లక్ష్యాలు, చేపట్టిన చర్చలు, వనరులు, వాడిన సాఫ్ట్వేరు, ప్రాజెక్టు స్థితి తెలుసుకుందామనే నా కోరిక. ఇంకొక రెండేళ్లలో కొత్త జనగణన సమాచారంతో ఈ వ్యాసాలు సవరించాల్సి వస్తుంది. జనగణన లో ముఖ్యమైన సమాచారం సమాచారపెట్టె రూపంలో వుంటే సవరించడం తేలికయ్యేది. ఇప్పుడు వాక్యాలుగా మారినతరువాత, ఏకమొత్తంగా విభాగాలు మార్చాల్సివుంటుంది. వ్యాసంలోను సమాచారపెట్టెలోను మార్పులు చేయాల్సి వుంటుంది. క్రియాశీలక సభ్యులు ఎక్కువగా లేని మన వికీకి ఇది కష్టసాధ్యం. ఇటివల {{infobox settlement}} అనువాద ప్రక్రియ ఎప్పుడో అర్ధాంతరంగా ఆగిపోతే దాని చరిత్రని తెలుసుకొని, కేవలం మూస తాజా చేయడానికి వారం రోజులు పట్టింది. అటువంటి పరిస్థితి గ్రామల వ్యాసాలలో ముందు చేయవలసిన కృషికి పట్టకూడదనే నేను ప్రాజెక్టుకు వివరాలు కూర్చి సమీక్ష చేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 04:24, 24 ఏప్రిల్ 2019 (UTC)
మరికొంత వ్యాస అభివృద్ధిలో భాగంగా, మేడపల్లి (నల్లబెల్లి) వ్యాసంలో కొన్ని మార్పులు కొంత వరకు మాత్రమే చేసాను. దయచేసి వాడుకరులు గమనించ గలరు. JVRKPRASAD (చర్చ) 05:01, 24 ఏప్రిల్ 2019 (UTC)
అర్జున గారూ, నేను అడిగిన అంశం అలానే ఉంది. దానికి కనీసం సమాధానం లేకుండా, అలా ఉండనిచ్చి మరికొన్ని అంశాలు చర్చలోకి తెచ్చి మాట్లాడుతున్నారు. "గణాంకాల్లోంచి రూపొందించిన వాక్యాల్లో ఏది ఎందుకు విజ్ఞాన సర్వస్వ వ్యాసాల్లో ఉండడానికి తగనిది?" అన్నది నా సూటి ప్రశ్న. ఇందుకు నేనొక మోడల్ వ్యాసం ఇచ్చాను మేడపల్లి (నల్లబెల్లి). అంతకుముందు, ఆ తర్వాత కూడా ఈ జనగణన డేటా నుంచి తయారుచేసిన సమాచారం వికీపీడియా వ్యాసాల్లో ఉండదగ్గది కాదన్న వ్యాఖ్యానాలు చేసిన మీరు దానిపై వివరణ కోరుతుంటే ఎందుకు చెప్పట్లేదు? అది వదిలి మీరు చాలా అంశాలు మాట్లాడారు. పలు సందేహాలు లేవనెత్తారు. అన్నిటికీ సమాధానాలు చెప్తాను. కానీ, స్వీపింగ్ స్టేట్ మెంట్లు చేస్తూ ఉండి, నమూనా వ్యాసంలో ఏమేం అంశాలు సరిగా లేవో చెప్పే కనీసమాత్రపు ప్రయత్నం కానీ, అలా చెప్పేందుకు ఏ అభ్యంతరాలూ లేవన్న ఒప్పుకోలు కానీ చేయకుండా ఏం మాట్లాడినా చర్చ సరైన దోవలో పోదు. --పవన్ సంతోష్ (చర్చ) 05:38, 24 ఏప్రిల్ 2019 (UTC)
@పవన్ సంతోష్ గారు మేడపల్లి (నల్లబెల్లి) కి నేను ప్రస్తావించిన ఇతర వ్యాసాలకి నాకేమీ పెద్దతేడా కనబడడం లేదు. అందుకనే నేను దానిని ప్రత్యేకంగా పరిగణించడంలేదు. ఇంతకు ముందు ఆదర్శ గ్రామ వ్యాసం అని చాలావరకు అంగీకరించిన భూత్పూరు_(భూత్‌పూర్_మండలం) దానికి మీరు ప్రస్తావించే మేడపల్లి (నల్లబెల్లి) పోల్చి చూడండి ఏది వికీపీడియా వ్యాసమవుతుందో. పట్టిక సమచారం సమాచారపెట్టెలో ఉండదగినదే కాని ఇతరంగా విస్తరించకుండా వ్యాసంలో చేర్చటవలన పరిమాణం పెరుగుతుంది కాని విలువేమి పెరగదు. అందుకనే నేను అటువంటిది వికీపీడియాలో వుండవలసిన వ్యాసం కాదంటున్నాను. అంతకన్నా నేను చెప్పవలసినదేమిలేదు. ఇక ఇప్పుడైన మీరు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెపుతారని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 05:58, 24 ఏప్రిల్ 2019 (UTC)
గ్రామవ్యాసాలపై సభ్యుడు:పవన్ సంతోష్ చేసిన సవాలును నేను స్వీకరించాను. వేలాది గ్రామవ్యాసాలలో గత కొన్ని సంవత్సరాలలో చేర్చబడిన సమాచారం ఏ మాత్రం నాణ్యమైనది కాదు మరియు అది విజ్ఞానసర్వస్వామికి సరిపోయేదిగా లేదు. వ్యాస పరిమాణంతో సంబంధం లేకుండా సంక్షిప్తంగా మధురంగా మరియు నాణ్యమైన సమాచార్ంతో వ్యాసాలుండాలనే గత చర్చలకు ప్రాధాన్యత ఇవ్వని కారణంగా కొందరు సభ్యుల అత్యుత్సాహంతో తెవికీ గ్రామవ్యాసాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సుమారు నాలుగైదు సంవత్సరాల క్రితం గ్రామవ్యాసాలపై జరుగుతున్న చర్చల ఆధారంగా గ్రామవ్యాసం అంటే ఇలాంగుండాలి అని నేను అభివృద్ధి చేసిన భూత్పూర్ గ్రామవ్యాసం కూడా ఈ చర్చలోకి వచ్చింది. పవన్ సంతోష్ సూచించిన మేడపల్లి (నల్లబెల్లి) (ఏప్రిల్ 23, 2019 నాటి స్థితిలో ఉండే) గ్రామ వ్యాసాన్నేనేను సమీక్ష జరిపి వ్యాసలోపాలను బహిర్గతపర్చగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:43, 24 ఏప్రిల్ 2019 (UTC)
అర్జున గారూ,
 1. ప్రస్తుత పద్ధతికి ప్రత్యామ్నాయంగా మీరు సూచించినది - "గ్రామ వ్యాసాలు వాటి ప్రాముఖ్యతకి తగ్గట్టు కాలక్రమంలో సభ్యుల ఆసక్తులదృష్ట్యా మెరుగవటమే మంచిది అని నా ఉద్దేశం.". ఖచ్చితంగా సభ్యుల ఆసక్తిని బట్టే పేజీలు మెరుగు పడతాయి. కొన్ని గ్రామాలు అలా మెరుగు పడ్డాయి. సందేహమే లేదు. కానీ అలాంటి గ్రామ వ్యాసాల శాతం చాలా చాలా తక్కువ. గ్రామ వ్యాసాల ప్రస్థానాన్ని పరిశీలిస్తే-
  1. సుమారు 2006/2007 లో పేజీ సృష్టి. పేజీలో ఒకే వాక్యం ఉండేది. సభ్యులు తమ ఆసక్తికి తగినట్టుగా మెరుగు పరుస్తారనే అందరూ అనుకుని ఉంటారు. ఆ పేజీలు - 95% పైచిలుకు పేజీలు - ఆరేడేళ్ళ పాటు అలాగే ఉన్నాయి, ఏ అభివృద్ధీ లేకుండా.
  2. 2013/2014 ప్రాంతంలో అనుకుంటాను.. వాటికి సమాచారపెట్టె చేర్చారు. ఆ తరువాత చాలా పేజీల్లో ఉత్త విభాగ శీర్షికలతో ఖాళీ విభాగాలు పెట్టారు. కనీసం దాన్ని చూసైనా పేజీల్లో సమాచారం చేరుస్తారనే సదాశయంతో అయి ఉండవచ్చు. కానీ ఏవో కొన్ని పేజీలు తప్పించి చాల వరకు అలాగే ఉండిపోయాయి. ఈలోగా ఒకరిద్దరు వాటిపై పనిచేసి జనాభా గణాంకాల వంటి వాటిని చేర్చారు. ఆ విధంగా కొంత మెరుగైనా.. మొత్తమ్మీద పేజీలు అంతకు మించి చాలావరకు మెరుగుదలకు నోచుకోలేదు. ఆ మాత్రం మెరుగు పరచేందుకు కృషి చేసిన వారికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను.
కొందరు సభ్యులు ఆసక్తిగా పని చేసినా, సృష్టించిన పదేళ్ళ తరవాత కూడా చాలా పేజీల్లో ఖాళీ విభాగలతో సమాచారం అరకొరగానే ఉంది. మీరు సూచించిన ప్రత్యామ్నాయాన్ని పదేళ్ళ పాటు అమల్లో ఉంది. అది అంతగా పని చెయ్యలేదు అని అర్థమౌతోంది. అదయ్యాకే ప్రస్తుతం చేస్తున్న పని మొదలైంది. (గతంలో జరిగిన కొన్ని చర్చల్లో అసలు అలాంటి పేజీలను తొలగించాలనే అభిప్రాయాలు కూడా వచ్చినట్లు గుర్తు.)
 1. ఇక పోతే, "ఇది టెలిఫోన్ డైరెక్టరీ స్థాయికి తీసుకువెళ్లే ప్రక్రియ మాత్రమే." - అనేది మీ వ్యాఖ్య. నాకు తెలిసినంతలో.., గ్రామంలో ముగ్గురు వైద్యులున్నారు అనేది సమాచారం. వాళ్ల పేర్లు ఇవి, వాళ్ళ హాస్పిటలు అడ్రసు లివి, ఫోను నంబర్లివి, అక్కడికి నడిచే బస్సు నంబర్లివి, అక్కడి దుకాణం అడ్రసిదీ, మా బాబాయి ఫోను నంబరిదీ అనేది డైరెక్టరీ. గ్రామ వ్యాసాల్లో ఉన్నది సమాచారం, డైరెక్టరీ కాదు. లేదు.., ఇది డైరెక్టరీయే అనే అంటారా.. ఎలాగో నిరూపించండి.__చదువరి (చర్చరచనలు) 08:14, 24 ఏప్రిల్ 2019 (UTC)
 • అర్జున గారూ, చంద్రకాంతరావు గారూ మీరన్నట్టుగానే నేను ఒకరు ఆదర్శ వ్యాసమనీ, మరొకరు గ్రామ వ్యాసమంటే ఇలాగుండాలని అభివృద్ధి చేశాననీ చెప్పుకుంటున్న భూత్పూరు (భూత్‌పూర్ మండలం) వ్యాసాన్ని, మేడపల్లి (నల్లబెల్లి) వ్యాసంతో పోల్చి చూశాను. ప్రత్యేకించి చంద్రకాంతరావు గారు మార్పులు చేసి ముగించిన 2015 నాటి వెర్షన్ తీసుకున్నాను. నా పరిశీలన చెప్తున్నాను చూడండి.
  • రెంటిలోనూ ఒకేలా ఉన్నవి: రెండు వ్యాసాల్లోనూ జనాభా గణాంకాలు, రోడ్లు-రవాణా, బ్యాంకులు-పోస్టాఫీసుల వివరాలు, ప్రభుత్వ కార్యాలయాల వివరాలు, విద్యాసంస్థలు, గ్రంథాలయం వంటివి ఉన్నాయా లేవా అన్న వివరాలు ఉన్నాయి. కాకపోతే, భూత్పూరు గ్రామంలో గణాంకాలకు తప్ప మిగతా వాటికి మూలాలు లేవు. మేడపల్లి వ్యాసంలో ఆ వివరాలన్నీ 2011 జనగణన వివరాల ఆధారంగా ఉన్నాయి.
  • ఉండరాని వాక్యాలు: గ్రామ సంస్కృతి విభాగంలోని వేషధారణ అన్న పాయింటు చూస్తే "జిల్లాలోని ఇతర ప్రాంతాల వలె ఈ గ్రామంలో కూడా పురుషులు ప్యాంటు, చొక్కా, వృద్ధులు (పురుషులు) ధోవతి, చొక్కా, మహిళలు చీర, రవిక ధరిస్తారు. టీనేజి అమ్మాయిలు / అబ్బాయిలు కొత్త కొత్త ఆకర్షణీయమైన దుస్తులలో కనిపిస్తారు. " అని రాసివుంది. వంటలు, భోజనం అన్న పాయింటులో "జిల్లాలోని ఇఅతర ప్రాంతాల మాదిరిగా ఇక్కడ కూడా వరి అన్నం, కూరగాయలు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. జొన్నరొట్టెలు ఉదయం పూట టిఫిన్‌గా కాకుండా భోజనంలో కూడా అదనంగా తీసుకుంటారు. మారుతున్న జీవన విధానం వల్ల టిఫిన్‌లో కొత్తకొత్త రకాలు చోటుచేసుకుంటున్నాయి." అని రాసుంది. ఇలాంటి జనరలైజ్డ్ వివరాలు రాసింది చంద్రకాంత రావు గారేనా అని ఓసారి పరిశీలించి చూశాను. అవునని తేలింది. చంద్రకాంత రావుగారే గతంలో వేరే వాడుకరి పలు గ్రామాల్లో గ్రామంలో ప్రధాన పంటలు అని పెట్టి వరి, కాయగూరలు, అపరాలు పండిస్తారని రాస్తే "ఊహాత్మక సమాచారం" అని అభ్యంతరపెట్టడం గమనార్హం. ఈ పద్ధతిలో రాస్తూ పోతే మగాళ్ళ మీసకట్టు, ఆడవాళ్ళు పెట్టుకునే కొప్పులు వగైరాలు ఎవరైనా రాసి, మేము ఆదర్శ గ్రామ వ్యాసం నుంచి రాశామంటే చేసేదేం ఉండదు.
  • మూలాలు లేని వివరాలు: గ్రామ పాలనకు సంబంధించిన విభాగంలో విస్తారంగా 2013 స్థానిక ఎన్నికల వివరాలు, ఎంత వివరంగా అంటే ఏయే వార్డుల్లో ఎవరు గెలిచారన్న పేర్లతో సహితంగా ఉన్నాయి. మూలం, ఆధారం లేదు. వ్యవసాయం విభాగంలోనూ జడ్చర్ల మార్కెట్‌లో పంటలు అమ్ముతారనీ, ఊరిలో ఆదివారం సంత జరుగుతుందనీ సమాచారం ఉంది. మూలాలు ఇక్కడా లేవు. గ్రామంలోని ప్రాచీనాలయాల గురించి కానీ, చుట్టుపక్కల సందర్శనీయమైన ప్రాంతాల గురించి కానీ మూలాలేమీ లేవు. ఇదంతా మౌలిక పరిశోధన కిందే తీసుకోవాల్సి ఉంటుంది.
  • కొంత బావుండి ఇంకా మార్చదగ్గ సమాచారం: చరిత్ర విభాగం కొంతమేరకు. మూలాలు కూడా లభ్యమవుతున్నాయి. ప్రత్యేకించి గ్రామానికి సంబంధించిన చరిత్ర బావుంది. "శాతవాహనుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. క్రీ.శ.3వ శతాబ్దిలో ఇది ఇక్ష్వాకుల పాలనలోకి వెళ్ళింది. ఆ తర్వాత వాకాటకులు, విష్ణుకుండినుల అధీనంలో నుంచి క్రీ.శ.6వ శతాబ్దిలో చాళుక్యుల పాలనలో చేరింది." వంటి వాక్యాలు దాదాపు ఆ జిల్లాలోని ప్రతీ గ్రామంలోనూ రాసుకోవచ్చు, వీటికన్నా అందులోని శాసనాలు, యుద్ధాలు వగైరా సూటిగా ఆ గ్రామానికే చెందినవై బావున్నాయి. కాలరేఖ బావుంది, సమగ్రంగా లేదు. కాలరేఖలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఒక సర్పంచి విజయం వంటివే ఉండడం ఇబ్బందికరం. వేల యేళ్ళ గ్రామ చరిత్రలో ఓ విగ్రహం ఆవిష్కరించడం, ఓ వ్యక్తి సర్పంచి కావడం రాస్తే మిగతా స్థానిక ఎన్నికలు, మిగిలిన రాజకీయ మార్పులు ఎందుకు వదిలివేయాలి అనిపించింది.
  • బావున్నవి: ఫోటోలు, పటాలు బావున్నాయి. వాతావరణ వివరాలు బావున్నాయి.
భూత్పూరు నమూనా నుంచి నేను పరిశీలించినవి ఇవి. భూత్పూరులో గ్రామ వ్యాసంతో చాలా సమస్యలు ఉన్నాయనీ, సరిదిద్దాలనీ అర్థమైంది. జనగణన నుంచి చేస్తున్న దిద్దుబాట్లలో ప్రస్తుతానికి చరిత్ర, దేవాలయాలు, రాజకీయ వివరాలు లేవు. ఐతే ఇప్పటికే మేం తదుపరి దశలో చరిత్ర, గ్రామనామ విశేషాలు మెరుగుపరచాలని ఆలోచించడం, చిన్నగా ఆ ప్రయత్నాలూ ప్రారంభించడం వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/నాణ్యతాపరమైన అభివృద్ధి అన్న పేజీలో చూసే ఉంటారని భావిస్తున్నాను. ఈ పరిశీలన మనందరికీ పనికి వస్తుందని భావిస్తున్నాను. చంద్రకాంతరావుగారు కూడా ఈ అవకాశాన్ని వాడుకుని ఒకసారి భూత్పూర్ వ్యాసాన్ని పూర్తి విమర్శనాత్మక ధోరణితో పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:19, 24 ఏప్రిల్ 2019 (UTC)

గ్రామవ్యాసాల్లో గణాంకాల ఆధారంగా చేసిన మార్పుల వల్ల వాటి నాణ్యత దారుణంగా దెబ్బతిన్నదన్న వాదన నేను అంగీకరించను. ఒక దశాబ్ద కాలం పాటు ఏక వాక్య వ్యాసాలుగా పడి ఉన్నవాటిని చెప్పుకోదగ్గ మూలంలో సమాచారంతో విస్తరణ చేయడం అస్సలు ఏమీ సమాచారం లేకుండా ఉండటం కన్నా మంచిదే. అన్ని వ్యాసాల్లో ఒకేరకమైన మూస వాక్యాలుంటాయని మొదట్లో నేను వ్యతిరేకించాను. అయితే వేల సంఖ్యలో గ్రామాల వ్యాసాలను అసలే అత్తెసరు మంది సభ్యులతో నెట్టుకొస్తున్న తెలుగువికీలో మానవీయ మార్పులు చేసి అభివృద్ధి చేయలేరనిపించిది. బాటు ద్వారా కనీసం ఫ్యాక్ట్స్ చేరిస్తే మంచిదే కదా అని నా అభ్యంతరాన్ని వెనక్కి తీసుకున్నాను. రవిచంద్ర (చర్చ) 13:20, 24 ఏప్రిల్ 2019 (UTC)

@పవన్ సంతోష్, భూత్పూర్ గ్రామంలో నేను చేర్చినది ఊహాత్మక సమాచారం కాదు. ఉహాత్మక అంటే ఎలాంటి ఆధారం లేకుండా కేవలం ఇంట్లో కూర్చొని మనకు తోచినదేదో ఊహించి వ్రాయడం. కాని నేను ఆ వ్యాసంలో చేర్చినది వాస్తవ సమాచారమే కాని ఊహాత్మక సమాచారం కానేకాదు. భూత్పూర్ గ్రామం గురించి నాకు పూర్తిగా తెలుసు. అయినా నాకు తెలిసిన విషయాలు కూడా చేర్చలేను. చేర్చిన దానికి (మీరు అభ్యంతరపర్చిన కొన్ని వాక్యాలకు - ముఖ్యంగా సంస్కృతి విభాగంలోని వాక్యాలకు) ఆధారం సిద్ధాంత పరిశోధన వ్యాసం (డాక్టరేట్ పట్టా కోసం అభ్యర్థులు చేసేదే సిద్ధాంత పరిశోధక గ్రంథం. అది నా పరిశోధన కూడా కాదు). అది ప్రామాణిక ఆధారం కాదు కాబట్టే మూలం ఇవ్వలేను. అంతేకాకుండా ప్రతి వాక్యానికి మూలాలు ఇవ్వాలనే నియమమేమీ లేదు. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరముంటే వాక్యం చివర ఆధారం కోరబడినది మూస చేర్చి సమయం పూర్తయిన పిదప వాక్యాలు తొలగించవచ్చు. అందులోనూ అలాంటి వాక్యాలు ఉన్నది ఒక్క వ్యాసమే కాని కొందరు సభ్యులు చేసినట్లుగా వేలాది వ్యాసాలలో ఏదో ఉద్దేశ్యం కోసం చేర్చబడలేదని గ్రహించండి. మీసాలు, కొప్పుల గురించి ప్రస్తావన నాకనవసరం. భూత్పూర్ సంస్కృతి సాధారణ సమాచారం కూడా కాదు. ఎందుకంటే సమీప గ్రామాలలో కూడా ఈ సమాచారం చేర్చడం వీలుండదు. భూత్పూర్‌కు నాలుగైదు కిమీల సమీపంలో ఉండే తండాలలో దీనికి భిన్నమైన సంస్కృతి ఉంది. అక్కడి వేషధారణ, భాష, ఆహారపు అలవాట్లలో తేడా ఉంది. అలాగే వాక్యాలకు మూలాలు లేనంతమాత్రాన మౌళిక పరిశోధన అనడం చూస్తే తెవికీలోని 95% వాక్యాలు తొలగింపునకు గురౌతాయి. వేలసంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామానికి "కాలరేఖలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఒక సర్పంచి విజయం వంటివే ఉండడం ఇబ్బందికరం" అంటే ఈ వ్యాసం అభివృద్ధి చేస్తున్న దశలో వార్తల్లో వచ్చిన అంశాలవి. అంతేకాని ఇవే ముఖ్యమైనవని మాత్రం కాదు. మనం చేసేది మౌళిక పరిశోధన కాదు కాబట్టి ఆధారాలు లభించినవి వ్రాస్తాము. "ఆ తర్వాత వాకాటకులు, విష్ణుకుండినుల అధీనంలో నుంచి క్రీ.శ.6వ శతాబ్దిలో చాళుక్యుల పాలనలో చేరింది. వంటి వాక్యాలు దాదాపు ఆ జిల్లాలోని ప్రతీ గ్రామంలోనూ రాసుకోవచ్చు" అన్నారు. కాని ఒక జిల్లా కాదు కదా ఒక ప్రాంతానికి సమీపంలోని మరో ప్రాంతానికి చరిత్రలో చాలా తేడా ఉంటుంది. అప్పటి రాజవంశాలు ఇప్పటి జిల్లాల ఆధారంగా పాలించబడలేవు. ఒకే జిల్లాలో భిన్నమైన ప్రాంతాలలో భిన్నమైన చరిత్ర ఉండుట సాధారణమే. భూత్పూర్ గ్రామానికున్న చరిత్ర కేవలం 8 కిమీ దూరంలో ఉన్న మహబూబ్‌నగర్ పట్టణానికి లేదు. ఇక్కడి చరిత్ర భిన్నమైనది. నేను భూత్పూర్ గ్రామవ్యాస సమాచారంకై వారంపైగా సమయం వెచ్చించి గ్రంథాలయంలోని పాత పుస్తకాలు, పరిశోధన గ్రంథాలు పరిశీలించాను. ఫోటోలకై ఒకరోజు సమయం వెచ్చించి భూత్పూర్ కూడా వెళ్ళాను. అంతేకాని కేవలం ఇంట్లో కూర్చొని వ్రాసిన ఊహాత్మక సమాచారం మాత్రం కాదు. అయితే ఈ వ్యాసం ఆదర్శవ్యాసానికి ఒక ప్రయత్నం మాత్రమే కాని పూర్తి సమగ్రమైన వ్యాసం అని నేను చెప్పడం లేదు. ఈ వ్యాసంలో మూడునాలుగేళ్ళ నుంచి తాజాకరణలు లేవు. ఇతర సభ్యులచే పలు మార్పులు కూడా జరిగాయి. చరిత్ర విభాగం, ఫోటోలు, పటాలు, వాతావరణ వివరాలు బాగున్నాయి అన్నందుకు మాత్రం కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:49, 24 ఏప్రిల్ 2019 (UTC)
గ్రామవ్యాసాలలో ఇప్పుడున్న అధిక సమాచారం విజ్ఞానసర్వస్వానికి ఎందుకు తగదో నేను స్వీకరించిన సవాలుకు జవాబుగా మేడిపల్లి గ్రామవ్యాసాన్ని సమీక్షించి ఇదే రచ్చబండలో ప్రత్యేక విభాగంగా పెట్టాను చూడండి సి. చంద్ర కాంత రావు- చర్చ 19:59, 24 ఏప్రిల్ 2019 (UTC)
 • అర్జున గారూ! ఆదర్శ గ్రామ వ్యాసంగా మీరు, గ్రామ వ్యాసమంటే ఇలాగుండాలని నేను అభివృద్ధి చేశానని ఇక్కడా, ఆదర్శ గ్రామ వ్యాసమని ఆయన వాడుకరి పేజీలోనూ చంద్రకాంతరావుగారు పేర్కొంటున్న భూత్పూరు వ్యాసాన్ని పరిశీలించి నేను చెప్పిన ముక్కలు గమనించే ఉంటారు. దాని మీద ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నమూ చేశారు. మూలాలు సమర్పించకపోయినా నేను పరిశోధన చేసి రాశాను కాబట్టి నమ్మాలన్నట్టుగా, వేల వ్యాసాలు కాకుండా ఆదర్శ వ్యాసమని చెప్పుకునే ఈ ఒక్కదానిలో రాస్తే ఫర్వాలేదన్నట్టుగా, ఊహాత్మకం ఎందుకు కాదంటే ఫోటోల కోసం ఆ గ్రామాన్ని సందర్శించి రాస్తున్నాను (మళ్ళీ ఆ వాక్యాలు మౌలిక పరిశోధన కాదు) - ఇలా ఉంది ఆ వాదన. ఇంతకీ, ఫలానా వార్డు నుంచి ఫలానా మెంబరు గెలిచాడని మూలాలు లేకుండా రాసేయడం, అలానే పెద్దవయసు పురుషులు పంచె కట్టుకోవడం, స్త్రీలు చీర రవికలు కట్టుకోవడం, ఉదయాన టిఫిన్‌ తింటూండడం ఈమధ్య కొత్త రకరకాల టిఫిన్లు వాడుకలోకి రావడం- వగైరాలన్నీ వికీపీడియాకు శోభస్కరమనీ, ఆదర్శ గ్రామానికి ఒరవడి అని మీరూ అనుకుంటున్నారా? లేక వ్యాసాన్ని తగినంత పరిశీలన చెయ్యకుండా మాకు ఆదర్శ గ్రామ వ్యాసమని నిర్దేశించబోయారా? చర్చలకు ఒక విలువ ఉందని, మీరు ఆలోచించకుండా అభిప్రాయాలు వెలువరించి ఉండరనీ అనుకుంటున్న నా నమ్మకాలకు ఇదంతా గొడ్డలిపెట్టులా ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 03:45, 25 ఏప్రిల్ 2019 (UTC)
అర్జున గారూ, భూత్పూరు (భూత్‌పూర్ మండలం) పేజీపై సి. చంద్ర కాంత రావు గారు శ్రమకోర్చి పెట్టిన ప్రత్యేక శ్రద్ధ ప్రధాన కారణంగా ఆ పేజీ ప్రస్తుత స్థితిలో ఉంది. అందుకు ఆయన్ను అభినందించుదాం. కానీ ఆ పేజీని ఒక ఆదర్శవంతమైన పేజీగా మీరు భావించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. పవన్ సంతోష్ గారు ఆ పేజీపై చేసిన పరిశీలన ప్రకారం అందులో కూడా ఇతర గ్రామ వ్యాసాల్లో లాగే జనాభా, రవాణా, బ్యాంకులు, పోస్టాఫీసులు, విద్యా వైద్య సౌకర్యాలు,.. ఇలాంటి సమాచారమే ఉంది. మరి మీ లెక్కన అది ఆదర్శ గ్రామమెలా అయింది? అలాంటి సమాచారమే కలిగిన మిగతా పేజీలు టెలిఫోను డైరెక్ట్రరీలు ఎలా అయ్యాయి? మగాళ్ళు ప్యాంటేసుకుంటారు, ఆడాళ్ళు చీర కట్టుకుంటారు.. ఇదా ఆదర్శవంతమైన సమాచారం!!? "జిల్లాలోని ఇఅతర ప్రాంతాల మాదిరిగా ఇక్కడ కూడా వరి అన్నం, కూరగాయలు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు." ఇదొక అదర్శవంతమైన వాక్యం!!! హాస్యాస్పదంగా ఉంది సార్. ఆ పేజీని ఆదర్శవంతమైన పేజీ అనడం, వీటిని టెలిఫోను డైరెక్టరీలనడం -రెండూ కూడా మీ పరిశీలనాశక్తిని, మీ అవగాహనా స్థాయినీ పట్టిస్తున్నాయి. (టెలిఫోను డైరెక్టరీ అనే దురుసు వ్యాఖ్యను మీరు నిరూపించటం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను.)
వికీపీడియాలో వ్యాసాల నాణ్యత ఎలా ఉంది అనే విషయమై ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. కానీ.., నాణ్యమైన వ్యాసాలు ఎలా ఉండాలి అనేదాని పట్ల మన అంచనాలు, ఆలోచనలూ నేలబారుగా ఉండాల్సిన అవసరం మాత్రం ఎంత మాత్రం లేదు.__చదువరి (చర్చరచనలు) 05:27, 26 ఏప్రిల్ 2019 (UTC)
@చదువరి, పవన్ సంతోష్ గార్లకు, మీరు నేను ఏ ఉద్దేశంతో రచ్చబండలో చర్చకుపక్రమించానో, ఎంత వివరణ ఇచ్చినా, మీరు దానిని పట్టిచ్చుకోకుండా, తదుపరి చర్యలు అనే పేరిట చర్చని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. నేను చర్చ ప్రతిష్టంభనకారణంగా ఆగిపోగూడదని నేను కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. దానిని మీరు సాగదీస్తూ నేను ఒక వ్యాసాన్ని ఆదర్శ గ్రామ వ్యాసంగా ధృవీకరించానని అనుకొని వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. వ్యాసం లేక వికీపీడియా నాణ్యతపై ప్రతి ఒక్కరికి కొలమానాలు వేరుగా వుంటాయని మీకు తెలియనిది కాదు. నేను గ్రామ వ్యాసాలు టెలిఫోన్ డైరెక్టరీ స్థాయికి దిగజారయ్యానని భావించాను. దానికి మీ విరుద్ధంగా గ్రామ వ్యాసాలు బ్రహ్మాండమైన స్థాయికి తీసుకువెళడటానికి మీరు చేసిన చర్చలు,వాడిన వనరులు, విశ్లేషణ తెలియచెప్పటానికి బదులు,"మీరూ అభ్యంతరం లేవనెత్తారు, మీరూ ప్రత్యామ్నాయం చూపించలేకపోయారు. కానీ అక్కడే ఆగిపోయారు. కొత్త దారి వెతకలేదు, ఇతరులు చూపించిన దారిలో నడవనూ లేదు. ప్రవాహానికి ఎదురీదలేదు, ప్రవాహంతో పాటు వెళ్ళనూ లేదు. ఒడ్డునే ఉండిపోయారు. ఇప్పుడు "తదుపరి చర్యలు" అని మాట్టాడుతున్నారు. ఏంటా తదుపరి చర్యలు?" అని చర్చని తప్పుదోవ పట్టించారు. నేను క్రియాశీలంగా వున్నప్పుడు మీరు గనక చర్చచేసినట్లయితే నేను పాల్గొనకుండా, ఒట్టిగా విమర్శలు చేస్తున్నాననే చెప్పే ప్రయత్నం చేశారు. పదేళ్లకు పైగా కృషి చేస్తున్న నేను,క్రియాశీలంగా వున్న కాలంలో నాణ్యత పరంగా సంబంధించిన చర్చలలో పాల్గొనకపోవటము, ఎవరైనా స్పందించమని కోరినప్పుడు స్పందించకుండా వుండటము లేదు.
ఇక రెండు వివరణలు ఇస్తున్నాను.
ఆదర్శ గ్రామ వ్యాసమని పాత రచ్చబండ చర్చలో బాగుంది అని అన్న వారి వివరాలు వున్నాయి మీరు చూడవచ్చు. ఇక నేను ఆ వ్యాసాన్ని ఎందుకు ప్రస్తావించానంటే గత చరిత్రని చూసి, మీరు విస్తరించిన వ్యాసాలకన్నా ఆ వ్యాసం స్థూలంగా బాగుందనిపించి సూచించాను. మీరు ప్రణాళిక బద్ధంగా ఈ కార్యక్రమం చేపట్టివుంటే గతచర్చలను విశ్లేషించి, సహసభ్యుల సలహాలను పరిగణించి వుంటే మీరు చేసిన పనికూడా మరింత విలువైనదిగా వుండేది. అప్పుడు నా వ్యాఖ్య చేయవలసిన అవసరం వుండేది కాదు, ఒక వేళ చేసిన మీకు అంత కటువుగాను మీకు అనిపించేది కాదు.
ఇక టెలిఫోన్ డైరెక్టరీ స్థాయికి మరింత వివరం కోరారు. స్థూలంగా ఆలోచిస్తే టెలిఫోన్ డెరెక్టరీలో ఏముంటాయి. కొన్ని విభాగాలుంటాయి. వ్యాపార ఫోను వినియోగదారులు, నివాస ఫోను వినియోగదారులు, ప్రభుత్వ సంస్థ వినియోగదారులు, వాటిలో పేరు, చిరునామా, ఫోను నంబరు. మనం ప్రస్తుత వ్యాసాలను చూసుకుంటే కొన్ని విభాగాలు, జనాభా, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు.రవాణా సదుపాయాలు, వాటికుండే వివరం, అంకెలు, వున్నయా లేదా. ఇది పట్టిక సమాచారం టెలిఫోన్ డైరెక్టరీని ఉపమానంగా వాడాను. అంటే దానిలో చిరునామా వుంటే మీరు రాసినదానిలో చిరునామా వుండాలని లేదు. కేవలం గణాంకాలు తప్ప మిగతా వివరాలు లేని వ్యాసం వికీపీడియా వ్యాసం నా దృష్టిలో కాదు. అటువంటి విస్తరించని గణాంకాలు ఉండవలసినది సమాచారపట్టికలోనని ఇంతకుముందే చెప్పాను. ఇక నాకు గ్రామాల గురించి సరియైన అవగాహనలేకనే వ్యాఖ్య రాశాననుకోండి. మీరు ఈ ప్రాజెక్టు ఎంత బ్రహ్మాండంగా ఆలోచించి, విశ్లేషించి, అమలు పరచి, సమీక్షించి, సముదాయం స్పందనలతో బ్రహ్మాండంగా వుందని అందరూ అన్నారన్న నివేదిక తీసుకువచ్చితే, నా వ్యాఖ్యని వెనుకకుతీసికొని, మీ కిద్దరికీ క్షమాపణ చెప్పడానికి నాకు అభ్యంతరముకాని, సిగ్గుగాని వుండదని తెలియచేస్తున్నాను. అంతకుమించి ముందు ఎవరైనా ఇంకా అభివృద్ధి చేయదలిస్తే మంచి పునాదిని ఇచ్చినవారవుతారు. మీకు, చర్చలో పాల్గొన్న ఇతర సభ్యులకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:12, 26 ఏప్రిల్ 2019 (UTC)
వ్యాసాలు పరిమాణంలో పెద్దవైనా, గణాంక పట్టికలలోని సమాచారాన్ని వాక్యాల రూపంలో చేర్చటం అంత మచంచిది కాదనిపిస్తుంది. అని మొట్టమొదట మీరొక వ్యాఖ్య చేశారు. దాన్ని సుస్పష్టంగా చెప్పమంటే, ఆదర్శ వ్యాసమని మీరనుకున్నది మాకిచ్చి దానికి మీరు ప్రస్తావించే మేడపల్లి (నల్లబెల్లి) పోల్చి చూడండి ఏది వికీపీడియా వ్యాసమవుతుందో. అని రాశారు. మీరు విస్తరించిన వ్యాసాలకన్నా ఆ వ్యాసం స్థూలంగా బాగుందనిపించి సూచించాను. అన్నప్పుడు కూడా మూలాలు లేని, జనరలైజ్డ్ వాక్యాలున్న వ్యాసాన్ని స్థూలంగా కూడా నాణ్యతపై ఏమాత్రం శ్రద్ధ ఉన్నవారూ సమర్థించలేరని, సమర్థించడం అటుంచి మీరు ఏకంగా నమూనాగా, ఆదర్శంగా తీసేసుకొమ్మని చెప్పేసినట్టు మరిచిపోతున్నారు. ఇప్పుడు చివరకు నిష్టూరమాడుతున్నారు. మంచిది కాదనిపిస్తుందన్నప్పుడు ఎందుకు కాదో తెలుసుకోవాలని ఆశించడం, పోల్చి చూడమన్నప్పుడు పోల్చి చూసి మీకెలా ఆదర్శ వ్యాసమని అనిపించిందని అడగడాన్ని కూడా దాడి అని పేరుపెట్టినా ఇక్కడొక తుది వ్యాఖ్య రాస్తున్నది భవిష్యత్తులో చదివేవారికి చర్చ జరిగిన తీరు గురించి తెలియడానికే. మేం చర్చించకుండా ఈ ప్రాజెక్టు ప్రారంభించలేదనీ, ప్రశ్నించినవారికి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పకాపోలేదనీ, ఇప్పుడు చేసిందీ అలాంటి ఒక ప్రయత్నమేననీ పైన వాడుకరి:రవిచంద్ర గారి వ్యాఖ్య చదివినవారు ఎలానూ తెలుసుకుంటారు.--పవన్ సంతోష్ (చర్చ) 06:36, 26 ఏప్రిల్ 2019 (UTC)
@పవన్ సంతోష్, "నేను పరిశోధన చేసి రాశాను కాబట్టి నమ్మాలన్నట్టుగా" అని రాశారు మీకు పరిశోధనకు, మౌళిక పరిశోధనకు, సిద్ధాంత పరిశోధనకు తేడా తెలుసా? "వేల వ్యాసాలు కాకుండా ఆదర్శ వ్యాసమని చెప్పుకునే ఈ ఒక్కదానిలో రాస్తే ఫర్వాలేదన్నట్టుగా" అని నేననుకున్నట్లుగా మీకైమీరు అనుకుంటే సరిపోతుందా, నా ఊహలు గురించి అబద్దాలు మీరెలా రాస్తారు? (నేను వ్రాసినదానికి ముందు వాక్యాలు విస్మరించడం ఎందుకు?) "ఊహాత్మకం ఎందుకు కాదంటే ఫోటోల కోసం ఆ గ్రామాన్ని సందర్శించి రాస్తున్నాను" అని ఇష్టమొచ్చినట్లుగా రాశారు. "ఫోటోలకై ఒకరోజు సమయం వెచ్చించి భూత్పూర్ కూడా వెళ్ళాను" అని మాత్రమే నేను వ్రాస్తే దాన్ని వక్రీకరించి రాయడం ఎందుకు? (చర్చలోని మొత్తం సమాచార్ం కాకుండా ఏదో కొంతమాత్రమే తీసుకొని మనదే తప్పు అనుకున్నట్లు వాదిస్తున్నారు. కావాలంటే దీనికీ పూర్తి వివరణ ఇవ్వగలను). "ఇలా ఉంది ఆ వాదన" అని కూడా చెప్పడం చూస్తే పొరపాట్లపై పొరపాట్లు వ్రాస్తూ కూడా చర్చలకు వాదనకు తేడాకూడా విస్మరిస్తున్నారు. అసలు ఇంతకీ మీ ఉద్దేశ్యమేమిటి? గోబెల్స్ ప్రచారం చేసి ఏ రకంగానైనా ఎదుటివ్యక్తిదే తప్పు ఉన్నట్లుగా నిరూపించడమేనా మీ ఉద్దేశ్యం? ఇదివరకు పలుసార్లు ఇలాంటి చర్చలే చేశారు. కొద్దికాలం క్రితమే "అడ్డంకి" చర్చలో కూడా నాదే తప్పు అన్నట్లుగా ఎంత చర్చ జరిగిననూ చివరికి చర్చ ఎటువైపు మొగ్గిందో అందరూ గమనించలేరా? పూర్తి వాస్తవాలు కాకుండా మీవైపు పలు పొరపాట్లు ఉన్ననూ చర్చను తప్పుదోవ పట్టించి ఎదుటివ్యక్తి చిన్న తప్పులను భూతద్దంలో చూపించే ధోరణిని ఎందుకవలంబిస్తున్నారు? ఎన్నికైన వార్డు సభ్యుల గురించి వ్రాసిననూ పరిశోధన అవుతుందా? అది పత్రికలలో, స్థానిక సంస్థల వెబ్‌సైట్‌లో వచ్చే సమాచారం కాదా? నిజంగా మౌళికపరిశోధన ప్రకారమే వ్రాస్తే ఆ వ్యాసం ఇంతకు పదిఇరవై రెట్లు పైబడి సమాచారంలో ఉండేదని గమనించండి. నేను వివరమైన సమాధానం ఇచ్చిననూ సరిగా అర్థంచేసుకోకపోవడమో, చర్చను మళ్ళించడానికి చేసే ప్రయత్నమో కానీ మీ చర్చమాత్రం పక్కదారిపట్టింది. తెవికీలో ఒక ఆదర్శగ్రామ వ్యాసం ఉండాలనీ, అది ఒక నమూనాగా ఉండాలనీ చేసే ప్రయత్నంలో భాగంగా అన్ని అంశాలు కవర్ చేసే ఉద్దేశ్యంతో సమాచారం చేర్చబడిన వ్యాసంలో సింహభాగం మెరుగైన వాక్యాలే ఉన్నాయన్నది పరిశీలించిన ఎవరైనా అంగీకరిస్తారు. ఆదర్శవ్యాసం అంటే 100% వాక్యాలు ఆదర్శ వాక్యాలుగానే ఉండాలనే నియమమేమైనా ఉందా? ఒకట్రెండు వాక్యాలు కొందరికి నచ్చనంతమాత్రానా వ్యాసానికి వచ్చే లోటేమీ ఉండదు. మీరు సవాలు విరిసిన గ్రామవ్యాసంపై తప్పుల కుప్పలు లేవదేసిననూ దానిపై మాట్లాడటం లేదు. చర్చను తప్పుదోవ పట్టిస్తూ చీరలు - ప్యాంటులు, లేని మీసాలు - కొప్పుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు మీకు ప్రజాస్వామ్య నియమం తెలుసా? ప్రజాస్వామ్య నిర్ణయం అంటే శతశాతం నిర్ణయం అని అనుకుంటున్నారా? ఏ నిర్ణయమైనా, ప్రతిపాదననైనా ప్రతీదానికీ అందరి ఆమోదం అవసరం అనుకుంటే ప్రజాస్వామ్యంలో అయ్యేపనికాదు. అలాగే ఆదర్శవ్యాసం అంటే అన్ని వాక్యాలు ఆదర్శ వాక్యాలుండాలని ఏమీ లేదు. భూత్పూర్ వ్యాసంలో అన్ని వాక్యాలు ఆదర్శ వాక్యాలనీ ఎవరు చెప్పారు? అంతమాత్రానా వ్యాసంలో తప్పులునాయనీ (లేదా మౌళిక పరిశోధన వాక్యాలున్నాయని) నేను అనడంలేదు. ఒకట్రెండు వాక్యాలు నాణ్యమైన వాక్యాలు కావని మీరనుకున్నంతమాత్రానా ఆ వ్యాసానికి వచ్చే లోటేమీ ఉండదు. అన్ని విభాగాలుండాలనే ఆశయంతో పెట్టిన సంస్కృతి విభాగంలో గ్రామ సమాచారం చేర్చడానికి ప్రామాణిక గ్రంథాలేవీ లభ్యంకావు. అనుమానం ఉంటే ఎవరైనా నిబంధనల ప్రకారం తొలగించవచ్చు అన్నపిదప కూడా లభ్యమైన పత్రాల ఆధారంగా రచించిన వాక్యాలపై ఇంత రాద్ధాంతం చేసే అవసరం ఉందా? మీరే స్వయంగా సూచించిన మేడపల్లి (నల్లబెల్లి) గ్రామవ్యాసంలో కుప్పలుగా తప్పులు చూపించిన కారణంతో భూత్పూర్ గ్రామవ్యాసంలోని మచ్చలు ఎంచడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? ఎవరికైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా నిబంధనల ప్రకారం తొలగించే అవకాశం ఉందని కూడా తెలిపినా ఆ వ్యాసంపై లేని విమర్శలు చేయడం మాత్రం మానడం లేరు. ఒక వ్యాసానికి ఆదర్శగ్రామంగా అభివృద్ధి చేసి నా సభ్యపేజీలో వ్రాసుకుంటే, ఆదర్శ వ్యాసం అని మరికొందరు అభిప్రాయపడితే, మీకొచ్చే ఇబ్బంది ఏమిటో బయటపెట్టండి. ఆ వ్యాసాన్ని ప్రతిఒక్కరు ఆదర్శవ్యాసంగా పరిగణించాలనీ ఎవరినీ కోరడం లేదు, బలవ్ంతం చేయడంలేదు. కాని ఆదర్శవ్యాసంగా పరిగణిస్తున్న వారిపై చర్చలదాడులు చేయడం సమంజసమేనా? ఎంత వివరంగా సమాధానం ఇచ్చిననూ పట్టించుకోకుండా చర్చను పక్కదారి పట్టించడం భావ్యమేనా? సాధారణ విషయాలు కావు, అభ్యంతరం ఉంటే తొలగించవచ్చని చెప్పిన తర్వాత కూడా మళ్ళీమళ్ళీ లేవదీయడం ఎందుకు? భూత్పూర్ వ్యాసంలో ఒకట్రెండు వాక్యాలు తొలగించామే అనుకుందాం, అయిననూ ఆ వ్యాసానికి వచ్చే లోటేమీ ఉండదు. అదే మీరు సూచించిన గ్రామవ్యాసంలో నేను లేవనెత్తిన అభ్యంతరాలు, పొరపాట్లు తొలగిస్తే అసలు ఆ వ్యాసం నిలుస్తుందా అనేది ఆలోచించండి. ఆ గ్రామవ్యాస సమీక్ష ఫలితం వేలాది వ్యాసాలపై ఉందనీ, లక్షలాది వాక్యాలు ఆ పరిధిలోకి వస్తాయనే వాస్తవాన్ని కూడా గ్రహించండి. చర్చలు చేసేముందు ఎదుటివారి చర్చలను కూడా పరిశీలించకుండా ఏకపక్షంగా మీ వాదనే ఇస్తున్నట్లుగా ఉంది. చందమామ అందాన్ని వదిలి కనీకనిపించని చందమామలోని మచ్చల్ని ఎంచడం ఎందుకు? సి. చంద్ర కాంత రావు- చర్చ 18:18, 26 ఏప్రిల్ 2019 (UTC)
 • చంద్రకాంత రావు గారూ చూడండీ,
  • అర్జున గారే పోల్చి చూడమని సూచించారు, మీరు ఆ సూచనకు వ్యతిరేకించలేదు నేను భూత్పూర్ గ్రామాన్ని పరిశీలించింది, అర్జున రావు గారు సూచించిన మేరకే. పై చర్చల్లో ఆ వివరం ఉంది. మీరు మేడపల్లి గ్రామ వ్యాసాన్ని సమీక్షిస్తానని చెప్పడానికి ముందే ఆయన నన్ను రెండూ పరిశీలించి నేర్చకొమ్మన్నారు, మీరు సమీక్షించడానికి మునుపే నా సమీక్ష ప్రచురణ జరిగింది. నిజానికి అర్జున గారి వాక్యాలు మరోసారి ఎత్తిచూపించే ఉద్దేశం నాకు లేదు. కానీ తప్పడం లేదు.
  • మూలాలు పేర్కొనలేకపోతే మౌలిక పరిశోధనే: ఆదర్శ వ్యాసం అని రచ్చబండ చర్చల్లో ప్రస్తావించినప్పుడు ఏమేరకు ఆదర్శమో ఎవరైనా పరిశీలిస్తారు. వికీపీడియాలో మూలాలు ఎప్పుడు ఇవ్వాలి? అన్న ప్రశ్నకు సమాధానంగా సంబంధిత పేజీలో "మీ రచన మౌలిక పరిశోధన కాదని తెలియ జేసేందుకు." అని చెప్పారు చూడండి. అంటే - మూలాలు చెప్పకుండా కొత్తవాడుకరులు రాసినా, మీరు రాసినా, నేను రాసినా, సాక్షాత్తు సర్వజ్ఞుడే రాసినా మూలాలు పేర్కొనేవరకు అది మౌలిక పరిశోధనే. "సంస్కృతి విభాగంలో గ్రామ సమాచారం చేర్చడానికి ప్రామాణిక గ్రంథాలేవీ లభ్యంకావు." మూలాలుగా చేర్చడానికి ప్రామాణిక గ్రంథాలు లేకపోతే వాక్యమే రాయవద్దని కొత్తవారికి పాఠాలు చెప్తామే, మనమే అలా చేయొచ్చా?
  • చందమామలో మచ్చలా?: "జిల్లాలోని ఇఅతర ప్రాంతాల మాదిరిగా ఇక్కడ కూడా వరి అన్నం, కూరగాయలు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు.", "జిల్లాలోని ఇతర ప్రాంతాల వలె ఈ గ్రామంలో కూడా పురుషులు ప్యాంటు, చొక్కా, వృద్ధులు (పురుషులు) ధోవతి, చొక్కా, మహిళలు చీర, రవిక ధరిస్తారు. టీనేజి అమ్మాయిలు / అబ్బాయిలు కొత్త కొత్త ఆకర్షణీయమైన దుస్తులలో కనిపిస్తారు. " ఈ వాక్యాలు చందమామలో మచ్చలా? కావండీ. చందమామనే కమ్మేస్తున్నాయివి. ఈ ముక్క మీక్కూడా అర్థమవుతూనే ఉందని భావిస్తున్నాను.
వికీపీడియా పాలసీల పరంగా చూసి విషయాలను రాశానే తప్ప కొన్ని "అభ్యంతరాల"లో, "కొన్ని అనుమానాలు, సందేహాలు" కలగలిపి రాయలేదని గుర్తించాలి. --పవన్ సంతోష్ (చర్చ) 05:59, 27 ఏప్రిల్ 2019 (UTC)
@పవన్ సంతోష్ నేనడిగిన వాటికి సమాధానాలు తప్పించుకొనేందుకు చర్చను పూర్తిగా దారిమళ్ళిస్తున్నారు. నేను అన్నింటికీ సమాధానాలు ఇస్తున్నాను, ఇస్తాను కూడా. చర్చ అనేది ఇంటర్వ్యూ మాదిరిగా కాకుండా ఇరువైపుల నుంచి సమాధానం రావాలి. మీనుంచి సమాధానాలు కోసం ఎదురుచూస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:22, 28 ఏప్రిల్ 2019 (UTC)
 • @C.Chandra Kanth Rao: చేసిన సమీక్ష పరిశీలించాను. వికీపీడియాలో సమీక్షలు కానీ, సూచనలు కానీ విధానాల మీద ఆధారపడి, ఉన్న సమాచారం మేరకు ఉండాలి. ఇది అలా లేదు.
  1. అది అనుమానాలు, సందేహాల్లో అభ్యంతరాలు కలిపి రాసిన జాబితానే తప్ప వికీపీడియా చర్చల పద్ధతిలో జరిగిన సమీక్ష కాదు. ఎందుకు కాదంటే అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాల తరహాలో రాసినవే తప్ప ఎక్కడా వికీపీడియా విధానాల మద్దతుతో వాటిని ప్రస్తావించి రాయలేదు. పైన నేను భూత్పూరు వ్యాసానికి చేసిన సమీక్ష చూస్తే విధానాల మద్దతుతో రాశాను. పాలసీల రూపకల్పనలో ఎన్నోమార్లు అభిప్రాయాలు వెలువరించిన ఆయన ఈ సమీక్షలో కనీసం ఒక్కసారైనా, ఒక్క పాలసీనైనా ప్రస్తావించకుండా వికీపీడియా వ్యాస సమీక్ష చేసేశారు.
  2. ఈ ప్రాజెక్టులో జరిగిన పనికీ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలకీ ఏ సంబంధమూ లేదు. విస్తృత స్థాయిలో ప్రాజెక్టు ప్రారంభతేదీ వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం పేజీని చూసినా, దాని చరిత్ర చూసినా తెలిసేది. లేదూ మమ్మల్ని అడిగితే మేమే చెప్పేవాళ్ళం. తప్పు దొరికిందన్న ఉత్సాహంలో మల్ రెడ్డిపల్లి (తాండూరు మండలం) పేజీ చరిత్ర కూడా చూడకుండా. ప్రాజెక్టుతో సంబంధం లేని పొరబాట్లన్నీ దీని నెత్తిన రుద్దుతున్నారు.
  3. లేని సమాచారం గురించి వ్యాఖ్యలున్నాయి. ఇందులో ఎంతో సమాచారం ఇంకా చేరాల్సి ఉందన్నది ఒప్పుకునే సంగతే. మేమేమీ దీన్ని ఆదర్శ వ్యాసమనీ, బెంచ్ మార్కనీ చెప్పట్లేదు. ఉన్న సమాచారం గురించి సమీక్షించమని అడిగితే ఫలానా లేదు, ఫలానా లేదు అంటూ చేసే వ్యాఖ్యానాలు చోటుచేసుకున్నాయి. ఆయన భావనలో ఆదర్శ వ్యాసమైన భూత్పూరు గురించి కూడా ఫలానా సమాచారం లేదని ఒక్క ముక్కా నేను చెప్పలేదు. వ్యాసంలో ఉన్న పాఠ్యాన్ని విధానాల ఆధారంగా మాత్రమే సమీక్షించాను. తేడా గమనించగలరు.
కాబట్టి, ఈ 1569 పదాల, 200 వాక్యాల భారీ సమీక్షలో పాలసీకి విరుద్ధమైన అంశాలు ఏవైనా ఆయన లేవనెత్తి ఉంటే, ఫలానా పాలసీకి ఇవి వ్యతిరేకమని చెప్పగలిగితే, వాటిని మిగిలిన సముదాయం దృష్టికి తీసుకువెళ్ళి తదుపరి పనులు నిర్ణయించుకోవచ్చు. ఉత్తినే సందేహాలు, అనుమానాల ఆధారంగా, జరిగిన పని ఏమిటో తెలుసుకోకుండానే ఈ ప్రాజెక్టులో జరిగిన పనిని సమీక్షించేసి ఓ తీర్పు వెలువరిస్తే వికీపీడియాలో ఉపయోగకరం కాదని మళ్ళీ చెప్పనక్కరలేదు. ఈసారి అయినా "చందమామలో మచ్చలు" తరహా కవితాత్మక వాక్యాలతో మాత్రమే కాక సూటిగా విధానాల ఆధారంతో మాట్లాడతారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:20, 30 ఏప్రిల్ 2019 (UTC)
అర్జున గారూ, మీరు నొచ్చుకున్నట్టున్నారు. మిమ్మల్ని నొప్పించాలనేది నా ఉద్దేశం కాదు.
 • "వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు." - మీరు చేసిన విమర్శకు హేతువు చెప్పమన్నాను. అది వ్యక్తిగత దాడి ఎలా అవుతుంది?
 • "నేను గ్రామ వ్యాసాలు టెలిఫోన్ డైరెక్టరీ స్థాయికి దిగజారయ్యానని భావించాను" - ఏది వికీపీడియా కాదో వికీపీడియా నిర్వచించింది. సందేహంగా ఉన్నప్పుడు అక్కడ చూడాల్సింది. పైగా ఏ పేజీతో నైతే మీరు ఈ టెలిఫోను డైరెక్టరీని పోల్చారో అందులో ఉన్నది కూడా ఈ సమాచారమే! మరి ఆ పేజీని టెలిఫోను డైరెక్టరీగా ఎందుకు భావించలేదో మీరు చెప్పనే లేదు.
 • "కేవలం గణాంకాలు తప్ప మిగతా వివరాలు లేని వ్యాసం వికీపీడియా వ్యాసం నా దృష్టిలో కాదు." - మనం ఈ చర్చలో మాట్టాడుకున్న మొట్టమొదటి విషయమే అది. దీనికంటే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని మీరే కాదు, ఎవరూ చూపించలేకపోయారు. గతంలో జరిగిన చర్చలను చూస్తే మీకు తెలిసి ఉండేది.
మొత్తమ్మీద నేను చెప్పదలచినది ఒక్కటే - ఏదైనా ఒక పని మీద నిర్హేతుకమైన నిందలు వేస్తే కలిగే ప్రయోజనం ఏంటో మనందరం ఆలోచించాలి. __చదువరి (చర్చరచనలు) 17:48, 3 మే 2019 (UTC)
నాకు తెలిసినంతమేరకు, ప్రాజెక్టు పేజీని శుద్ధి చేశాను. అలాగే కొన్ని గ్రామాల పేజీలు సవరించాను. ప్రాజెక్టుని బేరీజు వేశాను. ప్రాజెక్టులో పాల్గొన్న సభ్యులు, దీనిని కొంతవరకు పరిశీలించినవారు కూడా ఈ పేజీలని అభివృద్ధి పరిస్తే ముందు కృషికి ఉపయోగంగా వుంటుంది.--అర్జున (చర్చ) 04:03, 7 మే 2019 (UTC)

ది వికీపీడియా టేల్స్ డబ్బింగ్ (తెలుగు )సవరించు

అందరికీ నమస్కారములు!
న్యూ రీడర్స్ ఇన్స్పైర్ క్యాంపైన్లో భాగంగా Wikilover90 పంజాబీ వికీపీడియా గురించి అవగాహన పెంచుటకు యానిమేషన్ వీడియోను తయారుచేసారు. తెలుగు మాట్లాడేవారిలో వికీపీడియాని ప్రోత్సహించుట కొరకు దీనిని మేము తెలుగు భాషలోకి అనువదించుటకు ఒక ప్రాజెక్ట్ను చేపట్టాము. డబ్బింగ్ మూడు దశల్లో జరిగింది. మొదటి దశలో, మేము ఆంగ్లంలోకి తెలుగు నుండి ఉపశీర్షికలను అనువాదం చేసాము. రెండొవ దశలో, మేము కంఠ ధ్వనిని సరిచేయడానికి రికార్డింగ్ పద్ధతులు మరియు సాంకేతిక పరికరాల గురించి తెలుసుకున్నాము. మూడవ దశలో, రిహార్సల్ మరియు డాక్యుమెంటేషన్ పూర్తిచేసాము. ఈ ప్రాజెక్టును మేము VVIT WikiConnect ఆధ్వర్యంలో చేసాము. VVIT WikiConnect లోని సభ్యులు ఈ వీడియో కి డబ్బింగ్ చెప్పారు. 20 ఏప్రిల్ 2019 లో వికీమీడియా కామన్స్ లో ప్రచురించబడినది. ఈ వీడియోను కామన్స్ లో ఇక్కడ చూడవచ్చు. MNavya (చర్చ) 16:31, 20 ఏప్రిల్ 2019 (UTC)

MNavya గారు, మంచి ప్రయత్నం, అభినందనలు. తెలుగులో ఇలాంటి వర్క్ చేస్తున్న వికీపిడియన్లు ఉన్నారా?, అని ఆశ్చర్యంకలిగింది. కాకుంటే తీసుకున్న ధీం అంత ఉపయుక్తమైనది కానట్టుగా అనిపించింది. చిన్నపిలల్లకు పాఠాలు చెప్పడానికి ఉపయోగించే వీడియోలా ఉంది. లిప్ సింక్ ఉండదు కాబట్టి మరీ ఇబ్బంది అనిపిస్తుంది.కొత్తవారు, కళాశాల స్థాయి విద్యార్ధులు చూడకపోవచ్చు, మనం వికీపై అవగాహన తీసుకురావలసినది పిల్లల్లో కాదు కనుక ఇలాంటి ప్రయత్నం మరేదైనా చేయగలిగితే బావుంటుందని నా అభిప్రాయం. అంత పెద్దది కాని పంజాబ్ వాళ్ళే ఆ మాత్రం చేయగలిగినపుడు మనంకూడా మనకంటూ మెరుగైన, నూతన, సృజనాత్మక ప్రయత్నాలు చేయగలిగితే ఇంకా బావుంటుంది. (చదువుకున్న, కుంటున్న, విషయ అవగాహన ఉన్న పెద్దవారికైతే మనకు చాలా ధీంలు దొరుకుతాయి. దీనికి ఉదాహరణ నాని సినిమా "" టైటిల్స్‌లో వచ్చే వచ్చే రఫ్ డ్రాయింగ్స్ వంటివి చాలా సులభంగా ఉండి, త్వరగా ఆసక్తి కలిగేలా చేస్తాయి, వీటికి ఉన్న మరో ప్లస్, లిప్ సింక్ అక్కరలేదు)..B.K.Viswanadh (చర్చ) 05:16, 21 ఏప్రిల్ 2019 (UTC)
MNavya మరియు ఇతర ప్రాజెక్టు సభ్యులకు అభివందనలు. B.K.Viswanadh గారి సూచనలు బాగున్నాయి. --అర్జున (చర్చ) 03:44, 22 ఏప్రిల్ 2019 (UTC)
B.K.Viswanadh గారు, మీ అభిప్రాయం బావుంది. భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తాము. ధన్యవాదాలతో MNavya (చర్చ) 09:07, 22 ఏప్రిల్ 2019 (UTC).
అర్జున గారు ధన్యవాదాలు. MNavya (చర్చ) 09:07, 22 ఏప్రిల్ 2019 (UTC)

తెవికీ గ్రామవ్యాసాలు - ఒక పరిశీలనసవరించు

తెవికీలో గ్రామవ్యాసాలనేవి మొత్తం వ్యాసాలలో సుమారు 30% వరకు ఉంటాయి. పదేళ్ళ క్రితం నేను తెవికీలో ప్రవేశించే నాటికి గ్రామవ్యాసాలన్నీ ఏక వాక్య వ్యాసాలే. వాటిని కూడా బాటుద్వారా చేర్చారు. గ్రామవ్యాసాలకు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా నేను వాటిని అభివృద్ధిపర్చాలని ముందుగా మండలాల మూసలు తయారుచేసి వ్యాసాలలో పెట్టే పనిని ప్రారంభించాను. తర్వాత బాటుద్వారా అన్ని గ్రామవ్యాసాలలో చేర్చబడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలోని చాలా గ్రామవ్యాసాలను కొంతవరకు అభివృద్ధి చేశాను. కొంతకాలానికి మరికొందరు సభ్యులు తెవికీలో ప్రవేశించారు. అసలుకథ అప్పుడే మొదలైంది. గ్రామవ్యాసాలలో ఇన్ఫోబాక్సులు, జనగణన తదితర చేర్చాలని నిర్ణయం తీసుకున్నాకా వైజాసత్యగారు బాటుద్వారా వాటిని చేర్చగలనని చెప్పిన పిదప కూడా కొందరు సభ్యులు ఎంత వారించిననూ వినకుండా ఏకపక్షంగా ప్రతిపేజీలో ఖాళీ విభాగాలు చేర్చడం, అసంపూర్తి ఇన్ఫోబాక్సులు చేర్చడం లాంటివి మానవీయ్ంగా పెట్టారు. వారి అత్యుత్సాహం వల్ల ఆ సమయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. అది మొదలు, ఆ తర్వాత గ్రామవ్యాసాలపై దిద్దుబాట్ల దాడి మొదలై అప్రతిహితంగా కొనసాగుతూనే వస్తోంది. అప్పుడు నాణ్యత గురించి చెప్పిన సూచనలు ఎవరూ పట్టించుకోలేరు. సంవత్సరాల తరబడి గ్రామవ్యాసాలపై దిద్దుబాట్ల దాడి జరిగి గ్రామవ్యాసాలనేవి కేవలం వ్యాస పరిమాణం పెరగడానికీ మరియు సభ్యుల దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవడానికే తప్ప ఎలాంటి ఉపయోగం లేనట్లుగా తయారయ్యాయి. వ్యాసాలనేవి పరిమాణంలో కాకుండా నాణ్యతలో మెరుగుపడాలని చేసిన సూచనలన్నీ వృధాప్రయత్నాలుగానే మిలిగిపోయాయి. గ్రామవ్యాసాలలో కొందరు సభ్యులు ఇచ్చిన లింకులు కూడా అనవసర లింకులే. గ్రామవ్యాసాలను నాణ్యమైనవిగా తయారుచేయడానికి నేను స్వయంగా జిల్లాస్థాయి అధికారుల నుంచి సమాచారం తీసుకొని, ప్రతిగ్రామవ్యాసంలో గ్రామస్థానపు చిత్రాన్ని తయారుచేసి కొన్ని మండలాలలో చేర్చినపిదప కూడా గ్రామవ్యాసాలపై అనవసర దిద్దుబాట్ల దాడులవల్ల ప్రక్కకు జరగాల్సి వచ్చింది. ఒకానొకదశలో అర్జునరావుగారు కూడా గ్రామవ్యాసాలను తొలగించాలని చేసిన ప్రతిపాదనను ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక పేజీ ఉండటానికి అభ్యంతరపర్చిన సమయంలో నేను తీవ్రంగా వ్యతిరేకించాను కాని చివరకు గ్రామవ్యాసాలు చూడలేకపోయే ఈ స్థితికి వస్తాయని మాత్రం ఊహించలేకపోయాను. ప్రస్తుత స్థితిలో గ్రామవ్యాసాలు కేవలం పరిమాణంలోనే పెద్దవిగా ఉన్నట్లుగా, పట్టికలలోని సమాచారమే వ్యాసాలలో చేర్చబడినట్లుగా, నాణ్యత లేనట్లుగా అర్జునగారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు నేను పూర్తిగా మద్దతు తెల్పుతున్నాను. గ్రామవ్యాసాల లోపాలపై సభ్యుడు:పవన్ సంతోష్ చేసిన సవాలు ఆధారంగా ఆయనే ఇచ్చిన మేడపల్లి (నల్లబెల్లి) వ్యాసాన్నే (23-04-2019 నాటి స్థితి) పరిగణలోకి తీసుకుని సమీక్ష జరిపాను. దాదాపు అన్ని గ్రామ వ్యాసాలు ఇదేరకమైన లేదా ఇంతకంటే అధ్వానస్థితిలో ఉన్నాయన్న సంగతి కూడా గ్రామవ్యాసాలు పరిశీలించినవారికి తెలుస్తుంది. (కొందరికీ ఇలాంటి వ్యాసాలే నచ్చుతుంటే అది వారి అభిప్రాయం) కేవలం ఏదో ఒకటి రెండు వ్యాసాలని కాకుండా వేలాది వ్యాసాలలో అప్రయోజకరమైన మరియు అసమగ్రమైన సమాచారం ఉండుట అనేది ఏ మాత్రం మెచ్చుకోదగిన లేదా సమర్థించుకోగల్గిన పరిస్థితి కాదు.

పట్టికలలో ఉన్న సమాచారమే వాక్యాలుగా పేరాలలో చేర్చబడింది కాని ఈ సమాచారం విజ్ఞానసర్వస్వానికి యోగ్యమైన సమాచారం కాదు. సాధారణంగా ప్రభుత్వం తరఫున ముద్రించే లేదా విడుదల చేసే పట్టికల సమాచారం ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినదై ఉంటుంది. అలాంటి ఏదో ఒక కాలానికి మాత్రమే వర్తించే సమాచారం ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వానికి తగునా అని పరిశీలించడం అత్యావశక్యం. ప్రస్తుత కాలంలో రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. మారిన పరిస్థితులకనుగుణంగా సమాచారం కూడా మార్చాల్సి ఉంటుంది కాని ఎప్పటిదో పాతబడిన సమాచారం, అదీ అసమగ్రమైన అంటే ఖచ్చితమైన సమాచారం ఇవ్వని వాక్యాలు చేర్చడం ఎంతవరకు అవసరం, ఎంతవరకు సమంజసం అనేది నిర్ణయించుకోవాలి. తెలంగాణ అవరతణ అనంతరం జాతీయ రహదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు తెవికీ గ్రామవ్యాసాలలో 10 కిమీ పైబడి దూరంలో జాతీయ రహదారులున్నాయని చెప్పే గ్రామాలు కూడా జాతీయ రహదారులపైనే ఉన్నాయి. అలాగే విద్యుత్ సరఫరా, పారిశుద్ద్యం, నీటి సరఫరా తదితర విషయాలలో కూడా చాలా మార్పులు జరిగాయి. ఇప్పటి వాస్తవ సమాచారానికి తెవికీ సమాచారానికి గ్రామవ్యాసాలలో విపరీతమైన తేడాలున్నాయి. అయితే ఇప్పుడు కేవలం ఒక్క మేడపల్లి (నల్లబెల్లి) వ్యాస సమాచారం ఆధారంగానే సమీక్ష జరిపాను. కాని ఈ లోపాలు ఇలాంటి పొరపాట్లు ఉన్న వేలాది గ్రామవ్యాసాలకు వర్తిస్తుంది. కేవలం ఏదో ఒకట్రెండు వ్యాసాలలో పొరపాట్లు ఉన్నాయని కాకుండా వేలాది గ్రామవ్యాసాలలో ప్రక్షాళన కోసమే ఈ సమీక్ష. సమీక్షలో తెలిపిన అభ్యంతరకర వాక్యాలు, అస్పష్టమైన మరియు అసమగ్రమైన సమాచారం తొలగిస్తే ఇక మిగిలేది ఎంత అనేది కూడా సభ్యులు గ్రహించాలి. అసలు గ్రామ వ్యాసంలో నాణ్యమైన సమాచారం ఉన్న వాక్యాలెన్ని అనేవి కూడా లెక్కపెట్టండి. అవసరమైతే ఇదే గ్రామవ్యాసం ఎలా ఉండాలో (ఎలా వ్రాయాలో) నేను వ్రాసి చూపించగలను. (గ్రామవ్యాసంలోని అభ్యంతర వాక్యాలు, దానికి ముందు బ్రాకెట్లలో నా అభ్యంతరం కూడా వ్రాశాను. చర్చను కొనసాగించేవారు ఈ చర్చను విడదీయకుండా నా సంతకం క్రిందుగా మాత్రమే వ్రాయండి)

1) గ్రామంలో నాలుగుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. (ఇది ఎప్పటి సమాచారం, ప్రస్తుతానికి ఇది సరైనదేనా? ఏటా పుట్టగొడుగుల్లా గల్లీకొకటి పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఖ్యకు కొలమానం ఏమిటి? అసలు బాలబడులంటే ఏమిటి ? నర్సరీలా, ప్రాథమిక పాఠశాలలా?)
2) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. (గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా? ప్రాథమికోన్నత అంటే ఏమిటి ? మాధ్యమిక అంటే ఏమిటి ?)
3) ... ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వరంగల్లోనూ ఉన్నాయి. (50 కిమీ దూరం వరకు డిగ్రీ కళాశాల ఇప్పటికీ లేదా? మరి 15 కిమీ దూరంలో ఉన్న నర్సంపేట గ్రామవ్యాసంలో డిగ్రీకళాశాల ఉన్నట్లుగా వ్రాయబడింది కదా! నల్లబెల్లి మండలంలోని శనిగరం (నల్లబెల్లి), ముచింపుల వ్యాసాలలో సమీప డిగ్రీ కళాశాల నర్సంపేట అని కూడా వ్రాయబడింది.)
4) మేడపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. (ఎప్పటికీ 5గురు సిబ్బందే ఉంటారా ? ఇది నమ్మశక్యంగా లేదు)
5) ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. (డాక్టర్లు ఎప్పుడూ ఉండరా? పారామెడికల్ సిబ్బంది ఎప్పుడూ ఒకరే ఉంటారా?)
6) ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు (సర్వకాలం ఒక డాక్టరే, ఒక పారామెడికల్ సిబ్బందే ఉంటారా?)
7) సంచార వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. (సంచార వైద్యశాల అంటేనే స్థిరంగా లేనిది. అది ఒకచోటు నుంచి మరో చోటుకు వెళుతూ సేవలను అందిస్తుంది. మరి ఆ సంచార వైద్యశాల ఈ గ్రామంలోకి ఎందుకు ప్రవేశించదు? ఈ గ్రామంలో ఎందుకు సేవలందించదు? ఈ గ్రామానికి 5 కిమీ లోపు ఎప్పుడూ రాదా? 10 కిమీ దూరం వదిలి వెళ్ళదా?)
8) గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. (ఇది ఎప్పటి సమాచారం ? ఇప్పటికీ మూడే ఉన్నాయా? ముగ్గురికీ ఇప్పటికీ డిగ్రీ లేదా?)
9) రెండు మందుల దుకాణాలు ఉన్నాయి. (ఇదెప్పటి సమాచారం ? చిన్న గ్రామంలో 2 మెడికల్ షాపులున్నాయంటేనే గ్రేట్ ! సాధారణంగా చిన్న గ్రామాలలో ప్రత్యేకంగా మెడికల్ షాపులుండవు, కిరాణా షాపులలోనే కొన్ని ముఖ్యమైన మందులను మాత్రం అమ్ముతారు. లేదా అక్కడి వైద్యులే మందులను కూడా ఉంచుకుంటారు. దీనికి తాజా ఆధారం కావాలంటే ఎలా చూపించాలి?)
10) గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. (వేసవిలో కూడానా? )
11) బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. (పై వాక్యానికి దీనికి తేడా స్వల్పం, చేతిపంపులైనా, పవర్ బోర్లైనా బోరింగులే కాని దీనికి తాజా పరిస్థితి ఆధారం ఎలా చూపించాలి?)
12) గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. (పెద్ద పట్టణాలలోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేనప్పుడు గ్రామాలలో ఉన్నదనుకోవడం అనుమాస్పదమే ! దీనికి తాజా ఆధారం ఎలా అందించాలి?)
13) మేడపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. (పోస్టాఫీసు సౌకర్యం గ్రామంలోనే ఉన్నప్పుడు సబ్-పోస్టాఫీసు దూరం గురించి వ్రాసే అవసరం ఉన్నదా?)
14) పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (పోస్టాఫీసు సౌకర్యం గ్రామంలోనే ఉంది అనే వాక్యం ఉన్న తర్వాత మళ్ళీ 10 కిమీ పైబడి దూరంలో ఎందుకు? ఇక టెలిగ్రాఫ్ విషయానికి వస్తే అసలు భారతదేశంలో ఎక్కడైనా టెలిగ్రాఫ్ సౌకర్యం ఉన్నదా? ఈ ఒక్క పాయింటు చాలు సమాచారం ఎంత పాతదో తెలుసుకోవడానికి !)
15) గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. (ప్రధాన రహదారి అయితే తప్ప అన్ని గ్రామాలకు ఆర్టీసి సౌకర్యం ఉండదు, ఈ గ్రామం గురించి నాకు తెలియదు కాని ఇలాంటి సమాచారమే ఉన్న నాకు తెలిసిన మల్ రెడ్డిపల్లి (తాండూరు మండలం) గ్రామవ్యాసంలోని సమాచారం చూస్తే పూర్తిగా తప్పు అని చెప్పగలను)
16) వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. (ఇలాంటి వాక్యాల తాజాకరణకు ఆధారం లభ్యమౌతుందా? ఎలా నిరూపించాలి ?)
17) రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (10 కిమీ పైబడి అని కాకుండా సమీప రైల్వేస్టేషన్ పేరు ఇస్తే వ్యాసానికి బలం చేకూరుతుంది, కేవలం పట్టికలలోని సమాచారం మాత్రమే వాక్యాలుగా పేరాలలో చేర్చడం వల్ల వ్యాస నాణ్యత దిగజారింది. రైలురవాణా గురించి భూత్పూర్ గ్రామవ్యాసంలో నేను వ్రాశాను చూడండి)
18) గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. (ఇది సాధారణ సమాచారం మాత్రమే, విజ్ఞానసర్వస్వానికి ఇలాంటి సమాచారం తగదు. కనీసం ఏయే రకం రోడ్లు ఎంత పొడవు కలిగిఉన్నాయో వ్రాసినా బాగుండేది.)
19) రోజువారీ మార్కెట్, వారంవారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. (దూరం కాదు అది ఎక్కడనేది ముఖ్యం, అది తెలిస్తేనే సమాచారం చేర్చబడాలి కాని పట్టికలలోని సమాచారం చేర్చడం సరైనది కాదు)
20) ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. (ఒక గ్రామానికి సమీప ఏటీఎం, సమీప బ్యాంకు ఎక్కడనేది ముఖ్యమైన సమాచారమే కాని కేవలం దూరం మాత్రం తెలపడం అనవసరం. 10 కిమీ పైబడి అంటే అది ఖచ్చితమైన దూరం కూడా కాదు. అది ఎక్కడైనా ఉండవచ్చు. ఇలాంటి సమాచారం కూడా సాధారణ సమాచారంగానే పరిగణించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాక్యాలనేవి అనవసర సమాచారం కిందికే వస్తాయి)
21) వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (గ్రామంలో పండిన పంటలను అమ్ముకోవడానికి సమీప వ్యవసాయ మార్కెట్ కమిటి ఎక్కడుంది అనేది ముఖ్యమైన సమాచారమే కాని ఇక్కడ కూడా 10 కిమీ దూరంలో ఉంది అని ఇవ్వడం ఏ మాత్రం ఉపయోగకరమైన సమాచారం కాదు. 10 కిమీ పైబడి దూరంలో ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఇది సాధారణ సమాచారం కిందికే పరిగణించడం జరుగుతుంది)
22) అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. (అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ అనేది ఒక కార్యాలయం కాదు. అసెంబ్లీ అయినా, లోక్‌సభ అయినా, గ్రామపంచాయతీ / ఎంపీటీసి/ జడ్పీటీసి ఇలా ఏ ఎన్నికలైనా గ్రామంలో ఉండే ఒక పాఠశాలనో మరేదో అందుబాటులో ఉన్న భవనాన్నో తాత్కాలికంగా పోలింగ్ బూత్‌గా చేస్తారు అంతేకాని శాశ్వతంగా ఏ గ్రామంలోనూ పోలింగ్ స్టేషన్లు ఉండవు. అలాగే జనన మరణాల నమోదు కార్యాలయం కూడా ఎక్కడా ప్రత్యేకంగా ఉండదు. సాధారణంగా ఈ పని గ్రామపంచాయతీలే నిర్వహిస్తాయి)
23) ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (గ్రామాలలో ఆటలాడటానికి మైదానాలకు కొదువేమీ ఉండదు కాని స్టేడియం అన్నప్పుడు మాత్రం ఎక్కడుందో చెప్పాలి)
24) సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. (10 కిమీ పైబడి ఎలాగూ ఉంటుంది. అది ఎక్కడ అనేదే ముఖ్యం) గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. (ఈ కాలంలో గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉంటే అది ప్రత్యేకత కాదు, ఏదేని గ్రామంలో విద్యుత్ సరఫరా ఇప్పటికీ లేనట్లయితేనే అది ప్రత్యేకత కిందికి వస్తుంది. విద్యుత్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది. సమీప విద్యుత్ సబ్‌స్టేషన్ ఎక్కడ లాంటి సమాచారం ఇస్తేనైనా ఉపయోగకరం.)
25) రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. (తెలంగాణలో వ్యసాయానికి, వాణిజ్య అవసరాలకు 24 గంటల సరఫరా ఉంది, తెలంగాణలో ప్రస్తుతం విద్యుత్ కొరత ఏమీ లేదు కాబట్టి ఈ సమాచారం ప్రస్తుతానికి వర్తించదు మరియు తప్పుడు సమాచారంగా పరిగణించవచ్చు)
26) విజ్ఞానసర్వస్వం అందులోనూ ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వం అన్నప్పుడు తాజాకరించిన నాణ్యమైన సమాచారం ఉండాలి కాని అస్పష్టమైన, నిరుపయోగమైన, తాజాకరణ లేని సమాచారం ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
27) తెవికీలోని వ్యాసాలు తాజాకరించిన సమాచారంతో ఆధారం చూపగలిగేలా ఉండాలి కాని గ్రామవ్యాసాలు ఇటు తాజాకరణ లేవు అటు తాజా ఆధారమూ లేదు
28) తెవికీలోని వ్యాసాలలోని వాక్యాలపై అనుమానం ఉంటే ఎవరైనా ఆధారం కోరబడినది మూస పెట్టవచ్చు. కొంతకాలం వరకు సరైన ఆధారం చూపబడినచో ఆ వాక్యాలను తొలగించవచ్చు. అలాంటప్పుడూ గ్రామవ్యాసాలలోని అధికభాగం తొలగింపునకు గురికావడం ఖాయం. అధిక సంఖ్యలో ఇలాంటి వాక్యాలు చేర్చడం సరైనది కాదు.
29) అసలు మేడపల్లి గ్రామచరిత్ర ఏమిటి ? ఆ గ్రామంలోని పురాతన దేవాలయాలు ఏవి ? ఏమైనా ప్రాచీన శాసనాలు లభించాయా ? గ్రామప్రముఖులెవరు ? ఇటీవల జరిగిన సంఘటన ముఖ్యాంశాలు, చెరువులు, కాలువలు, నదులు (ఏవైనా ఉంటే) తదితరాలు చేరిస్తే వ్యాసం నాణ్యత మెరుగుపడుతుంది. అంతేకాని అక్కడి ప్రజలకు కాని పాఠకులకు కాని గ్రామ సమాచారం తెలుసుకోగోరే ఔత్సాహికులకు గానీ ఏ మాత్రం ఉపయోగపడని సమాచారం చేర్చడం వల్ల ప్రయోజనం ఏమిటి? (వ్యాస పరిమాణం పెరగడం తప్ప, వ్యాసాలు రచించేది పాఠకుల కొరకే కాని మన దిద్దుబాట్ల సంఖ్యకోసం కాదు, ఇన్నిబైట్ల సమాచారం చేర్చామని చెప్పుకోవడం కోసం కాదు)
30) పట్టికలలోని సమాచారమే వ్యాసాలలో చేర్చబడింది అనేదానికి మరో మంచి ఉదా: దుగ్గొండి గ్రామవ్యాసంలో ఉన్న "ఇది మండల కేంద్రమైన దుగ్గొండి నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది." అనే వాక్యం. (అంటే అదే గ్రామం అదే గ్రామం నుంచి సున్నా కిమీ దూరంలో ఉంది!! ఇదీ ఒక సమాచారమేనా?)
31) వికీపీడియా లాంటి ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వాలలో సమాచారం లేకుండుట కంటే తప్పుడు లేదా అసమగ్ర సమాచారం ఉండుట పొరపాటు. గ్రామస్థులు కాని ఆ గ్రామ సమాచారం తెలుసుకోగోరే ఔత్సాహికులు కాని ఆశించేది, వారికి మనం అందించేది సమగ్రమైన మరియు వాస్తవ సమాచారమే కాని ఎప్పటిదో పాత సమాచారం కాదు, స్పష్టంగా వివరించని అసమగ్ర సమాచారమూ కాదు. వ్యాసాలలో పాఠకులు చూసేది, ఆశించేది, కోరుకొనేది, మెచ్చుకొనేది సమగ్రమైన సమాచారమే కాని వ్యాస పరిమాణం కానేకాదు. ఇలా ఏ రకంగా చూసిననూ వ్యాసాలకు రాశి కంటే వాసియే ముఖ్యమని ప్రతి ఒక్కరు గ్రహించినప్పుడే తెవికీ బాగుపడుతుంది.
గమనిక: పై పాయింట్లన్నీ అభ్యంతరాలు కావు. అందులో కొన్ని అనుమానాలు, సందేహాలు కూడా ఉన్నాయి. గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:51, 24 ఏప్రిల్ 2019 (UTC)

ఈ అనుమానాలు, సందేహాలు, అభ్యంతరాల సంకలనం గురించి పైన హిందీ_వికీతో_పోలికలో.. విభాగంలో క్లుప్తంగా, సూటిగా రాశాను. ఆసక్తి గలవారు అక్కడే చదవగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 09:27, 30 ఏప్రిల్ 2019 (UTC)
@ పవన్ సంతోష్, అసలు గ్రామవ్యాసాలలో ఉపయోగకరమైన సమాచారం ఏముందీ ? చెప్పుకోవడానికి ఇదీ అని ఒక్క నాణ్యమైన వాక్యమైనా ఉందా? దాదాపు మెజారిటీ వాక్యాలు ఒకే ఆధారంతో చేర్చబడినవి. అది కూడా పాతబడిన మరియు అస్పష్టమైన సమాచారమే. చాలా వాక్యాలు ఇప్పటి సమయానికి వర్తించవు మరియు తప్పుడు సమాచారంగా పరిగణించబడుతుంది. మెజారిటీ వాక్యాలకు అందులోని సమాచారం నిర్థారించడానికి వీలుకావడం లేదు. నేను సమీక్ష జరిపి లేవనెత్తిన అభ్యంతరాలు / అనుమానాలు / సందేహాలు వికీపీడియా:నిర్ధారత్వం, వికీపీడియా:శైలి, వికీపీడియా:మూలాలు, వికీపీడియా:మూలాలను పేర్కొనడం తదితర మార్గదర్శకాలు, నియమోల్లంఘన క్రిందికి వస్తాయి. ఇప్పుడు అభ్యంతరకర / అనుమానాస్పద / సందేహాస్పద సమాచారం ఉన్న వాక్యాలలో కొన్నింటికి ఆధారం చూపాలి మూసను చేర్చాను. మరి ఆ వాక్యాలు తొలగింపునకు గురికాకుండా ఎలా ఉంచుకోవాలి, ఎందుకు తొలగించరాదో అనే దానిపై వ్యాఖ్యానించండి. కేవలం ఒక్కవ్యాసం అని కాకుండా దాదాపు పాతికవేల గ్రామవ్యాసాలలో ఇలాంటి వాక్యాలున్నాయనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని సమాధానం ఇవ్వండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:46, 1 మే 2019 (UTC)
@C.Chandra Kanth Rao: అసలంటూ తెలుగు వికీపీడియా విధానాలు ప్రస్తావించి రాయడం మొదలుపెట్టినందుకు అభినందనలు. ఇప్పుడు, ఉదాహరణకు వికీపీడియా:శైలికి మేం రాసింది ఉల్లంఘన అన్నారు కదా. వికీపీడియాలో చర్చ ఎలా ఉండాలంటే, మీరు ఆ శైలి పేజీని చదివి, మేం ఈ వ్యాసంలో ఏ వాక్యాలు ఆ వ్యాసంలో ఉన్న ఏ అంశానికి విరుద్ధమో నిర్దిష్టంగా రాయాలి. ఇదిలా ఉంచి, మల్ రెడ్డిపల్లి (తాండూరు మండలం) వ్యాసంలో మార్పులకు ప్రాజెక్టుకు సంబంధం ఉందో లేదో తెలియకుండా చేసిన ఆరోపణలు ఉపసంహరించుకున్నట్టేనా? (పైన హిందీ వికీతో పోలికలో.. చర్చలో నా రెండో పాయింటు చూడండి) --పవన్ సంతోష్ (చర్చ) 06:34, 2 మే 2019 (UTC)
మరోటి: ఈ గ్రామాల వ్యాసాల విషయంలో చెప్పిందే చెప్పాల్సి వస్తోంది. గతంలో లేవు అన్న విషయాలు, ఇన్ని కిలోమీటర్ల పరిధి ఆవలే ఫలానా సౌకర్యం ఉన్నది అన్న సమాచారం ఎలా పనికి వస్తుందన్నది గౌరవ సభ్యులకు వ్యాసాలలో "లేవు" వాక్యాలు అన్నదానిలో అభిప్రాయం తెలియజేశాను. అప్పుడు చర్చల్లో చురుగ్గా ఉన్న చంద్రకాంతరావుగారు ఆ చర్చలో పాల్గొనలేదు, బహుశా చర్చ చదివారో లేదోనని అవే అంశాలు లేవనెత్తితే అనిపించింది. ఐనా ఫర్వాలేదు, ఇప్పుడు అక్కడ చదువుకురండి. "అసలు గ్రామవ్యాసాలలో ఉపయోగకరమైన సమాచారం ఏముందీ ?" అన్నారు కదా. ఇప్పటివరకూ అసలు కేవలం సందేహాలు, అనుమానాలు కూడా భూమి వినియోగం, ప్రధాన పంటలు వంటి విభాగాల మీద వ్యక్తం చేసినట్టు లేరు. అంటే ఆ విషయాలపై కేవలం సందేహాలు కూడా వ్యక్తం చేయలేనందున వాదన సౌకర్యం కోసం విడిచిపెట్టేసినట్టా? --పవన్ సంతోష్ (చర్చ) 06:59, 2 మే 2019 (UTC)
@ పవన్ సంతోష్, నేనడిగిన వాటికి సమాధానాలు ఇవ్వడానికి బదులు చర్చను ఎంతకైనా మళ్ళించడానికి మళ్ళీమళ్ళీ ప్రయత్నిస్తున్నారు. అనసవరంగా సమయం వృధాచేయడం బదులు గ్రామవ్యాసాలలోని పొరపాట్లకు మరియు మేడపల్లి గ్రామవ్యాసంలో "ఆధారం కావాలి" మూసలుంచిన వాటికి సమాధానం చెప్పండి. నేనన్నీ వివరించగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:03, 3 మే 2019 (UTC)
చర్చలో క్లుప్తంగా ఉండే వాదనలు వాడుకరులకూ, విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండే విమర్శ వికీపీడియాకూ ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే ఆ వాదన ఇద్దరికీ - వాడుకరులకు, వికీకి - భారమే. ఈ చర్చలో వాదనలు అలా ఉన్నట్టు నాకు అనిపించలేదు. పాల్గొన్న వాడుకరులు అనుభవజ్ఞులు కాబట్టి ఈ సంగతిని ఈపాటికి గ్రహించే ఉంటారు. __చదువరి (చర్చరచనలు) 01:45, 4 మే 2019 (UTC)

Train-the-Trainer 2019 Application openసవరించు

అనువదించిన ప్రకటనసవరించు

నమస్కారం,

2019 మే 31, జూన్ 1, 2 తేదీల్లో ట్రైన్-ద-ట్రైనర్ (టీటీటీ) 2019 కార్యక్రమాన్ని సీఐఎస్-ఎ2కె నిర్వహించనుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం.

టీటీటీ అంటే ఏమిటి?
ట్రైన్ ద ట్రైనర్ లేక టీటీటీ అన్న ఈ కార్యక్రమం భారతీయ వికీమీడియా సముదాయ సభ్యుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించే శిక్షణా కార్యక్రమం. గతంలో టీటీటీ 2013, 2015, 2016, 2017, 2018ల్లో జరిగింది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

 • భారతీయ భాషల వికీమీడియా ప్రాజెక్టులపై (ఇంగ్లీషు సహా) కృషిచేసే యాక్టివ్ వికీమీడియన్ ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
 • 31 మార్చి 2019 నాటికి ప్రధాన పేరుబరిలో 600 పైచిలుకు ఎడిట్లు ఉండాలి.
 • ఆఫ్ లైన్ వికీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆసక్తి కలిగి ఉన్నవారు.
 • నోట్: గతంలో టీటీటీ కార్యక్రమాల్లో పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకునే వీలు లేదు.

దయచేసి మెటాలో కార్యక్రమ పేజీ సందర్శించి కార్యక్రమం గురించి మరింత తెలుసుకోండి. అర్హతను బట్టి దరఖాస్తు చేయడం కానీ, అర్హులైన తోటి సముదాయ సభ్యులను దరఖాస్తు చేసుకొమ్మని ప్రోత్సహించడం కానీ చేయగలరు. ధన్యవాదాలతో. -- Tito (CIS-A2K), అనువదించినవారు పవన్ సంతోష్ (చర్చ)

ఆంగ్ల మూలంసవరించు

Apologies for writing in English, please consider translating
Hello,
It gives us great pleasure to inform that the Train-the-Trainer (TTT) 2019 programme organised by CIS-A2K is going to be held from 31 May, 1 & 2 June 2019.

What is TTT?
Train the Trainer or TTT is a residential training program. The program attempts to groom leadership skills among the Indian Wikimedia community members. Earlier TTT has been conducted in 2013, 2015, 2016, 2017 and 2018.

Who should apply?

 • Any active Wikimedian contributing to any Indic language Wikimedia project (including English) is eligible to apply.
 • An editor must have 600+ edits on Zero-namespace till 31 March 2019.
 • Anyone who has the interest to conduct offline/real-life Wiki events.
 • Note: anyone who has already participated in an earlier iteration of TTT, cannot apply.

Please learn more about this program and apply to participate or encourage the deserving candidates from your community to do so. Regards. -- Tito (CIS-A2K), sent using MediaWiki message delivery (చర్చ) 05:07, 26 ఏప్రిల్ 2019 (UTC)

Participating in TTT programసవరించు

I am participating in Train the Trainer program/2019 at Vishakapatnam.--యర్రా రామారావు (చర్చ) 15:19, 6 మే 2019 (UTC)


I am participating in Train the Trainer program 2019.-వాడుకరి :adbh266

నగరాలు, పట్టణాలు, గ్రామాల వ్యాసాలకు బెంచ్ మార్క్ వ్యాసాలు రూపొందించుకుందాం!సవరించు

"హిందీ వికీతో పోలికలో.." అన్న శీర్షికన చదువరి గారు ప్రారంభించిన చర్చలో గ్రామాల వ్యాసాల్లో జనగణన సమాచారం చేర్పు సహా గత రెండు మూడేళ్ళుగా సాగుతున్న ప్రాజెక్టుపై జరిగిన వాదోపవాదాల అనంతరం నేను ఒక ప్రతిపాదనతో ముందుకు వస్తున్నాను. ఆ చర్చలో ఇప్పుడు జరిగిన పని నాణ్యత దెబ్బతీసిందనీ, చర్చోపచర్చల తర్వాత నిర్ణయించి పని నడుస్తూండగా కూడా చర్చలకు వీలిచ్చిన ఈ ప్రాజెక్టు చర్చలు లేకుండా జరిగిందనీ, గత చర్చలు చదవకుండా సాగిందనీ వాదన బలం లేకుండా అంటే అంగీకరించలేకపోయాను. కానీ, ఇప్పుడున్న గ్రామ వ్యాసాల రూపమే అత్యున్నతమైన స్థాయిలోనిదని నాకేమీ భ్రమలు లేవు. ఇంతకన్నా మరెన్నో విధాలుగా, ఎంతగానో మెరుగుపరచవచ్చన్నది నిస్సందేహం. సారాంశం ఏమిటంటే ఇప్పుడున్నది ఇంతకుముందు కన్నా నిస్సందేహంగా మెరుగైన స్థాయిలో ఉంది, భవిష్యత్తులో మరెంతో మెరుగుపడాల్సిన అవసరమూ ఉంది. ఈ నేపథ్యంలో కార్యవాదిగా నేను ఈ చర్చ నుంచి ఒక కార్యాచరణ నిర్ణయించుకుని ప్రతిపాదిస్తున్నాను:

 • బెంచ్‌మార్క్ వ్యాసాలు సమిష్టిగా రూపొందించుకోవాలి. నగరం, పట్టణం, మండల కేంద్రం, గ్రామం స్థాయిల్లో ఒక్కో వ్యాసాన్ని పట్టుకుని బెంచ్‌మార్క్ అనదగ్గ స్థాయికి వాటిని మెరుగుపరిచి (విశేష వ్యాసమంత సర్వ సమగ్రం కాదు, మంచి వ్యాసం కన్నా నాణ్యంగా ఉండాలి) చూసుకుందాం.
 • నగర స్థాయిలో నేను విజయవాడ వ్యాసాన్ని ఎన్నుకున్నాను. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, రవాణా కేంద్రంగా ప్రస్తుతం ఉన్న స్థానం కానీ, చారిత్రకంగా ఉన్న స్థానం కానీ దీనికి విస్తారమైన సమాచారాన్ని ఇస్తోంది. ఓ ఒద్దికకు తెచ్చి, మూలాలతో సమర్థించి మంచిగా తయారుచేయడం నిస్సందేహంగా ఓ సవాలే. సమిష్టిగా అందరం కలిసి మెరుగుపరుచుకుంటే మనకు ఓ ఒరవడిగా పనికివస్తుందని, ఆసక్తి గల ప్రతివారినీ ఆహ్వానిస్తున్నాను. క్రమేపీ పట్టణం, మండలకేంద్రం, గ్రామాల వ్యాసాలను కూడా ఎంచుకుని మెరుగుపరుచుకుందాం.
 • ఒకవేళ విజయవాడే ఎందుకు చేయాలని మీకనిపిస్తే, అనిపించినవారు వేరే నగరాన్ని ఎంచుకుని పనిచేయవచ్చు. బెంచ్‌మార్క్ అన్నది ఒక స్థిరమైనది కాదు. ఒకనాడు బెంచ్‌మార్క్ అనుకున్నది, మరొకరు మరింత సమగ్రంగా మరో వ్యాసం రూపొందించిన నాడు మారిపోతుంది. కొత్త వ్యాసం బెంచ్‌మార్క్ అవుతుంది. ఈ క్రమంలో మనకు చాలా మెరుగైన వ్యాసాలు లభిస్తే ఆనందమానందమాయేనే కదా.

దయచేసి మీమీ అభిప్రాయాలు చెప్పగలరు. ఎవరికైనా మూలాలు కావలిస్తే శాయశక్తులా పంచుకుంటాను. సహాయం కావాలంటే నేనూ చేస్తాను. ఈ ప్రతిపాదననే మెరుగుపరిచినా సంతోషమే. స్పందనల కోసం ఎదురుచూస్తూ పవన్ సంతోష్ (చర్చ) 12:47, 26 ఏప్రిల్ 2019 (UTC)

పవన్ సంతోష్ గారు, నేను కొన్ని వ్యాసాలు మెరుగు చేస్తునే ఉన్నాను. ఉదా:పోరంకి గురించి చూడవచ్చును. నాకుగా నేను తెలుసుకున్న, చూసిన విషయాలను ఆయా గ్రామాలలో వ్రాస్తున్నాను. కొంతకాలానికి అవే మెరుగు పడతాయని అనుకుంటున్నాను. వాడుకరులు అందరికీ నచ్చినట్లుగా ఏ వాడుకరి సమగ్రంగా ఏ వ్యాసాన్ని రూపొందించడం సాధ్యం కాదు. కాకపోతే వికీకి అనుగుణంగా వాక్యాలు ఉంటే సరిపోతుందనేది నా అబిప్రాయం. JVRKPRASAD (చర్చ) 13:14, 26 ఏప్రిల్ 2019 (UTC)
పవన్ సంతోష్ గారూ, "బెంచ్‌మార్కు" వ్యాసాలు! మంచి ఆలోచన. ఈ ప్రతిపాదన నాకు నచ్చింది. ఈ కృషిలో పల్గొనే వాళ్ళంతా వికీ విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పరస్పరం చర్చించుకుంటూ, సమష్టిగా ముందుకు సాగుతారని ఆశిస్తాను. __చదువరి (చర్చరచనలు) 16:50, 3 మే 2019 (UTC)

Requestసవరించు

Sorry to post in English. Please translate for the community. I would like to grant bot DiBabelYurikBot written by Yurik a bot flag. The bot makes it possible for many wikis to share templates and modules, and helps with the translations. See project page. Capankajsmilyo (చర్చ) 17:29, 26 ఏప్రిల్ 2019 (UTC)

Capankajsmilyo, Thanks for your notice. It seems a good initiative. Once few more editors respond, we may take a call on this. We have very few people with experience on templates. There may be some delay on using your bot in Telugu.--అర్జున (చర్చ) 03:56, 30 ఏప్రిల్ 2019 (UTC)
@Arjunaraoc: thanks. Any progress? Capankajsmilyo (చర్చ) 10:11, 13 మే 2019 (UTC)
@Capankajsmilyo, As you can see, there were no other responses to your notice. So I think we may have to wait for some success stories of this initiative in other languages before moving ahead. best wishes.--అర్జున (చర్చ) 16:21, 13 మే 2019 (UTC)

ఆంధ్ర ప్రదేశ్ గ్రామాల సమాచారపెట్టె మెరుగు ప్రాజెక్టుసవరించు

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు పేజీ చూసి స్పందించండి. --అర్జున (చర్చ) 05:16, 29 ఏప్రిల్ 2019 (UTC)

మరింత విశ్లేషించిన మీదట, వికీడేటాలో కావలసిన వివరాలు సమగ్రంగా చేసినతరువాతే ఈ ప్రాజెక్టు చేపట్టగలమని తెలింది. కావున ఆసక్తిగలవారు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా ప్రాజెక్టులో పేరు చేర్చి, సందేహాలు, సలహాలకై సంప్రదించండి. --అర్జున (చర్చ) 05:23, 3 మే 2019 (UTC)
వికీడేటా వాడి ఒకేఒక వరుస మూసతో సమాచారపెట్టె చేర్చబడినది ఉదాహరణగా వేటపాలెం చూడండి. --అర్జున (చర్చ) 10:33, 5 మే 2019 (UTC)

Hangout invitationసవరించు

I have created a hangout to improve collaboration and coordination among editors of various wiki projects. I would like to invite you as well. Please share your email to pankajjainmr@gmail.com to join. Thanks Capankajsmilyo (చర్చ) 16:39, 29 ఏప్రిల్ 2019 (UTC)

మే 3న ఆంధ్ర లొయోలా కళాశాలతో భాగస్వామ్య చర్చసవరించు

విజయవాడలోని ఆంధ్ర లొయోలా కళాశాలలో సీఐఎస్-ఎ2కె గతంలో భాగస్వామ్యం వహించి కార్యక్రమాలు (ప్రధానంగా 2014-2017 సంవత్సరాల్లో) నిర్వహించిన సంగతి సముదాయ సభ్యులు కొందరికి తెలిసిందే. కళాశాల నిర్వహణ విషయంలో జరుగుతున్న కొన్ని మార్పులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఏయే కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నది చర్చించడానికి మే 3న కళాశాలలో సమావేశం జరుగనుంది. దీనిలో కళాశాల ప్రతినిధులు, సీఐఎస్-ఎ2కె ప్రతినిధులు, తెలుగు వికీపీడియన్ రహ్మానుద్దీన్ పాల్గొంటారు. తెలుగు వికీపీడియా, సోదర ప్రాజెక్టుల మెరుగుదల కోణంలో వచ్చే ప్రతిపాదనలను సముదాయంతో ఈ పోస్టు కింద పంచుకుంటాము. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:15, 2 మే 2019 (UTC)

ఏ సమయంలో ఎంతసేపు జరుగుతుందో కూడా పొందుపరచండి. JVRKPRASAD (చర్చ) 08:06, 2 మే 2019 (UTC)
కేవలం రేపు అనగా ఈ రోజున మెసేజ్ పెట్టడంలో అనేక అనుమానాలుగా ఉంది. ఇది ఎవరికోసం పెట్టిన మెసేజ్ అనేది చెప్పగలరు.JVRKPRASAD (చర్చ) 12:07, 2 మే 2019 (UTC)
లొయోల కళాశాల లో 2018-19 సంవత్సరంలో ఏం ప్రణాళిక చేసారు, పవన్ సంతోష్ తెలపాలి. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:03, 2 మే 2019 (UTC)

పవన్ సంతోష్ తెలుగు భాషా ప్రతినిధిగా, తెలుగు వికీపీడియన్ గా కాదు, చేసిన కార్యక్రమాల వివరాల గురించిసవరించు

పవన్ సంతోష్ సీఐఎస్-ఏటుకె కార్యక్రమం ద్వారా సాధారణ వికీపీడియన్ గా కాకుండా ప్రత్యేకంగా చేసిన పనుల గురించిన నివేదిక చేర్చాలని మనవి. ఒక ఔత్సాహికుడిగా చేసిన పనులను, ఒక వికీపీడియా ద్వారా పరోక్షంగా జీతం తీసుకుంటున్న వ్యక్తిగా చేస్తున్న కార్యక్రమాలను అనుకున్న ప్రణాళిక ప్రకారం నివేదించమని మనవి. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:09, 2 మే 2019 (UTC)

తప్పకుండా, త్వరలోనే నివేదిక అందిస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 02:26, 3 మే 2019 (UTC)

టైటిల్ సాంగ్సవరించు

టైటిల్ సాంగ్ గురించిన వ్యాసం రాద్దామని అనుకొంటున్నాను. సరైన పేరు ప్రతిపాదించమని సభ్యులను కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 12:35, 3 మే 2019 (UTC)

Rajasekhar1961 గారూ, ఆసక్తికరమైన విషయాన్ని ఎంచుకున్నారు. పేరు కోసం ఆలోచించాను గానీ, ఏమీ తోచలేదు. టైటిల్ సాంగ్ అనేదే వాడుకలో ఉంది. మకుట గీతం, శీర్ష గీతం లాంటివి తలపుకు వచ్చాయి గానీ, కృతకంగా అనిపించాయి. ప్రస్తుతానికి "టైటిల్ సాంగ్" అనే పేరుతోటే పేజీ మొదలు పెట్టి రాయొచ్చని నా ఉద్దేశం. మంచి పేరును ఎవరైనా సూచిస్తే ఆ పేరుకు పేజీని తరలించవచ్చును. వ్యాసం రాస్తూ ఉండగా మంచి పేరు ఏదైనా స్ఫురించవచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 16:38, 3 మే 2019 (UTC)
Rajasekhar1961 గారు, "టైటిల్ సాంగ్" అనేది సినిమా (నామము) కు సంబంధించినది కనుక నామపాట అని పేరు పెడితే సరిపోతుందని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 00:58, 4 మే 2019 (UTC)
తెలుగు అనువాదాలు లేని పేర్లకు ఇంగ్లీషు నుంచి తెచ్చుకున్న పదాన్నే పెట్టమని, తెలుగు లిపిలో ఉంటే చాలని వికీపీడియా:నామకరణ పద్ధతులు పాలసీ చెప్తున్నది. కాబట్టి టైటిల్ సాంగ్ అన్నదే పెట్టండి. ప్రత్యేకించి కొత్తగా ఓ అనువాద పదాన్ని ఏర్పరిచి చలామణిలోకి తెచ్చే పని మనకొద్దు. --పవన్ సంతోష్ (చర్చ) 13:16, 4 మే 2019 (UTC)

వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణసవరించు

ఈ చర్చ పైనున్న #ప్రముఖుల వర్గాలు అనే విభాగంలోని చర్చకు కొనసాగింపు. AWB ద్వారా చెయ్యాల్సిన వర్గాల మార్పులు అయిపోయాయి. ఇక ఒక్కొక్క వ్యాసాన్ని తీసుకుని వర్గాలను మార్చాలి. వర్గం:తెలుగు ప్రముఖులు, వర్గం:తెలుగు వ్యక్తులు, వర్గం:తెలుగు ప్రముఖులు లాంటి స్థూల వర్గాల్లోని ఒక్కో వ్యాసాన్ని తీసుకుని సముచితమైన సూక్ష్మ వర్గంలోకి చేర్చాలి. అ సూక్ష్మ వర్గాన్ని దాని పైనున్న వర్గం లోకి, దాన్ని మరింత పై వర్గంలోకి.. ఇలా చేర్చుకుంటూ పోవాలి. పెద్ద పనే.. కానీ చెయ్యాల్సిన పని. ఆవశ్యయకమైన చర్చను లేవనెత్తిన Rajasekhar1961 గారికి అభినందనలు. ఆయనే ఈ పనికి నాయకత్వం వహించి ముందుకు తీసుకు పోవాలని కోరుతున్నాను. రాజశేఖర్ గారూ, దీన్ని ఒక ప్రాజెక్టుగా రూపొందించండి. నేనూ పాల్గొంటాను.__చదువరి (చర్చరచనలు) 02:14, 6 మే 2019 (UTC)

స్వంత పేజీల సృష్టిసవరించు

ఈ మధ్య స్వంత పేజీల సృష్టి పెరిగిందేమో నని నాకు అనుమానంగా ఉంది. గత రెండు రోజుల్లో నేను రెండు పేజీలను తొలగించాను. కొందరు వ్యక్తులు తమను తాము గొప్పవారిగా భావించుకోవడం, వికీపీడియాలో తమకు ఒక పేజీ ఉండకపోవడం లోపంగా భావించడం జరుగుతూండవచ్చు. అందుచేత ఒక కొత్త ఖాతాను సృష్టించుకుని వెంటనే తమ పేజీని రాసేసుకుంటున్నారు. (గతంలో అజ్ఞాతంగా- ఐపీ అడ్రసు నుండి - ఈ పని చేసేవారు; ఇప్పుడు కాస్త పురోగతి సాధించి ఉండవచ్చు). అలాంటి రెండు పేజీలను గత రెండు రోజుల్లో నేను తొలగించాను. అయితే సముదాయం దృష్టికి తెచ్చి, దీన్ని ఒక మార్గదర్శకంగా ఏర్పరచాలని భావించాను.

కొన్ని సందర్భాల్లో సదరు వ్యక్తులు నిజంగానే వికీపేజీకి అర్హులై ఉండవచ్చు కూడా. వారికి పేజీ తయారు చెయ్యకపోవడం లోపమే కావచ్చు. అంత మాత్రాన ఎవరి పేజీని వాళ్ళు తయారు చేసుకోవడం సరి అయిపోదు అని నా ఉద్దేశం. అలాంటి పేజీలను కూడా తొలగించాలని నా అభిప్రాయం.

తోటి వాడుకరుల అభిప్రాయాలు కోరుతున్నాను__చదువరి (చర్చరచనలు) 02:28, 6 మే 2019 (UTC)

చదువరి గారూ, అవును వికీపీడియా గురించి కొంతమంది ప్రముఖులకో, రచయితలకో తెలియగానే ఖాతా సృష్టించుకుని వాళ్ళే స్వయంగా తమ గురించి వ్యాసం రాసేసుకోవడం నేను కూడా గమనించాను. వీటిలో కొన్ని వికీలో ఉండదగిన వ్యాసాలే కాకపోతే వారికి మొదట్లో పాలసీల మీద అంతగా అవగాహన ఉండదు కాబట్టి మూలాలు చేర్చడం, పొగడ్తలు లాంటివి లేకుండా కేవలం విజ్ఞానదాయకంగా ఉండేలా చూడటం మన బాధ్యత. అలాగే ప్రాముఖ్యత లేనివి నేను కూడా తొలగిస్తున్నాను.రవిచంద్ర (చర్చ) 04:58, 6 మే 2019 (UTC)
నేను కూడా స్వంత పేజీల సృష్టిలను గమనించాను. అయితే, వాళ్ళు వికీకి వచ్చి రాయడం అనేది ఆహ్వానించదగినది కాబట్టి, వచ్చిరాగానే వారిని భయపెట్టకూదనే ఉద్దేశ్యంతో నేను ఆయా పేజీలపై చర్చ తీసుకోలేదు. మొదట్లో నాకు తెలియక నా గురించి నేనే ఒక పేజీ రాసుకున్నాను. రాజశేఖర్ గారు దాన్ని వాడుకరి పేజీగా మార్చారు. అలా మనం కూడా చేయొచ్చు. కాబట్టి, స్వంత పేజీల సృష్టి అనేది వికీకి మంచిది కాదని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:17, 8 మే 2019 (UTC)

సాక్ పప్పెట్లుసవరించు

ఈ మధ్య Bonadea అనే ఎన్వికీ్ వాడుకరిని వేధిస్తూ ఉన్న అనేక ఖాతాలను స్టీవార్డులకు నివేదించగా, అవన్నీ సాక్ పప్పెట్లేనని తేలింది. అంటే అవన్నీఒక దురాలోచనతో బహుశా ఒకే వ్యక్తి సృష్టించినవన్నమాట.వాళ్ళు ఆ ఖాతాలను పరిశోధించి, లాక్ చేసారు.

ఈ విషయంపై నిర్వాహకుల నోటీసు బోర్డులో జరిగిన చర్చ చూడవచ్చు. అక్కడ ఈ పప్పెట్లు చేసిన హడావుడి కూడా చూడొచ్చు. రవిచంద్ర గారు, Pranayraj Vangari గారు, నేను ఈ పనిలో పాల్గొన్నాం. అయితే ఇక ముందు ఈ పప్పెట్ల ఆగడాలు కొనసాగే అవకాశం, పెచ్చు మీరే అవకాశమూ లేకపోలేదు. మన మందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటి ప్రస్తుత ప్రవర్తన ఇలా ఉంది:

 • ఖాతా తెరవడం తెరవడమే Bonadea పై విషం చిమ్మడం మొదలుపెట్టాయి. అయితే భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాయన్న రూలేమీ లేదు.
 • ఈ పప్పెట్లలో కొన్ని Bonadea ను వ్యతిరేకించగా కొన్ని సమర్ధిస్తున్నట్లుగా మాట్టాడాయి. వాడుకరులను పక్కదోవ పట్టించే ప్రయత్నం అది.
 • స్వీడన్ నుండి రాస్తున్నాం అన్నట్లు కొన్ని మాట్టాడాయి.
 • వికీపీడియా విధానాలు స్పష్టంగా తెలుసునన్నట్టు మాట్టాడాయి.
 • అప్పుడే ఖాతా సృష్టించుకున్న ఒక పప్పెట్టైతే 9 నెలలుగా తెవికీలో ఉన్నట్టు రాసుకుంది.

వాడుకరులు గమనించవలసినదిగా మనవి. __చదువరి (చర్చరచనలు) 02:51, 8 మే 2019 (UTC)

ఓమ్‌నమశ్శివాయ అనే ఒక కొత్త ఖాతా పుట్టుకొచ్చింది ఇవ్వాళ. పుట్టీ పుట్టగానే, పప్పెట్లు చేసిన పనినే కొనసాగించడం మొదలెట్టింది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 03:35, 8 మే 2019 (UTC)
ఈ సాక్ పప్పెట్ వాడుకరి ప్రధాన పేరుబరిలో వ్యాసాలు ఏమీ చేయడం లేదుగానీ చర్చా పేజీల్లాంటి ఇతర పేరు బరుల్లో ఒకేరకమైన చెత్తను ఎక్కిస్తున్నాడు. నాకు దొరికినంతమేరకు తొలగిస్తున్నాను. అలాగే కొత్త వాడుకరులు సృష్టించినపుడు నిరోధిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:16, 8 మే 2019 (UTC)
సాక్ పప్పెట్లను గుర్తించేందుకు మనమే ఇక్కడ చెక్ యూజర్ వ్యవస్థ ఏర్పాటుచేసుకోవచ్చు. గతంలో ముసునూరి నాయకులు వ్యాసం మీద, కులాల వ్యాసాల మీద సాక్ పప్పెట్ల తరహా దాడి జరిగినప్పుడు సందేహంతో నేను ప్రారంభించిన చర్చలో ఆ అంశాన్ని తెరమీదికి తెచ్చాను. ఇక్కడ ఓసారి చదివి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 06:33, 8 మే 2019 (UTC)
పవన్ సంతోష్ గారూ చదివాను.ఇలాంటి పరిస్థితులలో మున్ముందు అవసరం కూడా అని నేను భావిస్తున్నాను. సముదాయ సభ్యులు ఆలోచించి చెక్‌యూజర్‌ హోదా అనుభవజ్ఞులైన సీనియర్ నిర్వాహకులును ఇద్దరిని నియమించి, వ్యవస్థ ఏర్పరుచుకుని మనమే పరిశీలించవచ్చు గదా అని నాఅభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 06:50, 8 మే 2019 (UTC)
పవన్ సంతోష్ గారు చెప్పిన చెక్‌యూజర్‌ హోదా బాగుంది. దాన్ని అమలు చేద్దాం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:22, 8 మే 2019 (UTC)


గ్రామ వ్యాసాల డేటాను చేర్చుటలో యర్రా రామారావు గమనించిన విషయాలు, జరిగిన పనులు, స్పందనలుసవరించు

నేను ఈ ప్రాజెక్టుపనిలో 2017 అక్టోబర్ మాసంలో ప్రవేశించాను.అప్పటి నుండి రోజుకు 12 గం.కు పైగా నిర్విరామకృషితో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామవ్యాసాల మార్పుల, చేర్పుల సవరణలు చేపట్టాను. గ్రామ వ్యాసాల పేజీలనందు డేటాను చేర్చుటలో నేను గమనించిన విషయాలు, జరిగిన పనులు, నాస్పందనలు పై మంచీ చెడూ స్పందించగలరు--యర్రా రామారావు (చర్చ) 17:48, 8 మే 2019 (UTC)

Wikimedia Education SAARC conference application is now openసవరించు

Apologies for writing in English, please consider translating

Greetings from CIS-A2K,

The Wikimedia Education SAARC conference will take place on 20-22 June 2019. Wikimedians from Indian, Sri Lanka, Bhutan, Nepal, Bangladesh and Afghanistan can apply for the scholarship. This event will take place at Christ University, Bangalore.

Who should apply?

 • Any active contributor to a Wikimedia project, or Wikimedia volunteer in any other capacity, from the South Asian subcontinent is eligible to apply
 • An editor must have 1000+ edits before 1 May 2019.
 • Anyone who has the interest to conduct offline/real-life Wikimedia Education events.
 • Activity within the Wikimedia movement will be the main criteria for evaluation. Participation in non-Wikimedia free knowledge, free software, collaborative or educational initiatives, working with institutions is a plus.

Please know more about this program and apply to participate or encourage the deserving candidates from your community to do so. Regards.Ananth (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 13:54, 11 మే 2019 (UTC)

వ్యక్తుల వర్గాల్లో లింగ వివరణ ఉండాలా?సవరించు

వ్యక్తుల పేజీలను వివిధ వర్గాల్లోకి చేర్చేటపుడు వారి లింగాన్ని బట్టి వర్గీకరించాలా అనే సందేహం వచ్చింది, నాకు. అంటే గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు అనే వర్గం లోకి ఆడ మగ అందరినీ చేర్చవచ్చా, లేక స్త్రీలకు ప్రత్యేకంగా గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు /గుంటూరు జిల్లా మహిళా స్వాతంత్ర్య సమర యోధులు అని వేరే వర్గం ఉండాలా? రచయితలు/రచయిత్రులు, నటులు/మహిళా నటులు, ఉపాధ్యాయులు/ఉపాధ్యాయురాళ్ళు (మహిళా ఉపాధ్యాయులు) - ఇలా లింగ విచక్షణ (వివక్ష కాదు) చూపించాలా? అలా విడివిడిగా వర్గాలు ఈసరికే ఉన్నాయి. అయినా నాకో సందేహం వాడుకరుల స్పందన కోసం చూస్తాను. __చదువరి (చర్చరచనలు) 07:22, 17 మే 2019 (UTC)

వర్గాల పేర్లలో లింగ విచక్షణ అవసరం లేదు అని నా అభిప్రాయం. కానీ మనం ఇదివరకే ఇలాంటి వర్గాలు సృష్టించేసి ఉన్నాము. కాబట్టి దానినే అనుసరిస్తే మంచిదేమో. లేకపోతే ఉన్న వర్గాలన్నీ దారి మళ్ళించాలి. దీనికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. రవిచంద్ర (చర్చ) 11:18, 17 మే 2019 (UTC)
వర్గాలు ఉన్నవి వర్గీకరించడానికి కదా. స్వాతంత్ర్య సమరయోధులు, గుంటూరు జిల్లా వారు అన్నవి రెండూ ఎలాగైతే గుర్తింపులో, మహిళలు అన్నదీ అలానే మరో ముఖ్యమైన గుర్తింపు కాబట్టి ఉండాలని నా ఉద్దేశం. ఐతే ప్రత్యేకించి గుంటూరు జిల్లా మహిళా స్వాతంత్ర్య సమరయోధులు అన్న వర్గీకరణ కాకుండా గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు అన్న వర్గమూ, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మహిళా స్వాతంత్ర్య సమర యోధులన్న పెద్ద వర్గమూ రెంటినీ కలిపి వారి వారి పేజీల్లో పెడితే బావుంటుంది. దీనికి నేను ఉదాహరణ ఆంగ్ల వికీ నుంచి తీసుకున్నాను. మణిబెన్ పటేల్ ఆంగ్ల వికీ వ్యాసంలో en:Category:Women Indian independence activists. en:Category:Indian independence activists from Gujarat అన్న రెండు వర్గాలూ ఉండడం ఒక ఉదాహరణ. --పవన్ సంతోష్ (చర్చ) 12:20, 17 మే 2019 (UTC)
వర్గాల పేర్లలో లింగ విచక్షణ అవసరం లేదు అనే అబిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 02:42, 19 మే 2019 (UTC)
ఆయా రంగాల ఉన్న మహిళల వ్యాసాలను గుర్తించడానికి వర్గాల్లో లింగ వివరణ ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:41, 19 మే 2019 (UTC)

తెలంగాణలోని పూర్వపు ప్రతి మండల వ్యాసాలలోని సకలజనుల సమ్మె విభాగం గురించిసవరించు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమంలో 42 రోజులపాటు తెలంగాణకు చెందిన సకలుజనుల సమ్మె జరిగిన సంగతి మనందరికి తెలుసు.ఇది ముఖ్యమైన సంఘటన అని అందరం ఒప్పుకోవలసినమాట, యదార్థం.ఇది ఏ ఒక్క జిల్లాకు, మండలానికి సంభందించిన విషయం కాదు.తెలంగాణ రాష్ట్రానికి సంభందించిన విషయం. తెలంగాణలోని మండలాలకు ప్రత్యేక వ్యాసం సృష్టించకముందు గ్రామ వ్యాసానికి మండల వ్యాసానికి ఒకే వ్యాసం పేజి ఉంది.ఆ వ్యాసాలలో పరిశీలించగా ప్రతి మండల వ్యాసంలో......

“ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.”

అని కూర్పు చేయబడింది.మన గౌరవ వికీపీడియన్స్ ఎవరు కూర్పుచేసారో ప్రస్తుతం అప్రస్తుతం.అయినా నాకు తెలియదు,అంతలోతుకుకూడా పోదల్చుకోలేదు. వాస్తవానికి ఇది తెలంగాణ ఉద్యమానికి సంభందించిన విషయం.పోనీ ఈ విషయం తెలంగాణ ఉద్యమం వ్యాసంలో ఉందా లేదా అని నేను పరిశీలించగా, లేకపోతే అక్కడ "సకలజనుల సమ్మె" అని విభాగం పెట్టి తగిన మార్పులుతో సవరించాను.పెద్ద మనసుతో ఆలోచిస్తే ప్రతి మండల వ్యాసంలో ఉండవలసిన ఆవశ్యకతలేదని నేను భావిస్తున్నాను.ఇక్కడ మీకు ఒక విషయం ఉదాహరణగా వివరిస్తాను.స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సంగతి గురించి మనందరకు తెలిసిందే.ఇది దేశానికి,మనందరకు సంభందించిన విషయం.1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలంలోని పెంటపాడు గ్రామంలో పోస్టాఫీసు మీద, టెలిగ్రాఫ్ శాఖకు చెందిన ఆస్తులపై ఆంగ్లేయుల పాలనకు నిరసనగా దాడిచేసి, స్థానిక స్వాతంత్ర సమర యోధులు జాతీయ స్థాయి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.గాంధీజీ అరెస్టు వార్త తెలుసుకుని ఆగస్టు 15 నుంచి ఎస్‌టివిఎన్ హిందూ పాఠశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించారు. కొద్దిరోజుల్లోనే సమీపంలోని భీమవరంలో ఉద్యమకారులపై కాల్పుల దుర్ఘటన జరిగిందని తెలిసిన విద్యార్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణరెడ్డి విద్యార్థులను సమావేశపరిచి ప్రసంగిస్తూ బొంబాయిలో జాతీయ నాయకులను అరెస్టుచేయడం, భీమవరంలో ప్రజలపై కాల్పులు జరపడం వంటివి చెప్పి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసి వారికి గుణపాఠం నేర్పాలని సూచించాడు. సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో 300 మంది విద్యార్థులు ఊరేగింపుగా వెళ్ళి పీడబ్ల్యుడి ఆఫీసు మీద, పోస్టాఫీసు మీద దాడిచేశారు. తాళం వేసివున్న పోస్టాఫీసును బద్దలుకొట్టి లోపలి వస్తువులు నాశనం చేసి, రికార్డులు తగలబెట్టారు.ఆ సందర్బంగా 12 మంది యువకులను అరెస్టు చేశారు.ఆ ఉద్యమంలో కోర్టు 11 మంది విద్యార్థులుకు 25 కొరాడా దెబ్బలు, స్వాతంత్రసమరయోధుడు సత్యనారాయణరెడ్డికి 25 కొరాడా దెబ్బలుతోపాటు,జైలు శిక్ష,జరిమానా విధించి ఖరారు చేయగా అనుభవించారు.ఈ ఘటన ఆ గ్రామంలో జరిగింది.ఆ గ్రామానికి సంబందించిన ఘటన కాబట్టి పెంటపాడు గ్రామవ్యాసంలో తగిన మూలాలుతో ఒక్క పెంటపాడు గ్రామ వ్యాసంలోనే రాయబడింది.కనీసం ఆ మండలంలోని గామాల వ్యాసాలలోగానీ , పశ్చమ గోదావరి జిల్లా వ్యాసంలో గానీ రాయబడలేదు. మన దేశానికి స్వాతంత్ర్యం ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చింది.అలాగని ప్రతి రాష్ట్ర వ్యాసం పేజీలో గానీ, జిల్లా వ్యాసం పేజీలలోగానీ రాసామా? రాయలేదు. భారత స్వాతంత్ర్యోద్యమం, భారతదేశ చరిత్ర వ్యాసాలలో మాత్రమే రాయబడింది.ఇటువంటి విషయాలు మన గౌరవ వికీపీడియన్స్ ఎవరికివారు ఆలోచించగలరని భావిస్తున్నాను.గ్రామ మండల వ్యాసాల మార్గదర్శకాలులోని 21,22 నియమాలు కూడా అవే చెపుతున్నాయి.

పైవాటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఉద్యమం వ్యాసంలో కూర్పు అయినందున ప్రతి పూర్వపు మండలవ్యాసంలో ఉన్న ఆ వ్యాక్యాలు తొలగించటానికి సముదాయం నిర్ణయం కోసం రచ్చబండలో చర్చనిమిత్తం తీసుకురావడమైనది.దీనిపై గౌరవ వికీపీడియన్స్ వారి వారి అభిప్రాయాలుపై స్పందించవలసినదిగా కోరడమైనది.--యర్రా రామారావు (చర్చ) 02:38, 19 మే 2019 (UTC)

యర్రా రామారావు గారూ ఈ వాక్యాలు ఎవరో అనామక సభ్యులు, వికీ శైలి నిబంధనలు తెలియని వారు అత్యుత్సాహంతో చేర్చిన వాక్యాలు. ఇవి ప్రతి వ్యాసంలో ఉండదగినవి కావు. తెలంగాణా ఏర్పాటు తర్వాత కూడా ఈ చెరువుల పూడికతీతపై ఒకేరకమైన వాక్యాలు గంపగుత్త (బల్క్) గా వ్యాసాల్లో చేర్చడం చూశాను. నాకు సాధ్యమైనంతమేర తిప్పికొట్టాను. ఐపీ అడ్రసులను నిరోధించాను. కానీ కొన్ని చేయిదాటి పోయినాయి. మీరు గుర్తించిన మార్పులు కూడా ఇలాంటివే అని భావిస్తూ వాటిని తొలగించగలరు. రవిచంద్ర (చర్చ) 17:56, 19 మే 2019 (UTC)
ఇప్పుడు మండల వ్యాసాలలో ఉన్న సకల జనుల సమ్మె విభాగాన్ని సుమారు 4 సం.ల క్రితం నేనే AWB ఖాతా ద్వారా ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో చేర్చాను. ఒకే సమాచారం అన్ని మండలాలలో చేర్చడం అనేది పూర్తిగా సాధారణ సమాచారం క్రిందికే వస్తుంది. కాని అప్పటి పరిస్థితుల దృష్ట్యా వెంటనే తొలగించాలని చేర్చిన సమాచారం ఇప్పటివరకు కూడా కొనసాగడం బాధాకరమే. సమాచారం చేర్చిన తర్వాత అనివార్య పరిస్థితుల దృష్ట్యా నేను సెలవులోకి వెళ్ళిపోవడం, మిగితావారు కూడా ఈ అనవసర సమాచారం గురించి పట్టించుకోకపోవడంతో తెవికీలో అలాగే ఉండిపోయింది. 2015 ప్రథమార్థంలో చిన్నదిద్దుబాట్లు / సునాయాస దిద్దుబాట్లపై మరియు అనవసర సమాచారంపై చాలా చర్చ జరిగింది. ఈ విషయం అప్పటి సభ్యులకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఈ సమాచారం ఎవరైనా తొలగించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:55, 19 మే 2019 (UTC)
వందలాది వ్యాసాల్లో చేర్చిన చంద్రకాంత రావు గారు చర్చ ప్రారంభమైనాకా అయినా స్పందించారు. బావుంది. అలానే 2016లో వికీపీడియా:ఆటో వికీ బ్రౌజరుతో చేయదగ్గ మార్పులు ఏమిటన్నవి బహిరంగంగా నిర్ధారించి కానీ చేయరాదనీ, అలానే వాడుకరి:Pranayraj1985 ప్రారంభించిన సత్సంప్రదాయం బట్టి ఆటోవికీ బ్రౌజర్లకు వేరుగా ఖాతాలుండాలని వాటిపై నియమాలు ఏర్పడ్డాయి. అలానే 2018లో మీరు రూపొందించిన గ్రామ వ్యాసం మార్గదర్శకాల్లోనూ దీన్ని చేర్చారు. ఈ సూత్రాలు, పాలసీలు అన్నీ 2016 తర్వాత ఏర్పడడం, ఆ తర్వాత కూడా వాటి అమలు విషయంలో కొద్దిమంది ఆసక్తి కల వికీపీడియన్లే తాపత్రాయపడడం కారణంగా ఇంకా ఇటువంటివి మన వ్యాసాల్లో ఉన్నాయి. ఇకపై వేలాది వ్యాసాల్లో చేసే ప్రతీ మార్పునీ ముందుగా సముదాయం ముందుకు తీసుకురాకుండా చేయకూడదని నిబంధన పటిష్టంగా ఏర్పరుచుకోవాలని ఇలాంటివి మనకు చెప్తున్నాయి. అలాంటి మార్పులు చేసే ముందు సముదాయానికి చెప్పే ఒరవడి కొద్దిమందే పాటించడం వల్ల, స్వచ్ఛందంగా పాటించాల్సిన ఈ అంశం ఖచ్చితమైన నియమం కావాల్సిన అవసరం కనిపిస్తోంది. రామారావుగారి ఆసక్తికి, ప్రయత్నానికి అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 08:11, 20 మే 2019 (UTC)
అలానే కాస్త విషయం పక్కకి మళ్ళినా ఒకటి చెప్పదలిచాను. వాడుకరి:యర్రా రామారావు గారు ప్రస్తావించిన పెంటపాడు గ్రామ వ్యాసంలో సదరు మార్పులు గాదం గోపాలస్వామి అనే ఓ చరిత్రకారుడు రాసిన "భారత స్వాతంత్ర్యోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు" అన్న పుస్తకం ఆధారంగా చేశాను. ఇలాంటివే వివిధ జిల్లాలకు సంబంధించి చరిత్ర, వ్యక్తులు, విద్య, పుణ్యక్షేత్రాలు వగైరాల పరంగా వనరులు ఉన్నాయి. ఆసక్తిగల సభ్యులకు అందించగలను. ఆయా పుస్తకాల నుంచి సేకరించి గ్రామాల వ్యాసాల్లో చేర్చగలిగితే ఎన్నో వ్యాసాలు బాగుపడతాయి. ఆసక్తి గలవారు నా చర్చా పేజీలో సంప్రదించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 08:17, 20 మే 2019 (UTC)
రవిచంద్ర గారూ , సి. చంద్ర కాంత రావు, గారూ పవన్ సంతోష్ గారూ మీ సానుకూల స్పందనలకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 11:11, 22 మే 2019 (UTC)

CIS-A2K: 3 Work positions openసవరించు

Hello,
Greetings for CIS-A2K. We want to inform you that 3 new positions are open at this moment.

 • Communication officer: (staff position) The person will work on CIS-A2K's blogs, reports, newsletters, social media activities, and over-all CIS-A2K general communication. The last date of application is 4 June 2019.
 • Wikidata consultant: (consultant position), The person will work on CIS-A2K's Wikidata plan, and will support and strengthen Wikidata community in India. The last date of application is 31 May 2019
 • Project Tiger co-ordinatorː (consultant position) The person will support Project tiger related communication, documentation and coordination, Chromebook disbursal, internet support etc. The last date of application is 7 June 2019.

For details about these opportunities please see here. -- Tito (CIS-A2K), sent using MediaWiki message delivery (చర్చ) 10:02, 22 మే 2019 (UTC)

కొత్త వికీపీడియన్లు వచ్చాకా "నిలుపుకోవడం" (Retention)పై దృష్టిసారించే మిని టిటిటి కార్యక్రమంసవరించు

కొత్తవారికి సహాయం వంటి ప్రయత్నం - కొత్తగా వస్తున్నవారికి శిక్షణనిచ్చి, ఇక్కడ కాలునిలదొక్కుకుని, చక్కని సముదాయ సభ్యులుగా నిలుపుకోవడంలో ఆసక్తికల వికీపీడియన్లు పనిచేయాలన్న ఆలోచనతో మొదలైంది. కొందరు వికీపీడియన్లు ప్రయత్నించారు. అలానే సముదాయంలో ఉన్న చాలామందికి సముదాయాన్ని విస్తరించడంలో సహకరించడంపై ఆసక్తి ఉన్నదని మనకు గతంలో జరిగిన కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం చెప్తోంది. ఈ నేపథ్యంలో కొత్తవారిని నిలుపుకోవడానికి (Retention of Newbies) ఏర్పాటుచేసుకోవాల్సిన వనరులు, సంతరించుకోవాల్సిన నైపుణ్యాలను అందిస్తూ మిని ట్రైన్-ద-ట్రైనర్ కార్యక్రమాన్ని ఇప్పటికే ఉన్న సభ్యులకు చేయాలని సంకల్పం. జూన్ 15, 16 తేదీల్లో నిర్వహించాలన్నది ప్రతిపాదన. వికీపీడియా, వికీసోర్సు ప్రాజెక్టుల విషయంలో మనకు తెలిసిన అంశాలు మనకు వీలుచిక్కినంత సమయంలో మరో కొత్తవ్యక్తికి నేర్పి, మనకి ఇందులో పనిచేయడానికి కలిగే ఉత్సాహాన్ని వారికి కూడా ఏర్పరిచి సముదాయాన్ని విస్తరించాలని, అందుకోసం అవసరమైన నైపుణ్యాలు సంతరించుకోవాలని ఆసక్తి కలిగిన తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులు దీనిలో ఆహ్వానితులు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం. దీనిపై సముదాయం స్పందించాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 10:02, 23 మే 2019 (UTC)

తెలుగు వికీపీడియాలో రాయడం విషయమై కొన్నిరోజులక్రితం నేను ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టగా చాలామంది రాయడానికి ఆసక్తి ఉందంటూ స్పందించారు. వారికి నేను ఒక్కడినే నేర్పడం వీలు కుదరడంలేదు. ఈ విషయాన్ని పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె)కు చెప్పినప్పుడు తెలుగు సముదాయ సభ్యులకు మిని టిటిటి కార్యక్రమం చేసి, వారితో కొత్తవారికి శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని చెప్పాడు. మనం తెవికీలో చేస్తున్నది, మనకు తెలిసింది మాత్రమే చెప్పడంకాకుండా కొత్తవారిని నిలుపుకోవడానికి ఏర్పాటుచేసుకోవాల్సిన వనరులు, సంతరించుకోవాల్సిన నైపుణ్యాల గురించి మరింత అవగాహన ఉంటే బాగుంటుందనిపించింది. కొత్తవారు వచ్చిపోవడంకాకుండా, నిలిచి తెవికీలో రాసేలా తగిన సహకారం అందించడానికి ఈ మిని టిటిటి కార్యక్రమం దోహదపడుతుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 19:10, 23 మే 2019 (UTC)
శుభం, కానివ్వండి.__చదువరి (చర్చరచనలు) 01:32, 24 మే 2019 (UTC)

వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ ప్రాజెక్టుసవరించు

ఈ పేజీలో [1], [2], [3] అనే చర్చలు వ్యక్తుల పేజీల వర్గీకరణను క్రమబద్ధీకరించాలనే ఆవశ్యకత గురించి మనల్ని తట్టి లేపాయి. తదనుగుణంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ అనే ప్రాజెక్టును మొదలుపెట్టాను. ప్రాజెక్టు పేజీ రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు. ముందుగా ప్రాజెక్టు స్వరూప స్వభావాలను, చెయ్యాల్సిన పనులను, చెయ్యల్సిన విధానాలనూ రూపొందించుకుని, ఆ తరువాత పేజీల్లో చెయ్యాల్సిన మార్పులను చేద్దామని నా ఉద్దేశం. వాడుకరులు ఈ పేజీని చూసి, ఆ ప్రాజెక్టులో భాగం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 10:48, 23 మే 2019 (UTC)